కాటిపల్లి వెంకటరమణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాటిపల్లి వెంకటరమణారెడ్డి

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు గంప గోవర్ధన్
నియోజకవర్గం కామారెడ్డి

పదవీ కాలం
2008 – 2011

వ్యక్తిగత వివరాలు

జననం 1970
కామారెడ్డి, కామారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి విజయ
సంతానం మైత్రేయ రెడ్డి
నివాసం కామారెడ్డి[1]

కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

నేపథ్యం[మార్చు]

కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ప్రాంతంలో విద్యా సంస్థలు నిర్వహిస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటాడు. ఇతను భార్య విజయ, కుమారుడు మైత్రేయితో కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటాడు.[3] ఇతను తన తండ్రి పేరిట ట్రస్టు ఏర్పాటుచేసి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.

రాజకీయ రంగం[మార్చు]

ఇతని కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వెంకటరమణా రెడ్డి తండ్రి పెద్ద రాజా రెడ్డి 25 సంవత్సరాల పాటు కామారెడ్డి సమితి ప్రెసిడెంటుగా పనిచేశాడు.

వెంకటరమణా రెడ్డి 2006లో కాంగ్రెస్ పార్టీ తరఫున తాడ్వాయి స్థానినికి జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి అండతో 2008లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు జిల్లా పరిషత్ ఛైర్మన్ అయిన వెంకటరమణా రెడ్డి 2011 వరకూ ఆ పదవిలో కొనసాగాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో వెంకటరమణా రెడ్డికి విభేదాలు రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి నిజామాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షునిగా పని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసి చివరిలో తప్పుకున్నాడు.[4]

వెంకటరమణా రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి బీజేపీలో చేరి కామారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 15,439 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావుపై 6741 ఓట్ల మెజారిటీతో గెలిచి[5] తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[6][7]

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[8]

కె.వెంకటరమణా రెడ్డిని 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[9]

మూలాలు[మార్చు]

  1. "కాటిపల్లి వెంకటరమణారెడ్డి 2023 ఎన్నికల అఫిడవిట్" (PDF). 2023. Archived from the original (PDF) on 16 December 2023. Retrieved 16 December 2023.
  2. BBC News తెలుగు (4 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: కేసీఆర్‌, రేవంత్ రెడ్డిలను ఓడించిన ఘనుడు..." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. ABN (2023-12-04). "katipally venkataramana reddy: ఎవరీ.. కాటిపల్లి?. కేసీఆర్, రేవంత్‌ని ఎలా ఓడించారు". Andhrajyothy Telugu News. Retrieved 2023-12-05.
  4. Andhrajyothy (4 December 2023). "ఎవరీ.. కాటిపల్లి?. కేసీఆర్, రేవంత్‌ని ఎలా ఓడించారు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Hindustantimes Telugu (4 December 2023). "నిజామాబాద్‌లో క‌మ‌ల వికాసం - 3 స్థానాలు కైవ‌సం". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  7. Eenadu (4 December 2023). "ఓటమి నుంచి విజయం వైపు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  8. NTV Telugu (14 December 2023). "ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  9. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.