క్యాచౌట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆస్ట్రేలియన్ ఫీల్డర్ క్యాచ్ తీసుకోవడానికి పరుగెతుతున్నాడు
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్, మహ్మద్ యూసుఫ్‌ను కాట్ ఆండ్ బౌల్డ్‌గా ఔట్ చేయబోతున్నాడు

క్యాచౌట్ అనేది క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ని అవుట్ చేసే పద్ధతుల్లో ఒకటి. చట్టబద్ధమైన డెలివరీలో బ్యాటరు బ్యాట్‌తో బంతిని కొట్టినపుడు, ఆ బంతి నేలను తాకడానికి ముందే బౌలరు గానీ, ఫీల్డరు గానీ క్యాచ్ పట్టుకుంటే ఆ బ్యాటరు క్యాచౌటవుతాడు.

బంతి వికెట్-కీపర్‌ను తాకి ఆ తర్వాత స్టంపులను తాకినట్లయితే - వికెట్-కీపర్ స్వయంగా తానే బంతితో కొట్టకుండా - ఆ బంతి "నో బాల్" అవుతుంది. ఆ డెలివరీలో బ్యాట్స్‌మన్‌ను స్టంపౌట్ చేయలేరు. బ్యాటరు పరుగు కోసం ప్రయత్నించకపోతే రనౌట్ కూడా చేయలేరు.

క్యాచ్‌ పట్టినది వికెట్-కీపరైతే దాన్ని కాట్ బిహైండ్ అంటారు.[1] వికెట్ వద్ద క్యాచ్ అని కూడా అంటారు.[2] బంతిని వేసిన బౌలరే క్యాచ్‌ పట్టుకుంటే దాన్ని క్యాట్ అండ్ బౌల్డ్ అంటారు.[1] బౌల్డ్‌కు దీనికి సంబంధం లేదు, క్యాచరు బౌలరూ ఒకరే అని చెప్పడానికి ఇలా అంటారు. (స్కోర్‌కార్డులో c. and b. అనిగానీ, c&b అని గానీ రాసి, ఆ తరువాత బౌలరు పేరు రాస్తారు)

క్యాచౌట్ అనేది ఔటయ్యే పద్దాతుల్లో అత్యంత సాధారణమైనది. 1877 - 2012 మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అయిన మొత్తం ఔట్లలో 36,190 ఈ విధంగా జరిగాయి. ఇది ఈ కాలంలో జరిగిన మొత్తం ఔట్లలో 56.9%.[3]

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 532 క్యాచ్‌లతో, [4] అత్యధిక టెస్ట్ మ్యాచ్ క్యాచ్‌లు పట్టిన రికార్డు సాధించాడు. వికెట్ కీపర్లు కాని ఫీలడర్లలో అత్యధిక టెస్ట్ మ్యాచ్ క్యాచ్‌లు పట్టిన రికార్డు, 210 వికెట్లతో, రాహుల్ ద్రావిడ్ పేరిట ఉంది.[5]

ఈ తొలగింపు పద్ధతి <i id="mwNw">క్రికెట్ చట్టాల</i> చట్టం 33 ద్వారా కవర్ చేయబడింది, ఇది ఇలా ఉంటుంది: [6]

నో బాల్ కాకుండా బౌలర్ వేసిన బంతి ఫీల్డర్లెవరినీ తాకకుండా, ముందే బ్యాటరు బ్యాట్‌కు తగిలి, అది నేలను తాకడానికి ముందే ఫీల్డరు దాన్ని స్థిరంగా పట్టుకుంటే,..., ఆ స్ట్రైకరు క్యాచౌట్ అవుతాడు,

దీనర్థం, కింది సందర్భాలలో బ్యాటరు క్యాచౌట్ అయినట్లు కాదు:

  • బంతి నో-బాల్ లేదా డెడ్ బాల్ అయినపుడు
  • బ్యాటారు తన బ్యాట్‌తో లేదా బ్యాట్‌ని పట్టుకున్న చేతితో గ్లోవ్‌తో బంతిని కొట్టనపుడు.
  • ఫీల్డరు బంతిని పట్టుకునే ముందు బంతి నేలను తాకితే
  • బంతి ఫీల్డర్ నియంత్రణలో ఉండకపోతే.
  • బంతి తగిలి బౌండరీకి అవతల నేలపై పడినపుడు(ఆరు పరుగులు ).
  • క్యాచ్ పట్టే ఫీల్డర్ బంతిని తాకినప్పుడు బౌండరీ తాడును గాని, బౌండరీ వెలుపల ఉన్న ప్రాంతంలో గానీ, అతని శరీరంలోని ఏదైనా భాగం తగిలితే
  • గాల్లో ఎగిరిన ఫీల్డరు క్యాచ్ పట్టేముందు, చట్టబద్ధంగా బంతిని తాకకముందు, అతని శరీరం పూర్తిగా బౌండరీలోపు లేకుండా ఉంటే. [7]

బంతిని పట్టుకునే ఫీల్డరు బంతి పైన, తన కదలిక పైన - ఈ రెండింటిపైన పూర్తి నియంత్రణ పొందే వరకు క్యాచ్ పూర్తి అయినట్లు కాదు (చట్టం 33.3).

ఒక బ్యాటరు క్యాచౌట్ తో పాటు మరొక పద్ధతిలో కూడా అవుటైనట్లైతే, ఆ రెండవ పద్ధతి బౌల్డ్ అయితే తప్ప, క్యాచౌట్‌కే ప్రాథమ్యత ఉంటుంది. [8]

బ్యాటరు క్యాచౌట్ అయినపుడు, ఆ డెలివరీలో బ్యాటరు చేసిన పరుగులు రద్దు అవుతాయి.

ఒక బ్యాట్స్‌మన్ క్యాచౌటైనపుడు, వికెట్‌ తీసిన శ్రేయస్సు బౌలరుకు, క్యాచ్ పట్టిన శ్రేయస్సు ఫీల్డర్‌కూ లభిస్తుంది; క్యాచ్‌కి ముందు బౌండరీ దాటకుండా కాపాడినపుడు లేదా స్లిప్స్‌లో వేరే ఫీల్డర్‌కి బంతిని మళ్లించినపుడు క్యాచ్ అసిస్ట్‌లు ఏమీ ఇవ్వరు. క్యాచ్ పట్టే లోగా, బ్యాటర్లిద్దరూ ఒక పరుగు తీసి, ఎండ్‌లు మారితే, అపుడు నాన్-స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్ స్ట్రైకింగుకు వస్తాడు. ఔటైన బ్యాటరు స్థానంలో కొత్తగా వచ్చిన బ్యాటరు నాన్-స్ట్రైకింగు వైపున ఉంటాడు. అంటే, కొత్త ఓవరు మొదలైతే తప్ప, కొత్త బ్యాటరు నాన్ స్ట్రైకింగు వైపునే ఉంటాడు .

వేడుక[మార్చు]

2000 కి ముందు, ఆటగాడు "బంతిని పట్టుకున్నాక మళ్ళీ దాన్ని విసరడం చెయ్యగలిగితే తప్ప" దానిపై నియంత్రణ ఉన్నట్లు కాదు, క్యాచ్‌ను పూర్తి చేసినట్లు కాదు అని క్రికెట్ చట్టాలు నిర్వచించాయి. చాలా కట్టుదిట్టంగా చెప్పాలంటే, దీనర్థం, ఆటగాడు బంతిని పట్టుకుని మళ్ళీ విసిరితే తప్ప పట్టుకోవడం పూర్తి అయినట్లు కాదు. ఫీల్డరు బంతిని ప్రత్యేకంగా ఎవరికీ వేయాల్సిన అవసరం లేదు, విసిరితే చాలు.

ఈ కారణంగానే నేటికీ, చాలా మంది క్రికెటర్లు బంతిని పట్టుకున్నాక గాలిలోకి విసిరి వేడుక చేసుకుంటారు. 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో సూపర్ సిక్స్‌ల మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకున్నాడు. అయితే అతను బంతిని విసిరేందుకు ప్రయత్నించినప్పుడు బంతి అతని నియంత్రణలో లేదని నిర్ధారణ అవడంతో వా నాటౌట్‌ అని ప్రకటించారు.[9] వా ఆ తరువాత 120 పరుగులు అజేయంగా చేసి తన జట్టును సెమీ-ఫైనల్‌కు తీసుకువెళ్ళాడు.[10] ఆ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

రికార్డులు[మార్చు]

టెస్ట్ మ్యాచ్‌లు[మార్చు]

టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ల జాబితా ఇది. గమనిక: ఈ జాబితాలో వికెట్ కీపర్‌గా కాకుండా ఫీల్డింగు చేసినప్పుడు పట్టిన క్యాచ్‌లు మినహాయించబడ్డాయి .

ర్యాంకు వికెట్ కీపరు క్యాచ్‌లు టెస్ట్ కెరీర్ కాలం
1 మార్క్ బౌచర్ 532 1997–2012
2 ఆడమ్ గిల్‌క్రిస్ట్ 379 1999–2008
3 ఇయాన్ హీలీ 366 1988–99
4 రాడ్ మార్ష్ 343 1970–84
5 జెఫ్ డుజోన్ 265 1981–91
6 ఆస్ట్రేలియా బ్రాడ్ హాడిన్ 262 2008–15
7 ఎంఎస్ ధోని 256 2005–14
8 ఇంగ్లాండ్ అలాన్ నాట్ 250 1967–81
9 ఇంగ్లాండ్ మాట్ ప్రియర్ 243 2007–14
10 ఇంగ్లాండ్ అలెక్ స్టీవర్ట్ 227 1990–2003

మూలం: Cricinfo Statsguru . చివరిగా నవీకరించబడింది: 2019 ఏప్రిల్ 19.

టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్ కీపర్లు ఇలా ఉన్నారు. గమనిక: ఇది వికెట్ కీపర్‌గా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చేసిన క్యాచ్‌లను మినహాయిస్తుంది .

ర్యాంకు వికెట్ కీపరు క్యాచ్‌లు టెస్ట్ కెరీర్ కాలం
1 రాహుల్ ద్రవిడ్ 210 1996–2012
2 మహేల జయవర్ధనే 205 1997–2014
3 జాక్వెస్ కల్లిస్ 200 1995–2013
4 రికీ పాంటింగ్ 196 1995–2012
5 మార్క్ వా 181 1991–2002
6 ఇంగ్లాండ్ అలిస్టర్ కుక్ 175 2006–18
7 న్యూజీలాండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 171 1994–2008
8 దక్షిణాఫ్రికా గ్రేమ్ స్మిత్ 169 2002–14
9 వెస్ట్ ఇండీస్బ్రయాన్ లారా 164 1990–2006
10 ఆస్ట్రేలియామార్క్ టేలర్ 157 1989–99

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Ways of getting out: Caught". bbc.co.uk (in ఇంగ్లీష్). 26 August 2005. Retrieved 2019-04-17.
  2. "Runs for Vaughan but England caught short". theguardian.com (in ఇంగ్లీష్). 13 December 2004. Retrieved 2019-04-17.
  3. "Analysing Test dismissals across the ages". espncricinfo.com.
  4. "Most catches in career". espncricinfo.com/ (in ఇంగ్లీష్). Retrieved 2019-04-17.
  5. "Most catches". espncricinfo.com/ (in ఇంగ్లీష్). Retrieved 2019-04-17.
  6. "Law 33 - Caught". www.lords.org (in ఇంగ్లీష్). Retrieved 2019-04-17.
  7. "{% DocumentName %} Law | MCC". www.lords.org. Retrieved 2020-12-04.
  8. "Law 32 (Caught)". http://ndca.nsw.cricket.com.au, para 2 (in ఇంగ్లీష్). Archived from the original on 2019-12-11. Retrieved 2019-04-17.
  9. "Australia v South Africa". cricinfo.com. Archived from the original on 2010-11-05.
  10. "9th Super, ICC World Cup at Leeds, Jun 13 1999 - Match Summary - ESPNCricinfo". ESPNcricinfo. Archived from the original on 2010-04-10.
"https://te.wikipedia.org/w/index.php?title=క్యాచౌట్&oldid=4034226" నుండి వెలికితీశారు