గువ్వడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గువ్వడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం వరికుంటపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,294
 - పురుషుల సంఖ్య 1,694
 - స్త్రీల సంఖ్య 1,600
 - గృహాల సంఖ్య 759
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గువ్వడి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలానికి చెందిన గ్రామము.

గ్రామం స్వరూపం[మార్చు]

గ్రామంలో సుమారుగా 200 ఇళ్ళు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులలో గ్రామానికి చేరుకోవచ్చును. కొంత మంది చదువుకొని విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఊరి మధ్య శ్రీ సీతా రాముల దేవాలయం ఉంది. ప్రతి రోజు పూజలు జరుగుతాయి. ఇంకా ప్రతి సంవత్సరం జూన్ 10, 11, 12 తేదీలలో ఉత్సవాలు కూడా జరుగుతాయి.

గ్రామ వ్యవసాయ విషయాలు[మార్చు]

ఈ గ్రామంలో దాదాపుగా 90% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా వరి ఎక్కువగా పండిస్తారు. తర్వాత పొద్దుతిరుగుడు, బత్తాయి తోటలు, పశువుల మేత కోసం జొన్న వంటి పంటలు పండిస్తారు. మామిడి తోటలు కూడా ఉన్నాయి. కొద్ది మంది చెరకు, రాగులు, సజ్జలు వంటి పంటలు పండిస్తారు. గ్రామంలో దాదాపుగా అన్ని కుటుంబాలకూ గేదెలు ఉన్నాయి. అందరు పాడి సంపద మీద ఆధారపడి జీవిస్తున్నారు.

గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు[మార్చు]

ఈ గ్రామంలో పంచాయతి కార్యాలయం ఉంది. దీనిని 25 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఊరిలో ఇంకా మహిళా మండలి కార్యాలయం నిర్మింపబడి ఉంది. దీనిలో ప్రస్తుతం ఒక గదిని గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఊరిలో ఇంకా విజయ పాలసేకరణ కేంద్రం ఉంది. గ్రామంలో ప్రజలు ఇక్కడ తమ పాలును పోస్తారు. ఊరిలో ఒక ఆయుర్వేద వైద్యశాల కీ.శే.మైనంపాటి వెంకటయ్య నిర్మించి ఇచ్చారు.దీనిలో ఒక గదిని తపాలా కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు.

విద్య, వైద్యం[మార్చు]

ఈ ఊరిలో ఒక అంగన్‌వాడి కార్యాలయము ఉంది. ఇక్కడ 3 నుండి 5 సంవత్సరములలోపు పిల్లలకు విద్యా బోధన చేస్తారు. ఊరిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. దీనికి 2 భవనాలు నిర్మింపబడి ఉన్నాయి. ఈ పాఠశాలలో 1 నుండి 7వ తరగతి వరకు భోదిస్తారు. కాలనీలో ఉన్న మరో పాఠశాల 1 నుండి 5 వ తరగతి వరకు భోదిస్తారు. 8వ తరగతి నుండి సమీపగ్రామమైన (వరికుంటపాడు) లో చదువుకొని వస్తారు. పై చదువులకు వేరే ప్రాంతాలకు వెళ్తారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3, 294 - పురుషుల సంఖ్య 1, 694 - స్త్రీల సంఖ్య 1, 600 - గృహాల సంఖ్య 759
 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 2502
 • పురుషుల సంఖ్య 1258
 • స్త్రీల సంఖ్య 1244
 • నివాసగృహాలు 578
 • విస్తీర్ణం 3271 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • వరికుంటపాడు 8 కి.మీ
 • తోటలచెరువుపల్లె 9 కి.మీ
 • జడదేవి 9 కి.మీ
 • గన్నేపల్లె 9 కి.మీ
 • కొండయపాలెం 9 కి.మీ
 • ఇస్కపల్లి 4 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • ఉత్తరాన పామూరు మండలం
 • దక్షణాన ఉదయగిరి మండలం
 • దక్షణాన దుత్తలూరు మండలం
 • పశ్చిమాన సీతారాంపురం మండలం

గ్రామంలో సౌకర్యాలు[మార్చు]

త్రాగునీరు సౌకర్యాలు

గ్రామానికి మంచినీరు పక్కనే ఉన్న గండిపాళెం జలాశయం నుండి రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది. ఈ నీరు ప్రతి వీధికి సరఫరా జరుగుతుంది. మిగిలిన అవసరాలకు ఊరి లోనె ఒక బొరు నుండి అదె కుళాయిలకు మిగిలిన సమయంలో విద్యుత్ పంపు ద్వారా సరఫరా చేయబడును. వ్యవసాయ నీటి సరఫరా

పంటపొలాలకు మాగాణి చెరువుకింద నీటి ద్వారా పండిస్తారు. చెరువులో నీరు లేనప్పుడు గండిపాళెం జలాశయం నుండి నీరు సరఫరా చేయబడుతుంది. కొంత భూమి బోరు బావుల ద్వారా సాగు చేయబడుతుంది.

దేవాలయాలు[మార్చు]

ఊరిలో రామాలయంతో పాటుగా చెన్నకేశవ స్వామి ఆలయం, ఊరి చివర చెరువు దగ్గర గంగమ్మ అలయం, అంకాలమ్మ, పోలేరమ్మ గుడులు కూడా ఉన్నాయి. ఊరి రామాలయంలో ప్రతి ఏటా కళ్యాణం జరుగుతుంది. గంగమ్మ అంకాలమ్మ, పొలెరమ్మ గుడుల వద్ద సంవత్సరానికి ఒక సారి పూజలు జరుగుతాయి. జంతుబలులు సాధారణం .ప్రతి ఏటా పంటలు బాగా పండాలని పొంగళ్ళు పెడతారు.

ముఖ్యమైన పండుగలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ అంతటిలాగానే ఈ ఊరిలో కూడా సంక్రాంతి, వినాయక చవితి, ఉగాది, దీపావళి మొదలైన పండుగలు బాగా జరుపుకుంటారు. ఏటా జరుగు శ్రీ రామనవమికి చుటుపక్కల గ్రామాల నుండి చాలామంది భక్తులు వస్తారు. అన్నదానం జరుగుతుంది. ఆరోజు సీతా రాముల కళ్యాణము జరుగుతుంది. రాత్రికి ఊరేగింపు జరుగును. ఔత్సాహికులైన యువకులు చెక్కభజన ముందు రోజు రాత్రికి చేస్తారు. గ్రామంలో కొంతమంది నాటకాలు కూడా నేర్చుకొని ప్రదర్శిస్తారు. ప్రత్యేకంగా వినాయకచవితి పండుగ 5 రోజులపాటు జరుగుతుంది.చివరి రోజు ఉట్టి మహోత్సవము జరగుతుంది.

వెలుపలి లింకులు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19

"https://te.wikipedia.org/w/index.php?title=గువ్వడి&oldid=1982858" నుండి వెలికితీశారు