Jump to content

చర్చ:20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

‌‌‌‌‌‌వ్యాసం పేరు

[మార్చు]
పల్లెవాసుల పనిముట్లు అంటే బాగుంటుందేమో ఆలోచించండి.Rajasekhar1961 10:14, 5 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసము చిన్నదైనా ఆసక్తిని కలిగించే విధంగా ఉంది. ఇటువంటి వ్యాసాలను భాస్కరనాయుడిగారి కృషి ప్రశంశనీయం. అందిస్తున్న కృషి శ్లాఘించతగినది.t.sujatha 07:00, 6 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
భాస్కరనాయుడు గారూ ! వ్యాసాం చక్కగా అభివృద్ధి ఔతుంది. వ్యాసం సహజత్వం ఉట్టిపడేలా ఉంది. అంధృల పల్లె వాసుల సంస్కృతిని తెలియజేసేలా ఉంది.t.sujatha 14:23, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రోత్సహిస్తున్న వారందరికి ధన్య వాదములు:వ్యాసం పేరు గురించి: నాకొరకు నేనె వ్రాసుకున్న "మావూరి కథ.... పాత గ్యాపకాలు" అనే పుస్తకం నుండి సార్వ జనీకమైన కొన్ని బాగాలను వ్యాసంగ మలిచి వ్రాస్తున్నాను. వ్యాసం ఒక సమగ్ర రూపం వచ్చాక అప్పుడు దానికి సరైన పేరు పెట్టడానికి ప్రయత్నిదాం. అంత వరకు గుర్తు కొరకు ఏదో ఒక పేరుండాలిగదా. అందుకె ఈ పేరు.

అందరికి ధన్య వాదములు: ellanki 04:56, 10 జనవరి 2012 (UTC)

సమగ్రమైన వ్యాసంగా తయారుచేయడానికి ఉన్న సమాచారాన్ని కొన్ని విభాగాలుగా చేస్తే చదివేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికి కొన్ని విభాగాలు చేశాను. ఇతర విభాగాల గురించి ఆలోచించండి.Rajasekhar1961 05:22, 10 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

[మార్చు]
భాస్కరనాయుడు గారూ ! ఈ వ్యాసానికి అవసరమైన దస్త్రాలను చేర్చడానికి ప్రయత్నించండి. అలాచేస్తే వ్యాసం మరింత చక్కగా ఉంటుంది.t.sujatha 15:34, 13 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
సుజాత గారికి:....పల్లెల్లొ పని ముట్లు వ్యాసానికి కావలసిన చాల ఫోటోలు నావద్ద నేను తీసినవి చాల వున్నాయి. కాని వాటిని అప్ లోడ్ చేసె విధానము మాత్రము తెలియడం

లేదు. సూచనల ప్రకారం ప్రయత్నిస్తే ఫలితం రాలేదు. అయినా ప్రయత్నిస్తూనె వున్నాయి. అలా అన్నింటికి కావలసిన బొమ్మలు వున్నాయి. దస్త్రం అంటె బొమ్మె లేదా ఫోటొ అని అని కుంటున్నాను. దయచెసి ఫోటోలను ఔ లోడ్ చేసె విధానం తెలియ జేయండి. ధన్య వాదములు: ఎల్లంకి భాస్కరనాయుడు.bhaskaranaidu 12:00, 27 మార్చి 2012 (UTC)

తిన్నగా వికీ కామన్స్ లోకి లోడ్ చేస్తే మంచిది. మీరు తీసినవి కాబట్టి. అవి అన్ని భాషలవారికీ ఉపయోగపడతాయి. మీ ఫోన్ నంబర్ తెలియజేస్తే నేను ఫోనులో నేర్పించగలను. నా నంబర్ 9246376622.Rajasekhar1961 (చర్చ) 12:22, 27 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పరిమాణం

[మార్చు]

ఈ వ్యాసం 3 లక్షల బైట్ల నిడివి దాటింది. సాధారణంగా 50 కిలోబైట్ల స్థాయిలో వుంచటం చదివేవారికి, నెట్ వ్యవస్థకి సౌకర్యంగా వుంటుంది. దీనిలో ఒక్కో విభాగాన్ని ఒక్కో వ్యాసంగా విడదీసి ప్రధాన వ్యాసంలో అ విభాగానికి సంక్షిప్త సమాచారం చేరిస్తే బాగుంటుంది. దీనిని వికీపుస్తకం గా తీసుకు రావాలన్నా అ ఏర్పాటు సౌలభ్యంగా వుంటుంది.--అర్జున (చర్చ) 03:39, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ బుక్స్ కి మార్చడం ఒక మంచి ఆలోచన. కానీ ఈ వ్యాసంలోని సమాచారాన్ని ఒక 10-12 వ్యాసాలుగా విభజించవచ్చును. అప్పుడు చదివేవారికి సౌకర్యంగా ఉంటుంది. విస్తరణకు కూడా అవకాశం ఉంటుంది. భాస్కరనాయుడు గారు సరైన నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం ప్రకారం మారుద్దాము.Rajasekhar1961 (చర్చ) 06:31, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నా ఉద్దేశ్యం ఈ వ్యాసంలో వికీలో ఉంచాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి, వికీ బుక్స్ లో కన్నా. పల్లెవాసుల జీవనం కంటే, తెలుగు పల్లెవాసుల జీవనం అంటే బాగుంటుందేమో ఆలోచించండి. పల్లెవాసుల జీవనం పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉంటుందో వ్రాస్తే బాగుంటుంది. ఇంకా వ్యాసాన్ని పలు చిన్న చిన్న వ్యసాలుగా విభజిస్తే చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. Chavakiran (చర్చ) 10:17, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపుస్తకాన్ని వికీపీడియా వ్యాసాలనుండి కూడా చేయవచ్చు. నేనన్నది వికీబుక్స్ లోకి మార్చమన్న వుద్దేశ్యంతో కాదు. --అర్జున (చర్చ) 10:50, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిలో అనేక వ్యాసాలు ఇప్పటికే రాయబడి ఉన్నాయి ఉదాహరణకు పండగలలో అన్నీ రాయబడి ఉన్నాయి. మళ్ళీ తిరిగి సమాచారం చేర్చడం జరుగుతున్నది. కాబట్టి ఇందులో బాస్కరనాయుడు గారు రాసిన కొత్త విషయాలను పాత వ్యాసాలలో చేరిస్తే సరిపోతుంది. సంక్రాంతి గురించి చిన్నగా రాసి ప్రధాన వ్యాసమునకు లింక్ చేరిస్తే దానిలో చూస్తారు. విశ్వనాధ్ (చర్చ) 14:52, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాస పరిమాణం 5లక్షల బైట్లు దాటింది. ఈ వ్యాసంలో ఉన్న విభాగాలు అదే సమాచారంతో వ్యాసాలుగా కూడా ఉన్నాయి. ప్రత్యేక వ్యాసంగా ఉన్నప్పుడు ప్రధాన వ్యాసంలో మళ్ళీ పూర్తి సమాచారం అవసరం ఉండదు. కాబట్టి విభాగాలను సంక్షిప్తి చేసే అవసరం ఉంది. అంతేకాకుండా ఈ వ్యాసంలో ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:42, 16 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పై వ్వాసం పరిమాణం గురించి వచ్చిన చర్చ పై ఇంకెవరైనా చర్చిస్తారని వేచి చూచాసు. ఎవ్వరు ఏమి చర్చించ లేదు. టూకీగా నాసమాధానము: నిజమే.... ఇది పెద్ద వ్వాసమే.... ఇంకా విస్తరించ వలసిన వున్నది కూడా.... ఉదాహరణకు.... కుల వృత్తులలో బెస్తవారి గురించి సాలె వారి గురించి .... ..... ఇంకా వ్రాయవలసి వున్నది.. విషయ సంగ్రహణ లో వున్నాను. అలాగె ఇంకొన్ని. మరొక్క విషయం..... పండుగల గురించి. అన్ని పండుగలను అన్ని ప్రాంతాలలోను జరుపుకుంటారు.... కాని వాటిని జరుపుకునే విధానములో ప్రాంతాలను బట్టి కొన్ని మార్పులుంటాయి. వాటిని తెలియ జేయటమే నా ప్రధానోద్దేశము. అందుకే అవి క్లుప్తంగా వున్నాయి. ఈ వ్వాసాన్ని రాజశేఖర్ గారి సాయంతో విభజించడం కూడ జరిగింది. చదువరులు ఈ వ్వాసం పై అబ్యంతరాలుంటే చెప్పండి. దాన్ని ఏంచేద్దామనే విషయం ఆలోసిస్తాను. Bhaskaranaidu (చర్చ) 04:32, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో రెండవస్థాయి శీర్షిక పేరుతో వ్యాసం తయారు చేసి దానిలోకి ఆ విభాగ సమాచారాన్ని మార్చండి. ఆతరువాత వాటినన్నిటిని కలిపి పుస్తకం రూపం తయారుచేయవచ్చు.--అర్జున (చర్చ) 05:07, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రచయితకి అభినందనలు, సాదాసీదా తనంతో వ్రాయబడ్డ ఈ వ్యాసం చాలాబాగుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 03:44, 26 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది వ్యాసం కాదు, వ్యాసాల సంకలనం. ఇందులో ఉన్న విభాగాలు ప్రత్యేకంగా అదే సమాచారంతో వ్యాసాలుగా ఉన్నాయి. అలాంటప్పుడు విభాగాలను సంక్షిప్తీకరించి ప్రతి విభాగంలో కొంత సమాచారం మాత్రమేఉంచి ప్రధాన వ్యాసం ఉన్నట్లు లింకులిస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:09, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలోని విభాగాలలో ఉన్న సమాచారంతో పూర్తిగా మక్కికిమక్కి ప్రత్యేక వ్యాసాలున్నందువల్ల ప్రధాన వ్యాసంలో సమాచారాన్ని కుదించాను. ఇంకనూ చాలా విభాగాలలొ సమాచారాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇక్కడ విభాగాలలో ఉన్న సమాచారం ప్రత్యేక వ్యాసాలుగా ఉండటమే కాకుండా ప్రత్యేక వ్యాసాలలొ ఉన్న విభాగాలలో ఉన్న సమాచారం కూడా మళ్ళి ప్రత్యేక వ్యాసాలుగా ఉన్నాయి. అదే సమాచారం పలు వ్యాసాలలో వస్తోంది. ఈ వ్యాసాన్ని పూర్తిగా వికీకరించవలసి ఉంది. ఇది ఊహాత్మక/ఆధారం లేకుండా/స్వయంగా రచించిన వ్యాసంగా ఉన్నట్లుగా నా పరిశీలనలో తెలిసింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:19, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం పరిగణన

[మార్చు]

{{ఈ వారం వ్యాసం పరిగణన}}

ఈ వారంవ్యాసం ఆదర్శవంతమైన వ్యాసంగా వుండాలి. ఈ వ్యాసం గురించి చర్చపేజీలోపేర్కొన్న సమస్యలను పరిష్కరించేంతవరకు, దీనిని ఈ వారం వ్యాసంగా పరిగణించవద్దని నామనవి. వాడుకరి:Kvr.lohithగమనించి స్పందించాలని కోరుతున్నాను--అర్జున (చర్చ) 09:04, 7 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ఇంకా మేగజిన్ వ్యాసంలాగానే ఉన్నది. ఈ వారం వ్యాసంగా తగదు --వైజాసత్య (చర్చ) 09:14, 7 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం ఏ పత్రికకో పంపిస్తే చక్కగా ముద్రించుకుంటారు. చాలామంది చదివి సంబరపడతారు. కానీ విజ్ఞాన సర్వస్వం స్థాయిలో మాత్రం లేదు. ఇది రచయిత అనుభవం నుండి వారి దృష్టిలో వ్రాయబడింది. జీవనవిధానం అన్నప్పుడు ఏ ప్రాంతం, ఏకాలం అన్నది స్పష్టంగా ఉండాలి. మీకో ఉదాహరణతో వివరిస్తాను. ఇప్పుడు ప్రతిపల్లెలో (తెలుగు రాష్ట్రాల్లో) క్రికెట్ ఆడుతున్నారు. గోలీలాట, వెన్నెలకుప్పలు కాదు. మరి దాని గురించి ఈ వ్యాసం లేదెందుకని అంటే ఇది (ఇది ఉండాలని కాదు..ఉదాహరణకు మాత్రమే) అంటే ఇది రచయిత జీవితకాలంలోని ఒక దశలో ఉహాతీత పల్లెలు ఇలా ఉండేవని చిత్రణ మాత్రమే. ఇలాంటి జీవనవిధానం వ్యాసం వ్రాయాలంటే మన సొంత దృష్టిని పక్కనపెట్టి చాలా మూలాలపై ఆధారపడి వ్రాయాలి --వైజాసత్య (చర్చ) 09:42, 7 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]