చర్చ:పాబ్లో ఎస్కోబార్/GA1
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని నేను సమీక్షకు స్వీకరించాను. తొలిచూపులో నేను గమనించినది.. వ్యాసం మౌలిక నియమాలకు అనుగుణంగా ఉంది. దీన్ని మెరుగుపరచి మంచి వ్యాసం స్థాయికి తీసుకుపోవచ్చు. వచ్చే రెండు రోజుల్లో నా తొలి పరిశీలనలు రాస్తాను.__చదువరి (చర్చ • రచనలు) 17:15, 7 ఆగస్టు 2018 (UTC)
Rate | ప్రమాణం | సమీక్షా వ్యాఖ్య |
---|---|---|
1. చక్కగా రాసినదై ఉండాలి: | ||
వ్యాసంలోని వచనంలో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండకూడదు.. . | ||
అది శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.. . | ||
2. మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగి ఉండాలి: | ||
దానిలో అన్ని మూలాల జాబితా, వ్యాసం లేఅవుట్‌కి అనుగుణంగా ఉండాలి. . | ||
వ్యాసంలో వాక్యం పక్కనే ఇచ్చే మూలాలు వికీపీడియా:నమ్మదగ్గ మూలాల నుంచి ఉండాలి. నేరుగా ప్రస్తావిస్తున్న కొటేషన్లు, ప్రచురితమైన అభిప్రాయాలు, సహజ విరుద్ధమైన అంశాలు, వివాదాస్పదమైన వాక్యాలు వంటి ప్రశ్నించదగ్గ, సందేహించదగ్గ అంశాలు, జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పదమైన సమాచారం మరీ ముఖ్యంగా ఈ నమ్మదగ్గ మూలాలతో సమర్థించాలి.. . | ||
దానిలో మౌలిక పరిశోధనలు లేకుండా ఉండాలి. . | ||
కాపీహక్కుల ఉల్లంఘనలు గాని, గ్రంథచౌర్యం గానీ ఉండకూడదు.. . | ||
3. విస్తృత పరిధి కలిగి ఉండాలి: | ||
వ్యాస విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరామర్శించాలి. . | ||
అనవసరమైన అంశాల జోలికి పోకుండా వ్యాస విషయంపైననే దృష్టిని నిలిపి ఉంచాలి (వికీపీడియా:సారాంశం శైలి చూడండి). . | ||
4. తటస్థం: నిష్పాక్షికంగా ఉంటూ, వివిధ దృక్కోణాలకు తగు విలువను ఇస్తూ చూపించాలి.. | ||
5. స్థిరత్వం: దిద్దుబాటు యుద్ధాల వలన గాని, పాఠ్య సంబంధ వివాదాల వలన గానీ వ్యాసంలో అనునిత్యం మార్పుచేర్పులు జరుగుతూ ఉండరాదు.. | ||
6. సచిత్రం: వీలైనంతవరకు బొమ్మలు, వీడియో , ఆడియో వంటివి వాడాలి.: | ||
మీడియాకు వాటి కాపీహక్కుల స్థితికి సంబంధించిన వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా ఉండాలి. అలాగే, స్వేచ్ఛగా అందుబాటులో లేని మీడియాకు సముచిత వినియోగపు హేతుబద్ధతను సూచించాలి.. . | ||
మీడియా, విషయానికి సంబంధించినవై ఉండాలి. వాటికి సముచితమైన వ్యాఖ్యలు ఉండాలి. . | ||
7. సమీక్షా ఫలితం. |
సమీక్ష
[మార్చు]స్థూలంగా వ్యాసం బాగా రాసారు.
భాషా దోషాలు
[మార్చు]వ్యాకరణ, అనువాద, అక్షర దోషాలన్నీ ఈ విభాగంలో చేరుస్తాను.
- అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే అక్రమంగా రవాణా చేసేది - ఈ వాక్యంలో "అక్రమంగా రవాణా" అవసరం ఉందో లేదో పరిశీలించండి.
- "ఈ మెడెలిన్ కార్టెల్‌కి దాని పోటీ కార్టెల్‌లతో జాతీయంగా, అంతర్జాతీయంగా స్పర్థ ఉండేది, దాని కారణంగా హత్యాకాండ, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయనాయకుల హత్యలు వంటివి చేసేవారు." - ఈ వాక్యంలో "స్పర్థ ఉండేది, దాని కారణంగా" అనే చోట కామా స్థానంలో పూర్ణ విరామం (.) ఉండాలి. వ్యాసంలో మిగతా చోట్ల కూడా ఇలాంటివి సవరించాలి.
- మోటారుసైకిల్ దొంగతనంలోనూ --> మోటారువాహనాల దొంగతనంలోనూ
- కాంట్రాబ్రాండ్ అక్రమరవాణాదారుల --> నిషిధ్ధ వస్తువుల (కాంట్రాబాండ్) అక్రమరవాణాదారుల
- దంపతులకు ఏడుగురు సంతానంలో --> దంపతుల ఏడుగురు సంతానంలో
- ఈ సమాధి రాళ్ళు సమాధుల నిర్వహణకు డబ్బు ఇవ్వడం ఆపేసిన క్లెయింట్లకు సంబంధించినవారి సమాధి రాళ్ళు తీసి అమ్మేసే శ్మశానాల యజమానుల నుంచే చట్టబద్ధంగా దీన్ని తీసుకునేవారమనీ, తమ బంధువుకు వీటిని అమ్మే వ్యాపారం ఉండడంతో అతనికి అమ్మేవారమనీ చెప్తాడు. - 1. ఈ వాక్యాన్ని అర్థవంతంగా ఉండేలా సవరించాలి. 2. "చెప్తాడు" సరైన వాడుక కాదు. చెప్పేవాడు/చెప్పాడు ఉండాలేమో చూదండి. మిగతా వ్యాసంలో కూడా టెన్స్ సరిగా ఉండేలా చూడాలి.
- ఎస్కోబార్ కుమారుడు సెబాస్టియన్ మారోక్విన్ ప్రకారం అతని తండ్రి నేరాలు ప్రారంభమైంది నకిలీ ఉన్నత పాఠశాల డిప్లమో సర్టిఫికెట్లు తయారుచేసి అమ్మడంతో మొదలైంది. - ప్రారంభమైంది, మొదలైంది - రెండూ అక్కర్లేదు. డిప్లమో, డిప్లొమో అనే రెండు వాడుక లున్నాయిక్కడ. డిప్లొమా ఉండాలనుకుంటాను.
- కిడ్నాప్ చేసి, విడుదల చేయడానికి లక్ష అమెరికన్ డాలర్లు సంపాదించాడు - ఈ వాక్యాన్ని సవరించాలి.
- ఎస్కోబార్ చిన్ననాటి నుంచి తనకు 22 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఎలాగోలా పది లక్షల కొలంబియన్ డాలర్లు సంపాదించాలన్న కోరిక ఉండేది - ఈ వాక్యం బాగానే ఉంది కానీ సవరిస్తే మరింత బాగుంటుంది.
- విమానానికి వచ్చి - ఒక్కో విమానంలో అని రాస్తే బాగుంటుంది.
- కార్టెల్ అని చాలాచోట్ల రాసారు. కొన్నిచోట్ల మాత్రం కార్టల్ అని పడింది. దాన్ని మార్చాలి.
- స్వతాహాగా
- దీని విషయంలో ఏం చేయాలన్నది స్పష్టంగా తెలియట్లేదు, ఈ పదం అనవసరం అనా? (పవన్)
- @Pavan santhosh.s:"స్వతహాగా" కదా సరైన పదం..
- కరెక్టేనండి. దిద్దాను.
- @Pavan santhosh.s:"స్వతహాగా" కదా సరైన పదం..
- దీని విషయంలో ఏం చేయాలన్నది స్పష్టంగా తెలియట్లేదు, ఈ పదం అనవసరం అనా? (పవన్)
- జట్టులకు స్పాన్సర్ చేయడం వంటి పనులు చేశాడు - "జట్టులను" అని అనాలేమో చూడండి.
- ఒక సమయంలో నెలనెలా 70 నుంచి 80 టన్నుల కొకైన్ అమెరికాకు కొలంబియా నుంచి అక్రమరవాణా చేస్తున్నట్టు అంచనావేశారు - ఈ వాక్యంలో "ఎస్కోబార్" గానీ, "అతను" గానీ చేరిస్తే బాగుంటుంది.
- "అతిపెద్ద లోడ్ షిప్పింగ్" - "అతిపెద్ద లోడు" అంటే సరిపోతుందేమో చూడండి.
- "సొమ్ము అంతా వారి గోడౌన్లలో దాచేవారు. ఈ సొమ్ములో ఏడాదికి పదిశాతం గోడౌన్లలో చేరి, అందిన డబ్బును కొరికిపారేసే ఎలుకల వల్ల పాడైపోయేది" - ఈ వాక్యాలను ఇలా రాయొచ్చేమో పరిశీలించండి. "సొమ్మునంతటినీ గోడౌన్లలో దాచేవారు. ఈ సొమ్ములో ఏడాదికి పదిశాతం వరకూ ఎలుకలు కొరికిపారెయ్యడం వల్ల పాడైపోయేది."
- దక్షిణ అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన కోపా లిబెర్టడరెస్‌ను 1989లో గెలుచుకున్న మెడెలిన్ నగరపు అట్లెటికో నేషినల్ క్లబ్ వెనుక ప్రధాన పెట్టుబడిదారు ఎస్కోబార్ అని సాధారణంగా నమ్మేవారు - "ప్రతిష్టాత్మకమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన " -రెండు సార్లు ఐన రాకుండా చూడాలి. కామన్ అనే మాటకు "సాధారణంగా" అనే అనువాదం ఇక్కడ ఇమడలేదు. "ఎస్కోబారే ననే నమ్మకం ప్రజల్లో ఉండేది." అంటే బాగుంటుంది. లేదా మరో విధంగానైనా మార్చండి.
అనువాదాలు
[మార్చు]- అనువాదాన్ని సంస్కరించాలి. "మెడెలిన్ అనే సమీప నగరంలో ఎస్కోబార్ పెరిగాడు.", "ఆ ద్వీపంలో విస్తరించిన భూమినంతా దాదాపు కొనేశారు," -"సమీపంలోని మెడెలిన్ అనే నగరంలో పెరిగాడు.", "దాదాపుగా ఆ ద్వీపంలోని భూమినంతటినీ కొనేశారు." అని రాస్తే బాగుంటుంది.
- అలాగే "కొనేశారు" తరువాత కామా తీసేసి, పూర్ణ విరామం పెట్టాలి. మిగతా వ్యాసంలోనూ దీన్ని సవరించాలి.
- "మెడెలిన్ ఎగ్జిక్యూటివ్‌ని కిడ్నాప్ చేసి, విడుదల చేయడానికి లక్ష అమెరికన్ డాలర్లు డిమాండ్ చేసి సంపాదించుకున్నాడు" - మెడెలిన్ నగరంలో ఒక ఎగ్జిక్యూటివ్‌ను కిడ్నాప్ చేసి.. ఈ వ్యాస విషయం, వ్యాసంలోని ఊర్లు, పేర్లూ పాఠకుడికి అంతగా పరిచయం లేనివి. మెడెలిన్ ఎగ్జిక్యూటివ్‌ని అని కాకుండా మెడెలిన్ నగరంలోని ఒక ఉద్యోగిని అని అంటే పాఠకుడికి త్వరగా ఎక్కుతుంది.
- మెడెలిన్ నగరాన్ని ఉద్దేశించిన ప్రతీచోట మెడెలిన్ నగరం అన్న అర్థం వచ్చేలా మార్చాను. మెడెలిన్ కార్టెల్‌కు ఆ పేరెలా వచ్చిందన్న వివరణ ఇంకా సులభంగా అర్థమయ్యేలా ఇచ్చాను. (పవన్)
- రాబర్టో ఎస్కోబార్ ప్రకారం - ఎకార్డింగ్ టు రాబర్టో ఎస్కోబార్ అనే వాక్యాన్ని రాబర్టో ఎస్కోబార్ చెప్పినదాని ప్రకారం అంటే బాగుంటుందనిపిస్తోంది. ఇది పరిశీలించాల్సిన సంగతి.
- వ్యక్తుల/స్థలాలు/సంస్థల పేర్లు: తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని పేర్లను రాసేటపుడు మరికొంత జగ్రత్తగా ఉండాలి. ఉదా: గోన్జెలెజ్ దీన్ని గొంజాలెజ్ అని రాయాలేమో చూడాలి. ప్రొనన్సియేషన్ ఎలా ఉండాలో తెలియజెప్పే సైట్లు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అది తేలిక.
- "కానీ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా లిబరల్ రెన్యువల్ ఉద్యమం మద్దతుతో పోటీచేసిన లూయీస్ కార్లోస్ గాలేన్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో సభ్యత్వం వదులుకోవాల్సి వచ్చిందీ'" - ఈ వాక్యం ఇంగ్లీషు మూలం ఇస్తున్న అర్థం కంటే భిన్నమైన అర్థాన్ని ఇస్తోంది.
- మార్చాను ఒకసారి సమీక్షకులు పరిశీలించి చెప్పగలరు. (పవన్) -
- అంతకుముందు, ఎన్నికల ప్రచారంలో ఎస్కోబార్ లిబరల్ రెన్యువల్ ఉద్యమం తరపున అభ్యర్థిగా నిలిచాడు. కానీ, లిబరల్ రెన్యువల్ ఉద్యమం మద్దతిచ్చిన ప్రెసిడెన్షియల్ అభ్యర్థి, లూయీస్ కార్లోస్ గాలేన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఎస్కోబార్ తప్పుకోవలసి వచ్చింది.
- "కొలంబియన్ ప్రభుత్వం ద్వారా అమెరికాకు నేరస్థుల అప్పగింత కింద బదిలీ అయ్యే ప్రమాదం ఉన్న లాస్ ఎక్స్ట్రాడిటబుల్స్ అన్న కొకైన్ అక్రమరవాణాదారుల బృందం గురించిన అన్ని పత్రాలూ, దస్త్రాలు M-19 వారు ప్యాలెస్ ముట్టడించి తగలబెట్టేందుకు కొకైన్ అక్రమరవాణాదారుల నుంచి డబ్బు అందుకున్నారు." - ఈ వక్యాన్ని సవరించాలి.
- "ఈ లాస్ ఎక్స్ట్రాడిటబుల్స్ జాబితాలో ఎస్కోబార్ కూడా ఉన్నాడు. లాస్ ఎక్స్ట్రాడిటబుల్స్‌ను వారి నేరాల విచారణకు అమెరికాకు అప్పగించకుండా ప్రభుత్వం నుంచి హామీని వారి విడుదలకు ముడిపెట్టి రాయబారం మాట్లాడుకుందుకు కొందరిని బందీలుగా పట్టుకున్నారు" - ఈ వాక్యాన్ని సవరించాలి.
- "అతని కార్యకాలాపాలు శిఖరాయమానమైన స్థితిలో ఉండగా మెడెలిన్ కార్టెల్ రోజుకు 70 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు సంవత్సరానికి 26 బిలియన్ అమెరికన్ డాలర్లు వచ్చేవి." - మెడెలిన్ కార్టెల్‌కు అని ఉండాలి. అలాగేఅతని స్థానంలో ఎస్కోబార్ అని పేరు ఉంటే బాగుండేదనిపిస్తోంది.
- అతను ప్రజాసంబంధాల విషయంలో చాలా సహజంగా, వారితో కలిసిపోతూ ఉండేవారు. - అతను చాలా సహజంగా, ప్రజలతో కలిసిపోతూ ఉండేవారు.
- కొన్నిచోట్ల గౌరవ సూచనగా బహువచనం వచ్చింది. దాన్ని ఏకవచనంగా మార్చాలి.
- " క్రమంగా ప్రభుత్వం ఎస్కోబార్‌తో సంప్రదింపులు జరిపి ఎస్కోబార్ లొంగిపోయి, తన నేర కార్యకలాపాలు అన్నీ కట్టిపెట్టేస్తే అతనికి శిక్ష తగ్గించేట్టు, ఖైదీగా ఉన్నప్పుడు చట్టపరంగానే వ్యవహరించేట్టు అంగీకరింపజేశారు. " - ఈ వాక్యాన్ని సవరించాలి.
- "ఎస్కోబార్ పలుకుబడి ఈ జైలు బదిలీ ప్రణాళిక ముందే తెలిసి, సకాలంలో తప్పించుకునే వీలు కల్పించింది." - ఈ వాక్యాన్ని సవరించాలి.
- "ఈ నిఘా సంఘం కార్యకలాపాలకు కాలి కార్టెల్, కార్లోస్ కాస్టనో ఆధ్వర్యంలో సాగే సంప్రదాయవాదులైన పారామిలటరీల వంటి ఇతని ప్రత్యర్థులు, పూర్వ అనుచరులు ఆర్థికంగా సహాయం చేసేవారు." - ఈ వాక్యాన్ని విడదీసి రాస్తే బాగుంటుంది. ఒక నమూనా: ఈ నిఘా సంఘం కార్యకలాపాలకు ఎస్కోబార్ ప్రత్యర్థులు, పూర్వ అనుచరులూ ఆర్థికంగా సహాయం చేసేవారు. వారిలో కాలి కార్టెల్, కార్లోస్ కాస్టనో ఆధ్వర్యంలోని సంప్రదాయవాద పారామిలిటరీలూ ఉన్నారు.
- "ఈ నిఘాసంఘం 300 మంది ఎస్కోబార్ సహచరులను, అతని న్యాయవాదిని, బంధువులను హత్యచేశారు." - సవరించాలి
- "దాని కారణంగా హత్యాకాండకు చేసేవారు." - దీన్ని మార్చాలి. "దాని కారణంగా హత్యాకాండకు పాల్పడేవారు" అనొచ్చు.
- "పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయనాయకుల హత్యలు వంటివి చేసేవారు." - "వంటివి"
- "ఎస్కోబార్ కుమారుడు సెబాస్టియన్ మారోక్విన్ ప్రకారం అతని తండ్రి నేరాలు నకిలీ ఉన్నత పాఠశాల డిప్లొమా సర్టిఫికెట్లు తయారుచేసి అమ్మడంతో మొదలయ్యాయి" - ఈ వాక్యం "నకిలీ ఉన్నత పాఠశాల డిప్లొమా సర్టిఫికెట్లు తయారుచేసి అమ్మడంతో తన తండ్రి నేరాలు మొదలయ్యాయని (నేరజీవితం మొదలైందని) ఎస్కోబార్ కుమారుడు సెబాస్టియన్ మారోక్విన్ అన్నాడు."
- "1976 మే నెలలో ఎస్కోబార్, అతని అనుచరులు భారీ ఎక్యుడార్ లోడ్‌తో మెడెలిన్ నగరానికి వస్తూండగా పోలీసులు అరెస్టు చేసి 15 కేజీల ఎక్యుడార్‌ను స్వాధీనం చేసుకున్నారు." - "1976 మే నెలలో ఎస్కోబార్, అతని అనుచరులు ఈక్వడార్ నుండి భారీ లోడ్‌తో మెడెలిన్ నగరానికి వస్తూండగా పోలీసులు అరెస్టు చేసి 15 కేజీల వైట్‌పేస్టును స్వాధీనం చేసుకున్నారు." అని రాస్తే బాగుంటుంది.
- "1980ల మధ్యకాలంలో ఎస్కోబార్ శక్తి, అధికారం శిఖరాన్ని అందుకున్నప్పుడు, మెడెలిన్ కార్టెల్ జెట్‌లైనర్స్ ద్వారా ఒక్కో విమానంలో 11 టన్నుల చొప్పున అమెరికాకు రవాణా చేస్తూండేవారు." - 1980ల మధ్యకాలంలో ఎస్కోబార్ శక్తి, అధికారం శిఖరాన్ని అందుకున్నప్పుడు, మెడెలిన్ కార్టెల్ జెట్‌లైనర్స్ ద్వారా ఒక్కో విమానంలో 11 టన్నుల చొప్పున అమెరికాకు రవాణా చేస్తూండేది.
- ఎస్కోబార్‌తో జరిపిన చర్చలు సాగించింది. - ఈ వాక్యాన్ని సవరించాలి.
- "సెర్చ్ బ్లాక్ సభ్యులు, కొలంబియన్, యునైటెడ్ స్టేట్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ఎస్కోబార్‌ను పట్టుకునే ప్రయత్నాలలో అయితే లోస్ పెపెస్‌తో కుమ్మక్కు అవడం కానీ, ఒక్కోసారి సెర్చ్ బ్లాక్‌లా, ఒక్కోసారి లోస్ పెపెస్ పేరిట తమ తమ పనులు చేపట్టేవారు." - ఈ వాక్యాన్ని సవరించాలి.
- "మిగిలిన ఎస్కోబార్ సహచరులను, స్నేహితులను అణచివేయడానికి, దెబ్బతీయడానికి ఈ సమన్వయ పద్ధతిలో లోస్ పెపెస్ వారికి సమాచారాన్ని అందించేవారన్న ఆరోపణలు ఉన్నాయి." ఈ వాక్యాన్ని సవరించాలనుకుంటాను.
- "అయితే ఒక్కోసారి సెర్చ్ బ్లాక్ సభ్యులు నేరుగా లోస్ పెపెస్ హత్యాకాండల్లోనూ పాల్గోవడమూ ఉండేది" - ఈ వాక్యాన్ని "అయితే ఒక్కోసారి సెర్చ్ బ్లాక్ సభ్యులు నేరుగా లోస్ పెపెస్ హత్యాకాండల్లో పాల్గోవడమూ ఉండేది" అని రాస్తే బాగుంటుంది.
- " మెండలిన్‌లో పలుమార్లు కాపలా కాయడం, అధికారులకు అతని వివరాలు చెప్పకుండా దాచడం వంయతిరేకమవడం అనేది ఇక్కడ అతకలేదు.టి పనులతో స్వచ్ఛందంగా చాలామంది ఇతన్ని పోలీసులకు దొరకకుండా తప్పించారు." - "మెడలిన్‌లో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, కాపలా కాయడం అధికారులకు ఎస్కోబార్‌కు సంబంధించిన వివరాలు చెప్పకుండా దాచడం వంటి పనులతో ఇతన్ని పోలీసులకు దొరకకుండా సాయపడ్డారు."
- కొన్ని ఇంగ్లీషు మాటలను అలాగే రాసేసారు. వీలైనంతవరకు వాటికి సరైన తెలుగు మాటలు రాస్తే బాగుంటుంది. ఉదా: రివార్డులు - బహుమానాలు
- సీజర్ గావిరియా ప్రభుత్వం ఎస్కోబార్‌కీ, మాదకద్రవ్యాల కార్టెల్స్‌కీ వ్యతిరేకమైంది. - "వ్యతిరేకంగా చర్యలు మొదలుపెట్టింది." అని రాస్తే బాగుంటుంది.
- "ఖైదీగా ఉన్నకాలంలో చట్టపరంగానే వ్యవహరించేట్టూ" - ఇంగ్లీషు మూలంలో "ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంటు" అని ఉంది. చట్టపరంగానే అనే బహుశా అనువాదం చేసిన తరువాత దాన్ని మార్చి ఉండవచ్చు.
- పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయనాయకుల హత్యలు చేసేవారు- ఈ వాక్యం "పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయనాయకులను హత్య చేసేవారు" - ఇలా ఉంటే బాగుంటుంది.
- కొలంబియా ప్రపంచ హత్యా రాజధానిగా పేరుగాంచింది, ఎస్కోబార్‌కు కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు బాగా వ్యతిరేకమయ్యాయి - ఎస్కోబార్ హత్యలు చేసేవాడనే వాక్యం తరువాత ఈ వాక్యం ఉంటే సందర్భోచితంగా ఉంటుంది. లేదా.. వాక్యానికి ముందు, "ఎస్కోబార్‌కు అతని ప్రత్యర్థులకూ మధ్య జరిగిన హత్యల కారణంగా" అని చేర్చితే మరింత అర్థవంతంగా ఉంటుంది. అలాగే.. "ఎస్కోబార్‌కు కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు బాగా వ్యతిరేకమయ్యాయి" వ్యతిరేకమవడం అనే మాట ఇక్కడ అతకలేదు.
- రాబర్టో ఎస్కోబార్ దీన్ని తిరస్కరించాడు - "రాబర్టో ఎస్కోబార్ దీన్ని ఖండించాడు" అంటే బాగుంటుంది.
- సాధారణంగా ఇవి యూనివర్శిడాడ్ - ఇక్కడ సాధారణంగా బదులు "ఎక్కువగా" అంటే బాగుంటుందేమో చూడండి.
- కార్ల దొంగతనం వంటి పలు నేరాలు చేసేవారు - కార్ల దొంగతనం వంటి పలు నేరాలు చేసేవాడు.
- డిపాజిట్ చేసి చాలా ప్రాచుర్యం పొందాడు - డిపాజిట్ చేసి చాలా "ప్రఖ్యాతి పొందాడు" ఆనొచ్చునా!!?
- కొన్నిచోట్ల పాబ్లో అని, కొన్నిచోట్ల ఎస్కోబార్ అనీ ఉదహరించారు. అన్నిచోట్లా ఎస్కోబార్ అంటే బాగుంతుంది.
- కొన్నిచోట్ల పాబ్లో ఎస్కోబార్, మిగిలిన చోట్ల ఎస్కోబార్ అని మార్చాను. (పవన్)
ఇతరాలు
[మార్చు]- [Page needed] అనే మూస ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉంది. అవసరమైన చర్యలు తీసుకుని వాటిని తొలగించాలి.
మూలాలు
[మార్చు]- "తండ్రి రైతు, తల్లి ప్రాథమిక ఉపాధ్యాయురాలు." - ఇక్కడి మూలం పనిచెయ్యడం లేదు.
- అందులో అతను కుటుంబంతోనూ, కార్టెల్ సిబ్బందితోనూ సరదాగా గడిపేవాడు - ఇక్కడి మూలం పని చెయ్యడం లేదు.
- 44 వ మూలం లోని లింకు (https://variety.com/article/VR1117973147/?categoryid=13&cs=1&query=Killing+Pablo) పని చెయ్యడం లేదు.
- 45 వ మూలంలోని లింకు (http://www.journalnow.com/content/2008/dec/25/celebrity-gossip/) పని చెయ్యడం లేదు.
- 47 వ మూలంలోని లింకు (http://www.tribecafilmfestival.org/weekly-screengrab-101007.html) పని చెయ్యడం లేదు.
- 52 వ మూలానికి చెందిన లింకు (http://www.lapeliculas.com/pelicula/pablo-escobar-the-king-of-coke-national-geographic-hd) - ఇదొక తప్పుడు లింకుగా అనిపిస్తోంది.
- చిట్టచివరి మూలం - http://main.snagfilms.com/films/title/mugshots_pablo_escobar_hunting_pablo - పని చెయ్యడం లేదు.
మూలాలన్నిటినీ మరొక్కసారి పరిశీలించాలి.
ఇతర సభ్యుల సూచనలు
[మార్చు]వర్గాలు
[మార్చు]- ఈ వ్యాసం తెలుగు వర్గాల పేర్లు లేవు. అలాగే ఆంగ్ల వర్గాల పేర్లు చాలా ఎర్ర లింకులు ఉన్నాయి. సరైన వర్గాలు చేర్చాలి. రవిచంద్ర (చర్చ) 17:04, 11 ఆగస్టు 2018 (UTC)
ప్రతిపాదకుని స్పందన
[మార్చు]చదువరి గారూ! ఈ వ్యాసాన్ని సమీక్ష ప్రారంభమయ్యాకా ప్రాచుర్యం అన్న శీర్షిక చేర్చి విస్తరించాను. మీరు మొత్తం వ్యాసాన్ని ఇప్పటికే సమీక్షించివుంటే, మీకు మరోసారి పనిపెట్టినట్టయింది. క్షమించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 09:08, 10 ఆగస్టు 2018 (UTC)