Jump to content

గుజరాత్‌లో 1977 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి

భారతదేశంలో 6వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి 1977 భారత సాధారణ ఎన్నికలు జరిగాయి. 1977 మార్చి 16 - 20 మధ్యకాలంలో పోలింగ్ జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో నిర్వహించబడిన ఈ ఎన్నకలు తుది ఫలితాలు ప్రకటించడానికి ముందు 1977, మార్చి 21న ఆగిపోయింది.[1][2]

ఈ ఎన్నికల ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోర పరాజయం ఎదురైంది, అప్పటి ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా గాంధీ 1977లో రాయ్ బరేలీ నుండి పోటిచేసి తన లోక్‌సభ స్థానాన్ని కోల్పోయారు. ఎమర్జెన్సీని రద్దు చేయడం ద్వారా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పిలుపు ప్రతిపక్ష జనతా కూటమి[3] విజయానికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది, దీని నాయకుడు మొరార్జీ దేశాయ్ 1977, మార్చి 24న భారతదేశ నాల్గవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

గుజరాత్‌లో జనతాపార్టీ/బీఎల్‌డీ 16 సీట్లు గెలుచుకోగా, మొత్తం 26 సీట్లలో కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికలతో పోల్చితే 24 సీట్ల సంఖ్య 26కి పెరిగింది.

పార్టీల వారీగా ఫలితాల సారాంశం

[మార్చు]
పార్టీ సీట్లు గెలుచుకున్నారు
జనతా పార్టీ/బిఎల్డీ 16
భారత జాతీయ కాంగ్రెస్ 10

ఫలితాలు- నియోజకవర్గాల వారీగా

[మార్చు]
క్రమసంఖ్య నియోజకవర్గం విజేత పార్టీ
1 కచ్ఛ్ డేవ్ అనంత్రే దేవశంకర్ బిఎల్డీ
2 సురేంద్రనగర్ అమీన్ రామదాస్ కిషోర్దాస్ (ఆర్కే అమీన్) బిఎల్డీ
3 జామ్‌నగర్ వినోద్ భాయ్ బి. షేత్ బిఎల్డీ
4 రాజ్‌కోట్ పటేల్ కేశుభాయ్ సావ్దాస్ భాయ్ బిఎల్డీ
5 పోర్బందర్ పటేల్ ధర్మసింహభాయ్ దహ్యాభాయ్ బిఎల్డీ
6 జునాగఢ్ నథ్వానీ నరేంద్ర ప్రాగ్జీ బిఎల్డీ
7 అమ్రేలి ద్వారకాదాస్ మోహన్ లాల్ పటేల్ బిఎల్డీ
8 భావ్‌నగర్ ప్రసన్నవదన్ మణిలాల్ మెత్త బిఎల్డీ
9 ధంధూకా (ఎస్సీ) పర్మర్ నటవర్లాల్ భగవందాస్ బిఎల్డీ
10 అహ్మదాబాద్ అహేసన్ జాఫ్రి కాంగ్రెస్
11 గాంధీనగర్ పురుషోత్తం గణేష్ మావలంకర్ బిఎల్డీ
12 మహేసన పటేల్ మణిబెన్ వల్లభాయ్ బిఎల్డీ
13 పటాన్ (ఎస్సీ) చావడా ఖేమ్‌చంద్‌భాయ్ సోమాభాయ్ బిఎల్డీ
14 బనస్కాంత చౌదరి మోతీభాయ్ రాంఛోద్భాయ్ బిఎల్డీ
15 శబర్కాంత హెచ్ఎం పటేల్ బిఎల్డీ
16 కపద్వంజ్ వాఘేలా శంకర్జీ లక్ష్మణ్‌జీ బిఎల్డీ
17 దోహద్ (ఎస్టీ) దామోర్ సోమ్జీభాయ్ పూజాభాయ్ కాంగ్రెస్
18 గోద్రా దేశాయ్ హితేంద్రభాయ్ కనైయాలాల్ కాంగ్రెస్
19 కైరా దేశాయ్ ధర్మసింగ్ దాదుభాయ్ కాంగ్రెస్
20 ఆనంద్ అజిత్‌సిన్హ్ ఫుల్‌సిన్హ్ దాభి కాంగ్రెస్
21 చోటా ఉదయపూర్ (ఎస్టీ) రథవా అమర్‌సిన్ విరియాభాయ్ కాంగ్రెస్
22 బరోడా గైక్వాడ్ ఫతేసింహరావ్ ప్రతాప్సింహరావ్ కాంగ్రెస్
23 బ్రోచ్ పటేల్ అహ్మద్ భాయ్ మహ్మద్ భాయ్ కాంగ్రెస్
24 సూరత్ దేశాయ్ మొరార్జీ రాంచోడ్జీ బిఎల్డీ
25 మాండవి (ఎస్టీ) గమిత్ చితుభాయ్ దేవ్జీభాయ్ కాంగ్రెస్
26 బుల్సర్ (ఎస్టీ) పటేల్ ననుభాయ్ నిచాభాయ్ బిఎల్డీ

మూలాలు

[మార్చు]
  1. "India 1977" (PDF).
  2. "India 1977".
  3. M.R. Masani, "India's Second Revolution," Asian Affairs (1977) 5#1 pp 19–38.