Jump to content

20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలి

వికీపీడియా నుండి
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో చెక్క బొమ్మలాట కళాకారుల ప్రదర్శన

భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది. కరువు ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టు బాటు కాని వ్యవహారంగా తయారైనది. అటు వంటి ప్రాంతాలలో బక్క రైతులు వ్యవసాయం చేయలేక ఇతర వ్యాపకాలకు మళ్లుతున్నారు. పెద్ద రైతులు దైనందిన వ్యవసాయం పక్కన పెట్టి సావకాశంగా పనులు చేసుకునే........... నీరు తక్కువ అవసరం అయ్యే పండ్ల తోటలు వంటి వాటి పై మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా పల్లెల్లో సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. "ఆప్యాయతకు, అనురాగానికి, ఆనందానికి, పల్లెలే పట్టు గొమ్మలు" అనే మాటకు అర్థం లేకుండా పోతున్నది. పల్లెల్లో ఆలనాడు అనగా 1950 నుండి 1965 వరకు రైతులు, రైతు కూలీలు మొదలగు పల్లె వాసులు నివసించిన గృహాలు, పంటలు పండించే విధానము, వారు వాడిన పరికరాలు / పని ముట్లు రాను రాను కనుమరుగౌతున్నవి. వాటిని ఈ తరంవారు ప్రత్యక్షంగా చూడాలంటే అంత సులభంకాదు. ఏ పుస్తకాలలోనో, సినిమాలలోనో చూడ వలసిందే తప్ప వేరుమార్గం లేదు. ఆ పనిముట్లను, వాటిని వాడే విధానాన్ని, వాటి ఉపయోగాన్ని తెలియ జేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. అంతే గాక ఆనాటి సామాజిక జీవన విధానము ఎలా వుండేది, పల్లె ప్రజలు ప్రతి విషయంలోను ఒకరికొకరు ఏవిధంగా సహకరించుకునేవారు, వారి అన్యోన్యత ఎలా ఉండేది, ప్రస్తుత పల్లెవాసుల జీవన విధానము ఎలా ఉన్నది, ఇలాంటి విషయాలన్నీ కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి, ప్రత్యక్షంగా చూసి వ్రాసిన వ్యాసమిది. కాలానుగుణంగా ప్రాంతీయతను బట్టి కాస్తంత తేడా ఉండొచ్చు. అంతే గాని అన్ని విషయాలలోను ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా ప్రస్తుతమున్న పరిస్థితి ఇది. ఆ విషయాన్ని చెప్పేదే ఈ వ్యాసం. ఒక విధంగా ఈమార్పును పురోగమనమే అనవచ్చునేమో. రాజకీయంగా సాధారణ ప్రజలు చాలా చైతన్యం పొందారు. విద్యవిషయంలో ప్రజలు చాల పురోగతిని సాధించారు. సామాజికంగా కూడా కొంత అభివృద్ధి సాధించారు. దాని ప్రభావమే ఈ మార్పు.

[ఈమాట 1] సాంకేతిక పరమైన మార్పుల వలన కొత్త వస్తువులతో చేసే పని కొంత సులభమౌతుంది. మార్పు అంటే అదే. అటువంటి సాంకేతిక అభివృద్ధి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో పనిగట్టుకొని సాధించే విజయం కాదిది. సామాజిక పరంగా జరిగే ప్రకృతి పరమైన అభివృద్దే ఇది. కాని సామాజికపరంగా జరిగే మార్పులు ..... అవి పురోగమన మనాలో తిరోగమన మనాలో అర్థంకాకున్నది. ఇదంతా సామజిక పరమైన అంశాల గురించి మాత్రమే నని గ్రహించాలి సాంకేతిక పరమైనవి కావు. ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో అతి స్పష్టంగా గ్రహించ గలిగే మార్పు ఇది. మార్పులు అతి వేగంగా జరుగుతున్న కాలమిది. ఉదాహరణకు చెప్పాలంటే ...... అభివృద్ధి అనగా అది సాంకేతికమా, సామాజికమా ఏదైనా సరే ......... మొదటి వంద సంవత్సరాలలో అంకశ్రేణి పద్ధతిలో పెరుగుతే, ఆదే అభివృద్ధి తర్వాత వంద సంవత్సరాలలో గుణశ్రేణి పద్ధతిలో అభివృద్ధి చెందింది. ఇది పరిశోధకులు నిరూపించిన సత్యం. కనుక ప్రతి సంవత్సరం మార్పులు చోటు చేసుకునే రోజులివి. అయా విషయాలు గతంలో ఎలా ఉండేవి ఇప్పుడెలా ఉన్నాయి వాటి మధ్య తారతమ్యాలేమిటి ఆవిషయాలను విశదీకరించే వ్యాసమిది. సందర్భాను సారంగా బొమ్మలను కూడా చేర్చడము జరిగింది.

పల్లెల్లో సాధారణంగా వాడు వస్తువులు

[మార్చు]
తట్ట, బుట్ట కాగులు:మట్టి పాత్రలు:వీటిలో బియ్యం వంటివి భద్రపరుస్తారు విసుర్రాయి, రాగల్రాయి: రాగులు, జొన్నలు వంటివాటిని పిండి చేయు రాతి పరికరం విసుర్రాయి, రాగల్రాయి: రాగులు, జొన్నలు వంటివాటిని పిండి చేయు రాతి పరికరం
తట్ట, బుట్టకాగులు:మట్టి పాత్రలుఅమ్మకానికి సిద్ధంగా ఉన్న చాటలువిసుర్రాయి, రాగల్రాయి:

ప్రతి వ్యవసాయ దారుని ఇంట్లొ వ్యవసాయోత్పత్తులను దాచు కొనడానికి ఏర్పాట్లు ఉంటాయి. అవి కాగు, ఓడ, గాదె, బొట్ట, పాత్ర గెరిసె, బొట్ట, చాపలు మొదలగునవి.

అపక

పల్లె వాసుల నివాస గృహాలు

[మార్చు]

పల్లె వాసుల నివాస గృహాలు : గుడెస,పూరిల్లు, గుడిసిల్లు/ చుట్టిల్లు, పెంకుటిల్లు, రేకుల ఇల్లు, మట్టి మిద్దె, బండ్ల మిద్దె, మిద్దె., మేడ, భవంతి, సపారు ఇలా అనేక రకాలు వుంటాయి. గోడలు గట్టి రాళ్ళతో కట్టుకని కప్పువేయటానికి ‘కూసాలు’ (pillers), దూలాల (beams)కు ‘యాప’ కలప వాడేవారు. అందువల్ల అవి ఎంతో బలంగా ఉండేవి. దూలాలపైన దంతెలు వేసి చాపలు గాని, బండలుగాని పరిచి ఆపైన చౌడుతో కాంక్రీట్‌ లాగా కప్పేవారు.ఇవి మట్ట్జి మిద్దెలు. ఇళ్ళ నిర్మాణం విశాలంగా ఉండేది. స్నానం చేసిన నీరు ‘మురుగు’ కాకుండా ‘జాలాది’ (పెద్ద గుంట) తీసి ఆ నీరు అందులో ఇంకేలా చేసుకొనే వారు. పశువులకు ప్రత్యేకంగా ‘ఆవాసాలను ఏర్పాటు చేసుకునే వారు. ఆర్థిక స్తోమత కల వారు మట్టిమిద్దెలు కట్టి పశువులకు తగిన వసతి (గాడి) ఏర్పాటు చేసుకొనే వారు. ఎరువు వేయటానికి ‘దిబ్బ’లకు వసతి చేసేవారు. అందుకే ‘గ్రామం గేయం లాంటిది – నగరం నాటకం లాంటిది’ అంటాడు ‘లాంగ్‌ఫెలో’.

తాటాకుల ఇల్లు, అలాంటిదె చిన్న చుట్టిల్లు, బాపట్ల దగ్గర పల్లె
గుడిసిల్లు
బండ్ల మిద్దె
పూరిల్లు
పెంకుటిల్లు
కోడి దాని పిల్లలు: బాపట్ల వద్ద
  • పూరిళ్ళు : ఇవి మట్టి గోడలపై కర్ర దూలాలుంచి వాటిపై ఏటవాలుగా వాసాలు పెట్టి వాటిని వెదురు బద్దలతో కట్టి దాని పై బోద, రెల్లుగడ్డి, ఇలాంటి వాటి తో కప్పు వేస్తారు. ఈ కప్పు ఏటవాలుగా వుండి పైన పడిన వర్షం నీరు క్రిందికి జారి పోవడానికి అనుకూలంగా వుంటుంది. పైన రెండు వైపుల కప్పు కలిసే చోటును "వెన్నుగోడు" అని కప్పు చివరి భాగం క్రింద "చూరు'' అని అంటారు. ఆ ఇంటిలో రెండు దూలాల మధ్యనున్న భాగాన్ని "అంకణం" అంటారు.
  • తాటాకుల ఇల్లు (యిదిపూరిల్లు లాంటిదే)

తాటాకుల ఇల్లు కూడా పూరిల్లు లాంటిదే. కాని ఇది కొంచెం వైవిధ్యం వుంటుంది: ఎలాగంటే దీని పై కప్పు తాటాకుల తో వుండి ఆ పైకప్పు ఇంటికి వెనక ముందు భూమికి మూడడుగుల ఎత్తు వరకు వుంటుంది. ముందు భాగం వెనక భాగం ఎత్తు తక్కువగా వున్నందున మనుషులు రాక పోకలు సాగించ డానికి వీలుండదు.

  • గుడిసె : ఇది ఎత్తు తక్కువగా వుండి తాటాకులు, లేదా కొబ్బరి మట్టలు, రెల్లు గడ్డి వంటి వాటి పైకప్పుతో తాత్కాలికంగా పొలాల వద్ద కాపలా కొరకు ఏర్పాటు చేసుకునేవి.
  • గుడిసిల్లు/చుట్టిల్లు ఇవి వృత్తాకారంలో వుండి ఒకే దూలం కలిగి కప్పు శంకాకారంలో పైకి వుంటాయి. పూరిల్లుకు లాగానె వీటికి పైకప్పు గడ్డి, బోద కసువు గాని వేస్తారు.
  • పెంకుటిల్లు :

ఇవి రెండు రకాలు. ఒకటి మంగుళూరు పెంకులు, రెండో రకం దేశవాళి పెంకులు వేసి కట్టినవి. ఇటుకల గోడపై సన్నని దూలాలు పెట్టి, గోడల పైనుండి ఏట వాలుగా వాసాలు అమర్చి వాటిపై అడ్డంగా సన్నని చెక్కలను వేసి వాటిపై పెంకులను పరుస్తారు. ఇవి పక్కా గృహాలు.

  • రేకుల ఇల్లు . పై కప్పుగా సిమెంటు రేకుల వేసిన ఇళ్లను రేకుల ఇల్లు అంటారు. జింకు రేకులను కూడా పైకప్పుగా వాడతారు. కాని ఈ రేకుల ఇళ్లలో ....... ఎండా కాలంలో వీటి వలన వేడి ఎక్కువగా వుంటుంది. కాన నివాసానికి అంత సౌకర్య వంతంగా వుండవు.. పశువులకు, కోళ్ల ఫారాలకు వీటిని ఎక్కువగా వాడతారు. ఇవి కూడా పక్కా గృహాలే.
  • మట్టిమిద్దె.. మట్టి గోడలపై అడ్డంగా వాసాలను వుంచి వాటిపై అడ్డంగా సన్న కర్రలను/ లేదా కర్ర చక్కలను పేర్చి దాని పై శుద్ద మట్టిని మందంగా వేసి గట్టి పరుస్తారు. ఇల్లు పైభాగం మొత్తం కనబడీ, కనబడనంత ఈశాన్యానికి వాలుగా వుంటుంది.
  • బండ్ల మిద్దె చుట్టు రాతి గోడ కలిగి మధ్యలో రాతి కూసాలు ఏర్పాటు చేసి ఆ రాతి స్థంబాల మధ్యన రాతి దూలాలను అమర్చి వాటిపై పై రెండడుగుల వెడల్పు కలిగి నాలుగంగుళాల మందం కల రాతి బండలను వరుసగా పేర్చి వాటి సందులలో సిమెంటు చేసి బండల పైన అంతా సిమెంటు గాని, సున్నము గాని వేస్తారు. ఇవి చాల పక్కా గృహాలు. కాని వీటిలో విశాలమైన గదుల ఏర్పాటు చేయలేరు. పుణ్య క్షేత్రాల సమీపాన నిర్మించిన సత్రాలు ఇటివంటివే. ఇవి చిరకాలము నిలుస్తాయి.
  • భవంతి :

భవంతి తెలంగాణ ప్రాంతంలో కనబడుతుంది. ఇందులో మట్టి గోడలు దేశవాళి పెంకులు వాడుతారు. అన్ని నివాస యోగ్యమైన ఇళ్లకన్నా ఇది అతి తక్కవ ధనం ఖర్చైనా అతి అనుకూలంగా వుంటుంది.

  • చిన్న రాతి బండలను ---- పై కప్పుగా వేసి కట్టిన ఇళ్లు :

కొన్ని ప్రాంతాలలో పదడుగుల రాతి బండలు దొరకవు. వారు ఆయా ప్రాంతాలలో స్థానికంగా దొరికే బండలను ఇంటి పైకప్పుకు వాడతారు. కడప, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలలో ఎక్కువగా నల్లని కడప బండలు ఎక్కువగా దొరుకుతాయి.

ఇటుకల గోడలపై మంచి దూలాలను వుంచి వాటిపై అడ్డంగా సుమారు నాలుగంగుళాల ఎత్తు, రెండంగుళాల మందం ఆరు, ఏడు అడుగుల పొడవు గల కర్రలను (వీటిని దంతులు అంటారు.) అమర్చి., దానిపై చదునైన పల్చని చక్కలను వేసి వాటిపై సన్నని ఇటుకలను పేరుస్తారు.

పశువుల కొరకు కట్టినది కొట్టము, అది రేకులతో వేసినది గాని, గడ్డితో కప్పినది గాని దాన్ని కొట్టమె అంటారు. రాతి కూసాల పై దూలలను పెట్టి వాటి మధ్యన అడ్డ కర్రలు పెట్టి దాని పైన వరి గడ్డిని వామి వేస్తారు.

ఇంటి ముందు వెదురు కర్రలు పాతి వాటిపై అడ్డంగా సన్న వెదులురు వేసి దానిపైన కొబ్బరి ఆకులు వేసినదె పందిరి. ఇంటి ముందు చల్లదనానికి దీన్ని అమర్చు కుంటారు. పెళ్ళిల్లు మరియి శుభ కార్యాల సందర్భంగా తప్పని సరిగా పందిళ్లలు వేస్తారు. ఇలాంటి వాటిని పచ్చి కొబ్బరి మట్టలతో వేస్తారు ఈ ఆచారం ప్పటికి కూడా కొనసాగుతున్నది.

ఇది కూడా కొట్టం లాంటిదే. కాని ఇందు గొర్రెలు, మేకలు మొదలగు చిన్న జీవాల కొరకు ఉపయోగిస్తారు. వాటిని గొర్రెల దొడ్డి, మేకల దొడ్డి అని అంటారు.

ఆరోజుల్లో ప్రతి ఇంటిలోను కోళ్లు వుండేవి. వాటిని రాత్రు లందు భద్ర పరచడానికి గూళ్లు, గంపలు వంటివి వుండేవి. ఈ ఇళ్లలో వందలాది కోళ్లు పెంచే వారు కాదు. పది, పదిహేను కోళ్లు వుంటే ఎక్కువ. ఇవన్నీ దేశవాళి కోళ్లు. అనగా నాటు కోళ్లు. వాటికి ప్రత్యేకించి మేత వేయ నవసరం లేదు.

పల్లెల్లో వ్యవసాయ విధానాలు

[మార్చు]

జల వనరులు

[మార్చు]

కాలువలు, చెరువులు, బావులు, కసిం కాలువలు, బోరు బావులు, కుంటలు, వాగులు, వంకలు, ఇవి జల వనరులనవచ్చు. రైతులు నీటి వసతి కొరకు చెరువులు, బావులు పైనే ఆధారపడే వారు. వర్షాకాలంలో చెరువులు నిండితే ఆరు నెలల వరకు నీళ్లు వుండేవి. చిన్న చిన్న వంకలు వాగులు ఉన్నాయి. ఆ రోజుల్లో వాటిల్లో ఎండాకాలంలో కూడా సన్నగానైనా నీరు పారుతుండేది. దాంతో బావుల్లో ఎండా కాలంలో కూడా నీళ్లు పైకే వుండేవి. ఆ వంకల్లో సాగే నీటిని నిలగట్టి చిన్న కాలువ ద్వారా పంటలకు మల్లించే వారు. లేదా ఏతం గూడ వంటి సాధనాల ద్వారా నీటిని పొలాలకు మళ్లించి పంటలు పండించే వారు. బావుల నుండి కపిలి అనే సాధనం ద్వారా ఎద్దులతో నీటిని పైకి తోడి పంట పొలాలకు పెట్టే వారు.దీనినే మోట అని కూడా అంటారు. ఆ తర్వాత బావులకు కరెంటు మోటార్లు వచ్చాయి. దాంతో రైతుల పని కొంత సులువైంది.

  • బావులు

సాధారణంగా గుండ్రంగా గాని, నలు చదరంగా గాని వుంటాయి. చుట్టు రాతి కట్టడం వుండి లోనికి దిగడానికి రాతి బండలతో చేసిన మెట్లుంటాయి. (చిత్రం చూడండి.) వీటి లోతు సుమారు ఐదు లేక ఆరు మట్లు వుంటుంది. ఒక మట్టు అంటే ఐదు అడుగులు. మహా లోతైన బావి అంటే ఏడు మట్లు బావి. ఆరోజుల్లో ఈ బావుల్లో నీళ్లు పైకే వుండేవి, (వర్షా కాలంలో అయితే పారుతుండేవి) అనగా పది నుండి ఇరవై అడుగుల లోతులో నీళ్లు వుండేవి. పిల్లలందరు ఎండా కాలం ఈ బావుల్లో ఈత కొట్టే వారు. కొత్తవారు ఈత నేర్చు కునే వారు. ఈ బావుల్లో నుండి కపిలి / మోటతో నీళ్లను బయటకు తోడి పంటలు పండించేవారు. ప్రస్తుతం ఇటు వంటి బావుల్లో వర్షం లేక అడుగంటి పోయాయి. చిత్రం చూడండి. పెద్ద జలవనరులు అనగా ప్రాజెక్టులు అందు బాటులో వుండే ప్రదేశాలలో కాలువల ద్వారానే నీటి వసతి లభించేది. ఆ ప్రాంతాలలో ఇటువంటి దిగుడు బావులు వుండవు. ఈ బావులుండే ప్రదేశాలు, ఎక్కువగా రాయలసీమ ప్రాంతం, తర్వాతి స్థానం, తెలంగాణా ప్రాంతం మాత్రమే. ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువగా పెద్ద ప్రాజెక్టుల ద్వారా.. లేదా నదులకు అనుసందానించిన కాలువల ద్వారా వ్యవసాయానికి నీటి సదుపాయం వుంటుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని ఇస్తున్నందున రైతులు నీటి తీరువ అనే పన్ను కడుతారు. బావులలో నుండి నీరు తోడి పంటలు పండించే రైతులకు ప్రభుత్వం నుండి మొన్నటి దాక ఎటువంటి రాయితి వుండేది కాదు. కాని ప్రస్తుత కాలంలో ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీని వలన కొంత కాలం రైతులకు చాల ఉపయోగకరంగా వుండేది. కాని ప్రస్తుత కాలంలో విద్యుత్తు సరిగా పంపిణీ చేయనందున, చేసినా....... సమయానికి చేయనందున ఆ సమయానికి బావులలో నీరు లేనందున..... ఇలా అనేక కారణాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

Dried up well,one can see the kapili doruvu, it is witness that that was a Kapili baavi,
  • గొట్టపు బావులు లేదా బోరింగు బావులు

వర్షాబావంతో మామూలు బావుల్లో నీరు అడుగంటి పోగా విధిలేక రైతులందరు బోరింగు బావులు త్రవ్వించారు. అవి వందలాది అడుగుల లోతులో నుండి మోటార్ల సాయంతో నీటిని తోడగలవు.

ఎండి పోయిన దిగుడు బావి. కపిలి దొరువు కూడా వున్నది, వెంకట్రామ పురంలో తీసిన చిత్రము.
  • కసింకాలువ

చిన్న చిన్న కసింకాలువలు చెరువు కట్ట క్రింద ప్రారంబమై లేదా కొండ వాలుల్లో మొదలై సుమారు ఒక మైలు పొడవునా వుంటాయి. స్వతసిద్దంగా ఏర్పడిన కాలువలు. అటు ఇటు పొలాల్లోని మురుగు నీరు ఈ కాలవలోకి ప్రవహిస్తుంది.

పశు సంపద

[మార్చు]

ఆవులు, ఎద్దులు, పందులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు ప్రతి రైతు పశువులను పెంచడం అవసరం. వాటి వల్ల అదనపు ఆదాయమే గాకుండా వాటి వలన పొలాలకు ఎరువు కూడా లబ్యమౌతుంది. పైగా ఎద్దులు పొలం పనులకు అత్యవసరం.

బర్రె లేదా ఎనుము

పశువుల పండగ సందర్భంగా సంబరం

[మార్చు]
మేకలదొడ్డిలో మేకలమంద
ఉప్పుచెక్క

సంక్రాంతి వరుస పండగల్లో పశువుల పండుగ మూడోది. ఆ రోజున ఇంటి కొక్కరు చొప్పన పల్లె వాసులు తెల్లవారక ముందే ఒక కత్తి, సంచి తీసుకొని పక్కనె వున్న అడవికి బయలు దేరుతారు. అనేక రకాల వన మూలికలు, ఆకులు, కాయలు, చెట్టు బెరడు, గడ్డలు, పువ్వులు, వేర్లు, మొదలగు నవి తీసుకొని వస్తారు. కొన్ని తప్పనిసరిగా వుండ వలసిన మూలికలు కొన్ని వున్నాయి అవి తీసుకొని మిగతా ఎన్ని రకాల మూలికలు ఎన్ని వీలైతె అన్ని తీసుకొని వస్తారు. ఇంటికి వచ్చి, వాటినన్నింటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి ఆ తర్వాత రోట్లో వేసి బాగా దంచి పొడి లాగ చేస్తారు. చివరిలో అందులో ఎక్కువ మోతాదులో వుప్పు వేసి ఇంకా బాగా దంచు తారు. దాన్ని "ఉప్పుచెక్క" అంటారు. ఇది పశువులకు సర్వ రోగ నివారిణి.

గొర్రెలు, మేకలు. చాల మంది రైతులకు గొర్రెలు, మేకలు మందలు వుండేవి. వాటిని తమ ఇంటి ముందున్న దొడ్లల్లో వుంచేవారు. వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టే వారు కాదు. ప్రతి రోజు వాటిని దగ్గరున్న అడవికి తీసుకెళ్లి మేపుకొని వచ్చేవారు.
పొట్టేలు, ఆవు

వ్యవసాయ పనిముట్లు

[మార్చు]

బాన, బండి, (కపిలి బండి) కదురుగోలు, ఇరుసు, ఎద్దుల బండి, కాడి మాను, మడక, లేదా నాగలి, గొర్రు, పార, తొలిక, కర్రు, గునపము, గొడ్డలి, కొడవలి, కత్తి, పిక్కాసు, మాను, పల్లంకి, మోకు, పగ్గం, తొండం తాడు, పలుపు, జాటి, ముల్లు గర్ర, పలుపులు, చిలుకు దోటి, కొంకి, గోరు గిల్లు, గీస కత్తి, చిక్కం, మచ్చు గత్తి, గొర, దోకుడు పార, మొదలగునవి వ్యవసాయంలో ఉపయోగించు పరికరాలు గతంలో రైతులు తమ పొలాలకు బావులలో నుండి కపిలి లేదా మోట అనె సాధనంతొ నీటిని తోడి పంటలు పండించే వారు. ఈ సాధనం ఎద్దులతో నడిసేది.

బావులలో నుండి కపిలితో నీరు తోడె విధానము

[మార్చు]

బావి గట్టున ఏటవాలుగా భూమి లోనికి ఒక చివరన రంద్రాలున్న పొడవాటి రాతి స్థంబాలను బావి లోనికి సాగి ఉండేటట్లు పాత తారు. ఆ రంద్రాలలో బలమైన కర్రలను దించి వాటి పైన అడ్డంగా మరొక కర్ర దుంగను పెట్టి దాని మధ్యలో రెండు చిన్న రంద్రాలను చేసి వాటిలో కూడా రెండు గట్టి కర్ర బద్దలను (పైచివరలలో రంద్రాలున్న వీటిని చెవులు అంటారు ) దించు తారు. ఈ రెండు కర్రల మధ్య సుమారు తొమ్మిది అంగుళాల దూరం ఉంటుంది. ఇప్పుడు భూమి లోనికి ఏటవాలుగా పాతిన రెండు రాతి పలకల మధ్య మూడు రాతి బండలను కాలువ లాగ చేసి ఏట వాలుగా లోపలనుండే బయటకు వచ్చే ఏర్పాటు చేస్తారు. ఈ కాలువకున్న రెండు బండల చివరన చిన్న గాడి కొట్టి అందులో చివరన ఇనుప కడ్డీలున్న రోకలి బండలాంటి చక్రాన్ని అమర్చు తారు. దీన్ని కదురుగోలు అంటారు. ఇప్పుడు పైనున్న చెవుల మధ్యలో ఇరుసు ఆధారంగా చుట్టూ గాడి వున్న దిట్టమైన చక్రాన్ని అమర్చు తారు. దానిని కపిలి బండి అంటారు. బాన. ఇది చర్మంతో గాని, ఇనుప రేకు తో గాని చేసింది. పైబాగాన వెడల్పుగాను, క్రింది బాగాన సన్నని మూతి గలది. అనగా బోర్లించిన అడుగు తీసేసిన కుండ ఆకారంలో వుంటుంది. ఈ బాన మూతి వైపున సుమారు ఆరు అడుగుల కైవారం ఉంటుంది. దీనికి ఒక ఇనుప చువ్వ తో చేసిన రింగును అనుసందానించి ఆరింగుకు నాలుగు వైపులా నాలుగు ఇనుప కడ్డీలతో బిగించి చివరన ఒక చిన్న రింగు అమర్చుతారు. దానికి మోకు కట్టతారు. కింది వైపు సన్నని మూతిగల వైపున సుమారు ఒక అడుగు కైవారము గల చర్మంతో చేసిన సుమారు నాలుగడుగుల గొట్టం బిగిస్తారు. దీన్నే తొండం అంటారు. దాని చవరలలో రెండు చెవులు లాంటివి కుట్టి వుంచుతారు. దీనికి పొడవాటి దారం కట్టతారు. దీన్నీ తొండం తాడు అంటారు. ఇది కపిలి బాన యొక్క సమగ్ర రూపం.

పాత పద్ధతిలో బావిలో నుండి నీటిని పైకి తోడి పొలాలకు పారించే విధానము.... కపిలి

ఇప్పుడు పొడవైన లావు పాటి దారాన్ని (దీన్నే మోకు అంటారు) తీసుకొని పైన అమర్చిన చక్రాని కున్న గాడి పై ఈమోకును అమర్చి దాని చివరను బానకున్న చిన్న రింగుకు కట్టి,, మరో వైపున ఉన్న తొండానికి ఇంకో సన్నని దారాన్ని కట్టి (తొండం తాడు) ఆ దారాన్ని కదురుగోలు పై వేసి ఈ రెండు దారాలను కాడిమానుకు కలిపి కట్టుతారు. కాడిమానును రెండు ఎద్దుల మెడపై వుంచి పలుపులతో బంధించి బానను బావిలోనికి వదులుతారు. ఇప్పుడు బాన బావిలో..... చక్రం పై మోకు, కదురుగోలు పై తొండం తాడు ఆధారంగా వేలాడు తుంటుంది. ఇప్పుడు బానను మెల్లిగా బావి లోనికి వదిలి ఎద్దులను వెనక్కి నడిపించి కపిలికి దగ్గర వరకు తీసుకొచ్చి తొండం తాడుని పట్టి లాగితే బానమూతి నీటిలో మునిగి బాన నిండుతుంది. ఇప్పుడు ఎద్దులను ముందుకు నడిపించితే నీటితో నిండిన బాన పైకి వస్తుంది. బానకన్న ముందు కింద నున్న తొండం పైకి వచ్చి అందులోని నీరు కాలవ లోనికి ప్రవహించి బయటకు వెళ్ళుతుంది. తిరిగి ఎద్దులను మెల్లిగా వెనక్కు నడిపించి బానను నీటిలో ముంచి ఒక మునక వెయించి మరలా ఎద్దులను ముందుకు నడిపిస్తారు. ఈ విదంగా నిరంత రాయంగా ఎద్దులను ముందుకు, వెనక్కు నడిపించి నీటిని తోడి పొలాలకు పారిస్తారు. ఒక్కోసారికి సుమారు రెండు మూడు వందల లీటర్ల నీరు బయటకు వస్తుంది. కపిలి విధానములో నీటిని తోడి పొలాలకు పారించే విధానము చాల పురాతనమైనది. పూర్వం రాజుల కాలం నుండి ఉంది. పురాతన కోటలలోని బావులకు కపిలి వుండేదనదానికి ఆధారాలు వారి కోటలలో ఈనాటికి ఆధారాలున్నాయి. అలాంటిది గోల్కొండ కోట ప్రక్కన వున్న నిజాము సమాధుల వద్ద వున్న బావికి వున్న కపిలి దొరువును నేటికి చూడవచ్చు. (చిత్రాన్ని చూడు)

గోల్కొండ కోట ప్రక్కన వున్న నిజాముల సమాధుల వద్ద వున్న ఒక బావికి కపిలి ఉండేదనటానికి వున్న ఆధారాలు చూపె చిత్రం.

ఇది చాల శ్రమతో కూడుకున్న పని. ఐనా ఈవిదంగానె రైతులు శ్రమించేవారు. సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఇదే విధానం అమలులో ఉండేది.. ఇప్పుడు కరెంటు మోటార్లు వచ్చినందున ఈ కపిలి ప్రక్రియ పూర్తిగా మరుగున పడిపొయింది. ఈ తరం వారికి కపిలి అంటే బొమ్మల్లో గాని, సినిమాల్లో గాని చూపించితేతప్ప తెలియదు. ఈ కపిలిలో ఉంకో రకం వుంది, అది తిరుగుడు కపిలి. ఈ విధానంలో ఎద్దులను మాటిమాటికి వెనక్కి నడిపించడం వుండదు. కాని దీనికి రెండు జతల ఎద్దులు కావాలి. ఇద్దరు మనుషులు కావాలి. కపిలి విధానంలో నీరు కపిలికి సమాంతరంగా వున్న లేదా పల్లంలో వున్న పొలాలకు మాత్రమే నీరు పారించగలం. గతంలో వర్షాలు బాగా పడి చెరువులు. వంకలు,వాగులు, సెలయేళ్లు నీటితో నిండుగా వుండేవి. అందుచేత బావులలో నీరు నిండుగా వుండేది. కనుక కపిలి/మోట తో నీటిని సులభంగా తోడేవారు.అప్పట్లో అత్యంత లోతైన బావి అంటే 7 మట్ల బావి. ఒక మట్టు అంటే ఒకమనిషి లోతు. అనగా 6 అడుగులు. అనగా లోతైన బావి అంటే సుమారు 40 - 50 అడుగులు లోతు. ప్రస్తుతం భూగర్బ జలం అడుగంటి నందున ఎంతో లోతుకు అనగా వందల అడుగుల లోతులో నీళ్లు ఉన్నాయి. అంత లోతు బావి త్రవ్వడం అసాద్యం., పైగా అంత లోతు నుండి కపిలి/మోట ద్వారా నీళ్లు తోడడం వీలు కాని పని. ఇప్పుడున్న వన్నీ వందలాది అడుగుల లోతైన బోరు బావులే. వాటిలో నుండి నీళ్లు తోడడం కరెంటు మోటార్లకే సాద్యం. అందు చేత బోరు బావులే అందరికి ఆధారం.

బావులు రకాలు
.... బావులు చాల రకాలున్నాయి. గుండు బావి, చదరం బావి, దీర్ఘ చదరం బావి. కట్టుడు బావి. (ఇవి రాతితో కట్టినవి) దొరువు బావులు అంటే రాతి కట్టడం లేనివి, దిగుడు బావులు, అనగా మనుషులు గాని, పశువులు గాని నేరుగా బావిలోనికి దిగేటట్లు కొంత దూరం నుండి ఏటవాలుగ బావి ఆడుగు వరకు దారి వున్న బావులు. చేద బావి. ఇది చాల చిన్నది. బావి పైన కట్టిన గిలక సహాయంతో నీటిని తోడి ఇంటి అవసారాలకు వాడుకుంటారు. ఇవి పల్లెల్లో వుంటాయి. ప్రస్తుతం ఇలాంటి బావులన్నీ ఎండి పోయి అడుగున చెట్ట్లు మొలిచి ఉన్నాయి. ఇప్పుడున్నవ్న్నీ నీళ్లు కనిపించని బోరు బావులే పొలాలకు నీటిని తోడే విదానలలో ఇంకా కొన్ని పద్ధతులున్నాయి. ఈ కపిలి తోలె విధానము పక్కనున్న పాత చిత్రంలో చూడ వచ్చు.

కపిలి బానకున్న ఇనుప వాటిని కంసాలి చేస్తాడు. కర్రతో చేసె వాటిని వడ్రంగి చేస్తాడు. నార, దారాలతో చేసే వటికి అనగా పగ్గం, తొండంతాడు, మోకు, మూజంబరం వంటి వాటిని రైతులు స్వంతంగా చేసుకుంటారు. కపిలి బానను చర్మంతో చేస్తారు. దానిని మాదిగ వారు కుట్టుతారు. కొన్ని కపిలి బానలు ఇనుప అరేకుతో చేసినవి వుంటాయి. బావులలో నుండి నీటిని తోడే ప్రక్రియలు ప్రస్తుతం వాడుకలో లేనందున దానికి సంబంధించిన వ్ అస్తువులు ప్రస్తుతం ఎక్కడా కనబడవు. కపిలి, ఏతం, గూడ మొదలైన నీటి పారుదల ప్రక్రియలు పూర్తిగా వాడుకలో లేనందున కనుమరుగైనవి. లోతు తక్కువగా వున్న నీటిని తోడ డానికి ఏతం గూడ అనె సాధనాలను ఉపయేగించే వారు. వీటి వాడకంలో ఎద్దులతో అవసరం లేదు. ఇద్దరు మనుషులుంటే చాలు.

ఏతం పని చేసే విధానం

దీనికి కావలసినవి:

ఆంగ్ల అక్షరం వై (Y) ఆకారంలో వున్న బలమైన కర్ర దుంగ, మరో కర్ర. (సుమారు 20 అడుగులది) సన్నని, పొడవైన వెదురు బొంగు, ఒక పెద్ద బక్కెట్ దీన్నె ఏతం బాన అంటారు.

పని చేసె విధానం.

వై ఆకారంలోవున్న కర్ర దుంగను రెండు కొసలు పైకి వుండేటట్టు మిట్ట ప్రాంతంలో భూమిలో పాతాలి. పై కొసలకు రంద్రాలు చేసి మరో గట్టి కర్రముక్కను ఇరుసు లాగ ఆ రంద్రాలలో పెట్టి ఆ ఇరుసుకు పొడవాటి కర్రను అనుసందానించాలి. ఈ కర్రకు మెరక ప్రాంతం వైపున కొసన సుమారు 20 కిలోల రాయిని బంధించాలి. రెండో కొసన మరో కర్ర సాయంతో ఒక బానను (బకెట్) అమర్చాలి. ఆరాయి బరువుకు ఆ కర్ర భూమిపై ఆని వుంటుంది. ఆ పొడవైన కర్ర రెండో కొన బాన వున్న వైపు ఆకాశంలో పైకి లేసి వుంటుంది. ఒక వ్యక్తి చేతిలో పొడవాటి వెదురు బొంగును చేత బూని ఆధారంగా భూమికి ఆనిస్తూ భూమిపై ఆని వున్న ఆ కర్రపై నిలబడి పైకి నడుస్తాడు. అతని బరువుకు ఆ కర్ర బానవున్న వైపు కిందికి దిగుతుంది. అది పల్లపు ప్రాంతం. అక్కడే నీటి గుంట ఉంటుంది. ఆ గుంటకు అడ్డంగా ఒక దుంగను వేసి దానిపై ఒక మనిషి నిలబడి కిందికి దిగుతున్న బానను పట్టుకొని నీటిలో ముంచిపైకి లేపుతాడు. అదే సమయంలో పైనున్న వ్యక్తి తనచేతనున్న కర్ర ఊతంతో కర్ర మీద రెండో కొసవైపు నడుస్తాడు. అతని బరువుకు నీటితో నిండిన బాన పైకి లేస్తుంది. అదే సమయంలో కిందనున్న వ్యక్తి బానలోనున్న నీళ్లను మిట్టన కుమ్మరిస్తాడు. ఈ విదంగా కర్ర మీదనున్న వ్యక్తి గారడి వాడి లాగ అటూ ఇటూ నడుస్తుంటే నీటితొ నిండి పైకి వచ్చిన బానను కిందనున్న వ్యక్తి పైన కుమ్మరిస్తాడు. ఈ విదంగా నిరంతరాయంగా చేయటం వలన పల్లంలో నున్న నీటిని పైకి తోడి పొలాలకు పారిస్తారు. ఈ గుంట లోనికి నీరు, చెరువు కాలవ ద్వారా గాని మరే ఇతర మార్గాల ద్వారా వస్తుంది.ఈవిధానంలో 10 అడుగుల లోతు లోపలే నీటిని తోడగలరు. ఒక్క బానలో 20---30 లీటర్ల నీరు పడుతుంది. ఒక పాటలో ఏతము. పద ప్రయోగమున్నది. అది ... "ఏటికి ఏతము పట్టి వెయ్యి పుట్లు పండించి గంజిలో మెతుకెరుగనన్నా.....

గూడ తో నీరు తోడి పొలాలకు పారించే విధానము దీనికి కావలసినవి. సుమారు 10---20 లీటర్ల నీరు పట్టే శంకాకారపు పాత్ర, దీన్నే గూడ అంటారు.4 సన్నని దారాలు. (పగ్గం) దీనికి ఇద్దరు మనుషులు కావాలి. గూడను డబ్బా రేకుతో గాని, వెదుదు బద్దలతో చేసి తారు పూసింది గాని వుంటుంది. గూడకు రెండు వైపుల రెండు దారాలను కట్టి ఇద్దరు మనుషులు గట్టుమీద నిలబడి చెరో రెండో దారాలను పట్టుకొని వంగుతూ గూడను పల్లంలోనున్న నీటిగుంట లోనికి విసురుతూ నీటితో నిండిన గూడను ఒడుపుగా పైకి లేపుతూ మిట్ట ప్రాంతంలో నీటిని కుమ్మరించాలి. ఈ విదంగా పలుమార్లు వంగుతూ గూడను విసురుతూ పైకి లేస్తూ వుంటే పల్లంలో వున్న నీరు మిట్టకు చేరి పొలాలకు పారిస్తారు. గూడను వేయడానికి చిన్నపాటి ఒడుపు (నేర్పరితనము) కావాలి, లేకుంటే అది ఎంతమాత్రం సాద్యం కాదు. గూడ. పద ప్రయోగము,, దృశ్యముతో సహా కులగోత్రాలు సినిమాలో వున్నది. అది..... ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది.... ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది...... ఊపుతు విసరుతు గూడెస్తుంటే,.... నీ గాజులు గల్లు మన్నవి.... నా మనసు జల్లు మన్నది... ఆడుతు పాడుతు పని చేస్తుంటే......... "

ఎద్దుల మెడపై కాడిమాను, దానిపై నాగలి, వెనుక రైతు

వ్యవసాయ పరికరాలు

[మార్చు]

వీటిలో మొదటిగా చెప్పుకో దగినది: అరక/మడక/ నాగలి ఇది కొయ్యతో చేసింది. ఇందులోని బాగాలు: మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుము తో చేసింది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రెండు ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగుతుంది. ప్రస్తుతం భూమిని దున్నడానికి టిల్లర్లు, లేదా ట్రాక్టర్లు వంటి యంత్రాలు వచ్చాయి. వీటితో అతి తొందరగా దున్నడం పూర్తవుతుంది. రైతుకు శ్రమ చాల వరకు తగ్గింది. భూమిని దున్నిన తర్వాత దాన్ని చదును చేయ డానికి, గట్లు వేయ డానికి, పాదులు కట్టడానికి, మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి, వుండే పరికరాల స్థానంలో ప్రస్తుతం ఈ ట్రాక్టర్లే అన్ని పనులు చేస్థున్నాయి. ఈ మధ్యన వరి కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు కూడా వచ్చాయి. రైతుకు చాల కష్టం తగ్గింది కాని పంటలు పండించడానికి సరిపడ నీళ్లే లేవు.

పార.
ఎద్దుల బండి. దామలచెరువు పొలాల్లో తీసిన చిత్రం
కత్తి, కొడవలి, గొడ్డలి.

వ్యవసాయ పనిముట్లు, గృహనిర్మాణాలకు వలసిన సామగ్రిని తయారు చేసే ‘వడ్రంగం’ వృత్తిని విశ్వబ్రాహ్మణులు చేపట్టి గ్రామ సాంఘికాభివృద్ధికి తమ వంతు సహాయమందించే వారు. వడ్రంగి సంవత్సరాంతాన ధాన్యం రైతు ఇల్లు చేరే తరుణంలో తనకు నిర్ణయించిన ‘మేర’ (ధాన్యం, కంకులు, గడ్డి మొదలైనవి) తీసుకొనే వాడు. వీరు బండి చక్రాలు తయారుచేయటం, చక్రాలకు ఇనుపకమ్మీ అమర్చటం, కాడి, మేడి మొదలైన వ్యవసాయ పరికరాలు, నాగలి, కత్తులు, కొడవలి, కర్రు, పార మొదలైన ఇనుప పరికరాలు తయారు చేసియిచ్చే వారు. పాడైపోయిన వ్యవసాయ పనిముట్ల మరమ్మత్తు చేసి వ్యవసాయం కుంటుపడకుండా చూసేవారు. గృహ నిర్మాణానికి సంబంధించిన మొగరాలు, దూరాలు, దంతెలు, ద్వారబంధాలు తయారు చేసేవారు. గృహ ముఖద్వారాన్ని శిల్పాలతో, నగిషీలతో సశాస్త్రీయంగా తీర్చిదిద్దే వారు. వీరే వివాహాలకు పెళ్ళి పీటలు, ‘బాసికం’ తయారుచేసి ఇచ్చేవారు. ఈ విధంగా వడ్రంగులు ఆ కాలంలో మర్యాద, మన్నన కలిగి ఉండేవారు

కపిలి

[మార్చు]
  • బాన,మోకు, బండి, (కపిలి బండి) కదురుగోలు, ఇరుసు, ఎద్దుల బండి, కాడి మాను, మడక, లేదా నాగలి, గొర్రు, పార, తొలిక, కర్రు, గునపము, గొడ్డలి, కొడవలి, కత్తి, పిక్కాసు, మాను, పల్లంకి, మోకు, పగ్గం, తొండం తాడు, పలుపు, జాటి, ముల్లు గర్ర, పలుపులు, చిలుకు దోటి, కొంకి, గోరు గిల్లు, గీస కత్తి, చిక్కం, మచ్చు గత్తి, గొర, దోకుడు పార, మొదలగునవి వ్యవసాయంలో ఉపయోగించు పరికరాలు గతంలో రైతులు తమ పొలాలకు బావులలో నుండి కపిలి లేదా మోట అనె సాధనంతొ నీటిని తోడి పంటలు పండించే వారు. ఈ సాధనం ఎద్దులతో నడిసేది.

ఇందులోని భాగాలు:....బాన, మోకు, బండి (చక్రం) కదురుగోలు, తొండం తాడు తాడు., కాడి మాను, [ఇరుసు], తొండానికి కట్టిన తాడును తొండంతాడు అంటారు. అది తిరుగుతున్న కదురుగోలుపైనుండి ఆ తర్వాత ఒక రాతిపై రాసుకుంటు వెళ్లుతుంది. అలా కొన్ని తరాలుగా రాపిడికి గురైన ఆ రాతిమీద అర్థవృతాకారంలో కొన్ని గాడులు ఏర్పడివుంటాయి. కపిలి మరుగైనందున, వాటికుపయోగించె పరికరాలు కూడా కనుమరుగైనాయి. కాని శాశ్వతమైన ఈ శిలలు మాత్రము ఎవరికి అవసరము లేదు. పాడవవు. అవి అక్కడక్కడా పడి ఉన్నాయి. రాబోవు కాలానికి ఇవే కపిలి అనే సాధనానికి తార్కాణాలుగా మిగిలి వుంటాయి. కాని అసలు కారణాలను పశిగట్టలేని కొందరు పురావస్తు పరిశోధకులు ఆరాతికి మరేదో కారణాన్ని ఆపాదించ వచ్చు. అది చాల హాస్యాస్పదంగా వుంటుంది.

వ్యవసాయ పనులకై కొన్ని కుటుంబాలకు ఒక ఆది ఆంధ్రుడు (మాదిగ) పనిచేస్తుండే వాడు. కపిలబావి నుంచి నీళ్ళు తోడే ‘బక్కెన’, బాన, ‘ఓర్నె’ ఎద్దులకు ‘పంతాళ్ళు’, ‘బడ్డోరు’ రైతులకు చెప్పులు మొదలైనవి పశుచర్మంతో కుట్టించి ఇచ్చేవారు. పైరు కాలంలో పంటకు కావలి వెళ్ళి మిగతా రోజుల్లో యజమాని ఇంట్లోనే పనిచేసి అక్కడే తినేవాడు. పంటలన్నీ కళ్ళం చేరిన రోజుల్లో కళ్ళంలోనే పనిచేస్తూ (జనవరి నుంచి మార్చి వరకు) తయారైన ధాన్యాన్ని ఇల్లు చేర్చి రైతుకు అన్ని విధాలా తోడుగా ఉండేవాడు. చివరగా తనకు రావలసిన ‘మేర’ తో పాటు కళ్ళంలో మిగిలిన ధాన్యం బాగుచేసుకొని రైతు బండిలోనే తన ఇంటికి తీసుకుపోయేవాడు.

కొడవలి

వరి కోతకు, ఇతర సన్నని పంటలను కోయ డానికి ఉపయోగిస్తారు.

కత్తి

కత్తులు చాల రకాలు. చిన్న కత్తి చిన్న పనులకు, అనగా చిన్న కొమ్మలు కొట్ట డానికి, చెరుకు కొట్టడానికి, వాడుతారు. పెద్ద కత్తి: దీన్ని పెద్ద కొమ్మలు కొట్ట డానికి ఉపయోగిస్తారు. వేట కత్తి: దీన్ని వేటను నరక డానికి, లావు పాటి కొమ్మలను నరకడానికుపయోగిస్తారు. వీటికి పదునెక్కువ.

చిలుకు దోటి
కొంకి

ఇది చిన్నకత్తికన్న తేలికగా వుండి దానికన్నా ఎక్కువ వంపు కలిగి వుండి, దానికి పిడి బదులు అక్కడ ఒక గొట్టం లాగ వుంటుంది. అందులో పొడవాటి వెదురు కర్రను దూర్చి వుంటుంది. దీన్ని గొర్రెల కాపరులు, మేకల కాపరులు వెంట తీసుకెళ్లి చెట్ల పైనున్న కొమ్మలను కోసి వారి జీవాలకు మేత వేస్తారు. దీనికి పదునెక్కువ. ఇది తెలికైన ఆయుధము.

గొడ్డలి

చిన్నగొడ్డలి .. పెద్ద గొడ్డలి రెండు రకాలు. చిన్న దాన్ని చిన్న పనులకు, పెద్ద దాన్ని పెద్ద పెద్ద మానులను నరకడాని కుపయోగిస్తారు. గొడ్డళ్లకు పదును ఎక్కువగా వుండదు. గొడ్డలి సంబందించిన సామెత: గోటితో పోయేదానికి గొడ్డలెందుకు

తొలిక

మెట్ట పైర్లలో కలుపు తీతకు, వేరుశనగ కాయలు త్రవ్వడానికి, మొదలగు వాటికి వాడు తారు.

గుద్దలి

దీనితో భూమిలో వున్న చెట్లను వేళ్లతో సహా పెకలించ డానికి వాడే గొడ్డలి లాంటి పరికరము.

చిలుకు దోటి

చిలుకు దోటి తో చెట్టు పైనున్న చింత కాయలు, మునగ కాయలు మొదలగు వాటిని కోసి కింద పడ వేయ డానికి ఉపయోగిస్తారు. పైనున్న కొమ్మకు తగిలించి వూపి దానిలోని కాయలను రాల్చడానికుపయోగిస్తారు.

చిక్కం దోటి
చిక్కం దోటి

ఇది చిలుకు దోటి లాంటిదే. కాని దీనికి చివరన ఒకచిన్న చక్రం లాంటిది వుండి దానికి చిన్న వల వుంటుంది. దీన్ని చెట్లపై నున్న మామిడి కాయలను కోయ డానికి వాడతారు. మామిడి కాయలను చిలుకు దోటితో కోస్తే అవి కింద పడి దెబ్బలు తగిలి పాడవుతాయి. ఈ చిక్కంతో కోస్తే కాయలు ఆ చిక్కంలో (వలలో) తగులుకొని కింద పడవు. మెల్లిగా క్రిందికి దించి కాయలను తీసు కుంటారు.

పార

మట్టిని తట్టల కెత్త డానికి, అడుసులో అండ చెక్కడానికి, గట్టులు వేయడానికి, పొలాలకు, చెరుకు తోట వంటి తోటలకు నీరు కట్టడానికి పార చాల అవసరం. కాల క్రమంలో పార అరిగిపోయి చిన్నదైతె దాన్ని గొనంపార అంటారు.

తొలికి దీనిని మెట్ట పైర్లలో కలుపు తీయడానికి, వేరుశనగ కాయలను త్రవ్వి తీయడానికి ఉపయోగించే చిన్న పరికరము.
గడ్డ పార/ గునపం

మట్టిని త్రవ్వడానికి, పొలాల్లో రాళ్లను పెకలించ డానికి దీని వుపయోగం చాల ఉంది. కపిలి, గూడ, ఏతం, ఎద్దుల బండి వీటికి కావలసిన పరికరాలు అవి పని చేసె విధానం ప్రత్యేకంగా ఆయా వర్గాలలో వివరించ బడ్డాయి. మంచె జొన్న, సజ్జ చేలలో మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక వేసి దానిపైకెక్కి కంకులపై వాలె పక్షులు, పిట్టలను తోలదానికి ఏర్పాటు చేసుకున్న సుమారు అయిదారు అడుగుల ఎత్తైన కర్రల వేదిక.

వడిసెల

అరచేతి వెడల్పు తో అదే పరిణామంలో దారాలతో అల్లిన వల. ఆ వల రెండు చివరలన రెండు పొడవాటి దారాలు వుంటాయి. మధ్యలో ఒక రాయిని పెట్టి రెండు దారాల కొసలను చేర్చి కుడి చేత్తో పట్టుకొని తలపి గిర గిరా వేగంగా తిప్పి ఒక దారం కొసను వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్ళి పడుతుంది.పొలాల్లో పక్షులను తోల డానికి దీన్ని వాడతారు. కాని దీన్ని గురి చూసి కొట్ట డానికి లేదు. పూర్వం వడిసెలను యుద్ధాలలో కూడా వాడినట్లు ఆధారాలున్నాయి. నైజాం సర్కారు పై ప్రజాపోరులో పాడిన పాట: బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ... ఏ బండిల వస్తవురో నైజాము సర్కరోడ ......................, ............ వడిసేల రాయి పెట్టి వడి వడి గా కొట్టి తేను నీ మిల్ట్రి పారి పోయె రో నైజాము సర్కరోడా ............................,

గోరు గిల్లు

ఆకు తోటలో తమలపాకులు కోయడానికి బొటన వేలుకి వేసుకునే ఇనుప రేకు గోరు. దీని వలన వేళ్లకు నొప్పి లేకుండా వుంటుంది.

కొడము

ఇది కొబ్బరి లేదా వెదురు పుల్లలతో అల్లిన చేపలు పట్టే.... పరికరం.

గాలము

ఇది కూడ చేపలు పట్టడానికుపయోగించే చిన్న ఇనుప కొక్కెం.

  • సూది ఇది బట్టలను కుట్టుకునే సాదారణ పరికరం.
దబ్బణం

ఇది సూది లాంటి పెద్ద పరికరం. దీతో పెద్ద గోతాలలొ ధాన్యం వేసి నపుడు దాని మూతిని కుట్టడానికి వుపయోగిస్తారు.

జాటి

ఎద్దుల బండి తోలె టప్పుడు జాటీ తో ఎద్దులను అదిలిస్తుంటాడు. ఇది సన్నని వెదురు కర్రకు తోలుతొ అల్లిన దారం కలిగి, కొసలో జానెడు పొడవున్న మూడు తోలు పోగులు వుంటాయి. ఇది ఆతి చిన్న కొరడా లాంటిది. దీని దెబ్బ చాల చురుక్కు మంటుంది.

ముల్లు గర్ర

ఇది సన్నని వెదురు కర్ర. దాని చివరన కొసగా చెక్కి వుంటుంది. దీన్ని దుక్కి దున్నేటప్పుడు ఎద్దులను అదిలించ డానికి వాడుతారు.

కాడి మాను
కాడిమాను

కాడిమాను ఇది కొయ్యతో చేసినది. దీన్ని ఎద్దుల మెడపై వేసి బండికి.... నాగలి వంటి పనిముట్లుకు కట్టి ఎద్దులతో పని చేయించడానికుపయోగిస్తారు. ఎద్దులతో ఏ పని చేయించాలనా ఎద్దుల మెడపై కాడి మాను పెట్టాల్సిందె. కాడి మాను పైకి లేపగానె ఎద్దులు తలలు వంచి దాని కిందికి దూరి కాడిమానును తమ మెడలపై వుంచుకుంటాయి.

పలికి మాను

ఇది నాలుగడుగులు పొడవున్న కర్ర దుంగ. దానికి సుమారు పది రంద్రాలు చేసి దానికి ఒక జానెడు పొడవున్న కర్ర ముక్కలను బిగించి వుంటారు. దీన్ని వెలి దుక్కి దున్నిన తర్వాత ఆ సాళ్లలొ ఏదేని విత్తనాలు వేసిన ఆ సాళ్లను పూడ్చడానికి వాడతారు.

నిచ్చెన
నిచ్చెన

పందిలి పైనున్న గడ్డిని, తీయడానికి, చిన్న చెట్లను ఎక్కడానికి దీనిని ఉపయోగిస్తారు.

కాడి ఎద్దులు

కాడి ఎద్దులు అంటే రెండు ఎద్దులు. కుడి పక్కది, ఎలపట.. ఎడం పక్కది దాపట అని అంటారు.. ఎద్దులు ఎప్పుడు దుక్కి దున్ను తున్న, బండి లాగుతున్న, లేదా రోడ్డు మీద నడుస్తున్న. పనిలో వున్నప్పుడు ఇంటి వద్ద కొట్టంలో కట్టేసి వుంచినా అవి ఆ వరుసలో మాత్రమె వుంటాయి.

ఎద్దుల బండి
పొలంలో ఎద్దుల బండి

రైతులకు ఇది అతి ముక్యమైన సాధనము. పొలములోని పంటను ఇంటికి చేర్చడానికి, ఇంటి వద్దనున్న దిబ్బలోని ఎరువును పొలానికి చేర్చడానికి ఇది ముక్యమైన సాధనం.

చిక్కం

ఇప్పుడైతే పొలానికి కూడ అన్నం టిపన్ క్యారియర్లలో తీసుకెళ్లు తున్నారు కాని గతంలో సంగటి ముద్దను అడవులకు/ పశువులును /గొర్రెలను/ మేకలను కాయడాని వెళ్లేటప్పుడు చిక్కంలో తీసుకెళ్లే వారు. ఇది సన్నని దారలతో అల్లిన చిన్న వల.

గీస కత్తి

సాధారణంగా ప్రతి మొగ వారి వద్ద మొల తాడుకు కట్టిన చిన్న వస్తువులు కలిగిని ఒక గుత్తి వుండేది. అందులో గీస కత్తి:

పంటలు

[మార్చు]
మొక్కజొన్నతోట
  • ఆహార పంటలు

వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న, కొర్రలు, ఆరికెలు, కందులు, అలసందలు/బొబ్బర్లు, పెసలు, ఉలవలు, మినుములు/ఉద్దులు, సామాన్యంగా ఈ పంటలన్నీ మెట్ట పంటలే. అనగా వర్షాధార పంటలే.

  • వాణిజ్య పంటలు

చెరకు, వేరు శనగ, పొద్దు తిరుగుడు, శనగ, మిరప, ప్రత్తి, పొగాకు,

  • కూరగాయ పంటలు

టమేట, వంకాయ, బీర, సొర, కాకర, గుమ్మడి, బీన్స్, చిక్కుడు, మునగ, వివిద రకాల ఆకు కూరలు.

  • పండ్ల తోటలు

మామిడి, కొబ్బరి, నిమ్మ, కమలా, బొప్పాయి, అరటి, జామ, సపోట, మొదలగునవి. ఆకు తోట. ఆకు తోట అనగా తమలపాకుల తోట.

వేరుశనగ పండించె విధానము
ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న వేరుశనగ పంట

ప్రధానంగా వేరుశనగ వర్షాధార పంటగా పండిస్తారు. భూమిని తొలకరి వర్షాలు పడగానె రెండు మూడు సార్లు దున్ని అందులో పశువుల ఎరువులేసి మరలా కలియ దున్ని ఆతర్వాత సాళ్లు సాళ్లుగా దున్ను తుంటే వెనక ఇద్దరు బుట్టలో వేరు శనగ గింజలను పెట్టుకొని సాళ్లలో(సాలు) జాన కొకటి చొప్పున వేస్తు నాగలి వెనకాల నడుస్తుంటారు. ఏడు సాళ్లకొకసారి వేరె విత్తనాలను వేస్తారు. అనగా కంది, జొన్న, అలసందలు, అనుములు, మినుములు, పెసలు ఇలా వేరొక గింజలను వేస్తారు. వేరు శనగ గింజలను భూమిలో వేయడానికి ఒక చిన్న పరికరం వున్నది. దాని పేరు గొర్రు. దీనితో సుమారు మూడు నాలుగు వరుసలలో ఒకేసారి గింజలను వేయ వచ్చు. గొర్రు అనగా నాగలి లాంటిదే. దీనికి మూడు నాలుగు కర్రులుంటాయి. వాటిని సన్నని గొట్టాలతో కలిపి పైన ఒక గిన్నెలాగ వుంటుంది. అందులో గింజలను పోస్తే అవి గొట్టాల ద్వారా క్రిందికి సాళ్లలో పడుతాయి. ఇది కొంత సులువైన పని వేగవంతమైనది కూడ. గింజలను వేసిన తర్వాత సాళ్లలో వేసిన గింజలు బైటికి కనబడు తుంటాయి. అలా వదిలేస్తే పక్షులు తినేస్తాయి. అందు వలన ఆ పొలంలో సాళ్లకు ఆడ్డంగా పలికి మాను తోలాలి. అప్పుడు సాళ్లు పూడి పోయి పొలం చదునుగా అవుతుంది. వేసిన రకాన్ని బట్టి వేరుశనగనాలుగు నెలలో కాయలు ఊరుతాయి.

వేరుశనగ మొదటి దశలో చెట్లకు పశుపు పచ్చని పూత వస్తుంది. అక్కడి నుండే సన్నని ఊడ నేలలోనికి దిగుతుంది. ఊడ కొసన చిన్న బుడిపె లాగ కాయ మొదలవుతుంది. అది పెద్దదయి కాయ తయారవుతుంది. కాయ పక్వాని కొచ్చినపుడు వేరుశనగ చెట్టు ఆకులు కొంత గోదుమరంగుకు మారుతాయి. అప్పుడు చెట్లున్న సాలు వెంబడి నాగలితో లోతుగా దున్ని పెళ్లగించ బడ్డ వేరుశనగ చెట్లను కాయలతో సహా తీసి కుప్ప వేసి అందులో నుండి కాయలను వలుసుకుంటారు. లేదా తొలికలతో ప్రతి చెట్టును త్రవ్వి అందులో నుండి కాయలను వలుసు కుంటారు. ఇంటి అవసరానికి కొంత వుంచుకొని మిగతా వేరుశనగ కాయలను అమ్ముకుంటారు. వేరు శనగ గింజలనుండి నూనె గానుగలతొ నూనె తీసి ఇంటి అవసరానికి వాడుకునేవారు. నూనె తీయగా వచ్చిన చెక్క పశువులకు చాల బలవర్థకమైన ఆహారము. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో వార్షాధార పంట అయిన వేరుశనగ పంట రాష్ట్ర వ్వాప్తంగా తగ్గిందని ప్రభుత్వ లెక్కలె చెపుతున్నాయి. గతంలో వేరుశనగ నూనె మాత్రమె వంటనూనెగా వాడెవారు. దానికి ప్రత్యామ్నంగా ప్రస్తుతం, గతంలో అంత ప్రాచుర్యంలో లేని ప్రొద్దు తిరుగుడు గింజల నూనె, పాం ఆయిల్ ను బాగ ఉత్పత్తి చేస్తున్నారు... బాగానె వాడుతున్నారు.

వరి పండించే విధానము

[మార్చు]

ఆరోజుల్లో వరి పంట పండించాలంటే ..... పొలాన్ని మూడు సార్లు మడక తో దున్ని, చువరి దుక్కిలో పశువుల ఎరువును వేసి చదును చేస్తారు. నీళ్లలో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అని, నీళ్లు లేకుండా మెట్ట పొలాలలో దున్నే దుక్కిని వెలి దుక్కి అని అంటారు. వెలి దుక్కికి తగుమాత్రం తేమ వుండాలి. తేమ ఎక్కువగా వుంటే దున్నరు. ఆ తేమ శాతాన్ని పదును అంటారు. అడుసు దుక్కి దున్నిన తర్వాత ఒకపెద్ద చెక్క పలకను ఎద్దులకు కట్టి అడుసులో ఒక సారి తిప్పితే పొలం అంతా చదునుగా అవుతుంది. ఆ తర్వాతి పొలం అంతా ఆకు పరచి ఆ ఆకును కాళ్లతో బురద లోనికి తొక్కుతారు. ఆకు అనగా, కానుగ, వేప, గంగ రావి, జిల్లేడు మొదలగు ఆకు తెచ్చి అడుసు లో వేసి తొక్కుకాతారు. పొలాల గట్టు మీద ఈ ఆకు చెట్లు లేనివారు అడవికి వెళ్లి కనిపించిన ఆకు కొమ్మలను కొట్టి మోపులుగా కట్టి తెచ్చి పొలంలో పరచి తొక్కుతారు. ఇది పంటకు చాల సారవంత మైన సేంద్రియ ఎరువు. తర్వాత అది వరకే నారు పోసి వుంచుకున్న వరి నారును పీకి కట్టలు కట్టలుగా కట్టి పొలంలో వరుసలుగా వేస్తారు. ఆడ కూలీలు వచ్చి నాట్లు వేస్తారు. ఈ కూలీలు నాట్లు వేస్తూ పాటలు పాడతారు. ఈ పాటలు ఒకరు ఒక నుడుగు పాడితె మిగతా వారు కోరస్ గా పాడు తారు. ఆ దృశ్యం చూడ ముచ్చటగా, ఆ పాటలు విన సొంపుగా ఎంతో ఆహ్లాద కరంగా వుంటుంది. మధ్యాహ్న సమయానికి పొలం యజమాని ఇంటి నుండి కూలీలకు (అన్నం) సంగటి వస్తుంది. అప్పుడు కూలీలు బయటికి వచ్చి తమ బురద కాళ్లను కడుక్కొని చెట్టు కింద కూర్చొని చేతిలో సంగటి ముద్దను వేయించుకొని తింటారు. కొందరు చిన్న పిల్ల లున్న తల్లులు రెండు ముద్దల సంగటిని కొంగులో వేసుకుని మూట గట్టుకొని తాము తెచ్చుకున్న గిన్నెలో కూర పోయించు కొని ఇంటి కెళ్లి తమ పిల్లలకు అన్నం పెట్టి, చంటి పిల్లలుంటే వారికి పాలిచ్చి తిరిగి పనిలోకి వస్తారు. పొద్దు పోయిందాక వారు పని చేసేవారు.

గుట్టకింద వరి పొలం, దామలచెరువు దగ్గర తీసిన చిత్రం
పొట్టకర్ర మీదున్న వరి పొలము

వరి నాటిన నాలుగు వారాలకు కలుపు తీయాలి. ఇది కూడ బురదలో పనే. ఆడవారి పనే. తెల్ల వారి సద్దులు తాగి పనిలోకి దిగితే మధ్యాహ్నం ఒంటిగంటకు సంగటి తిని అరగంట అలసట తీసుకుని మల్లీ పనిలోకి దిగుతారు. కలుపు తీత లో కూడ వీరు పాటలు పాడుతారు. వరి నాట్లు, కలుపు తీయడం ఈ రెండు పనులలోనె ఈ పాటల కార్యక్రమం వుంటుంది. మిగతా ఏ పనిలోను ఈ కోరస్ పాటలుండవు. ఈపాటలు వారికి పనిలోని అలసటను మరిపించి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.ఆ రోజుల్లో ఈ కూలివారికి డబ్బురూపంలో కాక వస్తు రూపంలో కూలి ఇచ్చేవారు. అనగా ఒక కూలికి రెండు బళ్ళల వడ్లు ఇచ్చేవారు. ఆతర్వాత కొంత కాలానికి డబ్బులను కూలీగా ఇచ్చే పద్దతి వచ్చింది. ఏ పనికైనా కూలిగా డబ్బులు తీసుకున్నా వరి పంటకు సంబందించిన పనికి మాత్రము... వడ్లను మాత్రమే కూలిగా తీసుకునేవారు. కొంత కాలానికి అన్ని పనులకు డబ్బులే కూలిగా ఇచ్చే పద్దతి వచ్చింది. మెదట్లో ఒక మనిషి కి ఒక రోజుకు కూలి అర్థరూపాయి గా వుండేది. ఆ తర్వాత.... తర్వాత అది పెరిగి ఈ రోజుకి అనగా 2011 వ సంవత్సరానికి 150 రూపాయలైంది. పని గంటలు మాత్రము తగ్గినాయి. అప్పట్లో పొద్దున ఎనిమిది గంటలకు పనిలోకి వస్తే సాయంత్రం పొద్దు పోయిందాక పని చేసే వారి. ఇప్పుడు పొద్దున 8 గంటలకు పనిలోకి దిగి మధ్యాహ్నం భోజన సమయానికి అనగా ఒంటి గంటకు దిగి పోతారు.

కలుపు మొక్కలు

[మార్చు]

కలుపు మొక్కలు పలు విదాలు. ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలే కలుపు మొక్కలు. ఈ మొక్కలు రైతులు ప్రధాన పంటకు వేసిన ఎరువులు ఇతర పోషకాలను గ్రహించి ప్రధాన పంట్టకు నష్టం కలిగిస్తాయి. వాటిని కూలీలు చాకచఖ్యంగా సులబంగా గుర్తిస్తారు. పీకేస్తారు. కాని ఒక రకమైన కలుపు మొక్క వుంటుంది. దాని పేరు "ఊదర" .ఇది ఎలా వరి మొక్కల మధ్యలో చేరుతుందో గాని ఇది చాల మోస కారి మొక్క. మనుషుల్లో మోసపూరితమైన వారుంటారనె విషయం అందరికి తెలిసిందే. పశుపక్ష్యాదుల్లో కూడ మోస గాళ్లుంటారు. తమ ఆహారం కొరకు తమ సహ చర జంతువుల నుండి అహారాన్ని దొంగిలిస్తుంటాయి. ఇంకొన్ని జంతువులు పక్షులు తమ ఆహారమైన ఎరను మోస గించి ఏమార్చి గుటుక్కున మింగేస్తాయి. ఇది కూడ చాల మంది ఎరిగినదే. కాని మొక్కల్లో కూడ మోస పూరిత మొక్కలుంటాయని చాల తక్కువ మందికే తెలుసు. ఈ :"ఊదర" మొక్క పూర్తిగా వరి మొక్క లాగే వుంటుంది. వరి మొక్కల మధ్య చేరి అక్కడున్న బలాన్ని అతి తొందర గా పీల్చు కుంటాయి. సకాలంలో వాటిని నిపీకేయక పోతె వరి పంట పండదు. అంతా ఊదర పంటే. అవి ఎంత మోసకారివైన ఈ కూలీల కళ్లు గప్పలేవు. చూడ డానికి ఒకే విధంగ వున్న అవి అతి వేగంగా ఏపుగా పెరిగు తాయి.

చెరకు సాగు విధానము

[మార్చు]
లేత చెరుకు తోట:,దామలచెరువు వద్ద తీసిన చిత్రం

నాలుగు రోజులు ఆరనిచ్చి ముందుగానె సిద్దంచేసుకున్న చెరకు ముక్కల సుమారు ఒక అడుగు పొడవున్న వాటిని సాళ్లలో వరుసగా పేర్చి మధ్య మధ్యలో వున్న కాలువల ద్వారా నీటిని మడవలకు పారించి అక్కడున్ను చెరుకు ముక్కలను సాళ్లలో బూమిలో తక్కువ లోతులో పాతి పెడ్తారు. ఆపొలానికి వారానికి అవసరాన్ని బట్టి తడి ఇస్తారు. ఒకటి రెండు నెలలకు చెరుకు మొలకెత్తి ఒక ఆడుగు ఎత్తు వరకు పెరుగుతుంది. అప్పుడు నాగలి/మడకలతో "సాలు" తోలు తారు. అప్పుడు తిరిగి మడవలు ఏర్పాటు చేసి నీళ్లు పారిస్తారు. చెరకు మూడు నాలుగడుగులు పెరిగాక ఆ మొక్కలను నాలుగైదింటిని ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే ఒకటిగా చుట్టు తారు. ఆ తర్వాత రెండు మూడు నెలలకు మరలా మరో చుట్టకం వేస్తారు. ఇప్పుడు రెండు సాళ్లలోని గడలను పైన ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే చుడ్తారు. చెరకు పంట సాధారణంగ పది నెలల పంట.

చెరకు గానుగ, బెల్లం తయారీ

[మార్చు]

బెల్లం ప్రధాన వ్యాసం చెరకు కొట్టి ఆ పొలంలోనె ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసి దాన్ని పెద్ద పొయ్యి మీద పెట్టిన పెద్ద పెనంలో పోస్తారు. సుమారు అర గంట కాగ బెట్టగా పెనంలోని చెరకు రసం చిక్కబడి బంగారు రంగు తో పాకం తయారవుతుంది. అప్పుడు దాన్ని ఇద్దరు మనుషులతో ఆ పెనాన్ని పైకి లేపి ప్రక్కనే వున్న ఒక దోని లో పొస్తారు. ఆ పాకాన్ని గోర అనే పరికరంతో బాగా కలియ బెట్టిటె అది చిక్కబడు తుంది. అప్పుడు కూడ చాల వేడిగానే వుంటుండి. వెంటనే దాన్ని ముద్దలుగా పట్టి ప్రక్కనే చెక్కల మీద ఆరబెడతారు. కొన్ని ప్రాంతాలలో ఆ పాకాన్ని అచ్చులలో పోసి బద్ర పరుచు చుంటారు. మరి కొందరు గట్టి పడిన బెల్లాన్ని పొడిగా వున్నప్పుడే సంసులలో వేసి బద్ర పరుస్తారు. . ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో ''రాపు.... లేదా ''జేడు." అంటారు. ఏదైనా రైతు నాలుగు డబ్బులు కళ్ల జూసేది ఈ బెల్లంలోనె. ఇప్పుడు చెరకు తోటలు గతంతో పోలిస్తే సగం మంది కూడ పండించడం లేదు. తయారైన బెల్లాన్ని రైతులు "మండిలకు " బండ్లలో తోలుకెళ్లి అమ్ము కోవచ్చు. కాని ఇందులో రైతుకు కొంత శ్రమ ఎక్కువ. ఎలాగంటే.... అంత దూరం బెల్లాన్ని తీసుకెళ్లడం రైతుకు పెద్ద శ్రమ. మండీలలో ఒక్కోసారి ఒకటి రెండు రోజులు ఆగవలసి వస్తుంది. మూడోది..... బెల్లం నాణ్యతను కట్టడం. బెల్లం నాణ్యతను నిర్ణయించేది మండీ వ్వాపరస్తుడె. ఇందులొ చాల మోసం జరుగుతుంది. బెల్లం ధర నాణ్యత మీదనె ఆధార పడి వుంటుంది. ఇన్ని కష్టాలు పడేదాని కన్నా రైతులు తమ ఇళ్ల వద్దకు వచ్చే వ్వాపారస్తులకే తమ బెల్లాన్ని అమ్ముకుంటారు. పైగా ఆ వ్వాపారస్థుడు రైతుకు ఇది వరకే అప్పు ఇచ్చి వుంటాడు. దాని వలన రైతు తన బెల్లాన్ని ఆ వ్వాపరస్తునికె తప్పక అమ్మవలసిన పరిస్థితి. బెల్లాన్ని మంచి ధర వచ్చునంత వరకు నిల్వ వుంచు కోవడము కూడ కొందరి రైతులకు అవకాశము వుండడు. కాని వ్వాపారస్తులు ముందుగానె రైతు వద్ద బెల్లాన్ని కొని తన గోదాములో చేర్చు కుంటాడు. ధర తెంచడు. కాని కొంత మంది వ్వాపారస్తులు ధరలు ఎప్పుడు ఎక్కువగా వుండునో అప్పుడే తన బెల్లానికి ధర తెంచమని రైతు అడగ వచ్చు. ఈ అవకాశము రైతుకు కొంత వెసులుబాటును కలిగిస్తుంది.

దోనిలొ గట్టిపడిన బెల్లం పాకం.
బెల్లాన్ని తూకం వేసె సాధనం. దీన్ని రతి అంటారు.

చిత్తూరు జిల్లా ప్రాంతంలో బెల్లాన్ని "గోనెలు "లో బరువుతో తూకం వేస్తారు. గోనె అనగా 150 కిలోలు, నాలుగు గోనెలు అనగా ఒక బండి . రైతులు "నాకు పది గోనెల బెల్లం అయింద " నో, "పన్నెండు బండ్ల బెల్లం " అయిందనో అంటుంటారు. బెల్లాన్ని తూక వేసే పరికరాన్ని రతి అంటారు. ఎక్కువగా దీనినే వాడతారు. బెల్లాన్ని తూకం వేయడానికి ఈ రతిని మాత్రమే వాడతారు. ఈ రతులు గడియారంలాగ గుండ్రంగా కొన్ని వుంటాయి. ఇంకొన్ని ధర్మా మీటరు లాగ పొడవుగా వుంటాయి. దీనిలో వ్వాపారస్తుడు తనకు అనుకూలంగా మార్పులు చేసె అవకాశం ఎక్కువ. ఏది వాడినా వ్వాపారస్తుడు రైతును మోసం చేయాలను కుంటే రైతు ఏ మాత్రం గ్రహించలేడు. ఇది కేవలం నమ్మకంతో జరిగే వ్యవహారం. పైగా తరుగు కింద ప్రతి బస్తా బెల్లానికి సుమారు ఒక కిలో బెల్లం ఎక్కువ వేసు కుంటారు వ్వాపారస్తుడు.

పక్వాని కొచ్చిన చెరుకు తోట. కొట్టిన చెరుకును ఎద్దులతో రవాణాకు సిద్దం:, దామలచెరువు వద్ద పొలంలో తీసిన చిత్రం
బెల్లం పాకం.

మొదట సారి చెరకు నాటి అది పక్యానికి వచ్చింతర్వాత ఆ చెరకును కొట్టి బెల్లం చేసింతర్వాత ఆపొలంలో చెరకు ఆకు మిగిలి వుంటుంది. దాన్ని నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఆ తర్వాత దానికి నీరు పార గట్టితే చెరకు మొదళ్లలోనుండి పిలకలు వచ్చి మరల చెరకు తోట పెరుగుతుంది. ఈ విదంగా రెండు మూడు సార్లు చేయ వచ్చు. దీనిని మర్దాలు తోట, కాసి తోట, లేదా మొక్క తోట అంటారు. ఇందులో కూడా మొదటి తోటలో లాగానె అంతర కృషి చేసి ఎరువులు వేయాల్సి వుంటుది. ఈ పంట కొంత తొందరగా కోతకు వస్తుంది. ఖర్చు, శ్రమ కొంత తక్కువ.

  • జొన్న సజ్జ పంటలు
పొలంలో జొన్న పైరు

ఇవి మెట్ట పంటలు. వర్షాదార పంటలు. వీటి మధ్య మధ్య సాలుల్లో ఇతర అపరాల, పప్పు దినుసుల పంటలు కూడా వేస్తారు. జొన్న, సజ్జ పంటలకు పంట దశలో పక్షులు, పిట్టల బెడద ఎక్కువ. వాటి నివారణ కొరకు చేల మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక నిర్మించి దానిపైకెక్కి వడిసెలలో రాళ్లు పెట్టి కొట్టి పక్షులను కాకులను తరుముతారు. ఆ వేదికనే మంచె అంటారు.

కొర్ర పంట
  • కొర్రలు లేదా ఆరెకలు

ఇవి కూడా ఆహార పంటలే. కాని మెట్ట పంటలు. అచ్చంగా వీటినే పండించ కుండా వేరుశనగ పంటలో అంతర్ పంటగా వేసే వారు. తగు మాత్రం పండించు కునే వారు. ఇంటి అవసరాల కొరకు, వైవిధ్య ఆహారం కొరకు. కాని ఆ కొర్రల, ఆరెకల అన్నం వట్టిది తిన్నా.... చాల రుచిగా వుంటుంది. పైగా ఈ పంట చాల సులభంగా ఎలాంటి తెగుళ్ల బారిన పడకుండా, ఎరువులు ఏమి లేకున్న వర్షాదార పంటగా పండు తుంది. కాని ఏ కారణం చేతనో ఆపంట పూర్తిగా కనుమరుగై చాల కాలమే అయినది. కానీ పట్టణాలలి కొన్ని చోట్ల చెక్కెర వ్యాధి గ్రస్తులకు.... రాగులు, కొర్రలు, ఆరెకలు, ఎర్ర జొన్నలు అమ్మబడును అనే బోర్డులున్నాయి.

  • రాగులు

వీటినె కొన్ని ప్రాంతాలలో తైదులు అంటారు. ఇవి ఆవాలంత చిన్నవి. వీటిని మెట్ట పంటగా గాని, లేద నీటి పారుదల కింద గాని పండిస్తారు. ఇది తక్కువ కాలపు పంట. వీటిని గతంలో రైతులు ప్రతి యొక్కరు పండించేవారు. రాగులను రాగల్రాయిలో వేసి విసిరి. పిండి చేసి ఆ పిండిని అన్నం వండే టప్పుడు అందులో వేసి కెలికి దాన్ని ముద్దలు ముద్దలు గాచేసి తిటారు. వాటినే రాగి ముద్దలు అంటారు. రాగులు చాల బలవర్దకమైన ఆహారం. చాల రుచి కరమైనది కూడ. అందుకే ఈ రోజుల్లో కూడా పట్టణాలలోని పెద్ద పెద్ద హోటళ్లలో రాగి సంగటిని ప్రత్యేక మైన ఆహార పదార్థంగా వడ్డిస్తుంటారు. రాగి పిండితో జావ కూడా తయారు చేస్తారు. ఇది చాల భలవర్థకమైన పదార్థం. ఆరోగ్యానికి కూడా చాల మంచిది.

  • ఆకు తోట

ఆ రోజుల్లో రైతు నిత్యం డబ్బు మొఖం జూసె పంట ఆకు తోట. ఇది తమలపాకుల తోట. ఇవి విస్థారమైన తోటలు కాదు. ఏ కొద్ది మంది రైతులే చాల కొద్ది విస్థీర్ణంలో వేసె వారు. అయినా ఆదాయం బాగానె వుండేది. అయితే ఆకు తోట పెంపకం అత్యంత నిష్ఠతో, అంటు, ముట్టు తగల కుండా పెంచాలి. ఎవరు పడితె వారు ఆ తోటలోనికి పోకూడదు. యజమాని రైతే లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే లోనికెళ్లెవారు. వారాని కొక సారి గోరు గిల్లు (బొటన వేలుకు తగిలించుకునే ఇనుపగోరు) తో ఆకులను గిల్లి వారపు సంతలో అమ్మే వారు. వాటికి ధర బాగానె వుండేది. మారు బేర గాళ్లు తోట దగ్గరకే వచ్చి ఆకులను కొనుగోలు చేసె వారు. ఈ ఆకు తోటకు చుట్టు దట్టమైన దడి ఆరడుగుల ఎత్తు వుండి దానికి మూడడుగుల చదరంలో ఒక చట్రం వుండి దానికి ఒక తలుపు వుండేది. దానికి తాళం వేసుకునే వాడు రైతు. ఈ తమలపాకులకు ఇప్పుడు కూడా మంచి ధర వున్నా ఏ కారణం చేతనో కొన్ని ప్రాంతాలలో ఆ పంట దాదాపుగా కనుమరుగై పోతున్నది.

మామిడి తోట. కమ్మపల్లి వద్ద తీసిన చిత్రం

పండ్ల తోటలు

[మార్చు]

పండ్ల తోటలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి మామిడి తోటలు ఇవి చాల విస్తారంగా వుంటాయి. ఈ మధ్యన రైతులు ఈ మామిడి తోటలపై ఎక్కువ మక్కువ చూపు తున్నారు. కారణ మేమంటే వరి వంటి నీటి పంటలకు నీరెక్కువ కావాలి. వర్షాభావంతో నీటి లభ్యత చాల తక్కువ. అందు చేత చాల మంది రైగులు తమపొలాలలో వరి, చెరకు వంటి పంటలను మానేసి మామిడి తోటల వైపు మొగ్గు చూపు తున్నారు. ఈ మామిడి తోటలకు నీటి అవసరం తక్కువ. మామిడి చెట్లు నాటిన తరువాతి సుమారు మూడు సంవత్సరాల వరకు కొంత శ్రద్ధ వహించి అంతర కృషి చేయాలి. ఆ తర్వాత వాటంతట అవే పెరుగుతాయి. నీటి లభ్యతను బట్టి నీరు పారిస్తారు. లేకుంటే లేదు. ఈ తోటలలో మొదటి మూడు సంవత్సరాల వరకు ఇతర పంటలను, అనగా వేరుశనద, చెరకు మొదలైన పంటలను కూడా పండిస్తారు. ఈ పంటలకు పారించే నీరె మామిడి చెట్లకు కూడా సరిపోతుంది. ప్రత్యేకించి మామిడి చెట్లకు నీరు పెట్ట నవసరం లేదు. మూడు సంవత్సరాల తర్వాత మామిడి తోటలు కాతకు వస్తాయి. ఆ తర్వాత చాల సంవత్సరాల వరకు తోటలు పెరుగుతూనె వుంటాయి., కాత కాస్తూనె వుంటాయి. దీనిలో శ్రమ చాల తక్కువ. మామిడి పూత, పిందె సమయాలలో మాత్రము జాగ్రత్త వహించి అవసరాన్ని బట్టి మందులు చల్లాలి. ఇప్పుడు ఈ మామిడి తోటలు విస్తారంగా పెరిగి పోతున్నందున ఒక్కోసారి పంట దిగుబడి ఎక్కువై ధర పడి పోయి రైతులకు నిరాశ మిగులు తున్నది. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దిగుబడి తగ్గి పోతున్నది. ఆ కారణంగా కూడా రైతులు నష్ట పోతున్నారు. మామిడి కాత బాగా కాశీ రైతు ఆనంద పడుతున్న సమయాన మే నెలలో విపరీతమైన గాలి వడగండ్ల వానలు వచ్చి పక్వానికి రాని ఆ మామిడి కాయలన్ని నేల రాలి పోతాయి. ఆ సందర్భాలలో రైతుల ఆవేదన వర్ణనాతీతం: ఇలాంటి ప్రకృతి పరమైన ఇబ్బందులే కాక మానవ కల్పిత ఇబ్బందుల వలన కూడా మామిడి రైతులు కొన్ని సార్లు నష్ట పోతున్నారు. ఈ చుట్టు పక్కల మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు అనేకం ఉన్నాయి. అవి సరిగా రైతుల నుండి కాయలను కొనుగోలు చేస్తే రైతుకు మంచి గిట్టు బాటు అవుతుంది. కాని ఒక్కోసారి ఈ పరిశ్రమల యజమానులంత ఏకమై (సిండికేట్) కూడా బలుక్కొని రైతు పండించిన మామిడికి మిల్లుల యజమానులు ధర నిర్ణయిస్తారు. రైతు ఈ మామిడిని నిల్వ చేసు కోలేడు. మిల్లులు వారు చెప్పిన ధరల ప్రకారం తప్పని సరిగా వారికి అమ్మాల్సిందే. మిల్లుల వారు రైతులను మరో విధంగా కూడా మోసగిస్తున్నారు. ఒక మధ్య వర్తి ఒక ట్రాక్టర్ లోడ్ మామిడి కాయలను మిల్లుకు తన పేరున పంపిస్తే... అతనికి మిల్లు యజమానులు అతనికి సుమారుగా 500 రూపాయలను కమిషన్ గా ఇస్తారు. అదే రైతు స్వయంగా మామిడి కాయలను మిల్లుకు తోలితే ఆ కమిషన్ ఇవ్వరు. దీనికి కారణమేమని విచారించగా.... మిల్లు యజమానులు చెప్పేదేమంటే..... స్వంత రైతులెతే వారి తోటలోని కాయలను మాత్రమే తెస్తారు.... అదే దళారులైతా ఆ సీజను అంతా మిల్లకు మామిడి కాయలను తీసుకొస్తాడు.. కనుక వారికే కమిషన్ ఇస్తారు. వినడానికి ఇది సమంజసంగానే అనిపిస్తుంది. కానీ ఏడాది పాటు కష్టపడి పంట పండించిన రైతు కన్నా..... అడ్డమీద కూర్చుని వచ్చే మామిడి కాయల ట్రాక్టర్లను మళ్ళించి తన పేరుమీద మిల్లులకు పంపి రైతులకన్నా చాల ఎక్కువ డబ్బను అతి తక్కువ సమయంలో సంపాదిస్తున్నాడు. ఈ విధంగా రైతులు మోస పోతున్నారు. మామిడి తోటకు కొట్టే క్రిమి సంహారక మందుల కొరకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. కల్తీ మందుల వలన కూడా మామిడి రైతులు నష్టాల బారిన పడు తున్నాడు.

నీటి అవసరము ఎక్కువగా వున్న వరి వంటి పంటలు వేయలేని రైతులకు ప్రత్యామ్నంగా పండ్ల తోటలు పెంచమని ప్రభుత్వము పండ్ల తోటల పెంపకాన్ని పెంచడం కొరకు అనేక రాయితీలను ప్రకటించింది. తక్కువ దరకు మొక్కలను ఇవ్వడము, చెట్లను నాటడానికి అయ్యే ఖర్చులో కూడా కొంత రాయితీ ఇవ్వడము వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఇంతా చేస్తున్నా.... వర్షాబావ పరిస్థితుల్లో ఒక్కోసారి పెద్ద పెద్ద చెట్లే ఎండి పోతున్నాయి.

రైతుల పాలిట శాపం ప్రకృతి వైపరీత్యాలు

[మార్చు]

రైతులను పీడించే ప్రకృతి వైపరీత్యాలు రెండు విధాలు. ఒకటి:.... వర్షాభావం, కరువు. రెండు:.... వరదలు, అధికవర్షాలు. ఈ రెండు విదాలలోను రైతులు తీవ్రమైన నష్టానికి గురౌతున్నారు. రైతులు వీటి బారిన పడి చాల సందర్భాలలో తమ ఆస్తులతో సహా ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.......

1.వర్షాభావం. కఱవు
2. వరదలు, తుపానులు.

వినోద కార్యక్రమాలు

[మార్చు]
కొమ్మిరెడ్డి గారి పల్లె వద్ద అసంపూర్ణంగా వున్న పాండవుల ఆలయం. మహాభారతం జరిగేది ఇక్కడే. కొమ్మిరెడ్డి గారి పల్లెలో తీసిన చిత్రం

పల్లెవాసుల వినోద కార్యుక్రమాలు: బుర్రకత, హరికథ, జాతరలు, సర్కస్, మోడి, మహా భారత నాటకము, వీధి నాటకాలు, భజనలు, కోలాటము, . ....... ఇలా పల్లెవాసులకు గతంలో అనగా టివిలు పూర్తిగాను, సినిమాలు పెద్ద పట్టణాలలో తప్ప పల్లెల్లో లేని కారణంగా ఆకాలంలో ఇటు వుంటి వినోద కార్యక్రమాలే పల్లె ప్రజలకు వినోద కార్యక్రమాలు. అవి బుర్ర కథ, హరికథ, జాతరలు, సమ్మక్క సారక్క జాతర, తిరుపతి గంగమ్మ జాతర, బోయ కొండ గంగమ్మ,

తెలుగు నాట కోడి పందెం

[మార్చు]

కోడి పందెములు తెనుగువారి వినోదములలో చాలా ప్రాచీనమగు వినోదము. మన సారస్వతములో కేతనకవి కాలము నుండియు నారాయణకవి కాలము వరకు పలువురు కవులు ఈ పందెములను వర్ణించారు. కోడి పందెపు శాస్త్రము కూడా చాలా ప్రాచీనమైనట్టిదే. నారాయణకవి ఈ విషయములో ఇట్లు వర్ణించాడు:

కోడి పందెంలో కోడి పుంజుల పోట్లాట

           "కాచిప్రాతలు దారాలు కట్టుముళ్ళు
            ముష్టులును నీళ్ళముంతలు మూలికలును
            కత్తులపొదుళ్ళు మంత్రముల్ కట్టుపసరు
            లెనయవచ్చిరి పందెగాళ్ళేపురేగి
            వేగ నెమిలి పింగళి కోడి డేగ కాకి
            వన్నెలైదింటి కిరులందు వెన్నెలందు
            రాజ్యభోజనగమన నిద్రామరణ
            ములను విచారించి యుపజాతులను వచించి"

తోలుబొమ్మలాటలు

[మార్చు]
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో తోలు బొమ్మలాట కళాకారుల ప్రదర్శన
అన్నిటికన్నా ఇది ప్రాచీనకళ.

పల్లె వాసులకు వినోదాన్ని పంచి పెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాటలు మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధినాటకాలు మొదలగు వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసులకందుబాటు లోకి వచ్చాయి. బహుళ ప్రచారం పొందాయి. ఈనాడు ఆంధ్రదేశంలో ఈ తోలుబొమ్మలాటల్ని, బుట్టబొమ్మలాటల్ని, కొయ్య కావళ్ళవారి ప్రదర్శనలనూ అతి అరుదుగా చూస్తూ వున్నాం. కాని కొయ్య బొమ్మలాటల్ని మాత్రం ఎక్కడా చూడలేక పోతున్నాం. ఈ తోలుబొమ్మలాట అంటే ఏమిటి?

ఒక జాతరలో పోతురాజు వేషధారి
బొమ్మల తయారీ

కొయ్యబొమ్మలకీ తేలికైన బూరుగ, బాడిసె మొదలైన బరువు తక్కువ గల చెక్కలను లుపయోగిస్తారు. బొమ్మల్ని చెక్కడానికి అనువైన తేలికగా చెక్కడానికి వీలుండే కొయ్యను ఎంచుకుంటారు. ప్రదర్శించబోయే బొమ్మ తలకు రెండు సూత్రాలు, ప్రేక్షకులకు కనిపించని నల్లని దారాలు వుంటాయి. ఆధారాలను సూత్రధారుడు తన తలకు కట్టుకుంటాడు ............. చేతులకు కొక్కీ లుంటాయి. వాటిని చేతిలో పట్టుకుని హృద్యమంగా జనరంజకంగా ప్రదర్శిస్తారు. ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథా ఇతివృత్తాలు భారత రామాయణ గాథలకు సంబంధించినవి. లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం మొదలైనవే కాక, దేశీయ కథలైన దేసింగు రాజు కథ, పల్నాటి వీర చరిత్ర, కరెభంటన కథ, కుమార రాముని కథలను కూడా ప్రదర్శిస్తూవుంటారు.

ఇక ప్రదర్శనానికి కావలసిన పరికరాలను, మిగిలిన హంగులన్నింటినీ కూడా తయారు చేసుకుంటారు. రథాలు, గుఱ్ఱాలు, అంబులు, బాణాలు, గదలు, ఈటెలు, సైన్యం మొదలైన వాటినన్నిటినీ కూడా తయారు చేసుకుని ప్రదర్శనం రోజున వివరంగా విడదీసి ప్రదర్శన గమనాన్ని బట్టి ఈ బొమ్మలన్నిటినీ సక్రమంగా, సిద్ధంగా అమర్చి పెట్టుకుని, ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెరమీదీకి ఎక్కించి క=థను ముందుకు నడుపించుతారు.

రామాయణ భారతాదులను వినటమే కాని పాత్రల స్వరూప, స్వభావాలను, వేషధారణను ప్రజలు చూడని ఆరోజుల్లో కళాత్మకంగా రూపొందించిందే ‘తోలుబొమ్మలాట’. నాడు ఈ తోలుబొమ్మలాట తెలుగు గ్రామాల్లో ప్రఖ్యాతి గాంచి ప్రజాదరణ చూరగొన్నది. బొమ్మలాట కళాకారులు గ్రామవాసులే అయినా వారు భారత రామాయణాల్లోని పాత్రలను పూర్వకవులు వర్ణించిన దానికి ప్రతిరూపంగా ఆ బొమ్మలను మేకతోలుపై నమూనాలు గీసుకొని కత్తిరించుకనే వారు. బొమ్మకు ఏ కీలుకు ఆ కీలు కదలికలు ఉండేలా తయారుచేసి పాత్రకు తగిన రంగులు అద్ది జీవకళ ఉట్టి పడేటట్టు వస్త్రాభరణాలు చిత్రీకరించే వారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన బొమ్మలు వీరి ప్రావీణ్యం, కృషి, తపస్సులలో పరిణతి చెంది ఆయా పాత్రలు మన కళ్ళముందు నిలిచేవి. కళకోసం బ్రతికిన వారి కృషి అనన్య సామాన్యమైనది. వ్యాపార పథంలో సాగిపోయే నేటి సినీ పరిశ్రమను వాటితో పోల్చలేము. కేవలం ఒక తెల్లపరదా, దీపాలు (ఆ తర్వాత పెట్రోమాక్స్‌ లైటులు), ఒక చెక్కబల్ల సహాయంతో శ్లోకం, పద్యపఠనం, అర్థ తాత్పర్యాలతో నవరసా లోలికిస్తూ ఒంటి చేత్తో బమ్మలను ఆడించే ఆ అద్భుత కళాప్రదర్శన మనిషి మనినంతకాలం మరచిపోయే ప్రక్రియ కాదు. ‘జుట్టు పోలిగాడు’, ‘కేతిగాడు’, ‘బంగారక్క’ల హాస్యరస పోషణ ఎంత ఉత్సాహభరితంగా ఉండేదో, ఎంత కడుపుబ్బ నవ్వించేదో మాటల్లో గాని, రాతల్లో గాని వర్ణించనలవి కాదు. ఆయా పాత్రలను బొమ్మల రూపంలో ఆడించే కథా కథన కౌశలం, యుద్ధ ఘట్టాల్లో రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన వానిని నడిపించటం, బాణయుద్ధం, మల్లయుద్ధం, మీసం దువ్వటం లాంటి దృశ్యాలను నేపథ్య సంగీతం, గానాలతో యథార్థంగా మన కళ్ళు ముందు జరిగినట్టు ఆడించే వారి కళావిన్యాసం ఆనాటి వారికే చేతనయింది. ఈ ప్రదర్శనల ద్వారా నాడు పామరులు సైతం భారతాది కథలను, పాత్రల స్వభావాలను, నాటి సంస్కృతి – సంప్రదాయాలను తెలుసుకోగలిగారంటే ప్రజలను తోలుబొమ్మలాట అంతగా ప్రభావితం చేయబట్టే! గ్రామాల్లో నేటికీ ఆ సంప్రదాయపుటానవాళ్ళు అప్పుడప్పుడు మనల్ని జాగృతం చేస్తూనే ఉన్నాయి. చదవ రాని ఆనాటి పల్లె ప్రజలకు భారత రామాయణాది గ్రంథాలు పూరిగా వచ్చు. దీనికి కారణమేమంటే... తోలుబొమ్మలాట వంటి వినోద కార్యక్రమాలే. ఈ కార్యక్రమాలు వినోదముతో బాటు పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని అందించాయి.

ఆటకు తగ్గ పాటలు, పాటకు తగ్గ మోతలు

పాట పాడేవారు, హార్మోనియం వాయించే వారూ, తాళం వేసే వారూ, మద్దెల కొట్టేవారూ, అదనపు మోతల్నిచ్చేవారూ, వంతపాటలు పాడేవారూ అందరూ లోపలే కూర్చుంటారు. పిల్లల పడకలూ, వుయ్యాలలూ అన్నీ నేపథ్యంలోనె అమర్చుకుంటారు.వీరికి హార్మోనియం శ్రుతిగా వుంటుంది. తాళాలుంటాయి. హార్మోనియం, తాళాలు, మద్దెల వాయించే వ్వక్తులు కూడా వెనుక వంత పాట పాడుతూ వుంటారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ క్రింద బల్లచెక్కలుంటాయి. ఆ యా ఘట్టాల ననుసరించి ఈ చెక్కలను త్రొక్కుతూ వుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, పరుగులెత్తేటప్పుడూ, యుద్ధ ఘట్టాలలోనూ ఈ చెక్కలు టకటకా త్రొక్కుతూవుంటే బలే రసవత్తరంగా వుంటుంది. అంతేగాక నగరా మోతలకు ఖాళీ డబ్బాలు వుపయోగిస్తారు. పిడుగులు పడ్డట్టూ, వురుములు వురిమినట్టు డబ్బాలను మోగిస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శననాన్ని జయప్రదంగా రక్తి కట్టిస్తారు. ఆట ఆడినంతసేపూ పరస్పర సహకారం వారిలో కనబడుతుంది. అందువల్లనే వారి ప్రదర్శనాలు అంత బాగా రక్తి కడతాయి.

ఆటగాండ్లు అష్టావధానం

ముఖ్యంగా ఏ వ్వక్తి బొమ్మల్ని ఆడిస్తాడో ఆ వ్వక్తి నోటితొ పాట పాడుతూ పాటకు తగిన విధంగా బొమ్మను ఆడిస్తాడు. సంభాషణలకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాడు. ఇక రెండు బొమ్మల్నీ ఆడించే సమయంలో బొమ్మల మధ్య వచ్చే పోరంటంలో, రెండు బొమ్మల్ని రెండు చేతులతో కొట్టిస్తాడు. అలా కొట్టడంలో సమయానికి క్రింద బల్ల చెక్క టకామని త్రొక్కుతాడు. నిజంగా పాత్రలు కొట్టుకున్నట్టే వుంటుంది. ఈ సమమంలో ఇతర వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధ ఘట్టం వచ్చిందంటే, డోళ్ళు, డబ్బాలూ, ఈలలూ కేకలతో వాన కురిసి వెలిసినట్లు చేస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శనను సమష్టి కృషితో జయప్రదంగా నిర్వహించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు.

ప్రదర్శనం, ప్రేక్షకుల హడావిడి

తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని తెలిస్తే చాలు, గ్రామ చుట్టుప్రక్కలున్న పెద్దలు, పిల్లలూ, స్త్రీలూ అందరూ హెచ్చు తగ్గుల భేదాలు లేకుండా ఒకరికంటే ఒక ముందుకు వచ్చి కూర్చుంటారు. కథా ప్రారంభం నుండి ఆసాంతం వరకూ రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. ప్రతి ఘత్తంలోనూ వారు కదిలి పోతారు. హాస్య ఘట్టాలలో ఎంతగా పగలబడి నవ్వుతారో అలాగే కష్టాలతో కూడుకున్న ఘట్టాల్లో కళ్ళవెంట నీరు కారుస్తారు. ఇక దౌర్జన్యం ఘట్టాలలోనూ, దుర్మార్గపు సన్నివేశాలలోనూ, ఆయా పాత్రలమీద పళ్ళు పటపాటా కొరుకుతారు. ఈ విధంగా పండితుల మొదలు పామరుల వరకు ఆబాల గోపాలం ఆనందంతో మునిగి పోతారు.

జుట్టుపోలిగాడు, బంగారక్క

ఈ బొమ్మలాట ప్రదర్శనాలను ఇంత ఆపేక్షాగా ప్రజలు చూడడానికి కారణం లేక పోలేదు. తెలుగు నాట బొమ్మల ప్రదర్శనాలలో విచిత్రమైన లాస్య పాత్రలను చూపుతారు. ఈ పాత్రలు కథా ప్రారంభం నుండి కథాంతం వరకూ అడుగడుగునా కథాగమనంతో ఒక ఘట్టం అయిన తరువాతి రెండవ ఘట్టం ప్రారభమయ్యే వ్వవధిలో ప్రత్యక్షమౌతూ వుంటాయి. ఆ పాత్రలే జుట్టుపోలిగాడు, బంగారక్క. ఈ రెండు పాత్రలూ హాస్యం ద్వారా, దీర్ఘ కాలం ప్రదర్శించే ప్రదర్శనంలో మధ్య మధ్య వారిని కడుపుబ్బ నవ్వించి నిద్రమత్తు వదలగొడుతూ వుంటాయి. ఈ పాత్రల హాస్యం బహు మోటుగా వుంటుంది. నవ్వుతో కడుపు చెక్కలయ్యే పనులు ఈ బొమ్మలతో చేస్తారు. సమాజంలో వున్న కుళ్ళును, ఈ బొమ్మలను అడ్డంగా పెట్టుకుని కుళ్ళగిస్తూవుంటారు. మధ్య మధ్య విసుర్లూ విసురుతూ వుంటారు.

మరో బపూన్ అల్లాటప్పగాడు

తోలుబొమ్మలాటల్లో హాస్యం ఎంతవర కెళ్ళిందో అల్లటప్పగాడిని గురించి తెలుసుకుంటే బోధపడుతుంది. జుట్టుపోలిగాడు, బంగారక్క కాక వీడు మూడవ వాడు. వీడి పాత్ర ఎటువంటిదంటే 'తాడెక్కే వాడుంటే వాడి తలదన్నే వాడుంటాడనే సామెత ప్రకారం పైరెండు పాత్రలనూ తలదన్నేవాడు. ఈ అల్లాటప్పగాడు. ప్రదర్శనంలో బంగారక్కను గడసరి పెండ్లాంగా సృష్టిస్తారు. ఈమెకు, పోలిగాడికి నిరంతరం కయ్యం నడుస్తూ వుంటుండి. కాసేపు రెండు పాత్రలూ అతి విచిత్రంగా అసభ్య శృంగారాన్ని అభినయిస్తాయి. కొంచెంసేపు పోట్లాట, మరల రాజీ, ఇంతలో పోలిగాడు అంతర్థానం. ఈ సమయంలో అల్లటప్పగాడు బంగారక్క దగ్గర ప్రత్యక్షమౌతాడు. బంగారక్కకు, అల్లాటప్పకు సంబంధాన్ని కుదురుస్థాడు. రెండు పాత్రలూ మంచి శృంగారపు పట్టులో వుండగా మరో పాత్ర ప్రవేశిస్తుంది. అది కేతిగాని పాత్ర.

కేతిగాడు

కేతిగాడి పాత్ర అతి విచిత్రమైంది. అన్నీ బొమ్మలకన్నా కేతిగాడి బొమ్మ చిన్నది. ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు పానకంలో పుల్లలాగ ఒక అడుగు చోటు తెరమీద వుంటే చాలు హఠాత్తుగా ప్రవేశిస్తాడు. శృంగార ఘట్టంలో వున్న అల్లాటప్పగాణ్ణి టకీమని ఒక్క దెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పా. ఇంకేముంది కేతిగాడు బంగారక్కను ఏడిపిస్తాడు. ఇలాంటి ఘట్టాలు ప్రదర్శనంలో వచ్చే వ్వవధిని కమ్మివేస్తూ వుంటాయి. చాలమంది ప్రేక్షకులు కథకంటే హాస్య పాత్రల ప్రవేశం కొరకే ఎదురు చూస్తూ వుంటారు. అందువల్లనే ప్రదర్శనం తెల్లావార్లూ ప్రదర్శించినా విసుగుజెందరు.

వానలు రాకపోతే, వాటమైన కిటుకు

గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయిపోయిన తరువాత ఈ బొమ్మలాటల ప్రదర్శనాలు జరుగుతూ వుంటాయి. బొమ్మలాటల్ని ప్రదర్శించడంలో జానపదులకు కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. వర్షాలు కురవక పోతే భారతంలోని విరాటపర్వం ఘట్టాన్ని హరికథగా గానీ, లేదా శ్రవణం ద్వారా గాని చేస్తే వర్షాలుపడతాయని పల్లె ప్రజల నమ్మకంఇ. ఉత్తర గోగ్రహణం కథ ఆడిస్తే వర్షాలు కురుస్తాయని, వర్షాలు లేని ప్రాంతంలో ఆ ఆటలను ఆడిస్తూ వుంటారు. ఆవిధంగానే పై కథలను తోలుబొమ్మలాట రూపంలో ప్రదర్శిస్తే వర్షాలు కురుస్తాయని పల్లె పరజల నమ్మికి.

అరవై దశకంలో తోలుబొమ్మలాట

అరవై దశకంలోనే ఈతోలుబొమ్మలాట అవసాన దశకుచేరుకున్నట్టు అర్థం మౌతూంది. ఎలాగంటే.... అంతవరకూ.... తోలుబొమ్మలాటలను మాపల్లెలో ఆడించండంటూ పల్లె పెద్దలు తోలు బొమ్మలాట కళాకారులను అభ్యర్థించి స్థాయి నుంచి....... తోలుబొమ్మలాట కళాకారులు తమ ప్రయాణ ప్రస్థానంలో తారసపడిన పల్లె పెద్దలను నాశ్రయించి తాము తోలు బొమ్మలాట ఆడించడానికి అనుమతి కోరిన సందర్భాలలో వారి అనుమతి కొరకు వేసి వుండే సందర్భాలకు దిగజారి చాల కాలమే గడిచిపోయింది. ఆ పరిస్థితి కూడా గతించగా...... తోలుబొమ్మలాటలాడించనిదే తమ జీవన భృతి లేదనే స్థయికి దిగ జారి పోయారు ఆ కళాకారులు. కారణమేదైనా కావచ్చు. అప్పటికే వీధినాటకాలు, డ్రామాలు, సినిమాలు, ఇతర వినోదాన్నందిచే అనేక ప్రక్రియలు మారుమూల నున్న పల్లె ప్రజలకు అతి సమీపంలోకి వచ్చాయి. ఆదరణ పొందాయి. పల్లెప్రజలు కూడా సాంఘికంగా.... నాగరికంగా... విద్యావిషయంలో చాల అభివృద్ధి పొందారు. ఆవిధంగా ఆనాటి తోలుబొమ్మలాటలను.... అందులోని హాస్యం, శృంగారం., ఇతర సంభాషణ చాతుర్యం చాల మొరటుగాను, జుగుస్సాకరంగాను అపహాస్యంగాను అనిపించ సాగాయి, అభివృద్ధి చెందిన పల్లెవాసులకు. అభివృద్ధి చెందిన ఇతర వినోద ప్రక్రియలు వైపు పల్లె ప్రజలు మొగ్గు చూపారు. పైగా తోలు బొమ్మలాట కళాకారులు అభివృద్ధి చెందుతున్న సమాజాని కనుగుణంగా తమ ఆటలను మార్పు చేయక తమ పాత పద్ధతిలోనే ఆటను కొనసాగించారు. అది పల్లె ప్రజలకు నచ్చక ఆ కళాకారులు నిరాధరణకు గురైనారు.

ఆవిధంగా నిరాధరణకు గురైన కళాకారులు.... అంతవరకు తమ తోలు బొమ్మలాటకు సకల సౌకర్యాలు.... అనగా పందిలి... తెరలు. వేదిక,... కళాకారుల భోజన సదుపాయాలు పల్లెవాసులే అమర్చిన స్థాయి నుండి... కళాకారులే తామె స్వంతంగా .... తమకు కావలిసిన సరంజామానంత సమకూర్చుకొని ఎక్కడన్నా పెద్ద వేడుకలు, తిరుణాల్లు, వంటి సందర్భాల ప్రదేశాలలకు వెళ్ళి వారి అనుమతితో అవసరమైతే వారికి కొంత పన్ను కట్టి .... తమ స్యంత గుడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో టికెట్టు పెట్టి తమ కళను ప్రదర్శించేవారు. అలా ప్రదర్శింప బడ్డ ఒక తోలుబొమ్మలాట యాబై సంవత్సరాల క్రితమే చూడడం జరిగింది...... దాని కథా కమామీషు ఎట్టిదనగా...............

అది అన్ని పల్లేల లాగా సాధారణ పల్లెటూరు. కాని.... ఆ పల్లెలో ప్రతి యేడు తప్పనిసరిగా...... ఇరవై రోజుల పాటు మహాభారత నాటకాలు జరుగుతాయి. అదొక ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల పల్లెవాసులకు పెద్ద తిరుణాలు. ఇటు వంటి మహాభారత నాటకోత్సవాలు ఈ నాటికి జరుగుతున్నాయి. అక్కడ అసందర్భాన జరిగే అనేక వినోద కార్యక్రమాలు.... అనగా.... చక్రాలాట, చింతపిక్కలాట, కీలుగుర్రం, రంగుల రాట్నం మొదలగు వాటితో పాటుగా తోలుబొమ్మలాటకూడ ఏర్పాటు చేసారు. దాన్ని స్వయంగా చూడడం జరిగింది.

అదొక చిన్న సైజు గుడారం. అంతా బట్టతో కప్పబడి ఉంది. దానికి ఒక ద్వారం. తోలుబొమ్మలాట చూడదలసిన వారు టికెట్టు తీసుకొని లోనికెళ్ళాలి. సుమారు ఇరవై ముప్పై మంది నిలబడడానికి మాత్రమే స్థలం వుంటుంది. కూర్చోడానికి లేదు. సుమారు ఒక గంట ప్రదర్శన. ఆ గుడారంలో ముందు సగ భాగం ప్రదర్శనకొరకు, ప్రేక్షకులకొరకు కేటాయించగా వెనక సగ భాగం ఆ కళాకారుల సిబ్బంది.... వారి కుటుంబం...... పిల్లా... జెల్లా..... వంట వార్పు.... దానికొరకు సగ భాగం. అప్పట్లో ఆ తోలుబొమ్మలాటకు వచ్చేదెవరంటే కేవలం చిన్న పిల్లలు మాత్రమే...... పెద్దలు మచ్చుకైనా ఒక్కరు కూడా రారు. దానిపైన పెద్దవారికి అంత చిన్నచూపు. ఆనాటికే తోలుబొమ్మలాట అంతరించి పోయిందంటే ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి.

మహాభారత నాటకోత్సవాలు

[మార్చు]
మహా భారత నాటకాలు కేవలం చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ మహా భారత నాటకోట్సవాలు సుమారు ఇరవై రోజులు జరుగు తాయి.. ( భారతంలోని ఘట్టాలు 18 రోజులే జరుగుతాయి. మిగతా రెండు రోజులు భారతానికి సంబంధం లేని వేరే నాటకాలు జరుగుతాయి.) ఈ మహాభారత నాటకోత్సవాలు బహు జనాదరణ పొందింది. ద్రౌపతీ సమేత పంచ పాండవుల ఆలయం వున్న వూర్లల్లోనే ప్రతి సంవత్సరం, లేదా ... రెండు మూడు ఏండ్ల కొక సారి జరుగుతుంది. ఆ సందర్భంలో అక్కడ జరిగే తిరునాళ్లు ప్రజలకు పెద్ద వినోధం. గతంలో ఈ భారత నాటక మహోత్సవాలు జరిగే మైదానంలో అనేక అంగళ్ళూ, రంగుల రాట్నం, చిన్న పిల్లలలి చిన్న ఆటలు, పెద్దలకు చింత పిక్కలాటలు, తోలు బొమ్మలాటలు, ఇలా అనేక విశేషాలతో ఈ జాతర జరుగు తుంది. ఇరవై రోజుల పాటు మహా వైభవంగా జరిగే ఇలాంటి మరెక్కడా జరగదు. పైగా ఈ వుత్సాహం పగలూ...... రాత్రి కూడా వుంటుంది. పగటి పూట మహాభారతంలో ఒక ఘట్టాన్ని హరికథ రూపంలో చెప్పి.... అదే ఘట్టాన్ని రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. పగటి పూట జరిగే హరికథా కాలక్షేపానికి సుధూర ప్రాంతాల నుండి కూడా ఎద్దుల బళ్ళ మీద తరలి వస్తారు జనం. ఈ ఇరవై రోజుల్లో మూడు నాలుగు ప్రధాన ఘట్టాలుంటాయి. ద్రౌపది వస్త్రాపహరణ, బక్కాసుర వధ, అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, కృష్ణ రాయ బారం,చివర ధుర్యోధన వధ. వీటిలో పగలు కూడా జరిగే ఘట్టాలు మూడు. అవి.... 1. బక్కాసుర వధ, 2. అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. 3. ధుర్వోధనుని వధ.

1.బక్కాసుర వధ. భీముని వేష దారి అలంక రించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు పక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలో వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి భారతం మిట్టకు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వెషధారి దారి పొడుగునా బండి లోని ఆహార పదార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ హావ భావాలను ప్రదర్శిస్తూ వుంటాడు. చివరకు ఆ బండి భారతం జరిగే మైదానానికి చేరిన తర్వాత అందులోని ఆహార పదార్థాలను అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బక్కాసుర వధ నాటకం ప్రదర్శిత మౌతుంది.

అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. మొగరాల గ్రామంలో జరిగిన భారతంలో ఒక ఘట్టం (2012 వ సం.)

2.;ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట;

ఇది పగటి పూట జరిగే ఒక ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టన పాతి వుంటారు. దీనికొరకు అశోక వృక్షాన్ని ఎంచు కుంటారు. అది దొరకని పక్షంలో మరేదైనా పొడవుగా వున్న వృక్షాన్ని ఎంచు కుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి, పైన సుమారు రెండడుగుల వెడల్పు, ఐదు అడుగుల పొడవున్న చెక్కను అమర్చి దాని పై అర్థ చంద్రాకారంలో ఎర్రటి వస్త్రాన్ని కట్టతారు. పూలతో ఆ వేదికను బాగా అలంక రించి వుంటారు. అర్జున వేష దారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాంగ ప్రమాణ ముద్రలో 'వరానికి' వడి వుంటారు. వారు చేతును ముందుకు సాచి దోసిళ్లను పట్టుకొని వుంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో వుండే, వీభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురు తుంటాడు. ఆ విసిరనవి క్రింద 'వరానికి' పడివున్న వారి చేతిలో పడితే వారికోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడా వుంటారు. వారు కూడా అర్జునుడు విసిరే ప్రసాదం కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేదిక పై ఆసీనుడై విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ వుత్సవానికి కూడా ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్యక్రమం ఆ రోజు మధ్యాహ్నం తర్వాత సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది.

ధుర్వోధన వధ నాటకానికి సిద్దంగా వున్న భీమ ధుర్వోధన వేషదారులు. ఇది 2012 లో దామల చెరువు గ్రామంలో జరిగిన భారతంలో తీసిన చిత్రం

3. ధుర్యోధనుని వధ. పగటి పూట జరిగే మహాభారత ఘట్టాలలో చివరిది.... అత్యంత ప్రజాదరణ కలిగినది ధుర్యోధన వధ:. దీని కొరకు మైదాన మధ్యలో.... ధుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్లున్న అతి బారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి వుంచు తారు. దానికి తొడ భాగంలో ఎర్రని కుంకుమ కలిపిన కుండను గాని గుమ్మడి కాయను గాని పాతి వుంటారు. ధుర్యోధన పాత్ర దారి గదను చేత బూని ఆ విగ్రహంపై తిరుగుతూ పాట పాడు తుంటాడు. భీమ వేష దారి ఆ విగ్రహం చుట్టు తిరుగుతూ పాటలు పద్యాలు పాడు తుంటాడు. భీముడు..... ధుర్యోధనుని విగ్రహం పైకి ఎక్కరాదు. ధుర్యోధనుడు అప్పు డప్పుడు క్రిందికి దిగు తాడు. అప్పుడు ఇద్దరు కొంత సేపు యుద్ధం చేస్తారు. ఇలా సుమారు రెండు మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించి చివరి ఘట్టా నికొస్తారు. అప్పుడు భీమ వేష దారి ధుర్యోధనుని విగ్రహానికి తొడలో దాచిన గుమ్మడి కాయను పెద్ద కర్రతో పగల కొడతాడు. దుర్యోధన వేషదారి అ విగ్రహంపై పడి పోతాడు. నాటకం సమాప్తం. అంత వరకు ఏకాగ్రతో నాటకాన్ని వీక్షిస్తున్న వందలాది ప్రజలు ఒక్కసారిగా ధుర్యోధనుని విగ్రహం మీద పడి రక్తంతో (కుంకుమతో) తడిసిన ఆ మట్టిని, అందంగా అలంక రించిన తల భాగంలోని రంగు మట్టిని తలా కొంత పీక్కొని వెళ్లి పోతారు. ఆ మట్టిని తమ గాదెలలో వేస్తె తమ గాదె ఎన్నటికి తరగదని వారి నమ్మకం. అలాగే ఆ మట్టిని తమ పొలాల్లో చల్లితే తమ పంటలు సంవృద్ధిగా పండ తాయని ప్రజల నమ్మకం.

శ్రీ కృష్ణ రాయబారము నాటకములో ఒక దృశ్యము. శ్రీ కృష్ణుడు, ధుర్యోధనుడు, అర్జునుడు.
భీమునికి వేషధారణ చేయుచున్న కళాకారుడు
వీధి నాటకాలు ఉత్సాహ వంతులైన కొంతమంది ఊరి వారు వేషాలు కట్టి ఊరి మధ్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి దానికి తెరలు కట్టి నాటకాన్ని తమ హావ భావాలతో రక్తి కట్టిస్తారు. ఈ నాటకాలను నేర్పే ఒక గురువు కూడా వుంటాడు. నాటకం వేయడానికి ముందు ఒక నెల నుండి వేషాలు లేకుండా పాటలు, మాటలు గురువు గారి సమక్షంలో తర్పీదు పొందు తుంటారు. దానిని చూడడానికి కూడా ఆ వూరి జనం వస్తుంటారు. దానిని వద్దిక అంటారు. ప్రధాన నాటకాన్ని చూడ్డానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి జనం చాల మంది వస్తుంటారు. ఎక్కువగా ద్రౌపది వస్త్రాపహరణ నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు.
వీధి నాటకాలలో ప్రత్యేకత
ఈ వీధి నాటకాలకు ఒక ప్రత్యేకత వుండేది. ఉదాహరణకు: ధుర్యోధనుడు రంగ ప్రవేశం చేసే టప్పుడు ...... తెర వెనకనుండి ముందుకు తన సోధరులతో రంగస్థలం మీదికొచ్చి ఆయుధాలతో రంగస్థలం మీద వృత్తాకారంలో తిరుగుతూ .... రాజు వెడలె రవి తేజములలరగ....... కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరయగ..... అంటూ ధుర్యోధన మహారాజు సభకు వచ్చె నని పాట పాడగా వెనక వున్న అతని సోదరులు.... వంత పాడతారు. అదేవిధంగా తెర వెనక నున్న ఇతర నటులు కూడ వెనకనుండి వంత పాడుతారు. అనగా వచ్చిన ఆ వేషధారి తాను ఎవరు? అన్న దానికి సమాదానమిస్తాడు. అలా ప్రేక్షకులు ఆ వచ్చినది ధుర్యోధనుడు అని గుర్తిస్తారు. ఆ విధంగా ప్రతి వేషధారి తాను ఎవరు అనే దానికి సమాదానంగా తానే పాట.... ఆట ద్వార తెలియజేస్తాడు. అలా పరిచయం అయ్యాక పాట రూపంలోనే ఇలా పాటలు.... మాటలు...... అంటాడు. సుఖమా మన రాజ్యమెల్ల సుఖమా..... అనగా... వెనక నుండి కోరస్ గా సుఖమే మన రాజ్యమెల్ల సుఖమే.... అని పాట అందుకుంటారు. ఆ తర్వాత ధుర్యోదనుడు... "ధుర్యోధన...ధుర్యోధన,............ ధుర్యోధన... అంటూ... కలియ దిరుగు తుంటే వెంటనున్న అతని తమ్ములు.... తెర వెనకునున్న వారు.... రాజే... రాజే.... రాజే........... అంటు కోరసగా అంటారు... తర్వాత..... ధుర్వోధనుడు మంత్రీ మన రాజ్యంలో వర్షాలు నెలకు మూడు సార్లు పడుతున్నాయా ?.... పంటలు బాగా పండుతున్నాయా? ధర్మము, న్యాయము చక్కగా అమలు జరుగు తున్నాయా? అని అడుగగా... మతి: అవును మాహారాజా.... మన రాజ్యంలో నెలకు మూడు వర్షాలు పడుతున్నాయి., బంగారు పంటలు పండు తున్నాయి.... ప్రజలు సుఖంగ వున్నారు అని సందర్బాను సారంగా.... కొంత సంభాషణ జరుగుతుంది. ఇదయిన తర్వాత అసలు నాటకంలోని అంశం ప్రారంబమౌతుంది. ఆ విధంగా పల్లెప్రజలు.... ధుర్యోధనుడు దుష్టు కాదని.... చాల చక్కగా ధర్మ పాలన చేశాడని.... అర్థం చేసుకుంటారు. ఇలా ప్రతి పాత్ర తన పరిచయాన్ని చెప్పిన తర్వాతనే అసలు కథలోకి వెళ్ళతాడు. ఆ విధంగా నాటకం సాగుతుంది.
రామభజన చేస్తున్న కళాకారులు
కాళ్ళకు గజ్జెలు కట్టి రామ భజన చేస్తున్న కళాకారులు

భజనలు, కోలాటం కొన్ని వూర్లలో రామ భజను ప్రతి రోజు జరుగు తుంటాయి. సుమారు రెండు మూడు గంటలు జరిగే ఈ భజన కార్యక్రమంలో చాల మందే పాల్గొంటారు. చూసే వాళ్ళు వస్తుంటారు. అప్పుడప్పుడు కోలాటం కూడ ఆడుతారు. కోలాటం లో పాడె పాటలు కూడ భజన పాటలే. కోలాటం ఆడడము ప్రస్తుతమము అంత విస్తారముగా లేదు. రామ భజనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ విధంగా పల్లె వాసులు తాము ఏర్పాటు చేసుకున్న వినోధ కార్యక్రమాలు కాకుండా పండగల రూపంలో నిర్ణీత సమయానికొచ్చే వినోధం వుండనే వున్నది. [1]

కోలాటం

[మార్చు]

ఒక రకమైన సాంప్రదాయక నృత్యము. కోల, ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం అనే పదం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట. సుమారు రెండు జానల పొడవున కర్ర ముక్కలను కోలలు అంటారు. ఈ కర్రలను ప్రత్యేకమైన చెట్టునుండి సేకరిస్తారు. పెడమల చెట్టు కర్రలు వీటికి శ్రేష్టము. అది ఒక చిన్న ముళ్ల చెట్టు. దాని కర్రలు చాల గట్టిగా వుండి మంచి శబ్దాన్నిస్తాయి. ఇలాంటి వే మరికొన్ని కర్రలుంటాయి. అలాంటి చెట్టు కర్రలతోనె ఈ కోలలు తయారు చేసు కుంటారు. ఈఆటలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కోలలను పట్టుకొని పాట పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి కోలలను వేరొకరి కోలలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. దీనిని బట్టి ఈ కోలాటము అతి ప్రాచీనమైనదిగా తెలుస్తున్నది. కోలాటం గ్రామదేవతలైన ఊరడమ్మ, గడి మైశమ్మ, గంగాదేవి, కట్టమైసమ్మ, పోతలింగమ్మ, పోలేరమ్మ,ధనుకొండ గంగమ్మ బాటగంగమ్మ మొదలగు గ్రామ దేవతల/ కులదేవతల జాతర సందర్భంగా ఆడతారు.

కోలాటం ఆడె విధానం కోలాటం ఆడే వారు అందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా ప్రార్థన చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కాళ్ళకు గజ్జెలతో చూడ ముచ్చటగా ఉంటారు. ఆట ఆడు తున్న వారి మధ్యలో నాయకుడు నిలబడి పాట పాడు తుండగా, ఇద్దరు మద్దెలను వాయిస్తుండగా మరొకరు తాళం వేస్తుంటారు. పంతులు పాడె పాటను మిగతా ఆడె వారు అనుకరించి పాడుతు కోలాటం ఆడుతారు. ఇది చాల ఉత్సాహ భరితమైన ఆట. ఈ కోలాటంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఒకటి ఉంది. దాన్ని జడ కోలాటం అంటారు. దాన్ని చాల నేర్పరులు మాత్రమే ఆడగలరు.

జడ కోలాటం కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమసంఖ్యలో సాధారణంగా ఒక చింతచెట్టు క్రింద ఆడతారు. ఆ చింత చెట్టుకు పైనున్న కొమ్మకు ఆటగాళ్లు ఎంత మంది వున్నారో అన్ని రంగుల తాళ్లు కడతారు. అన్ని సరి సంఖ్యలో మాత్రమే వుండాలి. ప్రతి ఒక్కరు ఒక తాడును తమ నడుంకు కట్టుకొని లేదా ఒక చేతితో పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ ఒకరి స్థానం నుంచి మరోకరి స్థానంలోకి ఒకరి తర్వాత మరొకరు వరుస క్రమంలో మారుతూ తిరుగుతూ కోలాటం ఆడుతుండగా ..... ఈ తాళ్ళన్నీ ఒక క్రమ పద్ధతిలో అల్లబడిన జడ లాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా వ్వతిరేక దిశలో ఆడి తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం. ఒక వేళ ఈ ఆటలో ఏదేని అపశృతి జరిగితే అనగా ఎవరైనా లయ తప్పితే క్రమ పద్ధతిలో అల్లిన ఆ జడలో తెలిసి పోతుంది ఎవరు తప్పుచేశారనని. తిరిగి విడ దీసేటప్పుడు కూడా అదే తప్పును చేసి ఆ జడను విడగొట్టాలి. సాధారణ కోలాటాలు ..... మామూలే... చాల నృత్యాల లాగ వుంటాయి. ఈ జడకోపు కోలాటం మాత్రమే అత్యంత క్లిస్టమైనది....... అసధారణమైనది,.

ఆటపాటలు

[మార్చు]

ఆట.. పాటలు... ఇందులో చిన్న పిల్లలు ఆడే ఆటలు, పెద్ద పిల్లలు ఆడే ఆటలు, పెద్ద వారు ఆడే ఆటలు వుంటాయి. బాలబాలికలు సాయం వేళల్లో – ముఖ్యంగా వెన్నెల రోజుల్లో – ఎన్నో సంప్రదాయ బద్ధమైన ఆటలు ఆడుకొనే వారు.

‘చెమ్మ చెక్క చారడేసి మొగ్గ – అట్లు పోయంగ ఆరగించంగ’ అని పాడుతూ ఇద్దరు లేక నలుగురు అమ్మాయిలు అడుగులు వేసి ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఆనందంతో ‘చెమ్మ చెక్క’ ఆట ఆడేవారు. ‘గిన్నెరగోల్‌’ తిరుగుతూ …

‘ఒప్పుల కుప్పా వయారి భామా – గూట్లో ముక్కురాయ్‌ నీ మొగుడు సిపాయ్‌’ అని చమత్కారంగా పాడుకంటూ అమ్మాయిలు ఆడుకొనే వారు.

– ‘చిటిమిటి దంతులు చిన్నారి దంతులు – దాదీ మీరేమంటారు జాజీ మొగ్గళ్ళూ’ అంటూ స్త్రీలు రెండు జట్లుగా ఏర్పడి ఒక జట్టును మరొక జట్టు పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. ఇది ఒక్కొక్క జట్టు ఐకమత్యాన్ని చాటి చెబుతుంది.

‘అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్‌ – ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌’ అని ఆశ్వయుజ మాసంలో అమ్మాయిలంతా ఉయ్యాల లూగుతూ, గాలిలో తేలుతూ వారు – వీరు అనే భేదం లేకుండా పాడుకొనే వారు. ఈ పాట పాడుకొనే కన్నెపిల్లలకు మంచి మొగుడొస్తాడంటారు. పిల్లలందరూ కాళ్ళు చాచుకొని కూర్చుంటే ఒకడు ఒక్కొక్కరి కాలు తాకుతూ …

‘కాళ్ళా గజ్జి కంకాళమ్మ – వేగుచుక్క వెలగా మొగ్గ మొగ్గాకాదుర మోదుగనీరు – కాలుదీసి కడగా పెట్టు!’

అని పాడుతాడు. ఈ ఆటలో కాళ్ళు తాకడంలో భేదభావం లేక అందరూ ఒకటేనని పిల్లలంతా కలిసిపోయే అవకాశముంది. ఈ పాటలో కాళ్ళకు లేచే గజ్జికి మందు సూచితమైందని పెద్దలంటారు.

ఇలాగే ముక్కులు గిల్లే ఆట, వెన్నెల కుప్పలు, కోతికొమ్మచ్చులు, తొక్కుడు బిళ్ళ, గోలీలాట, బొంగరాలాట, పేడబుర్రాట మొదలుగా ఎన్నో ఆటలు, పాటలు నాటి గ్రామాల్లోని సంస్కృతికి, సంప్రదాయానికి నిదర్శనాలు. ఇటువంటి ఆటలు, పాటలు అతి ప్రాచీనకాలం నుంచి గ్రామాల్లో సాగుతూ ఉండేవని చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. కాని నేడు అవి కనుమరుగై పోతున్నాయి.

గతంలో పల్లెల్లోని చిన్న పిల్లలు అనేక విధాల ఆటలు ఆడె వారు. ప్రాంతాల వారిగా కొన్ని ఆటల పేర్లు వేరుగా వుండొచ్చు. అటు వంటి ఆటలు:-- 1. చిన్న పిల్లలు ఆడే ఆటలు: వామన గుంతలు, వెన్నే కుప్పలు, గుచ్చు గుచ్చు పుల్ల, వత్తొత్తి వారొత్తి, గోలీలాట, బొంగరాలాట,ముట్టాట, దొంగ పోలీసు, నేల బండ, తోలుబొమ్మలాట, కుంటాట,

2. పెద్ద పిల్లలు ఆడే ఆటలు:...బిల్లంగోడి, (జిల్లంగోడి,) ఉప్పర పట్టి, చెడుగుడు, ముట్టాట, గెచ్చక్కాయలాట,, కోతి కొమ్మచ్చి, పులి మేక, నాలుగు స్థంబాలాట, ఈత కొట్టడం, ఉట్టి కొట్టడం, తోలు బొమ్మలాట, 3. పెద్దవారు ఆడే ఆటలు:..... పులి మేక, చింత పిక్కలాట, మొదలగునవి ఆడే వారు. వాటి గురించి వివరణ క్లుప్తంగా:----

వత్తొత్తి... వారొత్తి ఆట ఎలా ఆడతారు.

కొంత మంది పిల్లలు గుండ్రంగా కూర్చొని తమె రెండు అరచేతులను వెనకకు పెట్టి వుంటారు. మధ్యలో ఒకరు తన చేతులతో కళ్లు మూసుకొని నిలబడి వుంటాడు. మరొక పిల్లవాడు ఒక చిన్న చేతి గుడ్డను పట్టుకొని కూర్చున్న వారి వెనక తిరుగుతూ ప్రతి ఒక్కరి వద్దా వంగుతూ వారి చేతిలో ఆ చేతి గుడ్డను పెట్టి నట్లు నటిస్తూ వత్తొత్తి... వారొత్తి... చూసినోళ్ల కళ్లల్లో సూరొత్తి.. అని పాట పాట పాడుతు తిరుగుతూ చివరికి ఎవరి చేతిలోనో ఆ చేతి గుడ్డను పెట్టేసి ధనా దన్ ఘల్ బీగాల్. అని తన పాటను ముగిస్తాడు. అప్పుడు మధ్యలో నిలబడిన పిల్లవాడు కళ్లు తెరిచి అందరి వైపు పరిశీలనగా చూసి ఎవరి చేతిలో ఆ గుడ్డ వున్నదో కనిపెట్టాలి. అలా కనిపెట్ట గలిగితే మధ్యలో నిలబడే వంతు ఆ అబ్బాయికి వస్తుంది. అలా కనిపెట్టలేనంత వరకు... ఆ పిల్లవాడు మధ్యలోనె నిలబడాలి. ఇదీ ఈ ఆట ఆడె పద్దతి. అప్పట్లో ఈ ఆటను ఎక్కువగా ఆడపిల్లలే ఆడే వారు.

వామన గుంతలు.

ఇది ఎక్కువగా ఆడపిల్లలు ఆడే ఆట. వరుసగా ఆ రు చిన్న గుంతలు, సమాంతరంగా క్రింద ఆరు గుంతలుంటాయి. నాలుగు చింత పిక్కలు అరచేతిలోకి తీసుకొని వాటిని పైకి ఎగుర వేసి అవి కిందపడే లోపున అరచేతిని తిరగేసి వాటిని పట్టుకోవాలి. ఎన్ని పట్టుకోగలిగితే వాటిని ఆ గుంతలలో పెట్టాలి అలా కొన్ని సార్లు ఆడిన తర్వాత ఏ గుంతలో నాలుగు పిక్కలు చేరుతాయే వాటిని గెలుచు కున్నట్టు. వాటి తీసుకుంటారు. ఇలా పలు మార్లు ఆడి ఎవరు ఎన్ని చింత పిక్కలు గెలుచుకున్నారో చూసి వారు నెగ్గి నట్లు. ఇదే ఆటను వివిధ విధాలుగా ఆడుతారు. దీనికి కావలసిన గుంతలు పల్లెల్లో వుండే రచ్చ బండమీద శాశ్వత పద్ధతి మీద చెక్కి వుంటాయి. మడిచి ఇంట్లో పెట్టుకోడానికి వీలుగా చక్కలతో చేసిన వామన గుంతలు కొన్ని ఇళ్లలో వుండేవి. వాటితో పెద్దా ఆడ వారు కూడా ఆడేవారు. ప్రస్తుతం ఈ ఆట పూర్తిగా కనుమరుగైనది.[2]

'వెన్నేకుప్పలు"

ఇది చిన్న పిల్లల ఆట. ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి ఆడే ఆట. వెన్నెల రాత్రులందు మాత్రమే ఆడే ఆట. ఒక పిల్లవాడు ఒక చోట కళ్లు మూసుకొని ఒకటి నుండి వంద వరకు లెక్క పెడుతుంటాడు. లేదా కొన్ని పాటలుండేవి... ఒక్క పాటను ఇన్ని సార్లు పాడాలనె నియమం వుండేచి. ఇంతలోపల మిగతా పిల్లలు తలో దారిలో వెళ్లి మట్టితో వెన్నెల నీడలో చిన్న చిన్న కుప్పలు పెట్టే వారు. గోడ నీడలందు, బండల పైన, కొంత మరుగ్గా వుండే చోట ఎన్ని వీలైతే అన్ని కుప్పలను పెట్టే వారు. సమయం అయి పోగానె కళ్లు మూసుకున్న పిల్లవాడు... కళ్ళు తెరిచి... మిగతా పిల్లలు పెట్టిన మట్టి/ఇసుక కుప్పలను చెరిపి వేయాలి. అలా చెరప లేక పోయిన కుప్పలను లెక్క పెట్టుకొని... వాటిని తాము గెలిచిన పాయింట్లుగా లెక్కించు కుంటారు. తర్వాత మరొక పిల్ల వాని వంతు. చివరిగా లెక్కించి ఎవరు ఎక్కువగా చెరపలేని కుప్పలుంటాయో వరు ఓడినట్లు. ఈ ఆట ప్రస్తుతం వాడుకలో లేదు.

గోలీలాట

ఈ ఆటను కొంచెం పెద్ద పిల్లలు ఎక్కువగా ఆడే వారు. గోలీలను కుప్పలు కుప్పలుగా పెట్టి అనగా ముందు మూడు గోలీలను పెట్టి దాని మీద మరొక్క గోలీను పెడతారు. ఆ కుప్పను ఉడ్డ అంటారు. అలా ఒక్కొక్కరు ఒక ఉడ్డను పెట్టి ఒక నిర్ణీత దూరం నుండి ఒక్కొక్కరు ఒక్క పెద్ద గోలీతో ఆ కుప్పలను కొట్టాలి. దాంతో ఆ కుప్పలు పడి పోతాయి. తన వాటాగా వున్న ఒక కుప్పను తప్ప పడిపోయిన గోలీలను ఆతడు గెలుచుకున్నట్లు, ఆ తర్వాత మరొకని వంతు. ఇలా చివరన ఎవరెన్ని గోలీలను గెలుచుకున్నారో లెక్కించు కుంటారు. ఆ తర్వాత పెద్ద గోలీలతో ఆట మొదలవుతుంది. ఒక తన పెద్ద గోలీని కొంత దూరంలో వేస్తాడు. మిగిలిన వారు ఒక్కొక్కరుగా గురి చూసి ఆ గోలీను కొట్టాలి. అలా కొట్టగలిగితే ఆగోలీని వాడు గెలుచుకున్నట్టే. ఈ గోలీలాటలో చాల విధానాలున్నాయి.

బొంగరాలాట

ఈ ఆటను పెద్దపిల్లలే ఆడగలరు. దీనిలో కొంత నేర్పరి తనముండాలు. చిన్న పిల్లలు బొంగరాలను వేయలేరు. శంకాకారంలో ఈ కర్ర బొంగరము క్రింది భాగాన చిన్న ములుకు వుంటుండి. ఆ ములుకు దగ్గరనుండి ఒక సన్నన్ని దారం చుట్టి దాన్ని చేతిలో వాటంగా పట్టుకొని ఒక ఉడుపున విసిరి నేల పైకి వేస్తే అది ములుకు ఆధారంగా అతి వేగంగా తిరుగు తుంటుంది. అలా తిరిగుతున్న బొంగరాన్ని మరొకడు తన బొంగరంతోగురి చూసి కొట్టాలి. ఒక్కోసారి... ఆ బొంగరం పగిలి పోతుంది. సంతల్లో రంగు రంగు బొంగరాలు అమ్మే వారు. అవి అందంగా వుండి చాల తేలికిగా వుంటాయి. చాల వేగంగా తిరుగు తాయి. ఇవి పోటీలకు పనికి రావు. పెద్ద పిల్లలు తమ పెద్ద వారితో మంచి కర్రతో స్వంతంగా పెద్ద బొంగరాలను చేయించుకునే వారు. అవి బరువు ఎక్కువగా వుండి బలంగా వుండేవి. ఇలాంటివి పోటీలకు మాత్రమే వాడే వారు. నేర్పరులు బొంగరాలతో చాల విన్యాసాలు కూడా చేసె వారు. బొంగరానికి దారం చుట్టి గాల్లోకి విసిరి వేసి అది కింద పడకుండా గాల్లోనే దాన్ని ఒడుపుగా తన అరచేతిలో పడే టట్లు పట్టుకుంటారు. అలా అచి చేతిలో తిరుగు తుండగానె, అతడు వెనక్కి వంగి తన నుదిటిమీద తిరుగు తుండగానె పెట్టుకుంటాడు. బొంగరాలకు సంబంధించిన ఒక సామెత ఉంది. అది........ వాడు తాడు బొంగరము లేని వాడు. ఎవరైనా పని చేయకుండా గాలికి తిరుగు తుంటే ఈ సామెత వాడతారు.

చింతపిక్కలాట.

ఇది పెద్దవారు మాత్రమే ఆడే వారు. అది కూడా జాతరలపుడు, మహాభారత నాటకాలు జరిగే సందర్భంలోను డబ్బులు పెట్టిఆడే వారు. ఆడె విధానము:\ సుమారు ఒక అడుగు చదరములో సమానమైన వంద గడులు గీసి అందులో నున్న మధ్య గడిలో వరుసలో అనగా ఒకటి, రెండు, మూడు, నాలుగు..... ఇలా సుమారు ఇరవై గడులు వుంటాయి. ఆ సంఖ్య ఆ చదరము యొక్క సంఖ్యను తెలియ జేస్తుంది. మిగతా గడులలో అంకెలను ఆ ఇరవై చదరాలలో ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను వ్రాసి వుంచు తారు. అనగా ఏ చదరములో వున్న అంకెలు యదా తదంగా మరొక చదరంలో వుండవు. ఈ ఇరవై చదరాలను ఇరవై మంది ముందు పెట్టుకొని వృత్తాకారంలో కూర్చుంటారు. మధ్యలో ఆట నిర్వహకులుంటారు. ఒక డబ్బాలో ఒకటి నుండి వంద వరకు అంకెలు వ్రాసి వున్న చిన్న బిళ్లలుంటాయి. వాటిని కలిపి ఒక్కోసారికి ఒక్క నెంబరు తీసి దాన్ని గట్టిగా అరిచి చెప్త్రారు. ఆట ఆడెవారు తమ చదరంలో వున్న ఆ అంకెకు సంబంధించిన చిన్న గడిలో ఒక చింత పిక్కను పెట్టాలి. ఇలా ఆట కొనసాగుతుండగా..... ఎవరి చదరంలో నైనా చింత పిక్కలు అడ్డంగా గాని, నిలువుగా గాని, లేదా మూలలకు గాని వున్న చిన్న గడులలో చింత పిక్కలు అమరితే..... ఆ వ్వక్తి గెలిచానని చెప్పి తన చదరం నెంబరు కూడా చెప్తాడు. నిర్వహకులు కూడా తమ ముందు ఒక చదరంలో వారు చెప్తున్న అంకెల ప్రకారము చింత పిక్కలను పెడ్తారు. గెలిచిన వ్వక్తి తాను పూర్తి చేసిన గడులలోని అంకెలను బిగ్గరగా అరిచి చెప్తాడు. నిర్వహకులు తమ ముందున్న చదరంలో సరిచూసుకొని గెలుపును నిర్థారిస్తారు. ఈ విధానంలో ఒకరికన్న ఎక్కువ మంది ఆటను గెలుస్తారు. ఆట ప్రారంబానికి ముందు ఆడే ప్రతి ఒక్కరి వద్ద ఒక నిర్ణీతమైన సొమ్మును వసూలు చేస్తారు. అందులో కొంత భాగాన్ని నిర్వహకులు వుంచుకొని మిగతా దాన్ని గెలిచిన వారికి ఇస్తారు. ఒక్కరికన్నా ఎక్కువ మంది గెలిస్తే వారి ఆ సొమ్మును సమానంగా పంచు తారు. ఇందులో మోసం ఏమి వుండదు. ఇది చింత పిక్కలాట. కొన్ని రోజుల పాటు జాతరలు, తిరుణాల్లు మొదలగు వినోద కార్యక్రమాలు జరిగే సందర్భంలో మాత్రమే ఆడే వారు. ఇప్పుడు ఈ ఆయ పూర్తిగా కనుమరుగైనది.

ఈత కొట్టడం

గతంలో పల్లెల్లోని పిల్లలందరు ..... ఆడ మగ తేడాలేకుండా అందరు ఈత నేర్చుకునే వారు. నదులు, కాలవలు వుండే ప్రాంతాలలో, బావులు వంటివి వున్న ప్రాంతాలలో పిల్లలు ఈతను తప్పక నేర్చుకునే వారు. బావులలో ఈత కొట్టే విధానము, నేర్చుకునే విధానము;;;;;; ఎండా కాలంలో మాత్రమే ఈ కార్యక్రమము వుండేది. పిల్లలకు మొదటగా ఈత నేర్చుకునే టప్పుడు వారి నడుముకు బెండు లాంటి కర్ర ముక్కలను కట్టి బావులలో వదిలే వారు. ఈ కర్రలు ఎక్కువ కలబంద చెట్టు కర్రలై వుంటాయి. అవి మూరెడు పొడగున్నవి రెండు చాలు ఒక పిల్లవాణ్ని నీటిపై తేల్చడానికి. వాటిని తుండ్లు అంటారు. ఇలా ఈ తుండ్లతో కొంత కాలం ఈత నేర్పి.... రెండోదశలో ఆ తుండ్లను తీసేసి ఒక పొడవైన దారాన్ని పిల్ల వాని నడుముకు కట్టి బావిలో వేస్తారు. వాడు మునిగి పోతుంటే గట్టు మీద ఆధారాన్ని పట్టుకున్న పెద్ద వారు దారాన్ని పైకి లాగి వాడు ఈత కొట్టడానికి అనువుగా దారాన్ని వదులు చేస్తారు. ఇప్పుడు ఈ త నేర్చిన పెద్ద పిల్లలు పక్కన చేరు నేర్చుకునే పిల్లవానికి సహాయ పడుతుంటారు. ఈ విదంగా పిల్లలకు ఈత నేర్పుతారు.

పైన కనబరచిన వినోధ కార్యక్రమాలే గాక కొన్ని ప్రత్యేక సందర్భాలలో... అనగా తిరుణాలు, జాతరలు జరిగే చోట తోలుబొమ్మలాటలు, కీలుగుర్రం, రంగుల రాట్నం మొదలైన వినోద కార్యక్రమాలుండేవి. ఇలాంటివాటిని చూడడాకే కొంత మంది ప్రజలు జాతరలకు వచ్చేవారు. తోలు బొమ్మలాటలు, కీరుగుర్ర వంటివి ఈనాడు పూర్తిగా కనుమరుగైనాయి. రంగుల రాట్నం మాత్రం గతంకన్న మరికొన్ని సొబగులద్దుకొని ఈ నాటికి వినోదాన్నిస్తున్నది.

పల్లెల్లో పండగలు

[మార్చు]
భోగి పండుగ

వ్వయసాయ దారులైన పల్లె వాసులు తమ వ్యవసాయ పనులన్ని ఒక్క కొలిక్కి వచ్చి పంటలన్నీ ఇంటికొచ్చి న సమయాన వచ్చేదే సంక్రాంతి పండగ. మిగతా పండగలు ఎలా వున్నా రైతుకు ప్రాముఖ్యానిచ్చేదె సంక్రాంతి. ఇవి వరుస పండగలు. ఈ వరుసలో ముందుగా వచ్చేది బోగి పండగ. ఈరోజున తెల్లవారు జామునే ఇంటి ముందు బోగి మంటలు వేస్తారు. ఇంట్లో వున్న పాత సామానులు పనికి రానివన్ని అనగా చాటలు, గంపలు, తట్టలు, చీపుర్లు, అన్నీ ఎవరింటి ముందు వాళ్ళు బోగి మంట పెట్టి కాలుస్తారు. అవన్ని తొందరలో కాలిపోతాయి. ఆ తర్వాత కంపలు, చెత్త, కట్టెలు వేసి మండించి చలి కాచు కుంటారు. మంట వేడికి శరీరం ముందు భాగం బాగా వేడిగా వుంటే వాతావరణం లోని చలికి వీపు బాగా చాల చల్లగావుంటుంది. ఇదొక వింత అనుభూతి. తెల్లవారి కోడిని కోసి లేదా వేరె వూర్ల నుండి వేట కూర తెచ్చి వండి అందులోకి వడలు చేసి తింటారు. కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలకు బోగి పండ్లు పోస్తారు. తరువాత వచ్చేది సంక్రాంతి,

సంక్రాంతి ముగ్గు
సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దుల వారు పల్లెల్లో తిరుగుతుంటారు. గంగిరెద్దు
సంక్రాంతి

అదె పెద్ద పండగ. ఈ రోజున పెద్దలు తమ తల్లి దండ్రులు చనిపోయిన వారు వారి ఆత్మ శాంతి కొరకు ఉపవాసముండి స్నానం చేసి అయ్యవారి రాక కొరకు ఎదురు చూస్తుంటారు. అయ్యవారు అంటే ఆ ప్రాంత బ్రాంహడు. కొన్ని పల్లెలకు కలిపి ఒక బ్రాంహడు వుంటాడు. అన్ని శుభాసుభ కార్యాలకు అతను రావలసిందే. వేరెవ్వరు రావడానికి వీలు లేదు. ఇది అతని ఇలాకా. ఆ అయ్యవారు వచ్చి నంత వరకు ఆ గృహస్తుడు ఉప వాసముంటాడు. ఆతను వచ్చాక పూజా కార్యుక్రమాలు ప్రారంబించి గృహస్థుని చేత అతని పెద్దలకు తర్పణ, ఇస్తాడు, కాకులకు పిండ ప్రధానం చేయిస్తాడు. ఇలా పెద్దలకు తర్పణ ఇస్తున్నందుకె దీన్ని పెద్ద పండగ అన్నారు. పూజానంతరం, గృహస్తుడిచ్చిన దక్షిణ;; అనగా బియ్యం, కూరగాయలు, పప్పులు మొదలగునవి తీసుకొని మరొక్కరింటి కెళతాడు. ఈరోజున మాంసం వండరు. ఈ రోజున అనేక పిండి వంటలు చేస్తారు. ఈరోజు తప్పక వుండవలసిన పిండి వంట అరిసెలు పిల్లకు పిండిపంటలె పండగ. ఈరోజు నుండే గొబ్బెమ్మ పాటలు పాడతారు ఆడ పిల్లలు. ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గులేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను తీరుస్తారు. గొబ్బెమ్మ అంటే ఆవు పేడను ముద్దగా చేసి ముగ్గు మధ్యలో పెట్టి మధ్యలో గుమ్మడి పూలు పెడ్తారు. ఆ ఊరి ఆడపిల్లలందరూ కలిసి ఒక జట్టుగా చేరి అలంకరించుకొని, ఒక పళ్లెంలో పశుపు ముద్దను వుంచి దానిపై దీపం పెట్టి, చుట్టు పూలను అలంకరించి ప్రతి ఇంటికి వచ్చి ఆ పళ్లేన్ని క్రింద పెట్టి దాని చుట్టు తిరుగుతు తమ రెండు చేతులు తట్టుతూ గొబ్బెమ్మ పాటలు పాడతారు. ఆ ఇంటి వారు దీపంలో నూనె పోసి వారికి బియ్యం కొంత డబ్బులు ఇవ్వాలి. చివరి రోజున ఆ పిల్లలందరు వచ్చిన బియ్యాన్ని పొంగలిపెట్టి తిని ఆనందిస్తారు. ఇది ఆ వూరి ఆడపిల్లల సంబరం. ఈ తతంగం అంతా ఏ వూరి ఆడపిల్లలు ఆవూర్లోనే. పక్క ఊరికెళ్లరు. కానీ.... ఇంత కాలము వ్యవసాయదారుల పొలాల్లో కూలీ చేసిన ఆడవాళ్ళు, ముఖ్యంగా హరిజనులు ఈ రోజున ప్రతి రైతు ఇంటి ముందు గొబ్బెమ్మ పాటలు పాడి ఆడతారు. వారికి రైతు కుటుంబం ధాన్యం, డబ్బులు శక్తాను సారం బారీగానె ఇస్తారు. ఇచ్చినది తక్కువనిపిస్తే వారు వెళ్లరు. బలవంతం చేస్తారు... సాధించు కుంటారు. అదే విధంగా పరా ఊరు నుండి కొంత మంది హరిజన మహిళలు వచ్చి గొబ్బెమ్మ పాటలు పాడతారు కాని ఇచ్చింది తీసుకుని వెళతారు. ఇలాంటి వారు యాచకులు కాదు. కేవలం సంక్రాంతి సందర్భంగానె గొబ్బెమ్మ పాటలు పాడి ఆసిస్తారు. అలాగే గంగి రెద్దుల వాళ్లకు కూడా ఇది పెద్ద పండగే. వారు గంగి రెద్దును ఆడించి రైతుల మెప్పించి బహుమతులను పొందుతారు. గంగిరెద్దుల వారు ప్రదార్శించె విన్యాసాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గది ..... గంగిరెద్దుల వాడు రోడ్డుమీద వెల్లకిలా పడుకొని తన ఎద మీద గంగిరెద్దు ముందరి కాళ్లను పెట్టించుకొని ఆడించడము. రైతులు గంగిరెద్దుల వారికి ధాన్యాన్ని, వేసి పాత బట్టలను, చీరలను ఆ గంగిరెద్దు మీద వేస్తారు. ఆ విధంగా గంగిరెద్దు పైన అనేక మైన రంగులతో బట్టలు కనిపిస్తాయి. ఎవరైనా ఆడపిల్లలు ఎక్కువ బట్టలు వేసుకొని ఆడంబరంగా కనిపిస్తే..... గంగిరెద్దులా తయారయావేంది? అని అంటుంటారు. ఇది ఒక నానుడి.

కనుమ పండగ

మూడో రోజున వచ్చేది కనుమ పడుగ. కనుమ పడగ నాడు కూడా పిండి వంటలదే అగ్ర స్థానం. పార్వేట ఈ నాటి ప్రధాన ఘట్టం. వైష్ణవాలయం ప్రధానంగా వున్న ఒక పల్లె లోనుండి దేవుడిని పల్లికిలో మంగళ వాయద్యాలతో ఆ చుట్టు పల్లెలలో వూరేగించి చివరన దగ్గరలో వున్న కొండ ప్రాంతంలో గాని మైదాన ప్రాంతంలో గాని దేవుడిని దించి అక్కడ శమీ వృక్షం క్రింద పూజ నిర్వహించి, అప్పటికె పూజించి సిద్దం చేసు కున్న ఒక గొర్రె పొట్టేలును దూరంగా ఆ కొండ వాలులో కట్టేసి సుమారు ఒక కిలో మీటరు దూరంలో ఒక హద్దు ఏర్పరచి అక్కడ అందరు నిలిచి తమ తుపాకులతో దూరంగా వున్న గొర్రె పోతును కాల్చాలి. ఎవరు కాసిస్తే అది వారికే చెందు తుంది. ఎవరూ కాల్చ లేక పోతె అది ఇంతవరకు దేవుని వూరేగింపులో పాల్గొన్న మంగలి వారికి చెందు తుంది. మంగలి వారు ఆ జమ్మి చెట్టు కింద కూర్చొని ఆ పొట్టేలుకు ఎలాంటి దెబ్బ తగల కుండుటకు ఏవో కనికట్టు విద్యలు, మంత్రాలు వేస్తుంటారు. తుపాకులు లేనివారు తూటాలు తెచ్చుకొని ఇతరుల తుపాకులతో ప్రయత్నిస్తారు. చుట్టు ప్రక్కల పల్లె వాసులకు ఇదొక పెద్ద వినోద కార్యక్రమం. ఈ ఆచారానికి మాతృక:..... తిరుమల లోని శ్రీ వేంకటేస్వర స్వామి వారికి కనుమ రోజున వేటగాని వేషం వేసి విల్లంబులు ధరింప జేసి గోగర్బం డాంకు ఎదురుగా వున్న పార్వేట మిట్టకు ఊరేగింపుగా తీసుక వస్తారు. అక్కడ స్వామి వారు క్రూర మృగాలను వేటాడి నట్టు కొన్ని కార్యక్రమాలు చేసి తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుతారు. ఆరోజుల్లో తిరుమల వాసుడు విల్లంబులతో క్రూర మృగాలను వేటాడితే....... ఈ నాడు మానవుడు తుపాకులతో బంధించి వుంచిన గొర్రె పోతును వేటాడ తారు. అదీ ఆ దేవుని పేరు మీద

అడవిలో నుండి ఇంటికొస్తున్నా ఆవులు
పశువుల పండుగ

పశువుల పండగే ఈ వరుసలో చివరిది. ఈ రోజున పిండి వంటలదే పండుగ. సాయంకాలం ఊరి బయట కాటమ రాజు వద్ద పొంగిళ్లు పెట్టి పూజ చేస్తారు. కాటమ రాజు అంటే అక్కడేమి గుడి వుండదు. ఒక చెట్టు క్రింది తాత్కాలికంగా రెండు రాళ్లను పెట్టి వాటిని కడిగి వీబూతి పట్టెలు పెట్టి ఆ ప్రాంతమంతా శుభ్రం చేస్తారు. అక్కడి పూజారి ఆ వూరి చాకిలే. ఆ దేవుని ముందు వూరి ఆడవారందరు గిన్నెల్లో బియ్యం, బెల్లం తెచ్చి అక్కడే పొయ్యిలు ఏర్పాటు చేసి పొంగలి వండుతారు.. ఇంత లోపల చాకలి దేవుని వద్ద అలంకరణ పూర్తి చేస్తాడు. అందరు తలోక పొంగలి ముద్దను తీసి దేవుని ముందు కుప్పగా పెడ్తారు. చాకలి పూజా కార్యక్రమం కానిస్తాడు. అప్పటికే వూర్లో వున్న ఆవులను ఎద్దులను అన్నింటిని ఇక్కడికి తోలుకొస్తారు. కోళ్లను మొక్కుకున్న వాళ్ళు చాకలికి తమ కోళ్లను ఇస్తారు. అతను వాటిని కోసి దేవుని ముందు వేస్తాడు. పూజానంతరం పొంగలిని తలా కొంత ప్రసాదంగా తీసుకొని ఒక పెద్ద పొంగలి ముద్దను పశువుల కాపరికి ఇచ్చి తినమని, అతని వీపుకు ఇంకొక ముద్దను కొడతాడు చాకలి. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పొంగలిని తింటూ పశువులకున్న పగ్గాలను, దారాలను తీసేసి తరుముతాడు. అవి తలోదిక్కుకు వెళ్లి పోతాయి. అప్పటికి చేలన్నీ పరిగిలి పోయి వుంటాయి కనుక అవి ఎక్కడ ఏ చేల్లో దూరినా అడగడానికి లేదు. ఆరాత్రికి పాలు తాగె దూడలను కూడా కట్టడి చేయరు. అనగా పశువులకు స్వాతంత్ర్యం అన్నమాట. అదే పశువుల పండుగ. ఆ సందర్భంలోనె ఒక నెల నుండి కాటమరాజు ముందు ఆధారిన వచ్చి పోయె, పశువుల కాపరులు, రైతులు అక్కడ ఒక కంపో, కర్రో వేస్తుంటారు. ఈ నాటికి అది ఒక పెద్ద కుప్ప అయి వుంటుంది. పశువుల కాపరి ఆ కుప్పకు నిప్పు పెట్టి పశువులను బెదిరించి తరిమెస్తాడు. ఆ కంపల కుప్పను చిట్లా కుప్ప అంటారు. ఆ మంట ఆరిపోయిన తర్వాత అందరు అక్కడి నుండి నిష్క్రమిస్తారు. ఇంటి కెళ్లి...దేవుని వద్ద కోసిన కోళ్లలు బాగు చేసుకుని కూర వండుకుని తింటారు.

ఈ పండుగకు జరిగే జల్లికట్టు చిత్తూరు జిల్లా, తమిళనాడులో బారి ఎత్తున జరుగు తుంటాయి. వీధుల్లో డప్పులను వాయించి అలంక రించిన పశువులను తరుము తారు. అలా రెండు మూడు సార్లు పశువులను తరిమాక ఆ తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు రంగులతో అలంక రించిన బలమైన ఎద్దులలు, కోడెలను.... తరుముతారు. ముందుగా వాటి కొమ్ములకు రంగులు పూసి ఒక తువ్వాలు కట్టి అందులో వంద రూపాయలు .... వారి స్థాయిని బట్టి ఐదు వందల రూపాయలను కట్టి అల్లి వద్ద నిలిపి డప్పులతొ వాటిని బెదిరించి తరుముతారు. ధైర్యం వున్న వారు వాటిని పట్టి లొంగ దీసుకొని దాని కొమ్ములకు కట్టిన బట్టలోని డబ్బులు తీసుకోవచ్చు. దాని కొరకు కొంత మంది బలవంతులు తయారుగా వుంటారు. కొన్ని ఎద్దులు, లేదా కోడెలు తమ యజమానిని తప్ప ఇతరుల నెవ్వరిని దరి చేరనియ్యవు. అలాంటి వాటిమీద చెయ్యి వేయడమే ప్రమాదం. అటు వంటి వాటిని బెదరగొట్టిన తర్వాత వాటిని లొంగ దీసు కోవడం చాల ప్రమాధ కరమైన పని. అయినా కొందరు ఈ సాహసానికి పూను కుంటారు. ఇంకొన్ని ఎద్దులుంటాయి. అవి వట్టి బెదురు గొడ్డులు. వాటిని బెదిరిస్తే అవి చేసె వీరంగం అంతా ఇంతాకాదు. వాటిని ఆపడం అతి కష్టం. వీటి వలన ప్రమాదం ఎక్కువ. ఎందు కంటే ఇవి బెదిరి పోయి ఇరుపక్కల క్రీడను చూస్తున్న జనంలోకి దూరి పోతాయి. ఈ క్రీడలో చాల మందికి గాయాలవు తుంటాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరుగు తుంటుంది. ఇలాంటి క్రీడను ప్రభుత్యాలు నిషేధించినా ఫలితం లేదు. ఇటు వంటి క్రీడ పలాన పల్లెలో జరుగు తుందని ముందుగాని ఆ చుట్టు ప్రక్కల పల్లెల్లో దండోర వేసి తెలియ జేసి వుంటారు. దాంతో ఆ చుట్టు ప్రక్కల రైతులు తమ ఎద్దులను కోడెలను అలంకరించు కొని అక్కడికి తీసు కెళతారు.

గంగ పండగ: రైతులు చేసుకునె పండగలలో వాటి ప్రధాన్యత రీత్యా గంగ పండగ రెండొ స్థానంలోకి వస్తుంది. ఇది మేనెలలో వస్తుంది. అప్పటికి వ్వవ సాయ పనులు అన్నీ పనులు పూర్తి అయి వుంటాయి. రైతులకు వ్వవ సాయ కూలీలకు ఇది ముఖ్యమైన పండుగ. ఈ పండగకు మాతృక తిరుపతిలో బారు ఎత్తున జరిగే గంగ జాతర. అందు చేత ఈ పండుగ చిత్తూరు జిల్లాలోనె ప్రాముఖ్యత. ఇతర జిల్లాలలో ఈ పండగ వున్నట్లు లేదు. ఇది ముఖ్యంగా వ్వవ సాయ కూలీల పండగ. ఇంకా చెప్పాలంటే హరిజనుల పండుగ. వారి ఈ పండగ రోజున ముఖ్యంగా పులి వేషం..... ఇంకా ఇతర వేషాలు వేసి ఆడి పాడి రైతులను మెప్పించి వారి నుండి రైతు స్తోమతను బట్టి బహుమతులను అనగా ధాన్యం, బెల్లం, వస్త్రాలు బహుమతిగా పొందు తారు. పులి వేషాలను ఎవరు బడితే వారు వేయలేరు. ఆ వేషం వేయడానికి మంచి దేహదారుడ్యం వుండాలి. మంచి ఆరోగ్య వంతుడై వుండాలి. ఎందుకంటే అతను వేసే గంతులకు చేసే విన్యాసాలకు అతని శరీరము సహకరించాలి. పులి వేష ధారి మొలకు ఒక లంగోటి మాత్రం కట్టుకొని శరీరమంతా పశుపు రంగు చారలు తీర్చి, తలకి పులి కన్నులవలె దిద్దిన, మద్యలో రంద్రాలున్న, పులిచెవులు లాంటి చెవులున్న టోపి ధరించి, (దీనిని ఈ వేషం కొరకే తయారు చేసుకుంటారు.) నోట్లో పెద్ద నాలుకలాగ ఒక ఎర్రటి అట్టముక్కను పెట్టుకొని తయారవతాడు. అతని నడుముకు దారాలు కట్టి ఇద్దరు వ్వక్తులు పగ్గాలతో అతనిని పట్టుకొని నియంత్రిస్తూ వుంటారు. ఒక పొడవాటి వెదురు బద్దకు రంగు కాగితాలు కట్టి ఒక కొసన ఒక పెద్ద బుట్టను కట్టి దానిని కూడా రంగు కాగితాలను అతికించి వుటారు. ఒక వ్వక్తి దానిని రెండో చివరన పట్టుకొని పులి వేష ధారి వెనక నిలబడి రెండో చివరన నున్న బుట్ట భాగాన్ని పులి వేషదారుని ముందు వచ్చేటట్టు పట్టుకొని వూపుతూ వుంటాడు. ఇద్దరు ముగ్గురు డప్పులు కొడుతుండగా ఆ డప్పులకు అనుగుణంగా పులి వేష ధారి అడుగులు వేస్తూ, పైన వూగు తున్న రంగు కాగితాల బుట్టను చూస్తూ పులి లాగా ఆడుతుంటాడు. ఒక రిద్దరు ఉత్సాహ వంతులు అతనికి తోడుగా ఆడు తుంటారు. ఈ విధంగా ఆడుతూ వారికి సంబంధించిన పల్లెల్లో మాత్రమే అనగా వారు పనిచేసే రైతులున్న పల్లెల్లో మాత్రమే తిరుగుతారు. ప్రతి రైతు వారి స్థాయిని బట్టి ధాన్యము, ధనము, పాత బట్టలు ఇస్తారు. వారికిచ్చిన ప్రతిఫలము వారికి తక్కువగా అనిపిస్తే సాధించి తీరుతారు. రైతుల వంటి పైనున్న పై వస్త్రాన్ని లాక్కుంటారు. చివరగా ఆ యింటి నుండి వెళ్ళే టప్పుడు ఆ రైతు పేరున వారి కుటుంబం వారి పేరు పది నిముషాల సేపు ఆసువుగా పాట పాడగా దానికి తగిన డప్పు వాయిద్యాలు, ధరువులు వేసి పొగిడి తర్వాత మరొక ఇంటికి వెళతారు. పెద్ద రైతులు వారికి కొన్ని బట్టలు, డబ్బులు, ఒక బస్తా వడ్లను కూడా ఇస్తారు. సామాన్య రైతు సాధారణంగా ఒక గంప వడ్లును ఇస్తారు. ఈ పులివేష ధారణ ఆబాల గోపాలన్ని చాల అలరిస్తుంది.

సంవత్సరంపాటు రైతుల వద్ద పొలంలో పని సేసిన కూలీలు, ఇతర కుల వృత్తుల వారు ఈ పండగ నాడు రైతుల వద్ద నుండి ధాన్యం రూపంలో బాగానె నజరాన పొందుతారు. కూలీలైతే చిత్ర విచిత్ర వేషాలు ధరించి ఊర్ల లోని రైతులను మెప్పించి ఫలితం పొందుతారు. ముఖ్యంగా పులి వేషం వేషధారి ఆబాల గొబాలాలను మెప్పిస్తారు. చిన్న పిల్లలకు ఇది పెద్ద పండగ. పులి వేష గాని వెంబడి డప్పు, పిల్లనగొయ్యి, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉండగా ఇతరులు ఆడుతుండగా పులి వేషధారి గంతులు వేస్తూ పల్టీలు కొడుతూ నానా హంగామా చేస్తాడు. ఇది అందరికీ పండగే.

ప్రధానమైన పల్లెల్లో ఈ రోజున దున్న పోతును బలి ఇస్తారు. వీధి మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన గుడిలోని అమ్మోరును పూజించి గుడి ముందు ఆడి పాడి తెల్ల వారజామున బలి కార్యక్రమం కానిస్తారు. ఆ భయాన దృస్యాన్ని చిన్న పిల్లలు చూడ కూడదని ఆ సమయాన్ని నిర్ణ యిస్తారు. ఈ విచిత్ర వేష దారులు అనేక బూతు పాటలు పాడుతూ ఆడుతూ వీధుల్లో తిరుగుతారు. ఈ పండుగ రైతులకు వ్వవ సాయకూలీలలకు ప్రత్యేకం. ప్రస్తుతం దున్న పోతు బలులు తిరుపతిలో గంగ జాతరలో గాని ఇతర పల్లెల్లో గాని జరగడం లేదు. కానీ...... సాధారణ పల్లెల్లో జరిగే కార్యక్రమం ఏమంటే .... హరిజనుల (ఇంత కాలం రైతుల పొలాల్లో పనిచేసిన కూలీలు) వివిధ వేష దారణతో ఆడి పాడి రైతులను మెప్పించి కొంత ధాన్యాన్ని బట్టలను ఉదారంగ పొందు తారు. వీరు ఇంత కాలం ఏరైతుల వద్ద పనిచేశారో వారి పల్లెలకే వెళతారు. వేరొకరి ఇళ్లకు వెళ్ళరు. పొద్దంతా వీరి ఆట పాటలతో మురిసి పోయిన పల్లె వాసులు సాయంత్రం కాగానె గంగమ్మకు పొంగిలి పెడ్తారు. దీని కొరకు ఒక వేప చెట్టు వుంటుంది. అక్కడ చాకలి ఒక రాయిని గంగమ్మ తల్లిగా ఏర్పాటు చేసి చుట్టు వేపాకు మండలతో చిన్న పందిరిని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఆ పల్లె వాసులందరు పొంగిలి పెట్టి గంగమ్మ తల్లికి మొక్కు కుంటారు. సర్వ సాధారణంగా ప్రతి ఒక్కరు కోడిని బలి ఇస్తారు. ఈ పూజా కార్యక్రమాన్ని చాకలి విర్వహిస్తాడు. ప్రతి పలంగా అతనికి బలి ఇచ్చిన కోడి తల, అక్కడ కొట్టిన కొబ్బరి కాయ పై చిప్ప చాకలికి చెందు తారు. ఆ విధంగా ఆరోజు గంగ పండుగ పరి సమాప్తం అవుతుంది.

జాతరలో సామూహిక పొంగిళ్లు పెట్టడము. దామరచెరువు గ్రామంవద్ద, ధనుకొండ గంగమ్మ జాతర సందర్భంగా సామూహిక పొంగిళ్లలో ఒక భాగము

పొంగలి: సాధారణంగా పొంగలి అంటే తమిళ నాడు ప్రాంతంలో.... ఇడ్లి, దోసె, వడ, పంటి పదార్తాలతో బాటు ఇదొక అల్పాహారం. కాని ఈ ప్రాంతంలో పొంగలి అంటే దేవుని ముందు అప్పటి కప్పుడు పల్లె వాసులు అందరు కొత్త పొయ్యిలు ఏర్పాటు చేసి, కొత్త కుండలో, కొత్త బియ్యం వేసి అందులో కొత్త బెల్లం ఇతర సుగంద ద్రవ్యాలు వేసి అప్పటి కప్పుడు తయారు చేసె ప్రసాదమే పొంగలి. ఎక్కువగా గంగమ్మ జాతరల వద్ది పొంగిల్లు సామూహికంగా పెడతారు. దాన్నే ప్రసాధంగా గంగమ్మకు పెట్టి తర్వాత ఆ ప్రసాదం స్వీకరిస్తారు.

దీపావళి,నరకచతుర్దశి ఇది పిల్లల పండుగ. ఈ రోజున అనేక పిండి వంటలు చేసి తిని, టపాకాయలు కాల్చడమే పిల్లలకు పండగ. ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని రకాల టపాకాయలు లేవు. అప్పట్లో కాల్చిన కొన్ని రకాలు ఇప్పుడు లేవు. ఆరోజుల్లో చిన్న శబ్దం చేసేవి మాత్రమే వుండేవి. అవి గాక చిటపటలు, తాటాకు టపాకాయలు, కాకర పువ్వొత్తులు, బత్తాసు పుల్లలు, సురు సురు బుడ్లు, ఇలాంటివాటిని మితంగా కొనేవారు. అవి ఆరోజుల్లో పెట్లొప్పు అనే ఒక గందకం పొడి దొరికేది. అర్ద రూపాయికి ఒక ఫలం పెట్లొప్పు దొరికేది. దాన్ని తవ్వలు అనె పరికరంలో వేసి రాతికేసి కొడితే పెద్ద శబ్దం వచ్చేది. తవ్వలు అనగా...... రెండంగుళాల పొడవు ఒక అంగుళం వ్వాసం కలిగిన ఇనుప ముక్కకు ఒక వైపున ఆర అంగుళం లోతున సన్నని గుంట వుంటుంది. రెండో వైపున దారం కట్టుకోడానికి ఒక రంధ్రం వుంటుంది. దానిని రోలు అంటారు. రెండోది రోకలి. ఇది కూడా ఇనుప పరికరమే. చిటికెన వేలు పరిమాణంలో వుండి ఒక వైపు రోలుకు సరిపడ వుండి రెండో వైపు ఒక రంధ్రం దారం కట్టు కోడానికుంటుంది. ఈ రెండు పరికరాలను చెరి ఒక కొసన దారానికి కట్టి రోలులో ఒక చెటికెడు పెట్లొప్పు వేసి రోకలిని అందులో పెట్టి దారం సాయంతో ఒక రాతి కొట్టితే పెద్దశబ్దం వస్తుంది. పిల్లలకు ఒక పలం పెట్లొప్పు ఒక రోజు కొట్టడానికి సరిపోయేది.

ప్రస్తుతం అనేక రకాల టపాకాయలు వచ్చినా పల్లెల్లో వాటిని పరిమితంగానె కాల్చుతారు. వాటిపైన ఎక్కువ ధనం వ్వయం చేయరు.

శివ రాత్రి

ఈ పండగ ఉప వాసానికి జాగారణకు ప్రత్యేకం. పొద్దునంతా ఉపవాసముండి రాత్రులందు జాగారణ చేస్తారు. స్థానికంగా వుండే దేవాలయాలలో అనేక సాంస్క్రుతిక కార్యక్రమాలు జరుగు తుంటాయి. అవి భజనలు, హరి కథలు, వీధి నాటకాలు మొదలగు నవి వుంటాయి. అక్కడక్కడ వున్న శివాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. రాత్రులందు జాగారణ కొరకు ఆ కార్యక్రమాలకు వేళుతారు పల్లె వాసులు. ప్రస్తుతం ఈ శివరాత్రి పండుగ ఆరోజుల్లో జరిగినంత వైభవంగా జరగడం లేదు. ఏదో మొక్కు బడిగా జరుపుకుంటున్నారు. శివాలయాలల్లో మాత్రం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు జరుగు తున్నాయి.

సుడ్తుల పండగ

[మార్చు]

ఈ సుడ్దుల పండగ కేవలం చిత్తూరు జిల్లలో అదీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే చేసుకునే పండుగ. కార్తీక పౌర్ణమి రోజున చేస్తారు. ఆ రోజున అన్ని పండగలకు చేసినట్లే ఇల్లు అలికి, ముగ్గులు పెట్టి పిండి వంటలు చేసు కుంటారు. సాయంత్రం దీపావళి పండగకు పెట్టినట్లు ఇంటి ముందు దీపాలను పెడ్తారు. దిబ్బల్లోను దీపాలు పెడతారు. ఆలయం ఉన్న కొండలపై కర్రదుంగలతో పెద్ద మంట వేస్తారు. దాన్ని ఆకాశ దీపం అంటారు. అది ఆ చుట్టు ప్రక్కల చాల దూరం వరకు కనిపిస్తుంది. రాత్రి కావస్తుందనగా పిల్లకు పండగ అప్పుడు కనిపిస్తుంది. పిల్లలందరు వారి పెద్దల సహాయంతో సుడ్తులు కట్టుకోవడంలో చాల సరదాగా వుంటారు. సుడ్తు అనగా:..... గోగు పుల్లలను ఒక కట్ట లాగ కట్టి సుమారు పదడుగులకు పైతా కడతారు. దాని పొడుగు దాన్ని మోసే వారి వయస్సు, శక్తిని బట్టి ఇరవై అడుగుల పొడవు కూడా వుండొచ్చు. చీకటి పడగానా పిల్లలందరు వారి వారు సుడ్తులతో ఊరుముందర కూడతారు. అక్కడ ఒక పెద్ద మంట పెట్టి దాని నుండి వారి వారి సుడ్తులను వెలిగించుకొని పరుగులు తీస్తూ "డేహేరి గుళ్లారిగో...... డేహేరి మాముళ్లో...... అని గట్టి గా అరుస్తూ.... ఊరి బయట పరుగెడుతారు. అలా ఓ గంట సేపు అరిచి పరుగెత్తి... చివరికి ఊరిబయట ఒక చెట్టుకింద వున్న దేవుని ముందు దీవించి అక్కడే మిగిలిన ఆ సుడ్తులన్నింటిని నిలువుగా కుప్పవేస్తారు. అది పెద్ద మంటై పైకి లేస్తుంది. దాంతో పిల్లల కేరింతలు. ఆ మంటను "అవ్వాగుడిసె" అంటారు. ఆమంట పూర్తికాగానె కింద జానెడెత్తు నిప్పులు ఖణ ఖణ లాడుతు వుంటాయి. పెద్దపిల్లలు దానిపై ఇవతలనుండి అవతలికి నడుస్తారు. చిన్న పిల్లలు ఆచ్యర్యపోతుంటారు. అవి భయంకరంగా వున్న అవి మెత్తటి నిప్పులు గాన కాలవు. (గోగు పుల్లల నిప్పులు) అదొక సరదా.... ఆతర్వాత ఇద్దరు పెద్దపిల్లలకు ఒక పెద్ద దుప్పటి ఇచ్చి తెరలాగ పట్టుకోమని తెరకు అవతల చిన్న పిల్లలకు గోగు పుల్లలను ఇచ్చి కత్తిలాగ, బాణం లాగ, గద లాగ పట్టుకొమ్మని వారిని అక్కడ కోదరిని నెలబెట్టి, కొందరిని కూర్చో బెడతారు. ఒక చిన్న సుడ్తుకు మంట పెట్టి పిల్లలున్న వైపు పిల్లలకు కొంత దూరంలో మండుతున్న సుడ్దును అడ్దంగా, నిలువుకు తిప్పుతారు. ఆ మంట వెలుగులో పిల్లల నీడలు తెరపై పడి మంట కదులు తున్నందున పిల్లల నీడలు కూడా కదులుతాయి. తెరకు మరొకవైపు అందరు నిలబడి ఆనందిస్తారు. దీన్ని తోలుబొమ్మలాట అంటారు. కొన్ని వూర్లల్లో ఊరు వారందరు కలిసి "బండి సుడ్దు " అని పెద్ద సుడ్తు కడతారు. దాన్ని ఎద్దుల బండి మీద పెట్టి, మంట పెట్టి అది కాలుతుంటే ముందుకు జరుపు కుంటూ ఊరు బయట ఎద్దులతో పరుగులు తీయిస్తారు. ఇదొక సంబరం. ప్రస్తుతం ఈ పండగ పూర్తిగా కనుమరుగై పోయింది. గోగులను పండించడము పూర్తిగా మానేశారు. గోగులు లేవు సుడ్దులు లేవు. కాని కొండలమీద మాత్రము ఆకాశ దీపాలు వేస్తున్నారు.[3]

పల్లెల్లో విద్యావిధానం

[మార్చు]

అప్పటికింకా ప్రభుత్య బడులు పల్లెల్లో లేవు. పాత కాలపు విద్యా విధానమే అమలులో వుండేది. వాటిని వీధి బడులు అనే వారు. వూరి పెద్దలు చదువుకున్న ఒకతన్ని తీసుకొచ్చి అతనికి సకల సౌకర్యాలు కల్పించి ఎక్కడైనా ఖాళి ఇంట్లో గాని, అందుకొరకు కట్టిన సపారులో గాని, పెద్ద ఇండ్లలోని తాళావారంలో గాని, లేదా చెట్ల క్రింద గాని నేలమీద గాని వుండేవి, నేల మీద ఇసుక పోసి దాని పై పిల్లలు కూర్చునేవారు. అయ్యవారు కూర్చోడానికి ఒక మట్టి తో కట్టిన దిమ్మ 'అరుగు ' వుండి దాని పైన చాప వేసి వుండేది.

బడి సమయము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు వుండేది. శలవులు మాత్రము ప్రతి పండగకు, అమావాస్యకు, పౌర్ణమినకు మాత్రమే. ఈ మద్యలో పిల్లలు సద్ది తాగడానికి తొమ్మిది గంటలకు, మధ్యాహ్నము ఒంటి గంట ప్రాంతములో అభోజనానికి,, సాయంకాలము నాలుగు గంటలకు విరామముండేది. ఇక సూర్యాస్థమయానికి బడి వదిలే వారు. బడికి వచ్చే పిల్లలు.... ఎవరు ముందుగా వస్తే వారు సురి రెండో వాడు చుక్క, వారికి దెబ్బలు మినహాయింపు వుండేది. ఆతర్వాత వచ్చే వారికి అయ్యవారు తన బెత్తముతో మూడో వానికి మూడు దెబ్బలు, నాలుగో వానికి నాలుగు దెబ్బలు ఇలా దెబ్బలు కొట్టే వాడు. 1.

అయ్యవారు (ఉపాద్యాయుడు) చదువు చెప్పే విధానము. ఆ రోజుల్లో ఒకే ఉపాద్యాయుడుండేవాడు. ఐదు సంవత్సరాలు వయస్సు దాటితేనే బడిలోనికి చేర్చే వారు. మొదటగా ఓనమాలు నేర్పేవారు. మేము చదివేటప్పటికే పలకా బలపము వచ్చేశాయి. అంతకు మునుపు ఇసుకలో అక్షరాలు నేర్చుకునేవారట.

వ్రాయడానికి పలకు ఉన్నప్పటికీ చదువు అంతా నోటి పాటమే ఎక్కువ. అనగా ఒక పిల్ల వాడు గాని, అయ్యవారు గాని ఎలుగెత్తి ఒక ఎక్కము గాని, పద్యభాగము గాని చెప్పితే దానిని పిల్లలందరు గట్టిగా అరచి చెప్పేవారు. అంతా కంఠాపాటమన్నమాట. కొత్తవారెవరైనా ఊరిలోనికి వస్తే బడి ఎక్కడున్నదో సులభముగా తెలిసి పోయేది. ఎందుకనగా...... పిల్లలు కోరస్ గా పాఠాలను బట్టి పెట్టుతుంటే ఆ శబ్ధము గ్రామమంతా వినబడేది. పిల్లలు పద్యాలను ఆ విధంగా బట్టీ పెట్టుతుంటే.... ఊరిలోని పెద్దలు వారి ఇళ్లముందు అరుగుల మీద గాని, రచ్చ బండ మీద గాని కూర్చున్న వారు సుమతీ శతక, వేమన శతక పద్యాలను ఆ విధంగా నేర్చు కున్నవారు ఎక్కువ. ఆ రోజుల్లో చదువుకున్న పెద్దలు అతి తక్కువ.

ఇప్పట్లోలాగ ఆ రోజుల్లో పిల్లలకు తరగతులు లేవు. వున్నవల్లా ..... పెద్దబాల శిక్ష, బాల రామాయణము, అమరకోశము, ఆదిపర్వము, గజేంద్ర మోక్షము ....... ఇలా...... వుండేవి. అందరికి లెక్కలు మాత్రము వుండేవి. అందులో ముందుగా ఎక్కాలు, తరువాత కూడికలు, తీసివేతలు, గుణకార .... బాగహారాలు, వడ్డీ లెక్కలు, బాండు వ్రాసే విధానము, ఇలా వుండేవి. లెక్కల్లో నోటి లెక్కలు అనే ఒక విధానముండేది. అందులో అయ్యవారు ఒక విద్యార్థులకు ఒక లెక్క ఇస్తాడు.... ఒక ఆసామి రెండు వందల రూపాయలను నూటికి నెలకి ఒక రూపాయి చొప్పున వడ్డికి ఇచ్చాడు. మూడు సంవత్సరాల తర్వాత అప్పు తీసుకున్న వాడు చెల్లించాల్సిన మొత్తమెంత? అయ్యవారు లెక్క చెప్పుతున్నప్పుడే పిల్లలు మనసులో లెక్క వేసుకోవాలి. అయ్యవారు లెక్క పూర్తి చేయగానే సమాదానము చెప్పాలి. అలా ఎవరు ముందు చెపితే వారు గొప్ప. ఇలా వుండేవి లెక్కలు. ఇప్పట్లో లాగ ఆ రోజుల్లో.... దశాంశాలు, కిలోలు వంటి మెట్రిక్ పద్ధతి వుండేది కాదు. అది ఆనాటిది రూపాయలు, అణాలు, పైసలు లాగానే, ఇతర గణాంకాలు అనగా కొలతలు, బరువులు, మొదలగునవి.... మణుగు, వీశెలు, శేరులు, ఫలము, తులము ఇలా.... అంగుళము, గజము, ఫర్లాంగు, మైలు, క్రోసు ఇలా దూరాల కొలతలుండేవి.

2. ఆ కాలములో ఓనమాలు, ఎక్కాలు కా గుణితము ఇసుకలో దిద్దించి చెప్పించుచుండిరి. నేటికిని దాని జాడలు పెక్కు పల్లెలలో ఉన్నాయి. పేర్లు వ్రాయడము నేర్పినపిమ్మట పలక పట్టించేవారు. తర్వాత భాగవత భారతాలు చదివించేవారు. ఆ ముచ్చటనే కవి యిట్లు వర్ణించాడు
' (ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధములో రచయిత సురవరం ప్రతాపరెడ్డి )

1.ఈ విషయాన్ని ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధములో రచయిత సురవరం ప్రతాపరెడ్డి గారు ఇలా చెప్పారు.

బడికాలము తెల్లవారుజామునుండియే చీకటి యుండగానే ప్రారంభమయ్యెడిది. గురువు వద్ద బరిగయో కొరడాయో ఉండెడిది. మొదట వచ్చిన వాని చేతిలో శ్రీకారము ఆ యాయుధముతోనే వ్రాసి పంపి రెండవ వానిచేతిలో ఆయుధమును ఊరక తాకించి (చుక్కపెట్టి) పంపి మూడవవాని కొక దెబ్బ, నాల్గవ వానికి రెండు ఈ ప్రకారముగా ఆలస్యముగా వచ్చిన వారికి శిక్ష యిచ్చేవారు.

( నేను ఈ విషయాలను ఇంత వివరంగా చెప్తున్నాంటే..... అది నా స్వీయానుభవం. నే చదివింది ఆ చదువే గనిక. దీన్ని ఇంకా విస్తరించ గలను: అయినా వద్దులే ఇప్పటికే ఎక్కువైంది. ఈ వాఖ్యాన్ని తర్వార తొలిగిస్తాను)

పల్లెల్లో వైద్యం

[మార్చు]

అప్పటికింకా,,,,,,, ప్రభుత్వ ఆస్పత్రులు పల్లె వాసులకు అందు బాటు లోకి రాలేదు. వచ్చినా పల్లెవాసులకు వాటిని అవగాహన చేసుకొని ఉపయోగించుకునే తెలివి వారికి లేదు. ఎక్కడో పట్టణాలలో వుండె ఆస్పత్రులకు ఈ మారు మూల పల్లె వాసులు పోలేరు. పో గలిగినా అక్కడి వారితో ఎలా వ్వహరించాలో తెలియక ఎం మాట్లాడితో ఏం జరుగు తుందో...... అవమాన పడవలసి వస్తుందో...... అనే అనుమానం ఎక్కువ. ఎందు ఆనాటి పల్లె ప్రజలు రైతులు చాల నిజాయితి పరులు, నిక్కచ్చి మనుషులు, ఆనవసరంగా ఎవరైనా ఒక మాట అంటె పడరు. ఆంచేత ... పరా వూరికెళ్లి ఎవరినో బతిమాలి బామాలి మందులు తెచ్చుకోవడమేమిటని దాని పై శ్రద్ధచూపరు. తమకు తెలిసిన వైద్యమో...... తమ ఇంటి ముందుకు వచ్చిన వైధ్యమో ... దాన్నే ఆశ్ర యిస్తారు. అది పల్లె వాసుల నైజం. ఇది ప్రభుత్యం గ్రహించడం లేదు. అప్పటికి ప్రభుత్వం తమ స్థానాలల్లో పూర్తిగా కూర్చొని సర్దుకోలేదు. ఇంత చిన్న విషయాన్ని ఎలా పట్టించు కోగలదు ?.......... అందు చేత,,,,,,, అప్పటికి ఎంతో కాలం ముందు నుండే అమలలో నాటు వైధ్యుల సహకారం ఇంకా ఉపయోగించు కుంటున్నారు.

పల్లెల్లో కులవృత్తులు

[మార్చు]
చాకిరేవు

చాకలి

[మార్చు]

ఇది పల్లెల్లో చాల ప్రధానమైన వృత్తి. చాకలి లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారిది ముక్యమైన పని అందరి బట్టలను వుతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తికుని వెళ్లి తింటారు. అలాగె రాత్రికి కూడ కొంత అన్నం పెట్టాలి. దీనికొరకు చాకలి స్త్రీ ఒక గంప, ఒక పాత్ర తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి అన్నం కూరలు తీసుకుంటుంది. అన్నాన్ని గుడ్డ పరచిన గంపలో వేసుకుంటే...... కూరలను ఒక పాత్రలో పోసుకుంటుంది. ఆ విధంగా వూరి వారి అందరి కూరలు ఒకే పాత్రలో సేకరించడము వలన అది ఒక ప్రత్యేక రుచిని కలిగి వుంటుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పుట్టినదే సామెత.. చాకలి కూర. వూరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగ గుర్తు పట్టగలరు. అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది.

పల్లెలోని ఏ కుటుంబంలోనైనా ఆడపిల్లలు సమర్తాడితే ఆ సందర్బంలో ఆ అమ్మాయి ఒంటి పైనున్న బట్టలు చాకలికి చెందుతాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సామెతె పుట్టింది. అదేమంటే........ సరదాకి సమర్థాడితే...... చాకలి చీర పట్టుక పోయిందట. సామెత వివరణ:.... ఒక అమ్మాయి సరదాకి తాను సమర్థాడినట్లు ప్రకటించింది. ఆనవాయితి ప్రకారము చాకలి వచ్చి స్నానం చేయించి ఆ చీర పట్టుకొని పోయిందట. అదే విధంగా వివాహము వంటి శుభ కార్యాలలోను, చావు వంటి అశుభ కార్యాలలోను చాకలి, మంగలి వంటి వారు తప్పని సరిగా నిర్వహించ వలసిన కార్యాలు కొన్ని వుంటాయి. వాటినే చాకలి సాంగెం, అని మంగలి సాంగెం అని అంటారు. చావులో గాని, పెండ్లి లోగాని చాకలి వారి పని దీవిటి పట్టడము. అది పగలైనా, రాత్రి అయినా దీవిటి పట్టవలసినదే. ఆ విధానము ఒక తప్పనిసరి అయిన సాంప్రదాయము అయిపోయినది. వీరు దీవిటి పట్టడమనే తంతు దేవుని ఊరేగింపులోను, గంగమ్మ జాతర వంటి జాతర సందర్బంలోను తప్పని సరి. గంగమ్మ జాతరలో చాకలి వారే పూజారులు. ఈ విధానములో వీరికి కొంత సంభావన ముట్టుతుంది.

గ్రామంలో ‘రజకులు’ (చాకలి) కొన్ని కుటుంబాలకు ఒక కుటుంబం చొప్పున రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతూ ప్రతి దినం అన్నం పెట్టించుకొని వెళ్ళేవారు. పదవులు నిర్వహించే వారు, భాగ్యవంతులు చాకలికి ‘ఇస్త్రీ పెట్టె’(iron box) ఇచ్చి బట్టలు ‘చలువ’ చేయించుకొనే వారు. సంవత్సరానికి కుటుంబానికి నిర్ణయించిన ‘మేర’ ప్రకారం ధాన్యం వగైరా తీసుకనే వారు. చాకలి వాళ్ళే రైతుల సహాయంతో ‘బట్టీ’ల ద్వారా సున్నం తయారుచేసి కుటుంబానికి కావలసినంత ఇచ్చేవారు. తాంబూలం వేసుకొనే వారికి వీరు ప్రత్యేకమైన సున్నం ఇచ్చేవారు. పెళ్ళి మొదలైన శుభకార్యాలకూ, దైవకార్యాలకూ రజకులు పందిళ్ళు వేసి మామిడి తోరణాలు కట్టేవారు. వంట చెరకు విషయంలో కూడా వీరు రైతులకు ఎంతో సహకరించే వారు.

చాకలి వారు చేయ వలసిన పనులలో మరొకటి ఏమంటే..... చిన్నపిల్లలకు పురిటి స్నానము చేయించడము, ఆ సందర్బాని ఊరివారందని పిలవడము వీరి విధులల్లో ఒకటి. ఆ చాకలి ప్రతి ఇంటికి వెళ్లి పలాన వారింటిలో పురుడు పోస్తారు మీరు రావలసినదని చెప్తాడు. దీన్ని పురస్కరించుకొనొ ఒక సామెత పుట్టింది. అదేమంటే...... చాకలి దానికి చెప్పి చాలుకున్నడట. సామెత వివరణ: ఏదైనా ఒక రహస్యము చెప్పి ఎవరికి చెప్పవద్దంటే..... వాడు ఆ విషయాన్ని చాకలి వానికి చెప్పి చాలుకున్నాడట. అనగా చాకలి దానికి చెప్పిన విషయము వెంటనే ఆ పల్లెకంతా తెలిసి పోతుందని అర్థము.

కాలక్రమేణా వృత్తులు వ్యాపార దృష్టిని సంతరించుకొన్నాయి. సమాజం సమూలంగా మార్పు చెందింది. ఆధునిక పరికరాభివృద్ధి ఫలాలైన ‘లాండ్రీలు’, ‘బార్బర్‌ షాపులు’, నూలుమిల్లులు మొదలైన వాటి పోటీలో చేతివృత్తుల వారు వెనుకబడిపోయి బ్రతుకు దెరువుకోసం పట్టణాలకు వలసలు పోవలసిన దౌర్భాగ్యం పట్టింది. సకాల వర్షాలు లేక, పంటలు పండక, కరువు కాటకాలతో చివరకు రైతుల ఆత్మహత్యలతో దేశ ఆహారోత్పత్తి కుంటుబడుతున్నది. వ్యాపార పంటలు, ఉన్నత విద్యపై మోజు పెరగడంతో నగరీకరణ జరుగుతూ పల్లెలు చాలావరకు నగరాల్లో కలిసిపోగా మిగిలినవి వెనుకబడిపోయాయి.

మంగలి వృత్తి కూడ ఆ నాటి సమాజంలో చాల ప్రధానమైన వృత్తి. ప్రతి సారి ప్రతి ఫలం ఆశించ కుండా అందరికి క్షవరంచేసే వీ ఆ పనికి గాను ఫలితానికి, మేర ద్వారా ఐదు బళ్లల వడ్లు, ఒక మోపు వరి తీసుకునేవారు. తలంటు స్నానం చేయించడం వంటి పనులు చేసె వారు. ప్రతి రోజు మంగలి పల్లెలలోనికి వచ్చి క్షురక వృత్తి చేసె వారు. తల క్రాపు చేయడం, పెద్దవారికి గడ్డం చేయడం వంటివి చేసె వారు.

నాయా బ్రాహ్మణులు (మంగలి వాళ్ళు) గ్రామంలో కొన్ని కుటుంబాలకు ఒకరు చొప్పున ఇంటింటికి వెళ్ళి ‘తలపని’ (క్షవరం) చేసేవారు. సంవత్సరాంతంలో వీరు తమ ‘మేర’ తీసుకొనే వారు. వివాహ కార్యాల్లో వీరు వధూవరుల చేతి, కాళ్ళ గోళ్ళు తీయటం మొదలైన ‘కన్నెపెళ్ళి’ పనులు చేసే వారు. పుట్టు వెండ్రుకలు తీయటం, శుభకార్యాల్లో మంగళ వాద్యాలు వాయించి తగిన పారితోషికం పొందటం వల్ల వీరి జీవనం సాగేది. వీరు దైవకార్యాల్లో నిలయ విద్వాంసులుగా ఉండటం వల్ల ‘దేవుని మాన్యం’ కూడా భుక్తంగా ఉండేది.

ఈ విధంగా ’Artisans’ అనీ, పంచభట వృత్తుల వారనీ వీరు గ్రామాల్లో కొన్ని ప్రత్యేక సంప్రదాయ విధానాలు కలిగి, పని హక్కు గలిగి, ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే వారు. ప్రాచీన కాలం నుంచి వీరికిచ్చిన ‘మాన్యము’ వంశపారంపర్యంగా అనుభవిస్తూ కార్యసాధకులుగా ఉండేవారు.

కుమ్మరి

[మార్చు]

కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు. వీరికి కూడ ప్రతి పలితానికి 'మేర' వరి మోపు ఇచ్చేవారు. పెద్ద వస్తువులైన, కాగు, తొట్టి, ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకొని ఇచ్చేవారు. పెళ్లి సందర్భంగా ''అరివేణి'' కుండలని కుమ్మరి వారు ఇవ్వాలి. అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు.

అత్యంత కళాత్మకమైన మట్టి పాత్రలు, ఇతర ఆలంకరణ వస్తువులు. మలకపేట రోడ్డు పక్కన తీసిన చిత్రం
అమ్మకానికి సిద్దంగా వున్న కుమ్మరి చేసిన కుండలు. వనస్థలి పురం, హైదరాబాదులో తీసిన చిత్రం
కుమ్మరి తయారు చేసిన "అరివేణి కుండ" (అయిరేని) గతంలో ఈ కుండలు పెళ్లిల్లో తప్పని సరి. ఇది కొత్త పేట రైతు బజారు వద్ద తీసిన చిత్రం:
కూజాలు ఇతర నీటిని నింపె మట్టి పాత్రలు; కొత్తపేట రౌతు బజారు వద్ద తీసిన చిత్రం

వంటకు నాడు గ్రామాల్లో దాదాపు అందరూ మట్టి పాత్రలే వాడేవారు. కుమ్మరులు మట్టితో తయారుచేసిన చట్లు, కుండలు, మూకుళ్ళు, బానలు, కడవలు, ముంతలు, అన్నం తినే చిప్పలు బియ్యం, ధాన్యం పోసుకొనే పెద్ద ‘గరిసెలు’ ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చేవాళ్ళు. సంవత్సరాంతంలో తమకు వచ్చే ‘మేర’ రైతుల నుండి తీసుకొనే వారు. అదనంగా వీరు వివిధ రకాల మట్టిపాత్రలు తయారుచేసుకొని ‘కావిళ్ళ’తో మోసుకొనిపోయి సమీపంలోని పట్టణాల్లో వాటిని అమ్ముకొనే వారు. దైవకార్యాల్లో కుమ్మరులు తమకు కేటాయించిన పనులు నియమంగా నిర్వహించే వారు. http://eemaata.com/em/library/ata-2006/823.html?allinonepage=1

వీరి పని కర్రలతో పని ముట్లు తయారు చేయడం. నాగలి, కాడిమాను, ఎద్దుల బండి, ఇంటి సామానులు తయారు చేయడం వీరి పని. వ్యవసాయం యాంత్రీకరణమైన ఈ రోజుల్లో వడ్రంగి చేయవలసిన వ్వయసాయ పని ముట్లు ఏమి లేవు. అయినా ఇంటికి సంబందిచిన ద్వారాలు, కిటికీలు వంటి పనులు వీరికి ఎక్కువగా వున్నాయి వారు ఇప్పటికి పూర్తి స్థాయిలో పనులలో నిమగ్నమై వున్నారు. వారికి కావలసినంత డిమాండు వున్నది.

మేదరి వారు అల్లిన బుట్టలు, తట్టలు, చాటలు, ఇతర అందమైన అలంకార వస్తువులు., చాదర్ ఘాట్ రోడు ప్రక్కన తీసిన చిత్రం

వీరు వెదురు బద్దలతో తట్టలు,, బుట్టలు చాటలు దాన్యాన్ని నిలవ చేసె బొట్టలు ఎద్దుల బండికి వేసె మక్కిన వంటివి అల్లు తారు. గతంలో అడవులలో వున్న వెదుర్లను కొట్టి తెఛ్ఛి తట్టలు బుట్టలు అమ్మేవారు. అప్పట్లో బొట్టలు, మక్కెనలు, వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగ వుండేది. తాము తయారు చేసిన వస్తువులను రైతులకు దాన్యాన్నికి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

జంగం దేవర

జంగం వారి జనాభా అతి తక్కువ. ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూజారులు వీరే వుంటారు. గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరిగుతూ గంట వాయిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిది, వార, నక్షత్రాలను చెప్పి.... తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు. ఇలా తిరిగే వారిని జంగం దేవర అని అంటారు. వీరు శుభాశుబాలను చెప్పుతారు. వీరికి సమాజంలో బ్రాహ్మణుల తరువాత గౌరవ స్థానం వీరిదే. వీరి వేష ధారణ కూడ గౌరవ ప్రదంగానే వుంటుంది. కాషాయ వస్త్రాలను ధరించి, తలపాగా కట్టి, బుజాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెండో చేతొలో శంఖం వుంటుంది.

జంగం దేవర. వనస్థలి పురంలో తీసిన చిత్రము

లోహ వస్తువులను తయారు చేసె వారిని కంసారి అంటారు వీరు కత్తులు, గొడ్డల్లు, కొడవళ్లు వంటి లోహ సామానులు చేసె వారు. ఇప్పుడు వాటి అవసరం ఎక్కువ లేదు. అయినా యంత్రాలతో తయారైన రడిమేడ్ పరికరాలు సంతల్లో దొరుకుతున్నాయి. గతంలో అక్కడక్కడా ''కొలిమి'' వుండేది. కాని ఈరోజుల్లో కొలిమి ఎక్కడా లేదు.

జంగం .... వీరిని జంగం దేవర అని కూడ అంటారు. వీరు శివ భక్తులు. నొసటన వీభూతి ధరించి చేతిలో పెద్ద గంట పట్టుకొని వాయిస్తూ సంక్రాంతి ససందర్భంగా ఆ నెల అంతా తెల్ల వారు జామున వీదుల్లో తిరుగుతు శివ కీర్తనలు చేస్తూ, ఆ రోజు తిది వార నక్షత్ర పలాలను తెలిపి తెల్లవారాక ప్రతి ఇంటికి వచ్చి సంభావన తీసుకునే వారు. అప్పటికే వీరు అంతిమ దిశలో వుండే వారు. వీరు అంతరించి చాల కాలమే అయింది.

ఆ రోజుల్లో గాజుల శెట్టి తన మలారం బుజాన వేసుకొని పపల్లెల్లో తిరిగే వారు. మలారం అంటే: ... సన్నని పొడవైన దారాలకు గాజులను రెండు వైపులా గుత్తులు గుత్తులుగా కట్టి ఆ దారాలన్నింటిని మధ్యలో ఒకటిగా కట్టి దాన్ని బుజాన వేసుకుంటారు. గాజుల వాళ్ళు కొన్ని పల్లెలను తమ ప్రాంతగా విభజించుకొని ఆ యాపల్లెలలో వారె గాజులను అమ్మేవారు.

వీరు హరి జనులు. ఇతర ప్రాంతాలలో వీరిని అంట రాని వారుగా పరిగణించబడినా, ఈ ప్రాంతంలోఅనగా రాయలసీమ లో మాత్రం అంట రాని తనం అంత తీవ్రం వుండేది కాదు. వీరి జన సంఖ్య ఎక్కువే. వీరు ఎక్కువగా కూలీలుగా వుండే వారు. వీరిలో కూడ భూములున్న వారు కొందరుండేవారు. వీరు వ్వవ సాయ పనులు చాల బాగ చేస్తారు.

డబ్బ కొట్టులో మాదిగ వృత్తి పనిలో వున్నాడు

.... వీరు కూడ హరిజనులే. కాని వీరి జన సంఖ్య తక్కువే. వీరు చెప్పులు కుట్టడం, తోలు తోచేసిన కపిలి బానలను కుట్టడం అవకాశం వున్నప్పుడు రైతు పొలంలో కూలికి వెళ్లడం చేసే వారు. వీరికి కూడ రైతుల నుండి మేర వరి మోపు లభిస్తుంది. రైతు లందరూ వీరి వద్దనే చెప్పులు కుట్టించు కునేవారు. కరెంటు మోటార్లు వచ్చాక వీరి వృత్తి మరుగున పడిపోయింది.

చేపలు అమ్ముతున్న బెస్తవారు

(వీరి గురించి వివరాలు సేకరించ వలసి వున్నది)

బెస్త వారి కులంలో అనేక ఉప కులాలున్నాయి. గంగ పుత్ర, వన్నెకుల క్షత్రియ, పలికాపు, అనే కులాలు ఇందులోనె ఉన్నాయి. బెస్త వారి వృత్తి చేపలు పట్టడము. ఈ కులం వారు కృష్ణా, గోదావరి, తుంగ భద్రా నదీ ప్రాంతాలు, సముద్ధ తీర ప్రాంతాలలోనె ఎక్కువ ఉన్నారు. మిగతా ప్రాంతాలలో వీరి జన సంఖ్య చాల తక్కువ. వీరు చేపలు పట్టడం తప్ప మరే పని చేయలేరు. తీర ప్రాంతాలలో వుండే బెస్తలకు దిన దిన గండం నూరేళ్ల వయస్సుగా బ్రతుకీడుస్తున్నారు. వారి వృత్తి ప్రాణాలతో తెలగాటమే. వీరు ఆర్థికంగా చాల వెనుక బడిన కులంవారు. చేపలు పట్టే పడవలు, బోట్లు లక్షలాది రూపాయల విలువ చేస్తాయి. వాటిని వీరు కొనలేరు. పెద్ద ఆసాములు పడవలను కొని బెస్త వారికి అద్దెకిస్తుంటారు. వీరి అద్దె విధానము వైవిధ్యంగా వుంటుంది. పడవకు రోజుకింత అని గాని, లేదా నెలకింత అనిగాని అద్దె వుండదు. ఒక సారికి ఇన్ని చేపలు ఇవ్వాలి అని నిబందన వుంటుంది. అదే ఆ పడవకు అద్దె. వారికి ఎన్ని చేపలు దొరికినా అద్దె చేపలు పోగా మిగిలిన చేపలు బెస్త వారికి చెందు తాయి. చాల సార్లు అద్దెకు ఇవ్వాల్సిన చేపలు కూడా దొరకవు. ఇలా ఎక్కువ సార్లు వారికి తగిన ఫలితము దొరకదు. కొందరు చిన్న చిన్న పడవలలో చేపల వేటకు వెళ్లతారు. అవి చాల దూరం ప్రయాణించలేవు. కనుక అధికంగా చేపలు దొరకవు అంత దూరం పెద్ద పడవలే వెళ్లగలవు. అదృష్త వశాత్తు ఎప్పుడైనా పెద్ద చేపలు ఎక్కువగా దొరికితే.... బెస్త వారి పంట పండినట్టు కాదు. మధ్యలో దళారులుంటరు. చేపలను వారికి అమ్మాల్సిందే. పట్టిన చేపలను దాచుకొని నిదానంగా అమ్ముకుందామంటే కుదరదు. ఏ రోజుకారోజు వాటిని అమ్మేయాల్సిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు ఎంతో కొంత ధనం ముట్ట జెప్పి ఆ చేపలను తమ స్వంతం చేసుకొని తగు రీతులో వాటిని ఎగుమతి చేసి అధిక మొత్తంలో ధన సంపాదన చేస్తున్నారు. బడుగు జీవులైన ఈ బెస్త వారు తమ వృత్తిని వదులుకోలేక వేరె పని చేయలేక అలాగే బ్రతుకీడుస్తున్నారు.

జూలై, ఆగస్టు నెలల్లో చెరువుల్లో చేప పిల్లన్ని వదిలి మార్చి నుంచి మే వరకు చేపలను పడతారు. దళారీలు చెరువులను గుత్తకు మాట్లాడుకొని ఆదాయాన్ని గడించటంవల్ల మత్స్యకారులు నష్టపోతున్నారు. చెరువులో విత్తనాలు చల్లే సదరు కాంట్రాక్టర్‌ చేపలు పట్టే సమయానికి మత్స్యకారుల వద్ద కొనుగోలు చేస్తాడు. వాటిని ఆ వ్యక్తి మార్కెట్‌లో ఎక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. దళారి వ్యవస్థ లేనిపక్షంలో మత్స్యకారులు నేరుగా చేపలను మార్కెట్‌కు తరలించి విక్రయించి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సొసైటీలకు విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఫలితంగా వృత్తిదారులు స్వయంగా విత్తనాలు వేసి చేపలు పట్టుకొని మార్కెట్‌కు తరలించి విక్రయించడం ద్వారా లాభాన్ని గడించే అవకాశం లభించింది. వాగులలో ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. 105 రూపాయల ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు చేపలు పట్టుకొనే వీలు కల్పించింది. కట్ల, రౌ, బంగారు తీగ చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. చేపల మార్కెటింగ్‌కు గాను ఈ మధ్య మహిళలకు సబ్సిడీపై బైక్‌లను అందించారు. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో చిత్తూరు, పశ్చిమ గోదావరి మెదక్‌ జిల్లా ల్లోగురుకుల పాఠశాలలున్నాయి.వృత్తిదారులు చనిపోతే రెండు లక్షలు బీమా ఇస్తున్నారు. మహిళా మత్స్యకారులు కూడా మత్స్య మిత్ర గ్రూపుల నుంచి రుణాలు, నైలాన్‌ వలలు, ఐస్‌ బాక్స్ లు తదితర పరికరాల కోసం రుణాలు పొందారు.మహిళా మత్స్య ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి వారికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. తక్కువ నీటిలో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేసే మెళకువలు నేర్పించాలని, కేరళలో చేపడుతున్నట్లుగా ఇక్కడ కూడా చేపల పచ్చళ్లు, ఫ్రై తదితర వెరైటీ వంటకాలు తయారు చేసి విక్రయించేలా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎవరికైనా చేపలు అవసరమైతే డోర్‌ డెలివరీ చేసే స్థాయికి ఎదగాలని వృత్తి దారులు భావిస్తున్నారు.

సాలె వరి వృత్తి మగ్గం పై బట్టలు నేయడము. వీరి పరిస్థితి కూడా చాల అద్వాన్నంగా ఉంది. (వివరాలు సేకరించ వలసి వున్నది)

దొమ్మరి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో కనిపించే ఒక సంచార జాతి.

వీరిలో కొందరు వీధిలో సర్కస్ ప్రదర్శనలు ఇచ్చి సంపాదించేవారు. ఒకనాడు పడుపు వృత్తే వీరి జీవనాధారం. వారికి సంబదించిన సామెత. " చెప్పేది సారంగ నీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు" వెళ్ళటం లేదు. కనిగిరి పట్టణ శివారు ప్రాంతంలో దాదాపు వంద కుటుంబాల దొమ్మరులు నివసిస్తున్నారు. ఆడవారు ఇళ్ళల్లో పాచి పనులు, మగవారు చెక్క దువ్వెనలు, ఈరిబానులు అమ్ముకోవడం, గేదెల కొమ్ములు కోయడం, పండ్ల బండ్లు వేసుకొని కాయలు అమ్ముకుంటున్నారు. అడవి ప్రాంతంలో తెచ్చుకున్న కరల్రతో చెక్క దువ్వెనలు, ఈరిబానులు తయారు చేసుకొని వాటిని ఊరూర తిరిగి అమ్ముకొని జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. దువ్వెనల తయారీ పందుల పెంపకం వీరి కుటీర పరిశ్రమలు.వారు ఒళ్లు గగుర్పొడిచే విద్యలు ప్రదర్శిస్తారు. సన్నటి తాడుపై నడచి అబ్బు రపరుస్తారు. బిందె మీద బిందెలు పెట్టి వాటిపైన సాహసాలు చేస్తారు. గడ ఎక్కి ఊరికి శుభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈనాటి జిమ్నాజియానికి తీసిపోని విన్యాసాలు చేస్తారు దొమ్మరులు. దారిన వెళ్లేవారు కూడా కాసేపు నిలబడి వీరి ప్రదర్శన చూసి సంతోషంగా తమకు తోచినంత ఇచ్చి వెళ్లేవారు. దొమ్మర కులస్థులు నిత్యసంచారులు. చివరికి...వారుండే గుడిసెలను కూడా గాడిదలపై వేనుకుని ఊరూరా తిరుగుతారు. వీరు ఇంట్లో వస్తువులతో పాటు మేకలు, కుక్కలను కూడా తమ వెంట తీసుకెళ్లి ముందుగా ఊరి చివర దిగుతారు. తర్వాత ఊరి పెద్ద వద్దకు పోయి ఆ గ్రామంలో ప్రదర్శన ఇస్తామని చెబుతారు. దొమ్మరులు గ్రామంలో అడుగుపెడితే శుభసూచకమనే భావన ఉండేది. ఎవ్వరూ అడ్డు చెప్పేవారు కాదు. . పదేళ్లువచ్చేసరికి వీరు తమ పిల్లలకు శిక్షణ ఇస్తారు. గడ ఎక్కడం, దూకటం, పల్టీలు కొట్టటం, బిందెల మీద బిందెలు పెట్టి దానిమీద మనిషిని నిల బెట్టటం వంటివి సాధన చేయిస్తారు. విన్యాసాలు ప్రదర్శించే ఒక బృందం తయారు కావాలంటే కనీసం ఎనిమిది మంది ఉండాలి. వీరంతా గ్రామ కూడలిలోనో, చావిడి దగ్గరో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దొమ్మరులు గ్రామానికి వస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం కనుక వర్షాలు కురవకపోయినా, పం టలు పండక పోయినా దొమ్మరవాళ్లను ఆ గ్రామా నికి ప్రత్యేకంగా పిలిపించుకుంటారు. దొమ్మర ఆడపడుచుతో వ్యవసాయ భూముల్లో ప్రదర్శన ఏర్పాటు చేయిస్తారు. వేపాకు, పసుపు, బియ్యం కలిపిన మూటను నడుముకు కట్టుకున్న దొమ్మర మహిళ గడ ఎక్కుతుంది. దాదాపు 40 అడుగుల ఎత్తున్న ఈ గడపై ఆమె విన్యాసాలు చేస్తూ వడిలో ఉన్న బియ్యాన్ని వ్యవసాయ భూములపై విసురుతుంది. బావుల దగ్గర కూడా ఆమె ఓడు బియ్యాన్ని చల్లుతుంది. ఈ తంతు ముగిశాక వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. విన్యాసాలు చేసే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడితే వెంట తెచ్చుకున్న చెట్ల పసర్లతో వైద్యం చేసుకునేవారు.

పల్లె వాసుల పై ఆధారపడిన యాచక వృత్తి వారు అనేకం. అందులో ముఖ్యమైనది బుడబుక్కల వారు. వీరి వేష ధారణ చాల గంబీరంగా వుంటుంది. నొసటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని కోటు వేసుకొని, మెడపై అటు ఇటు కింది వరకు వేలాడుతున్న చీరలను ధరించి, కుడి చేతిలో చిన్న డమరుక / బుడబుక్కను ధరించి 'డబ డబ' వాయిస్తూ అంబ పలుకు జగదంబా పలుకు.... కంచి లోని కామాక్షి పలుకు, కాసీలోని విశాలాక్షి పలుకు....... అంటూ ఆయా గృహసుని కష్టాలను ఏకరువు పెడ్తాడు. ఇదిగో అంబ పలుకుతున్నది అంటూ తన బుడబుక్కను వాయిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఎవేవో మాయ మాటలు చెప్పి వాటిని 'అంబ' పలుకుతున్నదని నమ్మిస్తాడు. వాటి నివారణకు మంత్ర తంత్రాలను కడతానంటాడు. వాడి మాటలకు లొంగి పోయిన పల్లెవాసులకు కొన్ని కష్ట నివారణ మార్గాలను చూసిస్తూ యంత్రాలను, తంత్రాలను ఇచ్చి ఇంటిలో వెన్ను గోడులో గాని, గడప పై గాని కట్టమని ఇస్తాడు. ప్రతి ఫలంగా కొంత ధాన్యాన్ని పొందు తారు. వీరి ప్రస్తావన ఈ కాలంలో చాల అరుదుగా ఉంది. ఇంకా పూర్తిగా మాసి పోలేదు . ఇలాటివారే.....

కుర్రు తొకన్నలు. వీరు కూడా గంబీరమైన ఆహార్యముతో వుంటారు. భుజాన జోలితో, ఎర్రటి వస్త్రాలు ధరించి, నెత్తిన తలపాగతొ, అందులో నెమలి పించం పెట్టి రాజసం ఉట్టిపడేలా వస్తారు. కుర్రో కుర్రు.... కొండ దేవరా పలుకు, ..... అంటూ పల్లె వాసులకు కల్ల బొల్లి కబుర్లు చెప్పి వారిని తమ మాయ మాటలతో వశీకరణ చేసుకొని, వారి కష్టాలకు నివారణోపాయాలు చెప్పి కొంత ధాన్యం ప్రతి ఫలంగా పొందు తారు.

వారు ఏరైతు ఇంటి ముందు వాలినా వారు బిచ్చం వేసినంత వరకు వెళ్లరు. అందుకె వాళ్లను మొండోళ్లు అని అన్నారు. వారి నుండి పుట్టినదె ఈ సామెత మొండోడు రాజు కన్న భలవంతుడు. వారు రైతు ఇంటి ముందు భయాన దృశ్యాలను ప్రదర్సిస్తాడు. రక్త సిక్తమైన పసి పిల్లవాన్ని చేటలో పెట్టి దాన్ని ఇంటి ముందు పెట్టి పెద్ద కొరడాతో తనను తాను కొట్టు కుంటూ నానా భీబచ్చం చేస్తారు. అతని భార్య తన మెడకు వేలాడు తున్న ఒక వాయిద్యంతో వింత వింత శబ్ధాలు చేస్తూ పాటలు పాడుతుంది. ఈ ఘోర కృత్యాలను భరించ లేక గృహస్తు రాలు ఎంతో కొంత వడ్లు గాని బియ్యం గాని బిచ్చం వేస్తుంది. వారు అక్కడి నుండి ప్రక్క ఇంటి కెళుతారు.

వాయిద్య సహకారంతో పాటలు పాడి యాచించె రైతుల పైన, వారి పొలాల పైన ఆధార పడి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్రతికే అనేక ఆశ్రిత జాతుల వారి ఆరోజుల్లో చాల సంతోషంగానె కాలం గడెపేవారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇటు రైతులు అటు రైతులపై ఆధార పడి బ్రతికే ఆశ్రిత జాతులు రైతులకు పరాయి వారుగానె మిగిలిపోయారు. స్వంత ప్రాంతంలో వున్న దళితులకు రైతులకు ఆనాడు వున్న అవినాబావ సంబంధం ఇప్పుడు ఎంత మాత్రము లేదు. ఇది సాంఘిక పురోగమనమో, తిరో గమనమో.................

చిలక ఒక కార్డు తీస్తున్నది.
జ్యోతిష్కుడు చిలక జోస్యం చెపుతున్నాడు
చిలక జోస్యం .. వీరు ఒక పంజరంలో చిలకను పెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ జోస్యం చెపు తుంటారు. వీరు మంచి మాట కారులు. వీరిని ఎవరైన తమ ఇంటికి పిలిస్తే వెళ్లి కూర్చొని చిలక పంజరాన్ని కింద పెట్టి సుమారు ఒక ఇరవై కవర్లను వరుసగా పేర్చి పెట్టటాడు. ప్రతి కార్డులో ఒక దేవతా బొమ్మ మరొక కార్డుపై జ్యోతిషానికి సంబంధించిన కొన్ని మాటలు వ్రాసి వుంటాయి. జ్యోస్యం చెప్పించు కో దలచిన వాని పేరు అడిగి పేరును బట్టి అతన నామ నక్షత్రము చెప్పి దానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పుతాడు. ఆ తర్వాత పంజరం తలుపు తీసి చిలకను బయటకు పిలుస్తాడు. ఆ చిలక వచ్చి కొంచెం అటు ఇటు తిరిగి అక్కడ పరిచిన ఇరవై కవర్లలోనుండి ఒక కవరును తన ముక్కుతో తీసి బయట పడేస్తుంది. దానిని జ్యోతిష్కుడు తీసి అందులోని దేవతా బొమ్మని చూపి జరిగినవి, జరగబోయే విసేషాలను ఏకరువు పెడతాడు. తర్వాత మరొ కార్డులోనివిషయాన్ని చదివి కొన్ని లెక్కలు వేసుకొని సమస్యకు కొన్ని పరిష్కారా మార్గాలను సూచిస్తాడు.
కథాకళాకారులు
బుర్రకథ కళాకారులు

యాచక వృత్తి వారు

[మార్చు]

చాల కాలం క్రితం జానపద కళారీతులకు బాగా ఆదరణ వున్న రోజుల్లో ఆయా కళాకారుకలు ప్రజల్లో మంచి గౌరం వుండేది. అటు వంటి వారిని పల్లె ప్రజలు పిలిపించుకొని వారి కళా రూపాన్ని ప్రదర్శింప చేసుకొని ఆనందించి వారికి కొంత సంభావన ఇచ్చే వారు. ఆవిధంగా వారి జీవనం గౌరప ప్రదంగా సాగేది. అలాటి వాటిలో ముఖ్యం చెప్పుకో దగ్గది.... బుర్ర కథ, ఒగ్గు కథ మొదలైనవి. కాల క్రమంలో వీరి కళకు ఆదరణ తగ్గి అంతరించి పోయే దశలో మిగిలిన ఆ కళాకారులు లేదా వారి వంశం వారు బ్రతుకు తెరువుకు వేరు మార్గము చేత గాక..... తమ వృత్తికి ఆధణ లేక, వారే తమ కళను పల్లెల్లో ఇళ్లముందు ప్రదర్శించి యాచించి తమ జీవనమును జరుపుకుంటున్నారు. బుర్ర కథలోని మాధుర్యాన్ని రుచి యేరిగిన పల్లె పద్దలు.... ఆ కళాకారుల చేత మరికొంత సేపు బుర్ర కథను చెప్పించుకొని ఎక్కువ సంభావన ఇస్తున్నారు. ఆ తరం మారితే వారికి అంత మాత్రము కూడా ఆదరణ కూడా దొరకదనిపిస్తుం.

కొన్ని జాతుల వారు కేవలము యాచనే వృత్తిగా స్వీకరించి అదే ఆధారంగా జీవించె వారున్నారు. ఇలాంటి వారిలో ఆ కుటుంబంలో అందరు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఇటువంటి వారిలో కొందరు స్త్రీలు రామారి పాటలు పాడి యాచిస్తుంటారు. వారు ఎటువంటి ఆగడాలు చేయరు. గృహస్తు రాలు వారికి ఎంతో కొంత బిచ్చం వేసి పంపు తుంది. ఇంకొంత మంది వుంటారు..... వారు.. దొమ్మరి వారు వీధిలో గారిడి విద్యలు ప్రదర్శించి ఇంటింకి వెళ్లి యాచిస్తుంటారు. ఈ దొమ్మరి వారు, సంచార జాతులు. వీరు పల్లెలకు దూరంగా డేరాలు వేసుకొని తాత్కాలికంగా నివాసం వుంటారు. వీరు రెండు కర్రల మధ్య ఒక దారం కట్టి చిన్న పిల్లల చేత దాని మీద నడిపించడం, వారి చేతనే వింతైన కుప్పి గంతులు వేయించడం, ఇలా కొన్ని ప్రదర్శనలిచ్చి ఇటింటికి వెళ్లి యాచించడం వారి ప్రధాన వృత్తి. వీరి ఉప వృత్తి ''వ్వబిచారం'' వీరి నుండి పుట్టినదే ఈ సామెత '' చెప్పేవి సారంగ నీతులు.,.. దూరేది దొమ్మరి గుడిసెలు''. ప్రస్తుతం వీరి సంఖ్య పల్లెల్లో చాల వరకు తగ్గినా పూర్తిగా మాసి పోలేదు. ప్రస్తుతం వీరి సంఖ్య పల్లెల్లో కన్నా జన సంఖ్య ఎక్కువగా వున్న వారంతపు సంతలలో ఎక్కువ. ఆ తర్వాత చెప్పుకో దగ్గ యాచకులు

ఒక ఇంటిముండు గంట వాయిస్తూ నిలబడ్డ దాసరి

వీరు రైతు ఇంటి ముందు.... తమ బుట్టలో వున్న పాములను బయటకు తీసి పాముల బుర్ర వూదుతూ నాగు పాములను ఆడిస్తుంటారు. ఈలాంటి వారికి బిచ్చం తప్పని సరిగా వుంటుంది. ఈ పాముల వాళ్ళు... చెవిలో చీము కారుతున్న చిన్న పిల్లలకు పాము తోకను చెవిలో తిప్పితే చీము కారడం పోతుందని చెప్పి అలా చేసి కొంత ధాన్యాన్ని ఫలితంగా పొందు తారు. ఇంకా కొంత మంది ఎలాంటి విద్యలు ప్రదర్సించ కుండా కేవళం తమ కష్టాలను చెప్పుకొని యాచించె వారు కొందరుంటారు. అలాంటి వారికి తప్పని సరిగా బిచ్చం లభిస్తుంది. ఇలా రైతుల మీద ఆధార పడిన యాచకుల సంఖ్య చాల ఎక్కువే. ఆ రోజుల్లో రైతులు సుభిక్షంగా వున్నందున ఇలాంటి వారి జీవనానికి డోకా వుండేది కాదు. ఆరోజుల్లో యాచకులు ఎవరైనా ఇంటి ముంకు వస్తే ఎంతో కొంత బిచ్చం లభించేది. ఇది యాచకుల వృత్తి నైపుణ్యం కాదు. రైతుల, రైతు మహిళలు ఔదార్యమే ముఖ్య కారణం. ప్రస్తుతం ఇలాంటి వారి సంఖ్య పల్లెల్లో చాల వరకు తగ్గింది. రైతులే దీనావస్థలో వుంటే వీరి సంగతి పట్టించుకునే వారెవరు? ఇలాంటి వారు రైతుల పరిస్థితి గ్రహించి నగరాల పై బడ్డారు. గతంలో ఇలాంటి వారి ఆటలు పట్టణాలలో కొంత కాలం సాగింది. ఇప్పుడు పట్టణాలలో కూడా వీరిని ఆదరించే వారె కరువయ్యారు. పట్టణాలలో యాచలకు అన్నం పెడితే తీసుకోరు. వారికి డబ్బులు మాత్రమే కావాలి. చాలమందికి ఇది వృత్తి మారింది. ఈ యాచకులకు ఒక వ్వవస్త ఉంది. వీరి వెనుక కొంత మంది వుండి వారిని ప్రతి నిత్యం రద్దీగా వుండే స్థలానికి చేర్చి.... సాయంకాలం తిరిగి తీసుకెళ్లుతారు. వారి అన్న వస్త్రాలు ఆ నాయకులే చూసు కుంటారు. ప్రతిఫలంగా వారు యాచనలో సంపాదించిన దానిలో కొంత తీసుకొని మిగతా వారికి ఇస్తారు. ఈ వ్యవహారము పెద్ద పెద్ద పట్టణాలలోనె జరుగు తుంది. ఈ వ్వవస్థను ప్రభుత్వం ఏనాడో నిషేధించి యాచకులకు పునరావాసము కల్పించినా వారు అక్కడ వుండక నాయకుల అండలోనే జీవనం సాగిస్తున్నారు.

బుడబుక్కల వారు

[మార్చు]

బుడబుక్క కళాకారుల వృత్తి భిక్షాటనమే అయినా వారి పట్ల జానపదుల్లో గౌరవాదరాలుండేవి. వారు గ్రామాల్లో పదాలు చెప్పుకొంటూ సంచరిస్తే తమకు శుభం జరుగుతుందని ఆనాటి గ్రామస్తుల నమ్మకం. అందుకే వాళ్ళను కసురుకోకుండా దానధర్మాలు చేసేవారు. బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారు జాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు’, అని పాడుతూ ‘డబుక్‌డక్‌’ అని డమరుకం వాయించుకొంటూ ‘నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి!’ అని అడుగుతూ ధనధాన్యాలతో పాటు పాత బట్టలు అడుక్కొని వెళ్ళేవారు.

వీదిగారడీవారు

[మార్చు]

వీరు ఎక్కువగా దొమ్మరి వారై వుంటారు. వీరు కుటుంబంతో సహా పల్లెల్లో తిరుగుతు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. వీరు చేసె విన్యాసాలలో ముఖ్యంగ చెప్పుకో దగ్గవి..... అటు ఇటు కర్రలు పాతి వాటిమధ్యన ఒక దారాన్ని కట్టి ఆ దారంపై చిన పిల్లలను నడిపించడము., ఒకడు తన నడుంకు కట్టుకున్న గుడ్డ ఆధారంగా పొడవాటి కర్రను ఆనించి దానిపై చిన పిల్లలను ఎకించి విన్యాసాలు చేయించడము., ఇనుప రింగులలో తలను కాళ్ళను ఒకేసారి దూర్చి బయటకు రావడము, పిల్లలుచే శారీరిక విన్యాసాలు చేయించడము ఇలా అనేక విన్యాసాలు చేసి చివరకు ప్రదర్శన మధ్యలో గుడ్డ పరిచి, లేదా ప్రేక్షకుల వద్దకు వెళ్ళి యాచిస్తుంటారు. ఇలాంటివి ఎక్కువగా సంతలు, జాతరలు, ఇతర వుత్సవాలు జరిగే చోట ప్రదర్శిస్తుంటారు.

మోడి

[మార్చు]

మోడి అనగా మంత్ర, తంత్ర విద్యను ప్రదర్శించడం. ఫలాన రోజున ఫలాన పల్లెలో మోడి ఎత్తుతారు అని ముందుగానే సమాచారం ఇచ్చి వుంటారు. ఇద్దరు మంత్ర గాళ్ళ మధ్యన పోటి ఈ మోడీ. మంత్రాలతో ఎత్తులకు పైయెత్తులు వేసి ఒకరి నొకరు అడ్డు కుంటుంటారు. చివరకు ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ గారడి విద్య యాబై ఏళ్ళ క్రితమే మరుగైనది. ఇప్పుడెక్కడా మచ్చుకైనా జరగడము లేదు. నేటి తరం వారికి మోడి అంటే ఏమాత్రం తెలియని పరిస్థితి.

ఊరి బయట ఒక పందిరి వేసి, దాని ముందు బొగ్గు పొడితోనూ, ముగ్గు పొడి తోనూ భయంకరమైన బొమ్మలను తీర్చి వుంటారు. పందిరి ముందు బార కొకటి చొప్పున ఏడు చిన్న గుంతలు తీస్తారు. అందులో కుంకుమ, పశుపు లాంటివి చల్లుతారు. ఒక్కోక్క గుంతలో ఒక్కొక్కటి చొప్పున ఏడు వస్తువు లుంచుతారు. సామాన్యంగా ఆ వస్తువులు కొబ్బరికాయ, అరటి పండు, కోడి గ్రుడ్డు, ఇలాంటివే వుంటాయి. మోడి కట్టడి చేసే మాంత్రికుడు చేసిన ఏర్పాటు ఇది. ఇంతా సేసి ఆమాంత్రికుడు ఆ యా గుంతల వద్దకు ఎవరిని రానీయకుండా మంత్రాలతో కట్టడి చేసి వుంటాడు. మోడి కట్టడి చేసిన ఆ యా గుంత్లలో వున్న వస్తువులను తన మంత్ర విద్యలతో ఎదుటివాని మంత్రాలను చిత్తు చేసి ఆ గుంతలలో వున్న వస్తువులను బయటకు తీస్తే అవతలి మంత్రగాడు గెలిచినట్లు. లేదా ఓడి పోయినట్లు.

ఆకాలంలో అనగా సుమారు యాబై సంవత్సరాలకు ముందు నేను స్వయంగా చూచిన ఒక మోడిని వివరిస్తాను.

ఒక సారి మాప్రాంతంలో మారేపల్లి సిద్దయ్య అనే ఒక పెద్దమనిషి వుండేవాడు. అతడేమి పెద్ద మాత్రికుడు కాదు కాని అతని ఆహార్యం మాత్రం మంత్రగాడిలాగే వుంటాడు. పెద్ద గడ్డం, మెడలో రుద్రాక్షలు, మొహాన వీభూతి రేఖలపై పెద్ద కుంకుం బొట్టు. అతను ఒక సాధారణ సాధుజీవనం గడుపుతూ భార్యా పిల్లలతో ఆ వూర్లోనే కాపురం వుండేవాడు. ప్రతిరోజు రాత్రులందు భజనలు చేసుకుంటూ వుండేవాడు. అతని తోడుకు కొంత మంది సాధువులు వచ్చి పాటలు పాడుతుండే వారు. వారు ఎక్కువగా బ్రంహంగారి తత్వాలు పాడు తుండే వారు. పిల్లల సంతోషార్థం చిన్న చిన్న ట్రిక్కులు, మంత్రాలు చేస్తుండే వాడు. బయటి వూరినుండి ఒక మంత్ర గాడు వచ్చి సిద్దయ్యతో తాను మోడి ఎత్తతానని మాట కట్టుకున్నాడు. సిద్దయ్య మోడి కట్టడి చేసే టట్టు, పరా వూరి మంత్రగాడు మోడి ఎత్తే టట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఊరి బయట ఒక పందిరి వేశారు. దానిముందు ముగ్గు పిండితో, బొగ్గు పొడి తోను దయ్యం ముగ్గులేసి మధ్యలో కుంకుమ, పశుపు, వేసి అక్కడక్కడా కోసిన నిమ్మకాయలను వేశారు. పందిరి ముందు బాక కొక్కటి చొప్పున ఏడు చిన్న గుంతలు త్రవ్వారు. మొదటి గుంత త్రవ్వు తుండగా జానెడు లోతులోనె ఒక చింత వేరు అడ్డు పడింది. సిద్దయ్యకు ఒక ఆలోచన వచ్చింది. దాని ప్రకారం .... ఎద్దుల మెడకు కట్టే ఒక పలుపు తాడు తెచ్చాడు, పలుపు తాడు రెండు చివరలను ఒకటిగా కట్టి అక్కడ ఒక బంతిలాగ వుంటుంది. ఆ పలుపు తాడును గుంతలో కనబడిన చింత వేరుకు బంధించి దాని కొసన వున్న బంతి మాత్రము పైకి పెట్టి దానికి పసుపు, కుంకుమ పూసి, అక్కడ రెండు నిమ్మకాయలు కోసి వేసినారు. దాని తర్వాత గుంతలో ఒక కోడి గుడ్డును, మోడో గుంతలో ఒక కొబ్బరి కాయను, ఆ తర్వాత ఒక నిమ్మకాయను ... .... ఇలా ప్రతి గుంతలోనూ ఒక వస్తువును వుంచి వాటిని మంత్రంతో కట్టడి చేశాడు. కట్టడి అంటే వాటి దగ్గరకి ఎవరైనా వస్తే రక్తం కక్కుకుని పడిపోతారు, లేదా ఇంకో పెద్ద ఉపద్రవం ముంచు కొస్తుంది. ఇదంతా చేసి మంత్ర గాడిని మోడి ఎత్తమని చాలెంజ్ చేశాడు.

మంత్ర గాడు పాముల బుర్ర వూదుతూ పాములాగా మెలికలు తిరుగుతూ వింత విన్యాసాలు చేస్తూ మొదటి గుంత వద్దకు వచ్చి దాని చుట్టు తిరిగి అందులోని వస్తువును తీయడానికి ప్రయత్నించి క్రింద పడిపోయాడు. వళ్లంతా దురద పెట్టి నట్లు వళ్ళంతా గోక్కుంటున్నాడు. తన శిష్యుడు వచ్చి ఏదో మంత్రించిన పొడిని చల్లుతాడు. అంతట తన బాధలను పోగొట్టుకొని తిరిగి పాములబుర్ర వూదుతూ.... మొదటి గుంతలో నున్న వస్తువును అతి కష్ణంగా తీసి వేశాడు. ఆ తర్వాత రెండో గుంత.... అందులో కోడి గ్రుడ్డు ఉంది. ఆ గుంత చుట్టూ పాముల బుర్ర వూదుతూ అనేక విన్యాసాలు చేసి గుడ్డును తీయడానికి ప్రయత్నించగా ఆ గుడ్డు పిల్లగా మారి ఎగిరి పోతుంది. దానివెంబడి పడి పట్టుకొస్తాడు. మరో గుంత వద్దకు రాగానే దాని చుట్టూ మంటలు వ్వాపించాయి. దాన్ని అర్ప బోతే ఎంతకూ ఆరదు. మరో గుంతలోనున్న వస్తువును తీయబోతే అది పామై అతని చేయిని చుట్టుకుంటుంది. మంత్రం తో దానిని కట్టడి చేసి సంచిలో వేసి కట్టేస్తాడు. మరో గుంతలో చేయి పెట్టగానే అనేక తేళ్ళు బయటకు వస్తాయి. వాటి నన్నిటిని తన మంత్ర విద్యతో అచేతనం చేసి మరో సంచిలో పడేస్తాడు. ఇంతలో ఎవరో వాతలు పెట్టినట్టు వళ్ళంతా వాతలు తేలుతాయి. రక్తం కక్కుకుని నేలమీద పడి ఇక వీడి పని ఇంతే అనేంతగా విలవిల్లడి పోతాడు మంత్ర విద్యల ప్రభావంతో. అంతలో అతని శిష్యుడు వచ్చి ఏవో మంత్రాల వేసి రక్షిస్తాడు. మరలా పాముల బుర్ర పట్టుకొని వూదుతూ తిరుగుతాడు. ఇలా అన్ని గుంతల వద్దా అనేక పడరాని పాట్లు పడి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అవతలి వ్వక్తి మంత్రాలను చిత్తు చేస్తూ ఏడో గుంత వద్దకు వచ్చాడు. పశుపు, కుంకుమ పూసిన ఆ బంతి లాంటి వస్తువో అతనికి అర్థం కాలేదు. మారేపల్లి సిద్దయ్య మాత్రం ముగ్గు మధ్యలో కూర్చొని మంత్రాల వల్లిస్తూనే ఉన్నాడు. అతని మంత్రాలు ఫలించి ఎదుటి మంత్రగాడి మంత్రాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి., ఈ గుంతల్లో పెట్టే వస్తువులు ఒకె విధంగా వుండవు.. ఒక్కో మంత్రగాడు ఒక్కోవిధంగా వస్తువులనేర్పాటు చేస్తాడు. కప్ప, పాము, పావుర్ఫము, కాకి, తొండ వంటి ప్రాణులు, కొబ్బరికాయ,నిమ్మకాయ, ఎముకలు, పుర్రె, మరెన్నో వింత వస్తువులు వుంటాయి.

ఎంత ప్రయత్నించినా ఆ బంతి లాంటి పదార్థము బయటకు రాలేదు. ఎన్నిమంత్రాలు వేసినా ఫలించ లేదు. చివరకు ఆ మంత్ర గాడు తన ఓటమిని అంగీకరించాడు. ప్రేక్షకులనుండి తలా కొంత ధనం భహుమానంగా ఇస్తారు ఇద్దరి మంత్ర గాళ్ళకి. ఆ విధంగా మోడి ముగుస్తుంది. మోడి చూడ్డానికి అతి భయంకరంగానూ, జుగుస్సకరంగాను, ఒక్కోసారి అసహ్యంగానూ వుంటుది. కనుక చిన్న పిల్లలను స్త్రీలను మోడిని చూడడానికి అనుమతించరు. (ఈ మోడి లోని అసలు రహస్యం ఆ తర్వాత చాలకాలానికి తెలిసింది. అదేమంటే ...... ఆ మంత్ర గాళ్ళిద్దరూ ముందుగానే ఒక రహస్య ఒప్పందానికి వచ్చి ఈ మోడి ప్రక్రియను మొదలు పెడతారు. అని. అక్కడ జరిగిన ఘోరాలు, ప్రమాదాలు మొదలగునవి కేవలం గారడి విద్యలనీ, అక్కడ బయట పడిన పాములు, తేళ్ళు ముందుగా తాము తెచ్చుకున్నవనీ అని తెలిసింది.

పల్లెల్లో వాణిజ్యం

[మార్చు]
దామలచెరువు గ్రామ సంతలో గాజులమ్ముతున్న స్త్రీ

రైతులు తమకు కావలిసినంత తిండి గింజలను దాచుకొని మిగతా దాన్ని అమ్మేవారు. కాని ఎక్కువగా బెల్లం, వేరుశనగ కాయలు, కూరగాయలు, పండ్లు మొదలగునవి మాత్రమే అమ్మేవారు. దాని ద్వారా మాత్రమే రైతులకు డబ్బులు అందేవి. కాని ఊర్లలోకి అమ్మ వచ్చే మామూలు వస్తువులకు వస్తు మార్పిడి పద్ధతి అమలులో వుండేది. ఉప్పు కావాలంటే కొంత ధాన్యాన్ని ఇచ్చే వారు. వడ్ల విలువ ... ఉప్పు విలువను రైతు మహిళలు బేరీజు వేసుకుని చూసే వారు కాదు. వారికి అతి సులభంగా అందు బాటులో వున్నవి 'వడ్లే'.. ఈ వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా వడ్లతోనె జరిగేది. చింత పండుకు ఖర్జూర పండ్లు, గనిసె గడ్డలు, ఇచ్చేవారు. ఖర్జూర పండు ఇక్కడ అరుదుగా దొరికేది. ఖర్జూరానికి సమ తూకానికి సత్తు గిన్నెలు, పాత బడిన రాగి పాత్రలు కూడా ఇచ్చేవారు. కాని ధాన్యానికి వస్తువులివ్వడం కేవలం పల్లెల్లో మాత్రమే జరిగేది. సంతల్లో ఇటువంటి వ్యాపారం లేదు. అక్కడ ఏవస్తువైనా డబ్బిచ్చి కొనాల్సిందే. డబ్బు చలామణి అతి తక్కువ. ముఖ్యంగా రైతు స్త్రీలలో డబ్బును తమ వద్ద వుంచుకున్న వారు ఆ రోజుల్లో బహు అరుదు. ప్రస్తుతం ధాన్యంతో వస్తు మార్పిడి ఎక్కడా లేదు. కాని దాని ఆనవాలుగా .... సీసాలకు, పాత పుస్తకాలకు ఐసు పుల్లలు, చింత గింజలకు గెనిసి గెడ్డలు, కొబ్బారికి కొబ్బెర నూనె, ఆముదాలకు, ఆముదమూ, వేపగింజలకు వేప నూనె, కానుగ గింజలకు కానుగ నూనె ఇలా కొంత వస్తు మార్పిడి ఉంది. ఈ రోజుల్లో ప్లాస్టిక్ సామానులు ఎక్కువయ్యాయి. పల్లెల్లో వీటికి ఆదరణ ఎక్కువ. బిందెలు, బక్కెట్లు వంటి ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువగా వాడుతారు. దానికి కారణమేమంటే అవి చాల తేలికగా వుంటాయి. పాడైన పాత ప్లాస్టికి సామానులకు కొత్త ప్రాస్టిక్ సామానులు ఇస్తున్నారు. పాడైన ఇనుప సామాను కూడా తీసుకొని కొత్త పాత్రలను ఇస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలలో ఇదొక పెద్ద వ్వాపారం.

పాకా సంతలో అమ్మకానికున్న అపరాలు
దామల చెరువు వారపు సంతలో అమ్మకానికున్న అలంకార సామాగ్రి
సంత

పల్లె వాసులు పండించిన కూరగాయలు, మొదలగు వాటిని విక్రయించ డానికి గతంలో వారపు సంతలుండేవి. వారంలో ఒక రోజు ఒక గ్రామంలో సంత జరుగు తుంది. చుట్టు ప్రక్కల పల్లె వాసులు తాము పండించిన కూరగాయలు, పండ్లు ఇతర వస్తువులు అమ్ముకోడానికి, తమకు కావలసిన వస్తువులు కొనుక్కోడానికి ఈ వారపు సంతలు చాల ఉపయోగ కరంగా వుండేవి. రైతులేకాక ఆ సంతలో కుమ్మరి వారు కుండలను, మేదరి వారు తట్టలు, బుట్టలు, చాటలను కమ్మరి వారు కత్తులు, కొడవళ్ళు మొదలగు ఇనుప వస్తువులను సంతకు తెచ్చి అమ్మేవారు. ఈడిగ వారు దువ్వెనలు, కుంకుమ బరిణెలు, గాజుల వారు గాజులను ఇలా అనేక వస్తువులను ఈ సంతలలో అమ్మేవారు. ఈ సంతలకు ఇతర ప్రాంతాల నుండి అనేక వస్తువులు అనగా బట్టలు, తినుబండారలు, ఇతర కిరాణా వస్తువులు, అనగా సబ్బులు, పౌడర్లు, మొదలగు అలంకరణ సామాగ్రిని ఎద్దుల బడ్ల మీద తెచ్చి అమ్మేవారు.తాము తెచ్చిన వస్తువులను అమ్ముకొని తమకు కావలసిన వాటిని కొనుక్కోవడాని ఈ సంతలు ఎంతో ఉపయోగ కరంగా వుండేవి. ఒక విధంగా ఇక్కడ పురాతన వస్తు మార్పిడి జరిగేది. ఆ రోజుల్లో సంతలు చాల రద్దీగా వుండేవి. ఆ సందర్భంలో సంతల్లో చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చిన్న పిల్లలకు వినోధాన్ని ఇచ్చేవి. ఆ రోజుల్లో సంతకు వెళ్లడమంటే ఒక జాతరకు వెళ్లడం వంటిదే, ప్రస్తుతం కూడా ఈ వారపు సంతలు జరుగు తున్నాయి. ఇవి ఆ కాలంలో వున్నంత రద్దీగా లేవు. కారణమేమంటే ప్రస్తుతం ప్రతి పల్లెలోను చిన్న చిన్న దుకాణాలు వెలిశాయి. రైతుల అత్యవసర వస్తువుల కొరతను అవి తీరుస్తున్నాయి. అయినా కూరగాయలు, మొదలగు వాటి కొరకు ఇప్పటికి సంతలపైనే రైతులు ఆధార పడి ఉన్నారు. అక్కడక్కడ కొన్ని ప్రత్యేక సంతలుండేవి. పశువుల అమ్మకము, కొనుగోలుకు కొన్ని ప్రాంతాలలో సంతలు జరిగేవి. వాటిని పరస అనేవారు. అక్కడ కేవలము పశువుల అమ్మకాలు... కొనుగోళ్ళు మాత్రమే జరిగేవి. ఈ సంతల వల్ల సంత జరిగే ఆయా గ్రామాలకు కొంత ఆదాయ వనరు కూడా సమకూరేది. గ్రామ పంచాయితీ వారికి సంతకు వచ్చిన అమ్మకపు దారులు కొంత పన్నుకట్టి సంతలో వస్తువులను అమ్ముకోవలసి వుంటుండి. అదే ఆ గ్రామ పంచాయితీకి ఆదాయ వనరు. ఎప్పుడైనా సంత జరిగే రోజు పండుగ వస్తే.... ఆ సంతను ఒకటి రెండు రోజులు వెనకకు గాని, ముందుకు గాని జరుపుతారు. ఆ విధంగా పలాన రోజున సంత జరుగుతుందని అంతకు ముండు జరిగి సంతలో చాటింపు వేసే వారు.

పల్లెల్లో న్యాయవ్యవస్థ

[మార్చు]

న్యాయము .. చట్టము.... ఆ రోజుల్లో న్యాయ పరమైన విషయాలను వారి కుల పెద్దలు విచారించి తగు నిర్ణయం తీసుకునేవారు. కులపెద్దలే న్యామ మూర్తులు, వారి తీర్పే అంతిమం. కోర్టులు, పోలీసుల ప్రసక్తే వుండేది కాదు. కుల పెద్దలే పెద్దమనుషులు. ఒక వేళ ఎవరైనా పెద్ద మనుషుల మాటను కాదంటే వారికి విదించే శిక్ష ఏమంటే..... వారింటికి చాకలిని మంగలిని నిలిపి వేయడం. అటు వంటి సందర్భంలో చాకలిని, మంగలిని పిలిపించి వారితో పలాన వారికి శిక్ష వేశాము... వారి ఇంటికి 'పనికి' వెళ్ల కూడదు. అని తమ నిర్ణయం చెప్పేవారు. చాకలి, మంగలి పెద్ద మనుషుల మాటలను తప్పకుండా పాటించే వారు. అది నిందితులకు పెద్ద అవమానం. వ్వవహారాన్ని అంత దూరం రానిచ్చే వారు కాదు. మిగతా వూరి పెద్దలు నిందితులను ఒప్పించి రాజీ కుదిర్చే వారు. అంతటితో ఆ వ్యవహారం ముగిసేది. ఇంతకన్నా పెద్ద శిక్ష మరొకటి వుండేది. అది నిందితుడు మాట వినక పోతే సాంఘిక బహిష్కరణ చేసె వారు. అంటే నిందితుని తో గాని, వారి ఇంటి వారితో గాని ఆ ఊరు వారెవ్వరు మాట్లాడ కూడదు. వ్యవసాయ పనుల్లో వారికెవ్వరికి సహాయం చేయ కూడదు. పండగ సందర్భాలలో దేవుని ముందు పొంగలి పెట్టెటప్పుడు అందరితో బాటు వారిని పొంగలి పెట్టనిచ్చేవారు కారు. ఇలా వుండేవి ఆనాటి శిక్షలు. ఆ పెద్దమనుషుల తీర్పులు కూడా నిష్పత్తి పాతంగా వుండేవి.సర్వ జనాదరణ పొందేవి. రాను రాను ఈ వ్వవస్తలో చాల తొందరగా మార్పు జరిగింది. స్వార్థపరులైన కొందరు కుల పెద్దలు, లేదా వూరి పెద్ద మనుషులు తమ స్వార్థానికి అనుకూలంగా తీర్పు చెప్పి ఆదాయం గడించేవారు వచ్చారు. వారి ఆగడాలు మించి పోవడంతో ప్రజలలో వారి పై ఏహ్యభావం కలిగి వారివద్దకు పోవడం గాని, తీర్పు చెప్పమని కాని అడిగేవారు లేకుండా పోయారు. అలాంటి వారు మెల మెల్లగా రాజకీయాల వైపు మొగ్గు చూపి అలా స్థిర పడి పోయారు. ఆ విధంగా రాజకీయాలు కలుషితం ఐపోయాయి. ఈనాడు సరైన కుల పెద్దలులేరు, అరా కొరా అక్కడక్కడా వున్న వారి మాట వినే పరిస్థితి లేదు. ఆపడానికి చాకలి గాని మంగలి గాని లేరు. బహిష్కరించడానికి ఎవ్వరు పొంగళ్లు పెట్టడమే లేదు. అంచేత. .. ఏదైనా వ్యవహారం ముదిరితే పోలీసులు, కేసులు, కోర్టులల్లో తేలాల్సిందే. ‘గ్రామ పాలన’ నాడు మునసబు, కరణాల ద్వారా నిర్వహించబడేది. వీరికి ‘తలారులు’ (కట్టుబడులు) సహాయకులుగా ఉండేవారు. గ్రామంలో అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోకుండా, అక్రమాలు జరుగకుండా, భూమివాదాలు రాకుండా వీరు శాంతిభద్రతలు కాపాడే వారు. జననమరణ రిజిష్టర్లు, రెవెన్యూ సంబంధిత విషయాలు పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి తమ సేవలందించే వారు. జ్ఞాన, వయోవృద్ధులు కూడా ప్రజల మధ్య తలెత్తే చిన్న చిన్న తగాదాలను పంచాయితీ రూపంగా తీర్చి ఇరువర్గాల వారిని సమ్మతింపజేసేవారు. భూమి పన్ను కట్టే వారికి ఓటు హక్కు ఉన్న రోజుల్లో గ్రామ ప్రజలు ఒక చోటచేరి చేతులెత్తి నాయకుని ఎన్నుకొనే వారు. ‘జిల్లా బోర్డులు’ అమల్లో ఉండే రోజుల్లో కూడా ఎన్నికలు నామమాత్రమై నాయకుని సాధ్యమైనంతవరకు ఏకగ్రీవంగానే ఎన్నుకొనే వారు. మొన్నమొన్నటి వరకు ‘పంచాయితీ’ ఎన్నికలు సక్రమంగా, శాంతియుతంగా జరిగి చక్కని పరిపాలన జరుగుతూ ఉండేది. గ్రామానికి కావలసిన వాడు, నైతిక విలువలకు కట్టుబడి ఉండేవారు. ఏ వర్గం వాడైనా ఒకటే అనుకొనేవారు. ప్రజాపాలన సక్రమంగా జరుగుతుండేది ఆ గ్రామాల్లో.

కుల గురువులు

[మార్చు]

ఇది ఒక అతి పురాతన మైన సాంప్రదాయం. ప్రతి కులానికి కుల గురువుల వ్వవస్థ వుండేది. వారు ఒక పద్ధతి ప్రకారం అనేక పల్లెలను సందర్సిస్తారు ఆయావారి కులాచారాలను, గోత్ర నామాలను, ఇతరమైన కుల సంప్రదాయాలను చెప్పుతారు. కులగురువులు కూడా ఆ కులానికి చెందినవారే. కాని వారి వ్వవహార మంతా బ్రాంహణుల లాగే వుండేది. వారి కులం వారైనా ఇతరులు వండిన పదార్తాలను తినరు. వారి రాకను ముందు గానె వర్థమానం వస్తుంది. వారు ఒక పల్లెకు వస్తే వారికొరకు ఒక ఇల్లు శుభ్రం చేసి వారికి అప్పగిస్తారు. వారు ఆఇంటిలో కొన్ని రోజులు ఉంటారు. ఆ కులానికి చెందిన గృహస్తులు ఆ చుట్టు పక్కల నున్న చిన్న పల్లెలలోనుండి వారికి కేటాయించిన రోజున ఆ గురువుల కుటుంబానికి వంటకు కావలసిన సకల వస్తువులు ముందు రోజే సమకూరుస్తారు. దాంతో ఆ గురు పత్ని వంట చేసి ఆతర్వాత పూజ చేసి ఆ గృహస్తుని పిలిచి అతని ఇంటి పేరు, గోత్రము కొత్తగా పుట్టిన వారి పేర్లు ఇలాంటి వివరాలు అదివరకే వారి వద్దనున్న వివరాలతో సరి పోల్చు కుని అవసరమైన వాటిని నామోదు చేసుకొంటారు. అలా ఆ కులానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల పల్లెలో వున్న ఆ కులపు వారందరు వారికి కేటాయించిన రోజున వచ్చి గురువులకు కొంత సంబావన సమర్పించి వారి నుండి ఆశీర్వాదాన్ని, ప్రసాదాన్ని స్వీకరించి వెళతారు. ఆ కులానికి సంబంధినిన వారందరు గురువులను సందర్సించు కోవలసిందే. చివరి రోజున గురువుల కుటుంబాన్ని గౌరవ మర్యాదలతో సవారి బండిలో వారు నిర్ణయించు కున్న మరో గ్రామానికి సాగ నంపాలి. ఇలా ఆ కులగురువులు దేశాంతరాలు తిరుగుతూనే వుంటారు. ఆ కులానికి సంబంధించి జనాభా లెక్కలు అన్ని వారి వద్ద వుంటాయి. సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఒక సారి కులగురువులు కనిపించారు. ఆతర్వాత కనబడ లేదు. వీరు ఆ కులానికి సంబంధించిన పూర్తి స్థాయి జనాభాలెక్కలు సేకరించి పెట్టుకునే వారు. వివాహ సంబంధాలకు మొదలగు వాటికొరకు దాన్ని ఉపయోగించుకునే వారు. కొన్ని కులాలలో ఈ వ్వవస్త ఈ నాటికి వున్నది

శుభ కార్యాలు

[మార్చు]

పెళ్ళి. ఆ రోజుల్లో పెళ్ళి సుమారు మూడు రోజులు జరిగేది. అన్నిరోజులు.... బాజ బజంత్రీలు, వంటలు భోజనాలు ఎన్నో వుండేవి. పెళ్ళిల్లు ఇంటి వద్దనే జరిగేవి. పెళ్ళి మండపాలు అప్పట్లో లేవు. ఎక్కువగా అయిన వారి సంబంధాన్నే చేసుకునె వారు. అరుదుగా బయటి సంబంధం చూసే వారు. ఇరువైపుల వారు వధువును గాని వరున్ని గాని అనేక పరిక్షలకు గురి చేసి ప్రత్యక్షంగాని, పరోక్షంగాని చాల వివరాలు రాబట్టే వారు. స్నానం చేయించే నెపంతో చాకలి వారు అంగాంగ పరిక్ష జరిపేవారు రహస్యంగ. ఇక శోభనం రోజున తెల్లవారి చాకలి వచ్చి పక్కబట్టలను శల్య పరిక్ష చేసి ఆ రాత్రి వారి కలియక సక్రమంగా జరిగిందా లేదా అని నిర్ణయించే వారు. ఆరోజు సరైన ఫలితం రాకుంటే ఆ మరుదినం ...... ఇంకా కొన్ని రోజులు చాకలి నిశితంగా పరిశీలించి వివరాలను పెద్ద వారికి చెప్పేవారు. అంతే గాక సంబంధిత ముసలి వారు కూడా ఈ పరీక్ష వ్యవహారంలో ప్రధానంగా పాల్గొనే వారు. ఆ రోజుల్లో కులాంతర వివాహాలు పూర్తిగా లేవు. కాని అయిన వారి అమ్మాయిని తీసుకెళ్లి గుళ్లొ పెళ్ళి చేసుకొని వచ్చేవారు. ప్రస్తుతం పెళ్ళిల్లు పెళ్ళి మండపాలలో మాత్రమే జరుగు తాయి. తమ ఇళ్లముందు అంతగా జరుగుట లేదు. పెళ్ళి చేసుకుని పరాఊరునుండి ఈ వూరికి వచ్చిన పెళ్ళి కూతురు ఆ వూరిలో ఇంటింటికి కొన్ని పలహారాలు, పండ్లు, పశుపు కుంకుమ మొదలగువాటిని పంచాలి. పిల్ల పుడితే పురుడు పోయడానికి చాకలితో వూరి వారందరిని పిలవాలి. వారందరు వచ్చి నీళ్లు పోస్తారు. పల్లెల్లో కులాల వారిగా కొన్ని పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అవి ఇప్పటికి జరుగు తున్నాయి. ఒక కులంలో ఒక వర్గం వారికి ఒక కుల దేవత వుంటుంది. ఏడాది కొక సారి ఆ దేవతకు జాతర జరుపు తారు. అలా అన్ని కులాల వారికి, వర్గాల వారికి వారి కుల దేవత జాతర జరుగు తుంది. ఇది ఆవర్గానికి మాత్రమే సంబంధించింది. ఉదాహరణకు.... కమ్మ కులస్తులలో..... గొర్రెపాటి వారికి కుల దేవత దామల చెరువు సమీపంలో వున్న మొరవ పల్లిలో కొలువై వున్న వున్న ధనుకొండ గంగమ్మకు జాతర జరుపుతారు. ఆ రెండు మూడు రోజుల పాటు, విందు, వినోదాలు, భజనలు, కోలాటాలు, ఇలా చాల కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజున జంతు బలులు కూడా వుంటాయి. అదే విధంగా... కమ్మ కులస్తులలో యల్లంకి అనె ఇంటి పేరు గల వారికి ఎర్ర చెరువు పల్లెలో కొలువై వున్న గురప్ప దేవుడు వారి కుల దైవం. ఇక్కడ కూడా ఏడాదికి ఒకసారి ఘనంగా జాతర జరుపు తారు. ఇతర కులస్తులలో కూడా ఇటు వంటి కులదైవానికి పూజలు, జాతరలు జరుగు తుంటాయి. ఇవి గాక గృహ ప్రవేశము, వంటి కార్యక్రమాలు చాల అరుదుగా జరిగేవి. గతంలో చిన్న పిల్లల పురుడు కూడా అందరికి చిన్న శుభ కార్యమే. అలాగే పెద్ద ఆడపిల్లలు సమర్తాడితె .... అది కూడా ఒక చిన్న శుభ్య కార్యమే. ఆ అమ్మాయిని ఒక ప్రత్యేక గదిలో కొన్నాళ్లు వుంచి మంచి ఆహారానిస్తారు. చివరి రోజున స్నానం చేయించి చిన్న పాటి సంబరం జరుపుకుంటారు. స్నానం చేసిన రోజున ఆ అమ్మాయి ఒంటి మీదున్న బట్టలు చాకలికి వదిలేయాలి. ఇది ఆచారము. దాని నుండి పుట్టినదే.. ఈ సామెత: " సరదాకు సమర్తాడితె చాకల్ది చీర పట్టు కెళ్లిందట ".

అశుభ కార్యాలు

[మార్చు]

చావు, దివసాలు మొదలగు నవి అశుభ కార్యాలు. వీటికి కూడా చాల ప్రాముఖ్యత ఉంది.

మరణాంతర కర్మలు

[మార్చు]

హిందు మతంలో ఎవరైనా మరణిస్తే తర్వాత చేసె ఖర్మలు లేదా కార్యక్రమాలు ఆ యా ప్రాంతాన్ని బట్టి లేదా కులాన్ని బట్టి చిన్న మార్పులు తప్ప సధారణంగా ప్రధాన కార్యక్రమాలు ఒకే విధంగా వుంటాయి. మరణించిన వ్వక్తి బాలుడా, పెద్ద వాడా, పెళ్ళి అయిందా లేదా, స్త్రీ యా పురుషుడా, స్త్రీ అయితే విధవ రాలా పుణ్య స్త్రీ యా అనె దాన్ని బట్టి కొన్ని పద్ధతులలో మార్పులుంటాయి. ఇందులో భూమిలో గొయ్యి తీసి పూడ్చి పెట్టడము లేక కాల్చడము ఈ రెండు పద్ధతులు వాడుకలో ఉన్నాయి.

మరణానంతరం శవాన్ని పడుకో బెట్టే పాడె.

శవ యాత్ర

[మార్చు]
శవానికి చేసిన అలంకరణ, దూపదీప నైవేద్యం సమర్పించడము

నలుగురు వ్వక్తులు పాడెను ఎత్తి తమ భుజాలపై పెట్టుకొని నడువగా ముందుగా తలకొరివి పెట్టే వ్వక్తి కుమ్మి సట్టిని ఒక చేత్తో పెట్టుకొని ఇంకొక చేత్తో ఒక కాగడాను పట్టుకొని ముందు నడుస్తుంటే అంతకు ముందే బాజా బజంత్రీలు నడువగా వారి కన్నా ముందు మందు గుండు సామాగ్రి కాలుస్తుంటారు. గతంలో శవానికి ముందు గుంటిపోగులను కాల్చేవారు. (గుంటి పోగు) ఆనగా.... ఒక బారెడు వెదురు కర్రకు కొసన ఒక బలమైన ఇనుప గొట్టాన్ని బిగించి వుంటారు. ఆ గొట్టంలో నల్లమందు నింపి గొట్టానికి క్రింద భాగంలో వున్న చిన్న రంధ్రంలో వత్తి వుంచి గొట్టానికి పై భాగాన ఒక జానెడు కర్ర ముక్కకు గట్టిగా బిగ గొట్టి వత్తికి నిప్పు పెట్టి తుపాకి లాగ పట్టుకొని ఆకాశం వైపు చూపిస్తాడు. అది పెద్ద శబ్దంతో పేలి పైన బిగించిన కర్ర ముక్క ఆకాశంలోకి వెళ్లి పోతుంది. ఆ విధంగా శవ యాత్ర సాగినంత దూరం గుంటి పోగులను కాలుస్తూనె వుంటాడు. అదే విదంగా ఆ వూరి చాకలి దీవిటి పట్టుకొని శవ యాత్రలో ముందు బాగాన వుంటాడు. అది పగలైనా సరే దీవిటి వుండాల్సిందే. శవానికి కుడి ప్రక్కన ఒక వ్వక్తి నడుస్తూ తన వద్ద వున్న పళ్లెంలోని బొరుగులు.... చిల్లర డబ్బులు మొదలగునవి శవానికి ఎడం వైపుకు దాట వేస్తుంటాడు. శవాన్ని మోస్తున్న వారు శవానికి అలంకరించిన పూల దండలను తుంచి పూలను క్రింది జార విడుస్తుంటారు. మధ్య మధ్యలో శవాన్ని మోస్తున్న వారు భుజాలు మార్చు కుంటారు.

అంటు: ఖర్మ కాండలు తీరు నంతవరకు ఆ ఇంటి వారికి వారి పాలె వాళ్లకు అంటు వుంటుంది. ఆ రోజులలో ఎవరి ఇంట్లోను శుభ కార్యాలు చేయరాదు. పాలె వాళ్ళు అంటే అదే ఇంటి పేరున్న వారి బంధువులు. ఈ అంటు చావు సందర్భంలోనె గాకుండా... ఎవరి ఇంట్లో నైనా అమ్మవారు అనగా small fox, chicken fox మొదలైన్ వ్వాదులు వస్తే ఆ ఇంటికి అంటు వుంటుంది. ఆ ఇంటికి ఎవరు రాకూడడు, ఆ ఇంటి వారు కూడా ఎవరి ఇంటికి రాకూడదు. ఆ ఇంటి ముందు బూడిదతో ఒక అడ్డ పట్టి వేసి వుంటుంది. దానిని చూసి ఆ ఇంటికి అంటు వున్నదని బిచ్చ గాళ్లు కూడా రారు. తెలియక ఆ ఇంటికి వచ్చి వ్వాది బారిన పడకూడదనే ఆ నిబందన.

పాలు పోయడం

[మార్చు]

మరుదినం పాలు పోయాలి. ఆ రోజు శని వారం అయితే పాలు పోయకూడదు. అలా పోస్తే దాన్ని శని పాలు అంటారు. దానికి ప్రత్యామ్నంగా ఆ రోజు ఎవరు చూడకుండా తెల్లవారకముందే వెళ్లి పాలు పోసి వస్తారు. దానిని దొంగ పాలు అంటారు.

దివసాలు:

[మార్చు]
దివసాలు సందర్భంగా అమ్మవారికి (పంతులు గారి భార్య) కాళ్లు కడిగి పూజిస్తారు. (9 వ రోజు)

పాలు పోసి ఇంటికొచ్చిన తర్వాత ఒక పెద్ద పళ్లెం తీసుకొని దాని నిండా ఇసుక పోసి అందులో నవ ధాన్యాలు పొసి ఒక ప్రక్కన ఒక ఇటుకను పెట్టి దానికి కుంకుం బొట్టలు పెట్టి పూజకు సిద్దంగా వుంచాలి. దానిని ఇంట్లో ఒక ప్రక్కన పెట్టి దాని చుట్టు కొత్త బట్టలు, పండ్లు, పూజ ద్రవ్వాలు సిద్దంగా వుంచాలి. తల కొరివి పెట్టిన వ్వక్తి ఉపవాస ముండి మెడలో బద్దె ధరించి (జందెం లాగ) తల స్నానం చేసి ఆ పళ్లెం ముందు దూప దీప నైవేద్యాలు సమర్పించి అక్క డ అనేక వంటలతో తళిగ వేసి పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి వేరొక విస్తరిలో తళిగ లోని పదార్తాలన్నింటి లోని కొంత తీసి మారొక విస్తరిలో వేసి బయటకు వెళ్లి దానిని కాకులకు పెట్టాలి. దానిని పిండం అంటారు. ఆ పిండాన్ని కాకులు ముట్టాక అతను ఇంట్లోకి వచ్చి తళిగలోని మిగిలిన పదార్థాలను తిని ఉపవాసం విరమించాలి. అప్పుడే..... వచ్చిన బందు మిత్రులు బోజనాలు చేస్తారు. ఆ తొమ్మిది రోజులు ఈవిధంగా తప్పనిసరిగా చేయాలి. ఈ తొమ్మిది రోజులు అతను ఎవరి గడప తొక్కకూడదు. అనగా ఎవరి ఇంటికి వెళ్లకూడదు. ఈ తళిగ వేసె కార్యక్రమం...... దగ్గిర బంధువులు ఒక్కొక్కరు ఒక్క రోజున వేస్తారు. వారు తమ ఇళ్లవద్ద వంటలు తయారు చేసుకొని రావచ్చు., లేదా వీరింటికి అన్ని సామానులు తెచ్చి ఇక్కడే వంటలు చేసి తళిగ వేయ వచ్చు. ఇలా ప్రతి రోజు కార్యక్రమం వుంటుంది. తొమ్మిదో రోజు పెద్ద కార్యక్రమం జరుగుతుంది.

తొమ్మిదోరోజు:

[మార్చు]

thumb|right|దివసాలు సందర్భంగా కాకులకు పిండం పెట్టి కాకుల కొరకు ఎదురుచూస్తున్న వ్వక్తి తొమ్మిదో రోజున విశేష కార్యక్రమం వుంటుంది. ఈ తొమ్మిది రోజులు జరిగి నట్టుగానె యదావిదిగా తళిగ వేసి.... దానితో పాటు మరో మూడు తళిగలు వేసి వాటన్నింటిని అరటి ఆకులలో కట్టి ఒక గంపలో పెట్టుకొని ఒక బిందెడు పాలను తీసుకొని శవాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశానికి వెళ్లాలి. ఈ రోజు తళిగలో విశేషంగా ఎక్కువగా పిండి వంటలుంటాయి. ముఖ్యంగా చనిపోయిన వ్వక్తి ఇష్ట పడే ఆహార పదార్థాలు తప్పని సరిగా వుండాలి. ఇవన్ని తీసుకొని గుంత వద్దకు వెళ్లి అక్కడ గుంతకు తూర్పువైపున మూడు చిన్నరాళ్లను కడిగి పెట్టి వాటికి కుంకుంబొట్లు పెట్టాలి. ఇంటి నుండి తెచ్చిన మూడు తళిగలను అక్కడ పెట్టి దూప దీప నైవేద్యాలు సమర్పించి, కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలి. పూజానంతరము ఆ మూడు తళిగలలోని పదార్థాలను కొంత తీసి వేరొక విస్తరిలో వేసి దానిని కాకులకు పిండం పెట్టి తిరిగి వచ్చి గుంతకు తల భాగాన ఒక చిన్న గొయ్యి తీసి అందులో తులసి మొక్కను నాటి దాని మొదట్లో ఇంటి వద్దనుండి తెచ్చిన పాలను అందరు పోయాలి. తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో వున్న శలకు పూజ చేయాలి. అప్పటికి అయ్యవారు, అమ్మావారు వచ్చి వుంటారు. అయ్యవారు ఈ కార్యక్రమానికి అనేక పూజా ద్రవ్వాలు, ఇతర వస్తువులు చెప్పి వుంటాడు. అవన్ని సిద్దంచేసుకొని తళిగలు, ఇంతవరకు పూజలందుకున్న నవదాన్యాలు పోసిన పళ్లెం, బియ్యం, అనేక రకాల కూరగాయలు, కలశానికి మూడు చెంబులు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి మొదలగువాటిని మూడు గంపలలో సిద్దం చేసుకొని ఊరి బయట తోటలో నీటి సదుపాయమున్న చోటుకి బాజబజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లాలి. ఇక్కడ ఒక ప్రక్క తలకొరివి పెట్టిన వ్వక్తి చేత అయ్యవారు వివిధ పూజలు చేయిస్తాడు.

పల్లెల్లో మూడ నమ్మకాలు

[మార్చు]

మూడ నమ్మకాలలో ముఖ్యంగా చెప్పు తగినవి: మనిషికి దెయ్యం పట్టడం, వంటి మీదకు దేవుడు రావడం, దెయ్యాలు, భూతాలు, మిత్తవలు, గాలి శోకడం వంటివి ఎక్కువగా వుండేవి. స్త్రీలాకు మాత్రమే దెయ్యం పట్టేది. దానికి మంత్రగాన్ని పిలిపించి ముగ్గులు వేసి, నిమ్మకాయలు కోసి వేప మండలతో చావ బాధేవారు. ఈ తతంగం అంతా చాల కౄరంగా వుండేది. మాంత్రికుడు వేప మండలతో కొడుతూ..... దిగతావా దిగవా .... అని అరుస్తూండగా ఆస్త్రీ దిగుతా.... దిగుతా..... అని కొంత సేపటికి స్వాదీనంలోకి వచ్చేది. ఆతర్వాత ఆమెకు తగిలిన దెబ్బలకు కాపడం పెట్టే వారు. అందుకే అన్నారు దెబ్బకు దెయ్యం కూడ వదులుతుంది అని. కొందరికి ఒంటి మీదకు ''దేవుడు పూనడం...'' లేకా పూనకం రావడం జరుగు తుంది, కొందరికి పూనకం దానంతట అదే వస్తుంది. కొందరికి పూనకాన్ని ప్రేరేపించి తెప్పిస్తారు. ప్రేరేపించి పూనకము తెప్పించడానికి ఒక వ్వక్తి ముందు అతని సమ్మతితో అతని ముందు నిప్పులు లో సాంబ్రాణి పొగ వేస్తారు. ఆ వ్వక్తి దాని ముందు కూర్చొని కళ్లు మూసుకొని ఏదో జపంచేస్తూ సుమారు పది నిముషాలు తల ఆడిస్తుంటాదు. అలా కొంత సేపు వూగాక ట్రాంశ్' లోకి వెళ్లి పోతాడు. ఒక్కోసారి గురి కుదరర ఎంత సేపైనా పూనకం రాక పోవచ్చు. అప్పుడు ఆ తతంగాన్ని అతనే వాయిదా వేస్తాడు. పూనకం వచ్చాక ఆ వ్యక్తి మారు గొతుతో ..... వూగుతూ ఏదేదో మాట్లాడు తుంటాడు . అప్పుడు పక్కనున్న వారు., వారికి కావలసిన ప్రశ్నలు సందించి జవాబులు రాబట్టు కుంటారు. ఆంతా అయ్యాక దేవుడు కొండెక్కి పోతాడు. అప్పుడా వ్వక్తి మామూలు స్థితికి వచ్చి 'దేవుడు ఏమి చెప్పాడ' ని ఎదుటి వారినే అడిగి తెలుసుకుంటాడు. ఇక దెయ్యాలు, భూతాలు, మిత్తవలు, కొరివి కట్టి దెయ్యం వంటివి ఎక్కువగానె వుండేవి. పలాన వాగులో, పలాన చెట్టుపైన దయ్యాలున్నాయని చెప్పుకునేవారు. ఆ ప్రాంతానికి వెళ్లిన కొందరి దెయ్యం పట్టుకునేది. దాన్ని 'గాలి శోకడం' అనేవారు. దాన్ని తొలిగించ దానికి మూడు వీధులు కలిసే చోట ఎవ్వరు చూడ కుండా మిరప కాయలు, నిమ్మకాయలు, రక్తంతో కలిపిన అన్నం వంటివి వేసే వారు. దానిని ఎవ్వరైనా తొక్కితే వారికి కూడా గాలి సోకుతుందని నమ్మేవారు. ఇటువంటివి ప్రక్రియలు అంత విరివిగా కాకున్నా ఈనాటికీ జరుగు తున్నాయి. కడుపు నెప్పికి, దగ్గుకు ఉల్లిపాయలను మంత్రించి ఇచ్చే వారు. పశువులు తప్పిపోతె అంజనం వేసె వాడిని తీసుకొచ్చి అంజనం వేసి తమ పశువులు ఎక్కడున్నాయో కనుక్కునె వారు. అంజనం అంటే ఒక తమలపాకు మధ్యలో నల్లటి చుక్కను పెట్టి ఒక చిన్న పిల్లవాణ్ని పిలిచి ఆ చుక్కపై తదేకంగా చూడమని ఆదేసిస్తాడు నిర్వహుకుడు. నల్లచుక్కల తెల్లావు కనిపించిందా అని మాటి మాటికి అడుగు తుంటాడు నిర్వాహకుడు. ఆ బాలుడు కనిపించిందని చెప్పగానె అది ఏ దిక్కున వున్నది అని అడుగు తాడు. పలాన దిక్కులో వున్నది అని ఆ బాలుడు చేయి చూపగానె అదెంత దూరంలో వున్నది అని అడగ్గా బాలుడు చెప్పిన దిక్కున యజమాని వెళ్లి తన ఆవును తోలుకొస్తాడు. పంటలు బాగా పండాలని పొలాల్లో, చెరువు కట్టమీద ఏటను బలిచ్చి పొలి చల్లేవారు. వర్షాలు పడకుంటే సీతమ్మోరుకు తలా ఒక కుండ నీళ్లు పోయడం వంటి కార్యక్రమాలు, కప్పలకు పెళ్ళి చేసె కార్యక్రమాలు చాలనే వుండేవి. ఇటు వంటి మూడ నమ్మకాలు చాల వరకు తగ్గినా ఆరుదుగా ఇంకా కొన సాగుతున్నాయి,.

చేతబడులు...... బాణామతి.

మంత్ర,, తంత్ర విద్యలతో గిట్టని వారికి కష్టాలు కలిగించడము, ఇబ్బందులు పెట్టడం, రోగ గ్రస్తులను చేయడం., చివరకు ప్రాణాలు తీయడం వంటివాటిని చేతబడి,, లేదా బాణామతి అని కూడా అంటారు. బాణామతిని ఎవరిపై ప్రయోగించాలో వారి వెంట్రుక ఒక్కటి దొరికె తే చాలు దాంతొ అతనిపై బాణామతి ప్రయోగిస్తారు మంత్రగాళ్ళు. గతంలో ఈ విద్యలు చాల ప్రచారంలో వుండేవి. ప్రస్తుతం ఇటువంటి మూడ నమ్మకాలు చాల వరకు తగ్గినా.... అక్కడక్కడా వీటి ప్రస్తావన వార్తల్లో కనబడుతూనే ఉన్నాయి.

గతంలో మూడ నమ్మకాలు కొంత మొరటుగా వుండేవి. కొంత మంది వాటిని నమ్మేవారు కాదు. ప్రజలు వాటిని నమ్మినా నమ్మకపోయినా పెద్దగా నష్ట పోయేవారు కాదు. కాని ప్రస్తుతం కొంత మంది దొంగ బాబాల అవాతార మెత్తి మూడ నమ్మకాలను శాస్త్రీయం అనే ముసుగులో చదువుకున్న, తెలివైన వారిని కూడా బురిడి కొట్టించి తమ పబ్బం గడుపు కుంటున్నారు. ఈ నకిలీ శాస్త్రవేత్తలు ఉన్నతమైన హావ భావాలను ప్రదర్శిస్తూ వారి వేషభాషలతో హావ బావాలతో అన్ని వర్గాల ప్రజల్ని మబ్యపెట్టి తమ పబ్బంగడుపుకొని ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. ప్రజలను భారి ఎత్తున దోపిడి చేస్తున్నారు. అలాంటి వారికి సహాయ పడుతున్నట్టుగా టీవీలలో అన్ని చానళ్లలోను, అన్ని పత్రికల్లోను వారి ఉపన్యాసాలను ప్రచారంచేస్తూ అధిక ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు. వాస్తు శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, రత్న శాస్త్రం, సంఖ్యా శాస్త్రం..... ..... ఇలాంటి వాటికి చివరన శాస్త్రం అని మాట తగిలించి తాము ఆయా శాస్త్రాలలో గొప్ప పండితులమని గొప్పలు చెప్పుకుంటు ప్రజలను నమ్మిస్తున్నారు. ఇవి గాక న్యూమరాలజి అని, రమల్ ప్రశ్న శాస్త్రమని, అనేక చిల్లర విద్యలను, కనికట్టు విద్యలను గొప్ప శాస్త్రమని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలమంది వారి మాయలో పడుతున్నారు. ఇక్కడ ప్రజలు ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. ఆయా శాస్త్రాలలో పండితులమని చెప్పుకొనే వీరు....... ఏఒక్క విషయంలో ఏ ఇద్దరు వ్వక్తులు ఒకే మాట చెప్పలేరు. ఎవరికి వారే. అదేమంటే.... దానికి అనేక డొంక తిరుగుడు సమాదానాలు చెప్తారు. ఈ విధమైన మూడ నమ్మకాలు ఈ కాలంలో ఎక్కువగా ప్రభలుతున్నాయి. ఇవి గాక కొందరు బాబా అవతరామెత్తి అయిన కాడికి ప్రజలను దోచుకుంటున్నారు దేవుని పేరు చెప్పి. కొన్ని చోట్ల వారి బండారం బయట పడినా..... ప్రజల్లో వారి పట్ల నమ్మకం పోలేదు....... ..... ... సాధారణ పల్లెప్రజలు దొంగ బాబాల ఉచ్చులలో పడిన సందర్భాలు చాల తక్కువ. కారణమేమంటే.... పల్లె ప్రజలు అత్యంత ధనికులు కారు. వారికి పెద్ద పెద్ద కోరికలేమి వుండవు. దొంగ బాబాలకు కావలసినది ధనవంతులు, పెద్ద కోరికలు కోరె వారే. అంచేత పల్లె వాసులు బాబాల ఉచ్చులలో పడరు.

పుట్టకు పూజ చేసి నూలు చుట్టిన దృశ్యం, వెంకట్రామ పురంలో తీసిన చిత్రం
నాగ శిలలకు పూజ
నాగుల చవితి

నాడు పల్లెల్లోని స్త్రీలు తల స్నానం చేసి పూజా ద్రవ్వాలు తీసుకొని పాముల పుట్ట ఎక్కడున్నదో వెతుక్కుంటు వెళ్లి అక్కడ పూజ చేసి పుట్టలో పాలు పోస్తారు. కొంత మంది కోడి గుడ్డులను కూడా పుట్టలో వేస్తారు. కొంతమంది పుట్టకు నూలు దారం చుట్టి పూజ చేస్తారు. పల్లెల్లో పుట్టలు ఎక్కువగానె కనబడతాయి. కాని పట్నాలలో పుట్టలు ఎక్కువ కనబడవు. ఈ అచారం పట్నాలలో కూడా ఉంది. కాని వారికి పుట్టలు దొరకడం కష్టం. ఈ పూజను నాగ దేవతకు చేసిన పూజగా భావిస్తారు. దీని వలన పాము కాటుకు గురి కారని, చిన్న పిల్లలకు చెవిలో చీము కారడం తగ్గుతుందని నమ్ముతారు. అక్కడక్కడా రావి చెట్టు కింద నాగ శిలలు వుండేవి. వాటికి కూడా పూజలుచేసె వారు. ప్రస్తుతం పట్టణాలలో కూడా ఇటు వంటి పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా నాగ శిలలకు ఆడ వారు మాత్రమే పూజలు చేసే వారు.

రైతుల నేటి పరిస్థితి

[మార్చు]
గౌరవము

ఒకప్పుడు రైతు అంటే సమాజంలో ఒక గౌరవం వుండేది. ప్రస్తుతం రైతు అంటే బైతు గాడు అనె స్థాయికి దిగజారి పోయింది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వున్నటువంటి గౌరవం ఈ నాడు రైతులేదు. అదే విధంగా వారి కట్టు బట్టలను, మాట తీరును ఎగతాళి చేసె పరిస్థితి ఉంది. ఏదైనా చిన్న పని మీద ప్రభుత్వ కార్యాలయానికెళ్లిన రైతును అకార్యాలంలో వున్న చిన్న వుద్యోగి కూడా మర్యాదగా పలకరించడు. తానొచ్చిన పని ఎవరితో చెప్పుకోవలనే విషయం కూడా అతని కెవ్వరు చెప్పారు. ఆ వ విధంగా రైతులు బిక్క మొగం వేసుకొని కనబడిన వారినల్ల ప్రాధేయపడుతున్నాడు. చివరకు ఇతను మాట్లాడ వలసిన ఉద్యోగి కనబడినా అతినికి ఈ రైతుతో మాట్లాడి సమస్యను తెలుసుకునే తీరిక వుండదు. అంతే గాక వారి ఛీత్కారానికి బలౌతున్నాడు. ఒక చిన్న పని గురించి ఎన్ని సార్లు రైతు వారి చుట్టూ తిరగ గలడు? ఇది ఈ నాడు రైతుకు అందుతున్న మర్యాద, గౌరవము.

కూలీలతో...

నేటి రైతు తన పొలంలో ఈ వర్షాభావ పరిస్థితుల్లో పంట పండించనూ లేడు అలా అని పొలం పని చేయుకుండా ఉండనూ లేడు. ఎంత చిన్న రైతైనా పంట సమయంలో నైనా కూలీల మీద ఆధార పడక తప్పదు. కూలీలు దొరక్క..... దొరికినా వారు అడిగినంత కూలి ఇవ్వలేక ఇచ్చినా వారితో వేగ లేక ప్రస్తుతం రైతులు నీటి అవసరం తక్కువగా వుండే కూలీల అవసరం అంతగాలేని మెట్టపైర్లను ఎంచు కుంటున్నాడు. ముఖ్యంగా తోటల పెంపకానికి..... ఇంకా ముఖ్యంగా మామిడి తోటల పెంపకానికి మొగ్గు చూపు తున్నాడు. కొంత పొలమున్న రైతులు కూడా తమ పొలంలో ఓ పది ఇరవై మామిడి చెట్లు నాటి వాటికి కుండలతో నీళ్లు పోసి మూడు సంవత్సరాలు కాపాడ గలిగితే ఆ తర్వాత దానిలో అంతగా పని వుండదు. ఆవిధంగా రైతులు కూలీలతొ వేగ లేక వర్షాభావానికి తట్టుకోలేక ఏదో మార్గం వెతుక్కుంటున్నాడు. గతంలో అటు కూలీలు, ఇటు రైతులు ఒకరిపై ఒకరు ఆధారపడి వుండే వారు. పనులన్ని చక్కగా జరిగేవి. ప్రస్తుత పరిస్థి పూర్తిగా భిన్నం. కూలీలు దొరకడమే చాల కష్టంగా ఉంది. ఒక వేళ దొరికినా వారు అడిగినంత కూలి ఇవ్వాలి. లేకుంటే రారు. ఆర్థిక శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. దాన్ని ఇక్కడ ఉదహరించడం చాల సందర్బోచితం. ఆ సూత్రం: The most perishable commodity is labor అనగా..... ఒకశ్రామికుడు తన శ్రమను ఒకరోజు వదులుకున్నాడంటే..... దాన్ని అతనెప్పుడు తిరిగి పొందలేడు. అని దానర్థం. కాని ఇప్పుడు పల్లెల్లో.... ముఖ్యంగా వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం గగనం. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో వున్నదే. ముఖ్యంగా వ్యవసాయ పనులకే కూలీలు దొరకరు. కారణం ఏమంటే,... ఎండలో పని చేయాలి... బురదలో పని చేయాలి. ఇదొక కారణమైతే ప్రభుత్వం నుండి లభించే రూపాయికి కిలో బియ్యం... పధకంతో వారికి తిండి జరిగి పోతున్నది. తానడిగినంత ఇస్తే వెళ్దాము అనే ధీమాతో ఉన్నారు. ఆవిధంగా శ్రామికులు (కూలీలు) యజమానికి (రైతుకు) తమ శ్రమ విలువను.... ఇంత అని నిర్ణయించి నీ కిష్టమైతే కొనుక్కో లేకుంటే లేదు... మేమెం బలవంతం చేయడం లేదు గదా.... అంటున్నారు. పైన చెప్పిన ఆర్థిక సూత్రానికి అర్థమేమిటో??? పైగా.... గతంలో కూలీలు ఎనిమిది గంటలు పనిచేస్తే ఈ రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకే పని చేస్తారు. మధ్యాహ్నం రైతే వారికి అన్నం పెట్టాలి. పైగా వారు సమయం గడిచి పోవాలనే చూస్తారు గాని.... పని కావాలని చూడరు. ఈ మధ్యన కూలీలు ఇంకో పద్ధతికి వచ్చారు. అదే మంటే.... కొంత మంది కలిసి ఒక జట్టుగా ఏర్పడి ... రైతుల వద్ద పనిని గుత్తకు వప్పుకుంటారు. అనగా ఈ పనిచేసినందుకు ఇంత మొత్తమని మాట్లాడు కుంటారు. ఒక్కొక్కరికి ఇంత కూలి అని వుండదు. ఈవిధానము ఇతరత్రా పనులకు బాగుంటుంది.... కాని వ్యవసాయం పనులలో ఇది పూర్తిగా గిట్టు బాటు కాని వ్యవహారం. ఎలాగంటే.... ఒక రైతు రెండెకరాలు వేరు శనగ వేశారనుకుందాం..... చెట్లు పీకి కుప్ప వేయడానికి ఇంత అని ఒక రేటు మాట్లాడుకుంటారు. ఆ చెట్ల నుండి కాయలను తీయడానికి ఇంతని రేటు మాట్లాడుకుంటారు. ఆ కూలీల పని ఎలా వుంటుందంటే.... అతి తొందరగా పని ముగించి తమ డబ్బులు తాము తీసుకొని ఎంత తొందరగా వేలైతే అంత తొందరగా వెళ్లిపోవాలి అని అనుకుంటారు.. ఆవిధంగా.... వేరుశనగ చెట్లను పీకి కుప్పలేస్తారు. భూమిలో వున్న కాయలన్ని బయటికి వస్తున్నాయా లేదా కూలీలకు అనవసరం. అదే విదంగా చెట్లలోని కాయలు పీక డానికి ఇంత అని మాట్లాడుకుంటారు. చెట్లలోని కాయలు అన్ని పీకుతున్నారా లేదా వారికి అనవసరం. శుభ్రంగా పని చేయక ఏదో పని అయిందనిపిస్తారు. ఆవిధంగా వారు పని చేస్తారు. ఇంత కాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి కూలీలు చేసె ఇలాంటి పని వల్ల రైతులు నష్ట పడి ఎంతో మనో వేధనకు గురౌతున్నారు. అదే విధంగా మామిడికాయలను చెట్లనుండి కోయడానికి..... ఒక ట్రాక్టరు లోడుకు వెయ్యి రూపాయలు అని మాట్లాడుకుంటారు. వారు కాయలు కోసే విధానం ఎలా వుంటుందంటే.... చేతికి అందే కాయలను చేత్తో కోసి బుట్టలలో వేస్తారు. అందని కాయలను పొడవాటి కర్రలతో కొట్టి రాల్చి వాటిని ఏరి లోడు చేస్తారు. ఆకాయలు పగిలాయా..... దెబ్బలు తగిలాయా... అదంతా వారికనవసరం. ఇంకా పైకొమ్మల్లో వున్న కాయలను చెట్టెక్కి కొమ్మలను ఊపి రాల్చేస్తారు. ఆకాయలను తీసుకొని రైతులు మండీలకు వెళ్లితే..... అక్కడ.... తూకం వేసే వ్వాపారస్తుల తరుపున వారు ఈ దెబ్బలు తగిలిన కాయలను వేరు చేసి పక్కన పడేస్తారు. ఆ కాయలను డాగులు అంటారు. ఆ విధంగా రైతుకు ఈ కూలీల వల్ల సుమారు పది శాతం పంట నష్టం. ఆవిధంగా పక్కన పడేసిన దెబ్బలు తగిలిన కాయలు... రైతు తన ఇంటికి తెచ్చుకోలేడు. వాటిని అక్కడున్న కూలీలు తీసుకొని..... చిల్లరగా అమ్ముకుంటారు. వ్యవసాయ సంబంధిత పనులన్ని ఈ గుత్త కూలీలాతో పది శాతానికి పైగా రైతు నష్ట పోతున్నాడు. అది ఎవరు తిన్నట్టు వుండదు. అది వరి నాట్లు గాని, వరి కోతలు గాని, నూర్చడం గాని ఏదైనా సరే .... రైతుకే నష్టము. కొన్ని పనులకు యంత్రాలు వచ్చినా అన్ని సందర్భాలలోను వాటిని వాడడానికి కుదరదు. పైన చెప్పినట్లు మామిడి కాయలు, కొబ్బరి కాయలు కోయడానికి యంత్రాలు ఏమున్నాయి? ఆపనులు మనుషులు చేయాల్సిందే.......

సామాజిక పరంగా

ప్రస్తుత కాలంలో ప్రతి రైతు..... తమ పిల్లలకు వ్యవసాయం పని వద్దను కొని వారిని బడికి పంపిబాగా చదివించి ఏదైన ఉద్యోగంలో చేర్చాలని చూస్తున్నాడె తప్ప తనకు వారసత్యంగా వచ్చిన వ్యవసాయాన్ని మాత్రం తన పిల్లలకు ఇవ్వదలచు కోలేదు. ఒక నాడు రైతు తన పిల్లలకు ""చదవడం రాయడం వస్తే చాలు, వాళ్లేమైనా ఉద్యోగాలు చెయ్యాలా ? ఊళ్లేలాలా? ఈ పొలం చేసుకొని స్వతంత్రం గా బతికాలి "" అని అనుకొన్న అదే రైతు నేడు తన పిల్లలకు వ్యవసాయమె వద్దంటు న్నాడు. పల్లె ప్రజల మానసిక పరిస్థితే గాదు, సామాజిక పరంగా చూసినా పల్లెల్లో చాల మార్పులు వచ్చాయి. ఆడ పిల్లల తల్లి తండ్రులు తమ పిల్లలను వ్యవసాయ దారులకు ఇచ్చి పెళ్ళి చేయమని ధీమా చెపుతున్నారు. ఆడ పిల్లలు కూడా వ్యవసాయ దారులను పెడ్లాడమని కచ్చితం చేప్పేస్తున్నారు. దీనిని బట్టి వ్యవసాయ దారుల పరిస్థితి ఎంత దారుణంగా వుందో ఊహించ వచ్చు. వ్యవసాయ దారులైన ఆడ పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారంటే.... సామజిక పరంగా రైతుల పరిస్థితి రాబోవు కాలంలో ఎలా వుంటుందో ఊహకు అందదు.

ఆత్మీయత

పల్లె ప్రజలు ఆత్మీయతకు పెట్టింది పేరు అనే మాటకు ఈనాడు అర్థం లేకుండా పోయింది. ఎవరికి వారె యమునా తీరె అనె తరహాలో ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రజల సామూహిక సామాజిక కార్యక్రమాలైన పండగలు, జాతరలు, బుర్రకతలు, వీధినాటకాలు, హరికథలు, వంటివి రాను రాను కనుమరుగౌతున్నవి. ప్రజలను ఒక్కతాటిపై నిలబెట్టే ఇటువంటి ప్రక్రియలు లేనందున పల్లె ప్రజలు ఎవరికి వారు విడి పోతున్నారు. ఒకరికొకరు, ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకునే సంస్క్రుతికి రాను రాను దూరమై పోతున్నాడు. నేటి పల్లెల్లో జనాభా తగ్గింది. రాష్ట్ర వ్వాప్తంగా ఏ పల్లెలో జనాభా తీసుకున్నా కచ్చితంగా గత 50 సంవత్సరాల క్రితం వున్నంత జనాభా ఈ రోజున లేదు. నిజానికి అర్థ శతాబ్దంలో దేశ వ్వాప్తంగా జనాభా ఎంతో పెరిగింది. ఆ దామాషా ప్రకారం పల్లెల్లో కూడా పెరిగి వుండాలి. కాని దానికి విరుద్దంగా. ఆశ్చ్యర్య కరంగా పల్లెల్లో జనాభా తగ్గింది. కారణమేమంటే వర్షాలు సరిగ పడక, వ్యవసాయం గిట్టుబాటు కాని వ్వవ హారంగా మారడము ఇలాంటి కారణాల వల్ల యువత ఉద్యోగాలను, ఇతర వ్వాపారలని పట్టణాలు, నగరాల బాట పట్టారు. ఆ కారణంగా పల్లెల్లో జనాభా తగ్గి, పట్టణాలలో పెరిగింది. ప్రస్తుతం పల్లెల్లో మిగిలిన వారిలో ఎక్కువ మంది వృద్దులు ఏ పనిచేయలేని వారు మాత్రమే. వ్యవసాయం చేయలేక ఇతరత్రా, వ్వాపార, ఉద్యోగాలలో స్థిరపడి పోతున్నారు. పల్లె వాసుల్లో రాజకీయ చైతన్యం పెరిగి తత్కారణంగా కక్షలు కార్పణ్యాలు పెరిగి ఈర్ష్యా ద్వేషాలు పెచ్చు మీరి కల్లా కపటం తెలియని రైతులు నేడు ఈర్ష్యాల ద్వేషాల మధ్య బిక్కు బిక్కు మంటు బతుకీడుస్తున్నారు. ప్రతి పల్లెలోని నెలకొన్న పరిస్థితి ఇది. కేవలం ఒక యాబై సంవత్సరాల లోనె ఇంతటి మార్పు వచ్చిందంటే ఇక రాబోవు యాబై సంవత్సరాలలో ఇంకెంత మారుపు వస్తుందో వూహించు కోవడానికే భయం వేస్తుంది.

ఉమ్మడికుటుంబాలు

గతంలో పల్లెల్లో వున్నవన్ని ఉమ్మడి కుటుంబాలే. ఒక కుటుంబంలో పదుల సంఖ్యలో సభ్యులుండే వారు. దాంతో వ్యవసాయ పనులు చాల చక్కగా జరిగేవి. ఎవరి పనులు వారి కుండేవి. ఒక కుటుంబంలోని వ్వక్తులకు ఒక్కొక్క పని కేటాయించ బడి వుండేది. ఇద్దరు ముగ్గురు ఆడవారు ఇంటిపనికి వుంటే మిగతా ఆడవారు పొలం పనులకు వెళ్లే వారు. మగవారిలో ఒకరు గొర్రెలను కాయడానికి వెళితే మరొకరు మేకలను కాయడానికి వెళ్లె వారు. మరొకరు ఆవులను పాలు పిండి తర్వాత మేతకు తీసుకెళ్లే వారు. మిగతా వారు పొలం పనులకు వెళ్లే వారు. పెద్ద పనులు వున్నప్పుడు అనగా వరి నాట్లు, కలుపు తీత, వరికోతలు, చెరకు గానుక ఆడడము మొదలగు పనులకు చాల మంది అవసరము. ఆ సందర్భంలో ఇంటి వారందరు కలసి ఆ పనిని కొంత మేర చేసి తర్వాత తమ పనులకు వెళ్లె వారు. ఆ విధంగా కుటుంబ మంతా ఒకే నాయకత్వంలో కలిసి మెలిసి పనిచేసి వ్వవ సాయం చేసి చాల గొప్పగా బతికారు. అదే విధంగా ఆ పల్లెలోని అన్ని కుటుంబాలు అన్ని కలిసి ఒకే కుటుంబంగా మెలిగేవి. ఎవరికి ఏ కష్టం కలిగినా ఊరు వూరంతా వారిని ఆదుకునే వారు. ఒక కుటుంబంలో పెళ్ళి లాంటి శుభ కార్వం జరిగినా..... చావు లాంటి అశుభ కార్యం జరిగినా ఆ వూరి వారంతా ఆ ఇంట్లో తామె చేయగలిగిన పని చేసేవారు. అలా అంతా ఐకమత్యంతో జీవనం సాగించే వారు. కానీ...... ఇప్పుడు.... ఉమ్మడి కుటుంబం మచ్చుకైనా లేదు. దాంతో.... ఐకమత్యము, ఆత్మీయత, ప్రేమ, అనురాగము, అనే వాటికి అర్థం లేకుండా పోయింది. పక్కింట్లో ఏదైనా ఆపద సంబవిస్తే.... మాట వరసకు పలకరింపులు తప్ప మరే సహాయ సహకారాలు అందించడం లేదు. ఎదుటి వారు కూడా వారి సహాయ సహకారాలను కూడా ఆసించడము లేదు. ఇది కాలాను గుణంగా వస్తున్న మార్పు.

రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వ ప్రతిపాధిత సంక్షేమ పథకాలు

[మార్చు]

సంవత్సరాల తరబడి కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను, ఇతర రైతు కూలీలను ఇతర వృత్తుల వారిని ఆదుకోడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. వాటి వల్ల పల్లె ప్రజలు కొంతలో కొంత ఉపయోగకరంగా ఉంది. కాని ఈ పథకాలు ప్రతిపలాపేక్ష లేకుండా జరగడం లేదు. కొంత మేర అక్కడక్కడా లంచ గొండిలు, దళారుల మధ్యలో దూరి అసలు లబ్ధి దారులకు రావలసిన దానికి కొంత మేర గండి కొడుతున్నారు. ఈ పధకాలలో కొన్ని సుదీర్ఘ కాలం కొనసాగిస్తే..... ప్రభుత్వానికి మోయలేని భారమయ్యే ప్రమాదమున్నది. అంతే గాక సామజిక పరంగా అలజడులు జరిగే ప్రమాదమున్నది. రాజ కీయ నాయకులు తమ మనుగడ కొరకు, ఓట్ల కొరకు ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. ఈ ఉచితము, లేదా సబ్సిడి పధకాలు అమలుతో కొంత మంది ఏపని చేయకుండా దాంతోనె కాలం గడిపేస్తున్నారు. దాంతో కూలీలు దొరక్క రైతులు ఇతర వర్గాల ప్రజలు నాన ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో కొంతమంది రైతులు కూడా అవసరానికి కూలీకి వెళుతుంటారు. కాని వారికి కూడా కూలీలు ఒక్కోసారి అవసరమే. పంటల సమయానికి కూలీలు దొరక్క అందరితో పాటు వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది అన్ని వర్గాల సమస్య. ఈ పథకాలలో వున్న లొసుగులు నివారణకు నగదు బదిలీ పధకానికి ప్రభుత్వము ఆలోసిస్తున్నట్లున్నది. ఆకలేసిన వానికి అన్నం పెట్టాలి కాని జీవితాంతం ఉచితంగా అన్నం పెట్టుతుంటే వాడు పని అలవాటు తప్పి అసలు పని చేయడు. దాంతో సమాజికంగా కూడా నష్టమే. ఉచితంగా అన్నంపెట్టే బదులు వానికి అన్నం సంపాదించుకునే మార్గం చూపించాలి. అప్పుడే వాడు కొంత వరకు శ్రమ చేస్తాడు. ఫలితముంటుంది, సంతోషం గాను వుంటుంది. సమాజము నిజమైన అభివృద్ధి చెందుతుంది. చేపలు కావాలనుకున్న వానికి చేపలను పట్టి ఇవ్వడము కాదు, వానికి ఒక గాలాన్నిచ్చి చేపలు పట్టుకోమనాలి. అప్పుడే అతనికి శ్రమ విలువ తెలుస్తుంది. ఇప్పుడు అమలులో వున్న కొన్ని సంక్షేమ పథకాల వివారాలు క్లుప్తంగా: ......

రూపాయికి కిలో బియ్యం పధకం

[మార్చు]

ఈ పథకం ద్వారా లాబ్ది పొందే వారి ఎంపికకు ఒక గీత గీసినా పల్లెవాసులలో నూటికి తొంబై మంది ఈ పధకం క్రిందికి వస్తారు. ఆ విధంగా బడుగు రైతుల కూలీల ఆహార కొరత కొంత వరకు తీరిందనే చెప్పొచ్చు. దానికి తోడు పప్పులు, నూనె సబ్బులు కూడా తక్కువ ధరకు అందజేస్తున్నారు. ఒకప్పుడు బియ్యాన్ని దుకాణాలలో కొనడానికి నామోషి పడిన రైతులు వర్షాబావంతో పంటలు పండనందున దుకాణలలో బియ్యాన్ని కొనడం మొదలుబెట్టారు. ప్రభుత్వం గతంలో రెండు రూపాయలకు ఒక కిలో బియ్యాన్ని ఇచ్చేది. అది ఇప్పుడు ఒక రూపాయకే కిలో బియ్యం ఇస్తున్నారు. అవి నాసిరకమైనా విధిలేక ఎవరు వదిలి పెట్టడంలేదు. ప్రస్తుత ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి............ వంటకు కావలసిన ఒక నెలకు సారిపోవు సుమారు 18 వస్తువులను ఒక కిట్ ఒక బస్తాలో పెట్టి అతి తక్కువ ధరకే ఇస్తున్నారు. ఇది కూడా పల్లె వాసులకెంతో ఊరట నిస్తున్నది. ఇలాంటి సబ్సిడి పథకాల నన్నిటిని మానేసి నగదు బదిలీ పదకమనీ మరో పథకానికి మార్గం సుగమం చేస్తున్నది ప్రభుత్వం.

ఆరోగ్యశ్రీ పథకం

[మార్చు]

ఈ పథకం క్రింద కొన్ని వ్వాదులకు, ప్రమాదాలు జరిగినప్పుడు పల్లెవాసులకు పెద్ద ప్రవేటు హాస్పిటల్లలో ఉచిత చికిత్స ఇప్పిస్తున్నది. పల్లె ప్రజలకు ఇదొక మంచి వరమనే చెప్పాలి. వేలాది రూపాయలు ఖర్చయ్యె ఈ పధకంలో ఎక్కువ శాతం ప్రమాధాలకు గురై ఆస్పత్రిలో చేరి ఉచిత చికిత్స పొందు తున్నారు. సాధారణంగా పల్లె ప్రజలు తమ వచ్చిన వ్యాదులకు తగు సమయంలో చికిత్స చేసుకోరు. అది వారి అజ్ఞానమో లేక నిర్లక్ష్యమో ...... ఈ రెండు కావచ్చు..... అవిధంగా బాధపడే వారికి ఇది ఒక వర ప్రసాదినే అని చెప్పవచ్చు. పల్లె ప్రజలలో ఆరోగ్యంపై వారికి అవగాహన అతి తక్కువ. కాని ఈ ఆరోగ్య శ్రీ పధకం ద్వారా ఈ పల్లె ప్రజలు తమ ఆరోగ్యాని పై కొంత జాగ్రత్త వహిస్తున్నారు. ఇది సామాజిక పరంగా ఎంతో మార్పు తెచ్చింది. భారత పౌరులై నందుదున తమ విద్య ఆరోగ్యం విషయమై ప్రభుత్వ బాధ్యత తీసుకుంటున్నందున సంతోషిస్తున్నారు. ఇది ఎంతో అభిలషించ దగిన విషయమే.

అందరికి పక్కా గృహాలు

[మార్చు]

పల్లె ప్రజలు అజ్ఞానంతో తమ బ్రతుకులు ఇంతే..... ననే ధోరణిలో వుంటారు. తమ జీవన విధానంలో ప్రభుత్యం కూడా బాధ్యత వహిస్తుందని ఇప్పుడిప్పుడె తెలుసు కుంటున్నారు. ఈ పథకంలో అనేక మంది పల్లె ప్రజలు, తాము ఇంతవరకు గుడిసెలలో, పూరి పాకలలో బ్రతుకీడుస్తున్న వారు తాము కొంత పెట్టు బడి పెట్టి ప్రభుత్య సాయంతో పక్కా గృహాలు నిర్మించు కున్నారు. ఈ పథకంతో పల్లె వాసులు పట్టణ ప్రజలతో ఏ మాత్రంతీసి పోమని నిరూపించుకొని అందమైన గృహాలను నిర్మించుకొని చాల సంతోషంగా ఉన్నారు.

వెనుకబడిన కులాల పిల్లలకు ఉన్నతవిద్యలో ఫీజు ప్రభుత్మమే భరించు పధకం

[మార్చు]

సామాజిక పరంగా ఈ ఫధకం పల్లె వాసులను ఉన్నతి స్థితికి తీసుకెళ్లింది. చాలీ చాలని వ్యవసాయాదాయంతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించ లేమని అనుకొన్న పల్లె వాసులకు ఈ ప్రభుత్వ ఫదకము చాల ఉపయోగ పడుతున్నది. గతంలో రైతులందరు తమపిల్లలకు చదవడము వ్రాయడము వస్తే చాలు... వ్యవసాయం చేసుకొని బ్రతకుతారు అనుకొనేవారు. కాని రాను రాను వ్యవసాయము వ్యవసాయము గిట్టుబాటు కాని వ్వవహార మైనందును రైతు లందరు తమ పిల్లలను మంచి మంచి పాట శాలలో చదివిస్తున్నారు. ఉన్నత చదువులకు పంపడానికి కూడా సిద్దంగా ఉన్నారు. ఒకప్పుడు ఉన్నత చదువులు తమకు అందుబాటులో లేవనే బ్రమ పల్లె ప్రజలలో వుండేది. నిజానికి పల్లె ప్రజల విద్యార్థులే విద్యావిషయంలో ముందుంటారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈవిధానంతో వారు మరింత ఉత్సాహంగా చదువులో శ్రద్ధ వహించి ముందు కెళుతున్నారు. ఇది వారికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. కాని ఈ పథకము కొన్ని కులాల వారికే పరిమితం చేసినందున వారికి మాత్రమే ఉపయోగ కరంగా ఉంది. ఉన్నత కులాలలో పుట్టిన రైతులకు ఈ పధకము వర్తించదు. అలాంటి వారు తమ పిల్లల చదువు గురించి ఆందోళనతో ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారందరికి ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తే చాల మందికి ఉపయోగ కరంగా వుంటుంది.

డ్వాక్రా గ్రూపులు

[మార్చు]

ఈ పహథకం వైవిధ్యమైనది. విద్యావంతులు కాని మహిళలకు ఇదొక వర ప్రసాదిని. పావలా వడ్డి, అసలు వడ్డీ లేకుండా ఋణము ఇవ్వడము ఈ ఫథకంలో ఒక ఉద్దేశము. ఈ విధానములో పల్లె వాస మహిళలు ఆర్థిక విషయాలలో భాగ స్వాములు కావడమే కాకుండా, స్త్రీలైనా... ఆర్థిక విషయాలలో తమ భాగ స్వామ్యం ప్రభుత్వం గుర్తించినందున, సమాజంలో తమకు కూడా ప్రత్యేక వచ్చినందుకు చాల సంతోష పడుతున్నారు. ఆర్థిక విషయాలలో వారికి ఇదివరకు ఎంత మాత్రము అవగాహన గాని, అనుభవం గాని లేని వారు...... ఇప్పుడు ఆర్థిక విషయంలో కూడా తమ భాగ స్వామ్యాన్ని గుర్తించి నందుకు చాల సంతోషంగా ఉన్నారు. ఆర్థిక విషయాలలో మంచి పట్టు సాధిస్తున్నారు. అంతే గాక భవిష్యత్తులో బీమా పధకం ద్వారా తమకు లబ్ధి చేకూరు తుందని చాల ఆనందం వ్వక్త పరుస్తున్నారు. ఇది వారి వ్వక్తి గతంగా కన్నా సామజిక పరంగా చాల మంచి మార్పును తెస్తుంది.

వృద్దాప్య పించనులు

[మార్చు]

పల్లె వాసులు తమ వయసుకు మించిన వృద్యాప్తంతో ఉన్నారు. ఇది సర్వత్రా తెలిసిన విషయమే. పట్టణ వాసులు అరవై సంవత్సరాలు దాటినా ....... వారి ఆరోగ్యం పై తీసుకున్న శ్రద్ధ కారణంగా వారు చాల ఆరోగ్యంగా వుంటు వారి అసలు వయసు కన్న తక్కువగా కనిపుస్తుంటారు . పల్లె వాసులు దీనికి పూర్తిగా వ్వతిరేకం. వారి వయస్సు యాబై సంవత్సరాలు దాటితె చాలు వారు వృద్దులుకింద లెక్కే.. శారీరక పరంగా కూడా వారు అలానె కనబడతారు. కారణమేమంటే...... వారు తమె శరీరంపై కనబరుస్తున్న శ్రద్ధ. ఆహారం, ఆరోగ్యం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్త. అలాంటి వారు ఈ వృద్దాప్య పించను పథకంలో లబ్ధి పొందుతూ తమ బ్రతుకుల మీద ప్రభుత్వం కూడా శ్రద్ధ వహిస్తున్నందుకు చాల సంతోషంగా ఉన్నారు. వృద్దులకే గాక వికలాంగులకు, భర్తను కోల్పోయిన స్త్రీలకు కూడా పించను ఇస్తున్నారు. సాధారణ పల్లె వాసులను కూడా ప్రభుత్వం పట్టించు కుంటున్నదని వారి ఆనందానికి అవదులు లేవు.

పనికి ఆహార పథకము

[మార్చు]

కరువు కాలంలో పల్లె ప్రజలకు పనులు లేక, తద్వారా ఆదాయంలేక, బ్రతక లేక అద్వాన్న పరిస్థితుల్లో వున్న పల్లె వాసులకు ఈ ఫధకం క్రింద, తమ పల్లెల్లో సామజిక పరమైన పనులను చేపట్టి పనికి ఆహారము అనగా బియ్యం పొందే ఫధకమ ఇది. ఈ విధానం క్రింది తమ ఊరి చెరువును లోతు చెయ్యడానికి ఆ యావూరి రైతులు ప్రభుత్వానికి ఒక రోజు కూలి చేసి ఒక బస్తా బియ్యం తీసుకున్న సందర్భాలున్నాయి. సాధారణంగా పెద్ద రైతులు కూలికి పోరు. ఇది ప్రభుత్యానికి సంబంధించిన పని కనుక తప్పేమి లేదని వారి ధీమ. అలా వారు ఇటు వంటి సామాజిక కార్యక్రమంలో పాల్గొని తమ భృతిని సంపాదించుకున్నారు. ఇది కేవలము కరువు కాలంలో అమలు పరుచబడే పధకము.

పంట రుణాలు

[మార్చు]

పైన చెప్పిన సామజిక పధకాలకు తోడుగా పంట రుణాలు కూడా ఇస్తున్నారు. ఈ రుణాలు రైతులకు ఎంతో వెసులు బాటు నిస్తున్నాయి. కరువు కాటకాల సమయంలో అలాంటి రుణాలను మాఫీ చేసిన సందర్భాలున్నాయి. విత్తనాలు, మొక్కలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, మొదలగు వాటికి సబ్సిడి తో ఇస్తున్నారు. పంటల సాగుకు, డ్రిప్, తుంపర్ల సేద్య పరికరాలకు కూడా సబ్సిడి ఇస్తున్నారు. ఈ పథకాలు రైతులకే కాకుండా చేపలు పట్టేవారికి, నేత పనివారికి కూవ వారికి కావలసిన పరికరాల కొనుగోలుకు రుణాలిస్తున్నారు. తోటల అభివృద్ధి కొరకు మామిడి అంట్లను, కొబ్బరి మొక్కలను కూడా తక్కువ ధరకే ఇస్తున్నారు. వాటిని నాటడానికి త్వవ్వే గుంటలకు కూడా కొంత మొత్తాన్ని ఇస్తున్నారు.

ఉచిత విద్యుత్తు పథకము

[మార్చు]

రైతులకు అనగా బావులలోనుండి నీటి తోడే మోటార్లు వాడె వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్తుని సరపరా చేస్తున్నది. కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకము వల్ల కొంత ఊరట కలిగింది. కాని విద్యుత్తు సరిగా రాక రైతులు పంటలు పండించ లేక పోతున్నారు. పైగా ఆ కరెంటు కొన్ని గంటల పాటే వస్తుంది. అది కూడా ఏ సమయంలో వస్తుందో ఎవరు చెప్పలేరు. అపరాత్రి... అర్థరాత్రి అని తేడాలేక కరెంటు ఇస్తున్నారు. దానికొరకు రైతులు నిద్ర మాని కరెంటు రాక కొరకు కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. ఈ ఇబ్బంది ఏ ఏడాదికి ఆ ఏడాది అధికమౌతున్నదే తప్ప వారి కష్టాలు తీరె అవకాశం కనిపించడము లేదు.

కూడు,గుడ్డ, గూడు -- నాడు నేడు.

[మార్చు]

ప్రతి మానవునికి కావలసినవి అత్యవసరమైనవి మూడు. అవి 1. కూడు, 2. గుడ్డ, 3. గూడు. ఈ మూడింటి కొరకే ప్రతి మానవుని తపన... పరుగులు తీయడము...... జీవన యానము. కోటి విద్యలు కూటి కొరకే అనె సామెత వుండనే ఉంది. ఏపాటైనా సాపాటు కొరకే అనే నానుడి కూడా అందరికి తెలిసినదే. కనుక మానవునికి అత్యవసరమిన దానిలో మొదటి కూడు. దానినే తిండి, ఆహారము అని కూడా అనొచ్చు. పనిచేసినా చేయక పోయినా మానవునికి తిండి కావాలి. ఎంత డబ్బు వున్నా తినడానికి మాత్రము తిండి కావాలి. డబ్బులు తినలేడు. అందుకే అన్నారు లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మింగ బోడు. అని. ఆహారము క్షుద్బాధను తగ్గించు కొనుటకు, శరీరానికి భలాన్నిచ్చేందుకు, రేపటికి ఆహారాన్ని సంపాదించు కొనుటకు. రెండో ప్రాధాన్యత గుడ్డ. నాగరీక మానవుడు మానము కాపాడుకోవడానికి గుడ్డ కట్టుకోవాలి ఇది తప్పని సరి. మూడో ప్రధాన్యత గూడు.... అనగా ఇల్లు. ఉండటానికి ఇల్లు కావాలి. ఈ మూడు ప్రాథమిక అవసరాల కొరకు ఆ నాటి మానవుడు అనగా సుమారు అర్థ శతాబ్దం క్రితం ఏవిధంగా ప్రాకులాడే వాడు? ఎలా ?.... ఎలా సంతృప్తి పడేవాడు.?.... దీనిపై ఒక సమీక్ష:.....

గ్యాలరీ

[మార్చు]
ఉల్లిగడ్డలను ఇంటి పై కప్పుకు వేలాదీసి బద్ర పరుస్తారు
నాటడానికి సిద్దంగా వున్న మామిడి అంట్లు
చెరకు తోట:చెరకును ఎద్దులతో రవాణకు సిద్దం: దామల చెరువు పొలాల్లో తీసిన చిత్రం:
వెలగ చెట్టు
రసం తీయడానికి గానుగలో చెరుకులు పెడుతున్న దృశ్యం
చెరుకు తోటలో చెరకు రసం తీసె యంత్రం, దామలచెరువులోని చిత్రం
పలికిమాను తోలుతున్న రైతు


ట్రాక్టర్ తో పొలం దున్నడం. దామలచెరువు గ్రామం వద్ద తీసిన చిత్రం
కాలితో తొక్కి పంటలపై పురుగు మందులను వెదజల్లే యంత్రము: స్ప్రేయర్
చెరుకు పాల పెనము, దాని సామానులు, పొయ్యి.
బావి లోకి వంగిన కొమ్మలకు 'గిజిగాడు' అనే పిచ్చుక కట్టిన అందమైన గూళ్లు: వెంకట్రామ పురం పొలాల్లో తీసిన చిత్రం
చెరురసాన్ని పెనంలో పోసి క్రింద మంట పెడుతున్న దృశ్యం.
అమ్మవారి ఊరేగింపు

బయటి లింకులు

[మార్చు]

ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పొర్తివ, వ్వయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, సుబకృత్, సోభకృత్, క్రోధ, వశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్దర్తి, రౌద్రి, దుర్మతి దుందుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. (మొత్తం అరవై)

నక్షత్రాలు

[మార్చు]

నక్షత్రములు అశ్వని /భరణి / కృత్తిక /రోహిణి / మృగశిర / ఆరుద్ర / పునర్వసు / పుష్యమి / ఆశ్రేష /మఖ /పూర్వఫల్గుణి / ఉత్తరఫల్గుణి / హస్త /చిత్త /స్వాతి /విశాఖ /అనూరాధ / జ్యేష్ట /మూల / పూర్వాషాఢ / ఉత్తరాషాఢ / శ్రవణం / ధనిష్ఠ /శతభిషం / పూర్వాభద్ర / ఉత్తరాభద్ర/ కాల మానము రెప్ప పాటు, క్షణం, ఘడియ, అర ఘడి, జాము, (మూడు ఘడియలు) దినము, వారము, ఫలితము (సుమారు ఆరు నెలలు... ఒక పంట పండే కాలము) పక్షము, (పది హేను దినములు) నెల, (ముప్పై దినములు) మండలం.. ( నలబై దినములు) సంవత్సరం, మూడు వందల అరవై దినములు లేదా ఏడాది, తరం, (ముప్పై సంవత్సరాలు)

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. చేగిరెడ్డి, చంద్రశేఖర రెడ్డి. "ఈమాట". eemaata.com. ఈమాట. Retrieved 29 May 2016.
  1. వేంపల్లి, గంగాధరం (2010). రాయలసీమ కథా సాహిత్యం ఒక పరిశీలన. తిరుపతి: వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. p. 7/ 36.
  2. వేంపల్లి, గంగాధరం (2010). `రాయలసీమ కథా సాయిత్యం ఒక పరిశీలన. తిరుపతి: వేంకటేశ్వర విశ్వ విద్యాలయం. p. 8/36.
  3. ఉప్పటి, విజయ భాస్కర్ (2008). మన్నవ భాస్కరనాయుడు రచనల పరిశీలన, (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి ed.). తిరుపతి. p. మొదటి చాప్టర్. పుట 6.{{cite book}}: CS1 maint: location missing publisher (link)