Jump to content

పల్లెల్లో సాధారణంగా వాడు వస్తువులు

వికీపీడియా నుండి

గతంలో పల్లెల్లో వ్యవసాయ దారుని ఇళ్లలో, పొలంలో ఇంటా బయటా వాడే వస్తువులు.

ప్రతి వ్యవసాయ దారుని ఇంట్లొ వ్యవసాయోత్పత్తుల దాచు కోడానికి ఏర్పాట్లుంటాయి. అవి కాగు../. ఓడ/.గెరిసె /బొట్ట మొదలగునవి.


ఇది కుమ్మరి మట్టితో పెద్ద కుండలాగ చేసి ఇస్తాడు. రెండు వైపుల చిన్న మూతి గలగి మధ్యలో రెండడుగులు వ్యాసం కలిగి సుమారు నాలుగడుగులు ఎత్తు కలిగిన పెద్ద మట్టి పాత్రే కాగు. దీనిని నేలమీది పెట్టి అందులో బియ్యం, ఇతర పప్పు దినుసులు దాస్తుంటారు. దీన్ని మన కనుకూలమైన ప్రదేశంలో మార్చుకొని పెట్టుకోవచ్చు.

ధాన్యం, గింజలు వంటివి నిల్వ చేసుకునే మట్టి కాగు. దామల చెరువు వద్ద తీసిన చిత్రము

ఇది వరిపొట్టు కలిపిన మట్టితో చేసినదే. దీనిని కూడా కుమ్మరి చేసి ఇస్తాడు/. ఇది చాల పెద్దది పైగా దళసరిగా వుంటుంది. సుమారు రెండంగుళాల మందం కలిగి వుంటుంది. ఒకవైపు సుమారు రెండు అడుగు వ్వాసం కలిగిన మూతి వుండి రెండో వైపున సుమారు నాలుగైదు అడుగుల వ్వాసంతొ సుమారు మూడు అడుగుల ఎత్తి కలిగిన శంఖాకారం వుండే వాటిని ఒకే పరిమాణంలో రెండింటిని చేస్తారు. ఒక దాన్ని చిన్న మూతి వైపున నేలమీద పెట్టి దాని పై రెండొ దాన్ని బోర్లించి అనగా చిన్న మూతి పైకి వుండే టట్లు పెట్టి రెండు పెద్ద మూతులు కలిపే అతుకును మట్టితో పూస్తారు. అందులో ధాన్యం, ఇతర వస్తువులు దాస్తారు. ధాన్యాన్ని బయటకు తీయడానికి క్రింది ఒక జానెడు ఎత్తులో ఒక చిన్న రంధ్రం చేస్తారు. ఇది స్థిరంగా ఒక్కచోటునె వుండాలి. కదాల్చ డానికి వీలు లేదు.

ఇంటికి ఒక మూలలో సామాన్యంగా, నైరుతి మూల గాని, ఈశాన్యమూల గాని ఇంటికున్న గోడను అనుసందానం చేసుకొని మరో రెండు గోడలు కట్టి సుమారు ఐదు, ఆరు అడుగుల ఎత్తుతో చతురస్త్రంగా ఒక గది కడ్తారు. ద్వారం లేని ఈ గది గోడలు రెండు ఇంటి గోడల కన్న కొంచెం ఎత్తు తక్కువగ వుంటాయి, ఇందులో ధాన్యం భద్ర పరుస్తారు.ఇది శాశ్వతంగా ఒక్క చోటునే వుండాలి. కదల్చడానికి వీలు లేదు.

ఇది సుమారు నాలుగడుగులు చతురస్త్రంగా వుండి ఆరు ఆడుగుల ఎత్తుతో వెదుర బద్దలతో చేసిన పెద్ద బుట్ట. తట్టలు, బుట్టల. గంపలు అల్లె మేదర వాళ్లు దీన్ని అల్లతారు. ఇందులో కూడా ధాన్యం నిల్వ చేసుకుంటారు. దీన్ని మనకు అవకాశం వున్న చోటుకు మార్చు కునే వీలున్నది. మక్కిరి ఇది అర్థ చంద్రాకారంలో సుమారు మూడడుగులు వెడల్పు పదడుగుల పొడవు కలిగిన వెదురు బద్దలతో అల్లిన పరికరము. దీనిని ఎద్దుల బందిలో వేసి సరకుల రవాణాకు ఉపయోగిస్తారు.

ఇది కూడా ధాన్యాన్ని దాచుకునే సాధనమే. ఆరుబయట స్థూపాకారంలో సుమారు ఆరు, ఏడు అడుగుల వ్వాసంలో వరి ఎంటుతో పైన చెప్పిన బొట్ట లాగ చేసి దాని బయట, లోపలి వైపున మట్టి, పేడతో అలికి ఆర బెట్టి అందులో ధాన్యాన్ని నిలవా వుంచి దాని పైన శంకాకారంలో కప్పు వేసి వుంచు తారు. ఇది చాల పెద్దదైనందున ఆరు బయట పెడ్తారు. దీన్ని ఏ ఏటికాఏడు తయారు చేసుకోవలసినదే. సజ్జ, జొన్న, కంకులను భద్ర పరచ డానికి వీటిని ఎక్కువగా వాడతారు. ఇవి ఒకప్పుడు అన్ని పల్లెల్లోను కనుపించేవి. ఇప్పుడు లేవు. ఆయా ప్రాంతాలను బట్టి వాటి పేర్లు మారు తుంటాయి.

గృహోపకరణాలు

[మార్చు]
చాట
పార

కుండ, బాన, దుత్త, చట్టి, ముంత, కూజ, కాగు, పొంత, బుడిగి, ఓడ, నీళ్ల తొట్టి, ఇవి మట్టితో చేసినవి. కుమ్మరి వీటిని చేసి ఇస్తాడు.

కవ్వము, రోకలి,రోకలి బండ., అపక, పప్పు గుత్తి, సంగటి పలక, మూకుడు, గోర తుండు నాగలి, కాడి మాను, కపిలి బండి, కదురు గోలు, కపిలి దోర్నం పట్టి, ఎద్దుల బండి ఇవి చక్కతో చేసినవి. వీటిని వడ్రంగి తయారు చేసి ఇస్తాడు. ;బొక్కెన, గిలక, చెంబు, గిన్నె, తపేల, కంచము, లోటా, గరిటె, బిందె, జల్లెడ,మర చెంబు, గంగాళము, అండా, ఇవి లోహ సామాగ్రి. వీటిని సంతలో కొనుక్కోవాలి లేదా పల్లెల్లో అమ్మకాని కొచ్చినప్పుడు కొనుక్కోవాలి.
రోలు, పొత్రము, రుబ్బురోలు, రాగల్రాయి లేదా విసుర్రాయి, కల్వము, ఇవి రాతితో వడ్డరి వారు తయారు చేస్తారు. వారి వద్ద కొనుక్కోవాలి.
అపక
తిరగలి
తాడు, తొండంతాడు, మోకు, పగ్గం, [[పలుపు, చేంతాడు, ఉట్టి, చుట్ట కుదురు, మూజంబరము, మొదలగునవి. ఇవి నారతో చేసినవి. రైతులు స్వంతగా తయారు చేసు కుంటారు. లేదా సంతలో కొనాలి.
చాట, గంప, బుట్ట, తట్ట, సిబ్బి,కుక్కి తట్ట,. గిడుగు, మక్కిరి, బొట్ట, మొదలగునవి. ఇవి వెదురు బద్దలతో మేదరి వారు తయారు చేస్తారు. వారి వద్ద కొనుక్కోవాలి. లేదా మేదరి వారిని ఇళ్లకు పిలిపించి రైతులు తమ పొలంలో వున్న వెదుర్లను వారికిచ్చి తమకు కావలసిన వాటిని తన ఇంటి వద్దనె అల్లించు కుంటారు.
కత్తి, కొడవలి, కొంకి, చిలుగు దోటి, కత్తి పీట, పార, తొలిక, గునపము, పిక్కాసి, కడిసెల, గడ్డి పార /చెక్కుడు పార, దోకుడు పార, బెల్లం పెనుము, బెల్లం పాకం దోనె కారు/ కర్రు వీటిని ఆచారి (కంసాలి), తన కొలిమిలో చేస్తాడు. రైతులు ఇనుము, బొగ్గులు తీసుకొని కంసాలి కొలిమి వద్దకు వెళ్లి కొలిమి తిత్తులను ఊది (గాలి తిత్తులను) తమకు కావలసిన వస్తువులను తయారు చేసుకొని లేదా పాత వాటిని సరిపించుకొని వస్తారు,
వంటలు
అన్నం, సంగటి, సద్ది, కూడు, రాగి సంగటి, జొన్న సంగటి, రొట్టె, పులుసన్నం,
కూర, పప్పు కూర, చింత కాయ ఊరుబిండి, చెనిగ్గింజల ఊరు బిండి, గోగాకు ఊరు బిండి, బెండకాయ పులుసు, మునక్కాయల పులుసు, వంకాయ కూర, వంకాయ వేపుడు, చిక్కుడు కాయ కూర..గురుగాకు ఊరుబిండి ... మెదలగునవి
కోడి కూర, ఏట కూర, పొట్టేలు కూర, చేపల పులుసు, ఎండు చేపలు, ఉప్పు చాపలు, నెత్తాళ్లు మొదలగునవి.
ఎర్రగడ్డల వడియాలు, చింత చిగురు వడియాలు, (ఇవి నిల్వ వుండేవి)
చారు, మజ్జిగ, పచ్చడి, వడ కూర,
పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, మీగడ, పాలగోకు,
వడలు, అరిసెలు, మురుకులు, ఉంటలు, ముసి వుంటలు, పుల్ల వుంటలు, పాయసం, దోసలు, ఇడ్లీలు, ఉప్పిండి, సాంబారు,

ఉలవ చారు, గుగ్గిళ్లు,

తీపివడలు, అలసంద వడలు, బూంది, నిప్పట్లు, లడ్డు, మురుకులు, చెక్కల బెల్లం,

ఇవి కూడా చూడండి

[మార్చు]