ఖాజీపేట (తెనాలి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖాజీపేట గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 307., ఎస్.టి.డి.కోడ్ = 08644.[1]

హంసల దీవి
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

అంనవాడీ కేంద్రం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ కాశీ విశాలాక్షీ సమేత విశ్వేశ్వర స్వామి స్వామివారి ఆలయం:- ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవం సందర్భంగా 2014,మే-10, శనివారం (వైశాఖ శుక్ల ఏకాదశి) నాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచామౄతాభిఒషేక పూజలు నిర్వహించి, మద్యాహ్నం స్వామివారి కళ్యాణం నిర్వహించారు. రాత్రికి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [1] & [3]
  2. ఈ గ్రామంలో 2014,ఫిబ్రవరి-24న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంరస్వామి, గోవిందాంబసమేత ఈశ్వరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. 2014,ఫిబ్రవరి-24 ఉదయం 5గంటలకు అంకురార్పణ, 7గంటలకు అదివాసం, 8గంటలకు పంచామృత అభిషేక పూజలు జరిగినవి. 11-46 గంటలకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందాంబా సమేత ఈశ్వరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. శ్రీ వినాయకుడు, నాగేంద్రస్వామి, సిద్ధయ్యస్వామి ప్రతిమలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఖాజీపెట, కొలకలూరు గ్రామాలనుండి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ సి.హెచ్.సాంబయ్య:- వృత్తి రీత్యా బ్యాంకు ఉద్యోగి అయిన శ్రీ సాంబయ్య, ప్రవృత్తిగా విద్య, వైద్యం, కళారంగాలలో తన జీవిత చరమాంకం వరకు సేవలందించారు. గ్రామంలో ఆయన పేరుతో, "సి.హెచ్.సాంబయ్య స్మారక కళాపరిషత్తు" ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందజేయుచున్నారు. ఈ సంత్సరం ఈ పురస్కారానికి ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ కాగిత జయకృష్ణ ను ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2015,జూన్-11వ తేదీనాడు, గుంటూరులోని బృందావన గార్డెన్సులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం ఆవరణలో నిర్వహించు ఒక కార్యక్రమంలో అందజేసెదరు. [4]

గ్రామ విశేషాలు[మార్చు]

అమ్మ ఛారిటబుల ట్రస్ట్.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-25.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.