కేశవరావు కొరాట్కర్
కేశవరావు కొరాట్కర్ | |
---|---|
జననం | 1867 |
మరణం | 21 మే 1932 (aged 65) |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సంఘసంస్కరణ |
కేశవరావు కొరాట్కర్, స్వాతంత్ర్యసమరయోధుడు, హైదరాబాదు రాష్ట్రంలో రాజకీయ, సాంఘిక విద్యా సంస్కరణలకు ఆద్యుడు. మరాఠీ ప్రజల సంక్షేమం కోసం విశేషకృషిచేశాడు.
ప్రారంభజీవితం, వ్యాసంగం
[మార్చు]కేశవరావు కొరాట్కర్, 1867 లో మరాఠ్వాడా ప్రాంతంలోని పర్భణీ జిల్లా పుర్జల్ గ్రామంలో (ప్రస్తుతం హింగోలి జిల్లాలో ఉన్నది) మాతామహుని ఇంట్లో జన్మించాడు. ఈయన తండ్రి సంతుకరావు సాంప్రదాయ దేశస్థ బ్రాహ్మణుడు. ఐదుగురు కొడుకులలో కేశవరావు ఒకడు. తొమ్మిదవ ఏట కేశవరావు, గుల్బర్గాలోని తన సోదరితో నివసించటానికి వెళ్లాడు. అక్కడే ఉర్దూ, పర్షియన్ భాషలు నేర్చుకోవటం ప్రారంభించాడు. గుల్బర్గా తాసీల్దారు కార్యాలయంలో ఉద్యోగిగా వృత్తిజీవితం ప్రారంభించిన కేశవరావు న్యాయవాది కావాలని నిశ్చయించుకొని, 1889లో లా, జుడీషియరీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. 1896లో హైదరాబాదులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. వృత్తిజీవితపు ఉఛ్ఛస్థాయిలో హైదరాబాదు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.
సామాజిక సేవ
[మార్చు]కేశవరావు కొరాట్కర్ 1904లో హైదరాబాదు ఆర్యసమాజం యొక్క అధ్యక్షుడిగా ఎన్నికై, 1932లో మరణించేవరకు రెండు దశాబ్దాల పాటు ఆర్యసమాజంలో క్రియాశీలకంగా పనిచేశాడు.[1] హైదరాబాదు సామాజిక్ సుధార్ సంఘ్ అనే సంఘసంస్కరణా సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1907లో స్థానిక మరాఠీ ప్రజలకొరకై రెసిడెన్సీ బజార్లో, ఒక మరాఠీ మాధ్యమపు పాఠశాలను స్థాపించాడు. తన స్నేహితుడు విఠల్‌రావు దవుల్‌గవ్కర్ తో కలిసి గుల్బర్గాలో ఒక పాఠశాలను ప్రారంభించడంలో ప్రధానపాత్ర పోషించాడు.1920లో హైదరాబాదులో మరాఠీ గ్రంథాలయాన్ని ప్రారంభించి, స్థానిక మరాఠీ యువతను ఉత్తేజపరచాడు. మరాఠీ మాసపత్రిక రాజ్‌హంసను ప్రారంభించటానికి విశేషకృషి చేశాడు.
భారత స్వాతంత్రోద్యమంలో
[మార్చు]కేవశరావు తన స్నేహితుడు బాలగంగాధర్ తిలక్ చే ప్రభావితుడై, తిలక్ కోరిక మేరకు 1897లో అజ్ఞాతంలో ఉన్న పూణేకు చెందిన చాపేకర్ సోదరులకు హైదరాబాదులో వైద్యసహాయం చేయించాడు.[2] ప్రముఖంగా ముస్లిం మతోద్యమైనా, విస్తృత భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగమైన ఖిలాఫత్ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.[3] 1919లో ఖిలాఫత్ ఉద్యమ ఊరేగింపుకు నడిపించటానికి, కూతురు పెళ్ళికి కూడా వెళ్ళలేదు[4] కుటుంబం కంటే నమ్మిన ఆశయాన్ని ముందు పెట్టాడనటానికి ఇది ఒక తార్కాణం.
అవసానదశ
[మార్చు]కేశవరావు చివరి సంవత్సరాల్లో మధుమేహాన్ని సరిగా గుర్తించక, చూపు మందగించి అనారోగ్యంతో గడిపాడు. 1930 మే 20న మధుమేహంతో కోమాలోకి వెళ్లి, 1930 మే 21న మరణించాడు.
ఈయన కుమారుడు విద్యాలంకార్ వినాయకరావు కొరాట్కర్, హైదరాబాదు శాసనసభ, బొంబాయి శాసనసభ, లోక్‌సభలకు ఎన్నికయ్యాడు.[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.maharashtra.gov.in/english/gazetteer/Nanded/his1.html - 316k
- ↑ http://www.maharashtra.gov.in/english/gazetteer/VOL-II/REVOLUTIONARY_I.pdf
- ↑ Pernau-Reifeld Margrit :Reaping the Whirlwind. Nizam and the Khilafat Movement, in: Economic and Political Weekly, Vol 34, pp 2745-51
- ↑ Benichou Lucien D:From Autocracy to Integration: Political Developments in Hyderabad State, Orient Longman 2000 p.33
- ↑ "Shri Koratkar, V. K. Vidyalankar at Lok Sabha website". Archived from the original on 2013-06-24. Retrieved 2017-10-15.