గంప గోవర్ధన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంప గోవర్ధన్
గంప గోవర్ధన్


పదవీ కాలం
1995-99, 2009-11, 2011-14, 2014-18, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 5, 1963
బస్వాపూర్, బిక్నూర్ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు వెంకయ్య - రాజమ్మ
జీవిత భాగస్వామి జి. రాణి
సంతానం శశాంక్, సుష్మ
నివాసం కామారెడ్డి

గంప గోవర్ధన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1][2]

జననం, విద్య[మార్చు]

గోవర్థన్ 1963, ఫిబ్రవరి 5న వెంకయ్య - రాజమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బిక్నూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని సిటీ కాలేజీలో 1986లో బిఏ పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గోవర్థన్ కు రాణితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (శశాంక్), ఒక కుమార్తె (సుష్మ) ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గోవర్థన్ 1987లో బస్వాపూర్‌ సింగిల్‌విండో చైర్మన్‌గా, భిక్కనూరు మండల టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు.ఆయన 1994లో తొలిసారి కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 10వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గెలుపొందాడు. గంప గోవర్ధన్ కు 1999లో టిక్కెట్‌ దక్కలేదు. ఆయన 1999 నుంచి 2000 వరకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా టీడీపీ అ«ధ్యక్షుడిగా, ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2004లో కామారెడ్డి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. దీంతో ఆయన టీడీపీ అభ్యర్థిగాఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.[4]

గంప గోవర్ధన్ 2009 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుండి 13వ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు పోటీచేసి షబ్బీర్‌ అలీపై గెలిచాడు. తెలంగాణ ఉద్యమనికి మద్దతుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2011లో టీఆర్‌ఎస్‌లో చేరాడు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[5] 2014 డిసెంబరు 13న అసెంబ్లీలో విప్ గా నియమితుడయ్యాడు. ఆయన ఐదేళ్లపాటు (2018 సెప్టెంబరు 6) విప్‌గా పనిచేశాడు.[6][7] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ ఆలీ పై 35,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ ఆలీ పై 4,557 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2019 సెప్టెంబరు 7న రెండోసారి ప్రభుత్వ విప్‌గా నియమితుడయ్యాడు.[8][9][10]

మూలాలు[మార్చు]

  1. "Kamareddy Assembly (Vidhan Sabha) (MLA) Elections Result Live". www.news18.com. Retrieved 2021-09-25.
  2. https://telanganatoday.com/kamareddy-assembly-constituency-profile/amp
  3. Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  4. Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  5. Sakshi (6 November 2018). "గులాబీ గుబాళింపు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  6. "Kamareddy Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Retrieved 2021-09-25.
  7. https://www.firstpost.com/telangana-assembly-election-results-2018/kamareddy-election-result-2018-s29a016[permanent dead link]
  8. "Govardhan Gampa(TRS):Constituency- KAMAREDDY(NIZAMABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-25.
  9. "Govardhan Gampa MLA of Kamareddy Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-25.
  10. సాక్షి, తెలంగాణ (13 December 2018). "తిరుగులేని నేత". Sakshi. Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.