చంద్రచూడ్ కమిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత క్రికెట్‌లో మ్యాచ్‌ఫిక్సింగుపై ఓ మ్యాగజైన్‌లో మనోజ్ ప్రభాకర్ చేసిన ఆరోపణలకు సంబంధించిన సంఘటనలను దర్యాప్తు చేసేందుకు బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిషను, చంద్రచూడ్ కమిషను. ఆరోపణలను పరిశీలించిన కమిషను, సాక్ష్యాధారాలు లేకపోవడంతో అన్ని ఆరోపణలను కొట్టివేసింది.

ప్రభాకర్ ఆరోపణలు[మార్చు]

1997 జూన్‌లో ఔట్‌లుక్ మ్యాగజైన్‌లో మనోజ్ ప్రభాకర్, పేరు తెలియని జట్టు సభ్యుడు ఒకరిపై బహిరంగంగా ఆరోపణలు చేశాడు.[1] బిసిసిఐ, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ నేతృత్వంలో ఏక వ్యక్తి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.[2] ముఖ్యంగా మనోజ్ ప్రభాకర్ తన ఆరోపణలలో భాగంగా ఈ క్రింది గేమ్‌లను వెలుగులోకి తెచ్చాడు:[3]

  • 1991లో షార్జాలో భారత్ పాకిస్థాన్ మ్యాచ్. వెలుతురు తగ్గినా, అంపైర్లు లైట్ అందించిన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్, ప్రభాకర్, సంజయ్ మంజ్రేకర్‌లను ఆట కొనసాగించమని కోరింది. పాకిస్థాన్ చివరి ఓవర్‌లో విజయం సాధించి ట్రోఫీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
  • 1994లో కొలంబోలో భారత్ vs పాకిస్థాన్ (సింగర్ కప్). పాకిస్థాన్‌కు అనుకూలంగా మ్యాచ్‌ను కోల్పోయేందుకు మనోజ్ ప్రభాకర్‌కు రూ.25 లక్షలు ఇవ్వజూపారు. ఆ ఆటగాడిని తన గది నుండి బయటకు గెంటేశానని మనోజ్ చెప్పాడు. వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఆగిపోయింది.
  • 1994లో కాన్పూర్‌లో భారత్ vs వెస్టిండీస్. వెస్టిండీస్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నయన్ మోంగియా, మనోజ్ ప్రభాకర్ లు 48 బంతుల్లో 11 పరుగులు చేశారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆ ఇద్దరు ఆటగాళ్లను తదుపరి మ్యాచ్‌ నుండి తొలగించారు
  • షార్జాలో భారత్ vs పాకిస్థాన్ (తేదీ: తెలియదు). కెప్టెన్లు అమీర్ సొహైల్, మహ్మద్ అజారుద్దీన్ ఇద్దరూ తామే టాస్ గెలిచినట్లు ప్రకటించారు.

కమిషన్ విచారణలు[మార్చు]

కింది ఆరోపణలను పరిశీలించాలని BCCI, కమిషన్ కోరింది: [4]

  • మనోజ్ ప్రభాకర్ ఆరోపణల్లో నిజం ఉందా?
  • బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఎవరైనా భారతీయ క్రికెటర్, అధికారి, జర్నలిస్టు లేదా మరెవరిదైనా ప్రమేయం ఉందా?
  • భారత క్రికెటర్ల ఫోన్లను అజిత్ వాడేకర్ ట్యాప్ చేశాడా?
  • లంచం, మ్యాచ్ ఫిక్సింగ్ నివేదికల్లో నిజం ఉందా?

జస్టిస్ చంద్రచూడ్ తన విచారణను 1997 జూలై 7 న ప్రారంభించాడు. మనోజ్ ప్రభాకర్, కపిల్ దేవ్, ఔట్‌లుక్ మ్యాగజైన్ కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ లను మొదటి రోజు న్యాయమూర్తి ప్రశ్నించాడు.[5] మనోజ్ ప్రభాకర్ తన ఆరోపణలకు (అప్పటి క్రికెట్ మేనేజర్ అజిత్ వాడేకర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు) సంబంధించిన పేర్లను గాని, ఆధారాలను గానీ వెల్లడించలేదు.[6]

కమిషన్ ముందు హాజరైన ఇతర వ్యక్తులు:

చంద్రచూడ్ కమిషన్ నివేదిక[మార్చు]

జస్టిస్ చంద్రచూడ్ తన విచారణను 1997 అక్టోబరులో పూర్తి చేసి, నివేదికను బీసీసీఐకి సమర్పించాడు. 2000 లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చినప్పుడు BCCI, చంద్రచూడ్ నివేదికను మీడియాకు విడుదల చేసింది. నివేదిక ఇలా ఉంది:

  • మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను నివేదించడానికి మనోజ్ ప్రభాకర్ 3 నుండి 6 సంవత్సరాలు ఎందుకు వేచి ఉండవలసి వచ్చిందో సరైన కారణం చెప్పలేదు. 1991 అక్టోబరులో షార్జాలో జరిగిన సంఘటనలపై మంజ్రేకర్ చేసిన ప్రకటన ప్రభాకర్‌ ప్రకటంకు విరుద్ధంగా ఉంది. సింగర్ కప్ ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. లేదా కెప్టెన్, కోచ్ లేదా వైస్ కెప్టెన్‌కు నివేదిక ఇవ్వలేదు. టాస్ ఘటనపై అమీర్ సోహైల్, మహ్మద్ అజారుద్దీన్‌లపై మనోజ్ చేసిన ఆరోపణ వాస్తవంగా తప్పు. ఎందుకంటే ఈ ఇద్దరు క్రికెటర్లు షార్జాలో తమ జట్లకు కెప్టెన్‌లుగా ఉండగా మ్యాచ్ జరగనే లేదు. న్యాయమూర్తి స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన వ్యక్తి పేరు చెప్పడానికి మనోజ్ ప్రభాకర్ నిరాకరించాడు. మనోజ్, ప్రతీకారం కోసమే మహ్మద్ అజారుద్దీన్‌పై ఆరోపణ చేసినట్లు న్యాయమూర్తి నిర్ధారించాడు. మనోజ్ ప్రభాకర్ చేసిన ఆరోపణలను తిరస్కరించడానికి న్యాయమూర్తి సంకోచించలేదు. [6]
  • ఫోన్ ట్యాపింగ్ ఆరోపణపై అజిత్ వాడేకర్ చేసిన వాంగ్మూలాన్ని అంగీకరించిన న్యాయమూర్తి ఆ ఆరోపణను తోసిపుచ్చాడు. [6]
  • భారతదేశంలో క్రికెట్‌పై పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు జరిగాయని జడ్జి స్వయంగా విశ్వసిస్తున్నందున మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి జర్నలిస్టు వెలిబుచ్చిన అనుమానాలేమీ అన్యాయమైనవి కావు అని భావించాడు. అయితే భారత జట్టులో క్రికెట్‌పై పందెం కాసే ఆటగాడు లేదా ఆటగాళ్లను గుర్తించడం తమ దర్యాప్తు బృందాలకు సాధ్యం కాదని పోలీసులు తెలిపారు.[6]

విమర్శ[మార్చు]

కమిషన్ తనకు అందుబాటులో ఉన్న అన్ని వాస్తవాలను పరిశీలించలేదని భారతీయ మీడియాలో విమర్శలు వచ్చాయి. [9] [10] సాక్ష్యాధారాలను నమోదు చేసే విధానం, అమీర్ సొహైల్ - మహ్మద్ అజారుద్దీన్ టాస్‌కు సంబంధించిన వాస్తవాలలో సంబంధం లేకపోవడాన్ని పరిశీలించడాంలో చొరవ తీసుకోకపోవడం, బెట్టింగు, మ్యాచ్ ఫిక్సింగులలో పాల్గొన్న వ్యక్తులను ప్రశ్నించకపోవడం, వారిపై సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, రషీద్ లతీఫ్‌తో ఔట్‌లుక్ చేసిన ఇంటర్వ్యూ టేపులను పరిశీలించకపోవడాం (అందులో అతను, మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాల్గొన్న ఐదుగురు భారతీయ క్రికెటర్లను పేర్కొన్నాడు. కానీ ఆ తర్వాత వాటిపై అతను వెనక్కి తగ్గాడు) మొదలైనవాటిని మీడియా ఎత్తిచూపింది.

మూలాలు[మార్చు]

  1. "Prabhakar: 'I was offered Money'". Outlook India. 11 June 1997. Archived from the original on 13 September 2012. Retrieved 23 March 2007.
  2. "Chandrachud committee to probe betting scam". Rediff. 21 June 1997. Retrieved 23 March 2007.
  3. "Chandrachud committee to probe betting scam". Rediff. 2 June 1997. Retrieved 2 April 2007.
  4. "Chandrachud gets his brief". Rediff. 28 June 1997. Retrieved 2 April 2007.
  5. "Prabhakar refuses to finger player as Chandrachud begins probe into betting scandal". Rediff. 7 July 1997. Retrieved 2 April 2007.
  6. 6.0 6.1 6.2 6.3 "Full Report – Chandrachud Commission". Rediff. 20 April 2000. Retrieved 23 March 2007.
  7. "Players appear in front of Chandrachud Commission". Rediff. 22 July 1997. Retrieved 3 April 2007.
  8. "Azhar to discuss betting allegations scandal". Rediff. 5 September 1997. Retrieved 3 April 2007.
  9. "Not proven!". Rediff. 20 October 1997. Retrieved 3 April 2007.
  10. "Chandrachud report dismissed as 'old hat'". ESPNcricinfo. 21 April 2000. Retrieved 3 April 2007.