అక్షాంశ రేఖాంశాలు: 16°10′50″N 80°47′02″E / 16.180530°N 80.783801°E / 16.180530; 80.783801

క్రాప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రాప
—  గ్రామం  —
క్రాప is located in Andhra Pradesh
క్రాప
క్రాప
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°10′50″N 80°47′02″E / 16.180530°N 80.783801°E / 16.180530; 80.783801
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల జిల్లా
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ బొల్లా వీరరాఘవయ్య
జనాభా (2011)
 - మొత్తం 3,586
 - పురుషుల సంఖ్య 1,828
 - స్త్రీల సంఖ్య 1,758
 - గృహాల సంఖ్య 977
పిన్ కోడ్ : 522 324 522324
ఎస్.టి.డి కోడ్ : 08644

క్రాప బాపట్ల జిల్లా కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ గ్రామానికి అతి పురాతన చరిత్ర ఉంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు పరిపాలించారు. మొగలు సామ్రాజ్యం, నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైనది. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రరాష్ట్రంలో, ఆ తదుపరి ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైంది.

సీ ఆర్ డీ ఏ

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బొల్లా వీరరాఘవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • గ్రామదేవత దుగ్గెమ్మ:- ఈ గ్రామంలో గ్రామదేవత దుగ్గెమ్మ పేరుతో పూజలు అందుకుంటున్నారు.
  • శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామివారి దేవాలయం:- ఈ గ్రామంలో 2013 నవంబరు 24న, కార్తీకమాసం సందర్భంగా, ఒక కోటి 30 లక్షల వొత్తులతో, దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో, శివునికి పసుపు, కుంకుమతో మహారుద్రాభిషేకం చేశారు. శివునికి లక్ష బిల్వార్చన పూజలు, జరిపినారు. భ్రమరాంబాదేవిని వివిధ రకాల కూరగాయలతో, శాకంబరీదేవీ అవతారంలో ప్రత్యేకాలంకరణ చేసారు.
  • శ్రీ వెంకటేశ్వర ఆంజనేయస్వామి దేవస్థానం.

గ్రామంలోని ప్రధాన పంటలు

[మార్చు]

చెరకు, వరి, మొక్కజొన్న, మినుములు

గ్రామంలోని ప్రధాన వృత్తులు

[మార్చు]

సారవంతమైన నల్ల రేగడి నేల, కృష్ణా కాలువలు, ప్రధాన నగరమైన తెనాలికి దగ్గరగా ఉండడం వలన వ్యవసాయోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందింది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

గ్రామ విశేషాలు

[మార్చు]

క్రాప గ్రామాన్ని, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, తానా కోశాధికారి వెన్నం మురళి, ఆ గ్రామాన్ని దత్తత తీసికొన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
"https://te.wikipedia.org/w/index.php?title=క్రాప&oldid=4130422" నుండి వెలికితీశారు