కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌
Kandala subramanya tilak.jpg
కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌
జననంకందాళ సుబ్రహ్మణ్య తిలక్‌
(1920-07-15) 1920 జూలై 15 [1]
విశాఖపట్నం
మరణం2018 జూన్ 8 (2018-06-08)(వయసు 97)
విశాఖపట్నం
మరణ కారణముసహజ మరణం
నివాస ప్రాంతంవిజయనగరం
ఇతర పేర్లుకందాళ సుబ్రహ్మణ్య తిలక్‌
వృత్తిమొదటి లోక్‌సభ సభ్యులు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు
భార్య / భర్తసూర్య శేషుకాంతం
పిల్లలు1 కుమారుడు(అశోక్), ఇద్దరు కుమార్తెలు (అరుణ, అమల)

కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ ((1920-07-15) 1920 జూలై 15 - 2018, జూన్ 8) ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు. ఈయన స్వాతంత్య్ర కోసం తనదైన శైలిలో పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. క్షణం కూడా ఆలోచించకుండా ఆయన బాటన నడిచేందుకు ఉద్యుక్తుడయ్యారు. స్వాతంత్య్రోద్యమంలో విజయనగరం జిల్లా నుంచి కీలక పాత్రధారయ్యారు.

జీవిత విశేషాలు[మార్చు]

కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ విశాఖపట్నం జిల్లాలో జూలై 15 1920 న జన్మించారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో తిలక్‌ విద్యాభ్యాసం చేశారు. అప్పట్లో బ్రిటిష్‌ వారి చిత్రహింసలకు గురవుతున్న ప్రజలను చూసి ఆయన చలించిపోయారు. తెల్ల దొరల ఆగడాల నుంచి భారత ప్రజలను విముక్తి చేయాలనే ఆలోచన ఆయనకు కలిగింది. అదే సమయంలో స్వాతంత్రం కోసం పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, విద్యాభ్యాసం చేస్తుండగానే ఉద్యమంలోకి దిగారు. 1942 ఆగస్టు 9 వ తేదీన చేపట్టిన పికెట్‌తో తిలక్‌ ఉద్యమంలోకి ప్రవేశించారు. ఈ పికెట్‌లో ఉత్తరాంధ్రకు చెందిన 14 మంది పాల్గొన్నారు. వారితో కలిసి చాలా ఉద్యమాల్లో తిలక్‌ భాగస్వామి అయ్యారు[2].

స్వాతంత్ర్యోద్యమంలో[మార్చు]

కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా రెండు సార్లు జైలు జీవితం గడిపారు. ఈ రెండు విడతల్లో దాదాపు 130 రోజులు జైలులోనే ఆయన గడిపారు. 1942లో పికెటింగ్‌ చేపడుతున్న సమయంలో తిలక్‌ను బ్రిటిష్‌ వారు అరెస్టు చేశారు. విజయనగరం సబ్‌ జైలులో కొంత కాలం ఉంచారు. ఆ తర్వాత 1943 జనవరి 26న విజయనగరంలోని ప్రకాశం పార్కులో జాతీయ జెండా ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు ఉద్యుక్తులవుతున్న సమయంలో తెల్ల దొరలు వచ్చి అందరినీ పట్టుకుపోయారు. వీరిలో తిలక్‌ కూడా ఉన్నారు. అప్పట్లో కేరళ రాష్ట్రం బళ్లారి ఎయిర్‌ఫోల్డ్‌ జైలుకు తరలించారు. ఈ జైలులో తిలక్‌ నాలుగు నెలలు గడిపారు. జైలు జీవితం ఎలా గడిచిందంటే....

జైలులో దాదాపు 130 రోజులు గడిపిన తిలక్‌ అనేక ఇబ్బందులకు గురయ్యారు. జైలులో జెండా ఊంఛా రహే హమారా... బొలో స్వతంత్ర భారత్‌కి జై... అనే నినాదాలను ఉద్యమకారులు చేసేవారు. దీనికి తెల్ల దొరలు కోపోద్రోక్తులై లాఠీలు విరిగేలా చితకబాదేవారు. అలాగే వీరికి సరైన భోజనం కూడా బ్రిటిష్‌ వారు అందించేవారు కాదు. ఉదయాన నూకల జావ, మధ్యాహ్నం 14 గ్రాములు మాత్రమే అన్నం, మట్టి కుండల్లో వేసిన పిక్క చారును భోజనంగా ఇచ్చేవారు. అయినప్పటికీ స్వాతంత్య్రోద్యమంలో లీనమైన ఉద్యమకారులు లాఠీ దెబ్బలను లెక్క చేయలేదు. అలాగే వారు ఏ భోజనం పెట్టినా ఆనందంగా భుజించేవారు. ఈ విధంగా తెల్ల దొరల చిత్ర హింసలను తట్టుకుంటూనే ఎంతో ఓపికతో తిలక్‌ జైలు జీవితం గడిపారు. కాగా, తిలక్‌ను అరెస్టు చేసిన సమయంలో భార్య సూర్య శేషుకాంతం తనను కూడా అరెస్టు చేసి భర్తతో తీసువెళ్లాలని పట్టుబట్టారు.

రాజకీయ నేపథ్యం[మార్చు]

కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ ఎన్నో పోరాటాల ద్వారా స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో పోటీ రంగంలో దిగారు. పూసపాటి విజయరామగజపతిరాజు, ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుడు జయప్రకాష్‌ నారాయణ ప్రోద్బలంతో తిలక్‌ ఇచ్ఛాపురం పాయకరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేశారు. పోటీ బరిలో నలుగురు నిలిచారు. బివి సంజీవరావు, పసుమర్తి వీరభద్రరావు, కాళ్లకూరి కృష్ణమూర్తి, తిలక్‌ మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో లక్షా 87 వేల ఓట్ల ఆధిక్యతతో తిలక్ విజయం సాధించి ఎంపిగా ఎన్నికయ్యారు. అప్పట్లో మహాత్మా గాంధీ ఎప్పటికప్పుడు తిలక్‌కు ఉత్తరాలు రాసేవారు

అభిప్రాయాలు[మార్చు]

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఆనందపడడమే తప్ప, ఆ ఫలాలు అందరికీ దక్కడం లేదని, మనకు స్వాతంత్య్రం వచ్చి 62 సంవత్సరాలు కావస్తున్నా దేశంలో పేదరికం కొనసాగుతూనే ఉందని, రాజకీయ నాయకుల హవా కొనసాగుతున్న ప్రస్తుత కాలంలో పేదవారు మరింత పేదరికంలోకి వెళ్తున్నారన్నారనీ ఆయన అభిప్రాయం.

సూచికలు[మార్చు]

  1. first parliament member
  2. "Parliament honours KS Tilak". News18. Retrieved 2018-06-08.

ఇతర లింకులు[మార్చు]