చర్చ:ఆంధ్రుల దుస్తులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రుల దుస్తులు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


నాకు తెలిసినంత, వీలయినంత మొదలు పెట్టాను. మీకు ఇంకనూ వేరే విషయాలు తెలిసి ఉంటే, తప్పక విస్తరించవలసిందిగా, నాకు సూచించవలసిందిగా మనవి. శశి (చర్చ) 00:09, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దుస్తుల వ్యాసంలో ఆభరణాలను తొలగించండిSomu.balla (చర్చ) 01:24, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సందేహాలతోనే ఆభరణాలను చేర్చాను. మీరు చెప్పినది సరియే. దుస్తులు ప్రాథమిక అవసరాలు. శక్తి కొలది వాటికి సొబగులు ఉంటాయి. ఆభరణాలు సంపన్న వర్గాలు మాత్రమే వాడతారు. ఇవి పాథమిక అవసరాలు కావు. తొలగిస్తాను. శశి (చర్చ) 04:29, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
శశి గారూ, చాలా కష్టమైన వ్యాసాన్నే వ్రాస్తున్నారు. అందుకు ముందుగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఈ వ్యాసం జాగ్రత్తగా వ్రాయకపోతే సులభంగా మెగజీన్ ఆర్టికలైపోతుంది. రవికకు, జాకెట్టుకు తేడా సిమ్రాన్ వివరించిదని వ్రాసారు. ఆ సిమ్రాన్ కు ఎలా తెలిసింది? మాటల రచయితో, కథా రచయితో వ్రాసుండాలి. ఆ సదరు రచయితకి ఎలా తెలిసింది? ఈ ధోరణిలో ఆలోచిస్తే వీటన్నిటి మూల సమాచారం దొరుకుతుంది. ఏదైనా ఆంధ్రుల సాంస్కృతిక సాంఘీక చరిత్రకు సంబంధించిన పుస్తకంలో మీకీ వ్యాసం వ్రాయటానికి కావలసిన సమాచారం లభించవచ్చు --వైజాసత్య (చర్చ) 03:41, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, మీ మెచ్చుకోలుకు ధన్యవాదాలు. రాజశేఖర్ గారిచ్చిన సలహాతో మొదలు పెట్టాను. (వారు, మీరు నాకు అండగా ఉన్నారన్న ధైర్యం తో!) గూగుల్ లో ప్రయత్నించాను. కావలసినంత సమాచారం దొరకలేదు. మెల్లగా నా జ్నానాన్నంతా క్రోడీకరించాను. మెగజీన్ ఆర్టికల్ కాకుండా వికీ ప్రమాణాలకి తగినట్లు వచ్చేట్టు దీనిని పర్యవేక్షించండి, పెంచండి, తొలగించండి, నాకు సలహాలివ్వండి. శశి (చర్చ) 04:29, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సలహాననుసరించి మంచి వ్యాసాన్ని ప్రారంభించారు. పురుషుల దుస్తుల్ని, స్త్రీల దుస్తుల్ని వేరుచేసినట్లుగానే పిల్లల దుస్తులకు కూడా ఒక సెక్షన్ పెట్టండి. ముందు వ్యాసానికి పరిచయంగా మన సంస్కృతిని ఇదొక మూలంగా పేర్కొనండి. మనందరమూ కలిస్తే ఇది మంచి వ్యాసం అవుతుంది. వ్యాసంలో కొన్ని బొమ్మలు చేర్చాను.Rajasekhar1961 (చర్చ) 05:58, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, బొమ్మలు చేర్చినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు విషయాలని చేరుస్తాను.శశి (చర్చ) 14:36, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పిల్లలు ధరించేది లంగా-ఛోళీ, పెళ్ళి కావలసిన యువతులు ధరించేది లంగా-ఓణి అని తెలుసుకొని, దానికి తగ్గట్టుగా మార్పులు చేశాను. శశి (చర్చ) 14:36, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రుల ఆహార్యం గురించిన వ్యాసంలో తమిళుల, మళయాళీల ప్రస్తావన అనవసరం ఆ భాగం తీసెయ్యండి --వైజాసత్య (చర్చ) 03:50, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తమిళుల, మలయాళీల ప్రస్తావన తొలగింపు శశి (చర్చ) 23:37, 4 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి

[మార్చు]

రవికె వ్యాసం చదివాను. ఛోళీ అంటే కూడా రవెకే అను ఉన్నది. మరి చిన్నపిల్లలు లంగా పైన వేసుకొనేదేమిటి? నేను ఓణీ అనుకొన్నాను. కానీ మా శ్రీమతి ఓణీ అంటే పైట యే అని నా సందేహాన్ని నివృత్తి చేసినది. ఇదిలా ఉంటే పరికిణీ అంటే ఏమిటి? అనే ఇంకో కొత్త సందేహం బయలు దేరినది. సూచించగలరు. శశి (చర్చ) 23:48, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పైట మరియు ఓణీ ఒకటే; కన్యలు, పిల్లలు వేసుకొనే అందమైన లంగాణే పరికిణీ అంటారు. రవికె పెళ్ళిన స్త్రీలు వేసుకొనేవి సగం శరీరాన్ని కప్పితే; పిల్లలు పరికిణీ మీద వేసుకొనే జాకెట్టు నడుం క్రింద వరకు వచ్చి శరీరాన్ని మొత్తం కప్పివుంచుతుంది.Rajasekhar1961 (చర్చ) 07:12, 2 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పై ప్రకారం మార్చాను శశి (చర్చ) 11:12, 2 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతర దుస్తులు గురించి

[మార్చు]

గోచీ గురించి కూడా వ్రాస్తే బావుంటుంది. వ్యవసాయదారులు కూలీలు పల్లెలలో ఇప్పటికీ చాలామంది దానినే రెగ్యులర్ డ్రెస్గా వాడుతున్నారు.విశ్వనాధ్ (చర్చ) 14:30, 2 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్ గారికి నమస్కారం. ఒక చిన్న అయోమయం. గోచీ అంటే మీ ఉద్దేశ్యం లంగోటి యా? ఎందుకంటే పుట్టగోశ అని మా ఊళ్ళో వాడే వికృతి కి అర్థం, లంగోటి యే. లేక నీళ్ళలో తడవకుండా ఉండేలా మోకాళ్ళు లేదా కాలిపిక్కలు దాకా కట్టే ధోవతియా? శశి (చర్చ) 23:50, 2 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసకర్త ఈ [1]లింకు కూడా చూడగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:38, 2 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
జె వి ఆర్ కె గారికి నమస్కారం. చూశాను, ఈ లింకులోని ఎరుపు రంగు లో ఉన్న వాటి గురించి కూడా వ్రాయమని అడుతున్నారా? తెలుపుగలరు. శశి (చర్చ) 23:50, 2 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
శశి గారికి, మీరు వ్రాయుచున్న వ్యాసము, దుస్తులు అనే విషయము గురించి కాబట్టి మీరన్నట్లు (1) నీలము, ఎరుపు రంగు లో ఉన్న వాటి గురించి కూడా సమాచారము అక్కడ విపులముగా పొందు పరచిన చదువరులకు వీలుగా ఉంటుంది. మరియు వ్యాసము కూడా పెద్దది కాదు. అని నా అభిప్రాయము. (2) దుస్తులు రాష్ట్రాల వారీగా భారతీయ దుస్తులు వ్యాసము నందు వాడుకరులు జాబితా నందు పొందు పరచ వచ్చును. అప్పుడు మీరు ప్రతి కొత్త సమాచారమునకు వాడుకరులకు జవాబులు ఇచ్చే సమయము తగ్గుతుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:51, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సంతోషం. నేను కూడా మొదటి పాయింటు తో ఏకీభవిస్తాను. అందుకే కుర్తాలో కొంత భాగాన్ని ఇక్కడి నుండి తొలగించి కుర్తా వ్యాసంలో చేర్చాను. ఇక రెండవ పాయింటుకు వస్తే, నా వ్యక్తిగత అభిప్రాయం ఆంధ్ర దుస్తులు వేరుగా ఉండాలనే. ఎందుకంటే మనలో మనము ఇలా చర్చించుకొని సందేహ నివృత్తి చేసుకొనవచ్చును.ఇతర రాష్ట్రాల వేషభాషల గురించి మనకి తెలిసినది తక్కువ కాబట్టి, మన రాష్ట్ర దుస్తుల గురించి అందులో చాలా ఎక్కువ, మిగతా రాష్ట్రాల వారి దుస్తులు గురించి చాలా తక్కువ సమాచారం ఉంటుంది. కానీ వికీ నాణ్యతా ప్రమాణాలని నేను శాసించలేను. కాబట్టి అదే సరియైనచో అలాగే చేయండి. (మరి అలా విలీనం చేస్తే, నేను రాసినదంతనూ, విలీనం చేసినతని ఖాతా లో నమోదు అవుతుందేమో నన్న భయం కూడా).
శశి గారికి, గోచీ (పిపీలిక) అంటే ఒక గుడ్డలోని చిన్న పీలిక. కాని లంగోటి అంటే అది ఒక పెద్ద గుడ్డ త్రికోణాకృతిలో (సుమోలు వాడేవి) ఉంటుంది. గోచీ కంటే లంగోటి పెద్దది కాని వాటి ఆచ్చాదనలో భేదము ఉన్నా (పిరుదులు మూతలో కొంతభాగము లంగోటికి ఉంటే గోచీకి మాత్రము పిరుదులు ఆచ్చాదన అసలు దాదాపుగా ఉండదు) కాని వాటి ఉపయోగము మాత్రము ఒకటే. గమనించ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:59, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామాలలో, ఇతరత్రా అనేక పనులలో వివిధ రకములయిన గోచీలు పెట్టుకుని పనులు చేస్తారు. వాటి సందర్భ విషయములు వేరుగా ఉంటాయి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:03, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గోచి (లేదా గోశి)కి లంగోటి (లేదా లంగోట)కు తేడా ఉంటుంది. పొలాలలో పనిచేసే రైతులు (లేదా ఇతర కూలీలు) పనిసౌలభ్యం కోసం పంచెనే మోకాలిపై వరకు బిగుతుగా కట్టుకోవడమే గోశి. గోశిలలో రకాలుండవు. కట్టుకొనే విధానంలో ప్రాంతాలను బట్టి తేడాలుంటాయి. కొందరు కట్టే గోశి నుంచి డ్రాయరు కూడా బయట కనిపిస్తుంది. 223.196.191.78 09:27, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు లేని వారు వ్రాసినది కూడా ఆలోచించ వచ్చును. వివరముగా వివరిస్తే బావుంటుంది. గోచీలలో రకములు " గురించి నేను ప్రస్తావించ లేదు. వివిధ రకములయిన గోచీలు పెట్టుకుని పనులు చేస్తారు అంటే వివిధ పద్దతులలో (గోచీలు) పెట్టుకుని అని అర్థం. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:28, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ కాంసెప్ట్ యే (కనీసం నాకు). కానీ ప్రయత్నిస్తాను. శశి (చర్చ) 00:22, 4 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Formals కి తెలుగు పదం ఏమిటి?

[మార్చు]

ఈ వ్యాసంలో నేను సాంప్రదాయికం అని వాడాను. కాని అది Traditional ని సూచిస్తుందేమోనని సందేహం. విక్షనరీ లో ఉన్న బహుళార్థాలు సరిపోలేదు. గూగుల్ ట్రాంస్లేట్ లో మర్యాదపూర్వకం అని చూపినది. ఎందుకో అది కూడా సరియైన పదం అని అనిపించలేదు. ఎవరైనా సహాయం చేయగలరా?శశి (చర్చ) 23:41, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రభారతి నిఘంటువులో చూశాను. formal అనే దానికి సాంప్రదాయక, ఆచారబద్ధ, క్రమబద్ధ, లాంఛనప్రాయ, రూపాత్మక; ఆనవాయితీగల, పద్ధతి ప్రకారమైన, మర్యాదప్రకారమైన, విధ్యుక్తమైన, వ్యావహారికమైన, మొదలైన అర్ధాలున్నాయి. traditional కి వాడే సాంప్రదాయక పదమే బాగుంది. అసాంప్రదాయక అనేది దానికి విభిన్నమైనది. ఇతర సభ్యులు వారి అభిప్రాయాన్ని తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 03:55, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే సాంప్రదాయికం కే ఫిక్స్ అయిపోతా! సరియైన పదం కనుగొనటానికి మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు. శశి (చర్చ) 18:11, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సాధారణంగా ఇటువంటి పదాలకు 'సాధారణ దుస్తులు'గా రాస్తుంటాము. 'సాధారణం' అనే పదం 'క్యాజువల్' ఆంగ్ల పదానికి దగ్గరగా ఉన్నట్లనిపిస్తున్నా - ఫార్మల్ డ్రెస్సింగ్ అంటే సాధారణ సంప్రదాయక దుస్తులుగానే పరిగణిస్తాము. ఫార్మల్స్ అనేపదం వాడుక ఇటీవలి కాలంలోనే ఎక్కువగా వినిపిస్తోంది. పూర్వకాలంలో పంచె, ధోవతి, షరాయి, జుబ్బా, చీర, రవిక, లంగా, ఓణీ - వంటివన్నీ తెలుగువారి సంప్రదాయక వస్త్రధారణగానే వ్యవహరించేవారు. ఈమధ్య కాలంలో కార్పోరేట్ కల్చర్ పెరిగిపోయిన తరువాత సంప్రదాయాన్నీ, వ్యవహారికాన్నీ విడగోట్టారనిపిస్తుంది. అందుకే - కార్పోరేట్ పీపుల్ వారి ఆఫీస్ వ్యవహారాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా జరుపుకునే పార్టీలు, సమావేశాలకు ఫార్మల్ డ్రస్సింగ్ లో రమ్మంటూ ఆహ్వాన పత్రికల్లో ప్రత్యేకంగా పేర్కొనడం - ఆఫీస్ డ్రస్సు లో కాకుండా సాధారణ దుస్తులలో రావాలన్నదే కావచ్చు. ఇకపోతే - శీర్షిక పేరు 'ఆంధ్రుల దుస్తులు' కంటే 'ఆంధ్రుల వస్త్రధారణ' అంటే బావుంటుందేమో ఆలోచించగలరు. ---Malladi kameswara rao (చర్చ) 07:32, 6 ఫిబ్రవరి 2013 (UTC) కామేశ్వరరావు గారు తెలిపిన విషయం ప్రకారం, వస్త్రధారణ నే బావున్నదని నా వ్యక్తిగత అభిప్రాయం. (ఆంధ్రుల అని అన్నాం కాబట్టి. తెలుగువారి అని అని ఉంటే, దుస్తులు సరిపోయి ఉండేది.) శోధించేవారు రకరకాల పేర్లతో శోధిస్తుంటారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని, తగు విధంగా రీ-డైరెక్టు చేయగలరని మనవి. శశి (చర్చ) 18:11, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మెయిన్ ఆర్టికల్, సీ ఆల్సో మూసలు

[మార్చు]

ఉపయోగించిననూ, ఈ క్రింది మూసలు కూడా వినియోగించాలా?

- 19:23, 18 ఫిబ్రవరి 2013 (UTC)

గ్లాస్కో, గ్లాక్సో కాదుట, గ్లాస్గోవ్ (Glasgow)ట

[మార్చు]

గ్లాక్సో బ్రాండు వికృతి గ్లాస్కో అయినది అనుకొన్నాను. కానీ బ్రిటన్ లోని గ్లాస్గోవ్ లో ఉత్పత్తి అయ్యే నూలు చాలా మేలు రకమైనది అని, నాణ్యతలో అక్కడ ఉత్పత్తి అయిన నూలు వలె ఉన్నదానితో నేసిన పంచెలని గ్లాస్గోవ్ పంచెలు అనేవారని అదే గ్లాస్కో గా మారినదని మా నాన్నారు శెలవిచ్చారు. ఇప్పుడు ఏమిటి చేయటం? శశి (చర్చ) 16:17, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]