కమ్మవారిపాలెము (నందిగామ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమ్మవారిపాలెము (నందిగామ)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందిగామ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521185
ఎస్.టి.డి కోడ్ 08678

కమ్మవారిపాలెము, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 185., యస్.ట్.డీ కోడ్=08678.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

జగ్గయ్యపేట. నందిగామ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 50 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  • రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్, నారాయణ టేక్నో స్కూల్, నందిగామ.
  • ఇక్కడ అక్షరాస్యత చాలా ఎక్కువ. అందరు తమ పిల్లలని చదివిస్తారు. ఈ ఊరిలో రెండు మూడు తరాల నుండి విదేశాలలో స్థిరపడిన వారు మరియు చదువుకొని తిరిగి వచ్చిన వారు ఉన్నారు. నందిగామలోని పేరు గన్న జూనియర్ కళాశాల మరియు పాఠశాల, ఈ ఊరి వారు స్థాపించినవే.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఫోన్ నం. 08678/256290.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ ఊరికి ప్రధాన నీటి వనరు వైరా ఏరు. ఈ ఊరిలో పంపింగ్ స్కీమ్ కూడా ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ వేల్పుల కిషోర్‌బాబు సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. 2017,ఏప్రిల్-4న, దాతలు కొణిదెన సతీష్, లక్ష్మీచైతన్య దంపతులు, శ్రీరామనవమికి కళ్యాణం జరిపించుటకై, ఈ ఆలయానికి 30 వేల రూపాయల విలువైన పంచలోహ విగ్రహాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రోచ్ఛారణలతో హోమాలు నిర్వహించారు. దాతలు ఈ విగ్రహాలకు పంచామృతాలతో సంప్రోక్షణ నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి మరియు పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటలలో మామిడి మాత్రమే కాక సపోటా పండ్లు కూడా పండుతాయి. ఇక్కడి మామిడి తోటలలో బంగినపల్లి, చిన్న రసాలు,పెద్ద రసాలు,యెల్లమంద రకాలు చాలా ప్రసిద్ధి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ప్రధాన వృత్తి వ్యవసాయము.

గ్రామ ప్రముఖులు[మార్చు]

డాక్టర్ కిలారు సురేంద్రనాథ్‌బెనర్జీ.

గ్రామ విశేషాలు[మార్చు]

కాపా వారి మేడ ఈ ఊరిలో ముఖ్య లాండ్ మార్క్.

ఈ గ్రామానికి చెందిన పేద విద్యార్థి భూక్యా మోతీలాల్ నెహ్రూ, కోదాడలో 3వ సం. బి.ఎస్.సి. చదువుచున్నాడు. ఇతడు క్రికెట్ పోటీలలో అండర్-25 విభాగంలో ఆడి, తన అత్యుత్తమ ప్రతిభతో మార్చి-2015లో నిర్వహించే, సౌత్ ఏషియన్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనాడు. [1]

గ్రామజనాబా[మార్చు]

ఊరి జనాభా సుమారు 2000 ఉంటుంది. తెలుగు ప్రధాన భాష.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-14; 11వపేజీ. [2] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,ఏప్రిల్-5; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,ఆగష్టు-24; 2వపేజీ.