ఐనంపూడి శ్రీలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐనంపూడి శ్రీలక్ష్మి ఆకాశవాణి,హైదరాబాదులో రెండు దశాబ్దాలు అనౌన్సరుగా పనిచేసారు. ఆమె రచయిత్రి. ఆమె అనేక ఆర్టికల్స్, పుస్తకాలు, కవితలు ప్రచురించారు. కొన్ని డాక్యుమెంటరీలు కూడా తయారుచేసారు. ఆమె చిత్రాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలిండియా రేడియోలో ప్రముఖ వ్యక్తులతో ఇంటర్వ్యూ కార్యక్రమాలను నిర్వహించారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె నిజామాబాదు జిల్లా లోని బోధన్ లో 1967 ఆగస్టు 15 న జన్మించారు. విజ్ఞానశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ ను గిరిరాజ్ కళాశాలలో పూర్తిచేసారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.యి.డి చేసారు. ఆమె హైదరాబాదు ఆకాశవాణిలో అనౌన్సరుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు కవిత్వం, చిత్రనిర్మాణాలపై ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక ఆర్టికల్స్, పుస్తకాలు మరియు కవితలను వివిధ విషయాలలో (ఫైన్ ఆర్ట్స్ మరియు సినిమాలు) ప్రచురించారు.

సాహితీ సేవలు[మార్చు]

ఆమె పాఠశాల విద్యాభ్యాసం నుండే సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. పాఠశాలలో కవితలు వ్రాసేవారు. పాఠశాల మ్యాగజైన్ కు ఎడిటరుగా ఉండేవారు. ఆమె 2000లో ఇండూర్ స్పెషల్ ఇష్యూలోని ఎడిటోరియల్ మెంబరుగా ఉన్నారు. ఆమె యోజన మాసపత్రిక మరియు ప్రజాశక్తిలో వివిధ రచయితలు మరియు కవులు వ్రాసిన కవితలు, కథలు, నవలలకు సమీక్షలు వ్రాసారు. 2001లో "అలలవాన", 2003 లో దృక్కోణం (భావ చిత్రాలు) పుస్తకాలను ప్రచురించారు.2011 లో లైఫ్@చార్మినార్ అనే దీర్ఘ కవితను ప్రచురించారు. ఆమె ఒక డాక్యుమెంటరీలో దీర్ఘ కవితను ప్రవేశపెట్టారు. ఈ కవిత 5వ కాఫిసో జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ జ్యురీ అవార్డును కైవసం చేసుకుంది. ఆమె వ్రాసిన కవిత "వెన్నెల దుఃఖం" నకు 2012 జనవరి 18రంజని-కుందుర్తి అవార్డు వచ్చింది.

అవార్డులు[మార్చు]

తెలుగు విశ్వవిద్యాలయం వారు 2013 సంవత్సరానికి గాను ఆమెకు 'ఉత్తమ రచయిత్రి' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[2]

మూలాలు[మార్చు]

  1. "About Inampudi Sreelaxmi". మూలం నుండి 2015-08-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-06-30. Cite web requires |website= (help)
  2. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]