చేతన్ చౌహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేతన్ చౌహన్
నిఫ్ట్ కాన్వొకేషనులో చేతన్ చౌహాన్
ఉత్తర ప్రదేశ్ శాసనసభ్యుడు
In office
2017 ఫిబ్రవరి 24 – 2020 ఆగస్టు 16
నాయకుడుయోగి ఆదిత్యనాథ్
In office
1991–1998
నాయకుడుచంద్రశేఖర్
పి.వి. నరసింహారావు
అటల్ బిహారీ వాజపేయి
నియోజకవర్గంఅమ్రోహా
వ్యక్తిగత వివరాలు
జననం(1947-07-21)1947 జూలై 21
బరేలి, ఉత్తర ప్రదేశ్
మరణం2020 ఆగస్టు 16(2020-08-16) (వయసు 73)
గుర్‌గావ్, హర్యానా
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిసంగీతా చౌహాన్
కళాశాలవాడియా కాలేజి, పూణే
పురస్కారాలుఖేల్ రత్న (1984)

చేతన్ ప్రతాప్ సింగ్ చౌహాన్ (1947 జూలై 21 - 2020 ఆగస్టు 16) భారతదేశం తరపున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్. అతను మహారాష్ట్ర, ఢిల్లీ జట్ల తరపున రంజీ ట్రోఫీ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ భాగం 1970ల చివరలో ఆడాడు. ఆ కాలంలో సునీల్ గవాస్కర్‌కి ఓపెనింగ్ భాగస్వామిగా ఆడాడు. చేతన్ చౌహాన్ 2016 జూన్ నుండి 2017 జూన్ వరకు NIFT (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఛైర్మన్‌గా పనిచేసాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నుంచి 1991, 1998లో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018 నుండి 2020 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యువత, క్రీడల శాఖ మంత్రిగా ఉన్నాడు. [1]

తొలి రోజుల్లో[మార్చు]

చౌహాన్ ఉత్తరప్రదేశ్‌లో హిందూ రాజపుత్ర కుటుంబంలో జన్మించాడు. [2] [3] ఆ తర్వాత ఆర్మీ అధికారి అయిన తండ్రికి బదిలీ అవడంతో, 1960లో మహారాష్ట్రలోని పూణెకు వెళ్లాడు.[4] పూణేలోని వాడియా కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నాడు. అక్కడ అతనికి మహారాష్ట్ర మాజీ ఆటగాడు కమల్ భండార్కర్ శిక్షణ ఇచ్చాడు.[5] చౌహాన్ 1966–67లో రోహింటన్ బారియా ట్రోఫీలో పూణే విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. అదే సీజన్‌లో ఇంటర్‌జోనల్ విజ్జీ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఫైనల్‌లో నార్త్ జోన్‌పై 103, సౌత్ జోన్‌పై 88 & 63 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతని ఓపెనింగ్ భాగస్వామి సునీల్ గవాస్కర్. [6]

1967లో విజ్జీ ట్రోఫీలో మరిన్ని విజయాలు సాధించి, మహారాష్ట్ర రంజీ జట్టులోకి ఎంపికయ్యాడు. చౌహాన్ మొదటి సెంచరీ మరుసటి సంవత్సరం బాంబేతో జరిగిన మ్యాచ్‌లో వర్షంతో తడిసిన వికెట్‌పై మొదటి స్థానంలో దిగి, చివరిగా అవుట్ అయిన మ్యాచ్‌లో వచ్చింది. ఆ మ్యాచ్‌లో మొదటి ఆరు వికెట్లు 52 పరుగులకే పడిపోయాయి. అతను ఐదు టెస్ట్ బౌలర్లపై ఆడుతూ దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్‌పై 103 పరుగులు చేశాడు. 1969-70లో భారతదేశం తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [7]

టెస్ట్ క్రికెట్[మార్చు]

బాంబేలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చౌహాన్ టెస్టు ప్రవేశం చేశాడు. మొదటి పరుగు తీయడానికి 25 నిమిషాలు పట్టింది. బ్రూస్ టేలర్ వేసిన బంతిని స్క్వేర్ కట్ చేసి, నాలుగు పరుగులు తీసాడు. అతని తదుపరి స్కోరింగ్ షాట్లో, అదే బౌలర్‌ను సిక్స్‌కి హుక్ చేసాడు. చౌహాన్‌ను రెండు టెస్టుల తర్వాత తొలగించారు. ఆ సీజన్‌లో మళ్ళీ ఆస్ట్రేలియాతో ఆడాడు గానీ విఫలమయ్యాడు. మళ్లీ మూడేళ్లపాటు టెస్టుల్లో ఆడలేదు. [8]

చౌహాన్ 1972-73 రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తరపున 873 పరుగులు చేశాడు. ఇది ఒక సీజన్‌లో చేసిన అత్యధిక స్కోరులలో రెండవది. ఇందులో గుజరాత్, విదర్భలతో జరిగిన వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు ఉన్నాయి.[9] చౌహాన్, మధు గుప్తే చివరి కలిసి మ్యాచ్‌లో 405 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం సాధించారు. ఈ డబుల్ సెంచరీల మధ్యలో, ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడాడు. రెండిట్లోనూ విఫలమై, మరో ఐదేళ్లపాటు టెస్టులు ఆడలేదు. [10]

1975లో ఢిల్లీకి, నార్త్ జోన్‌కు వెళ్లారు. శ్రీలంకతో జరిగిన ఒక అనధికారిక టెస్టులో విఫలమయ్యాడు. 1976–77లో హర్యానాపై 158 (దవడ పగిలిన బాధలో ఆడాడు), 200 v పంజాబ్, 147 v కర్ణాటక, సెంట్రల్ జోన్‌పై 150 పరుగులు చేశాడు. తదుపరి సీజన్ ప్రారంభంలో దులీప్ ట్రోఫీలో చేసిన మరొక శతకం అతనికి ఆస్ట్రేలియా జట్టులో చోటు కల్పించింది. [11]

తిరిగి రాక[మార్చు]

పర్యటనలో తన మొదటి మ్యాచ్‌లో చౌహాన్, విక్టోరియాపై 157 పరుగులు చేశాడు. అందుకు అతనికి 516 నిమిషాలు పట్టింది. కేవలం రెండు ఫోర్లు మాత్రమే కొట్టాడు. అంతకు ముందు ఇదే మ్యాచ్‌లో విక్టోరియాకు చెందిన పాల్ హిబ్బర్ట్ ఒక్క బౌండరీ కూడా లేకుండా శతకం చేశాడు. పెర్త్‌లో జరిగిన రెండో టెస్టు కోసం చౌహాన్ తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు చేశాడు. అప్పటి నుండి అతను తన కెరీర్ ముగిసే వరకు ఒకే ఒక టెస్ట్‌కు దూరమయ్యాడు. ఒక్క సందర్భం మినహా, ప్రతిసారీ గవాస్కర్‌తో కలిసి ఓపెనింగు చేసాడు. వారిద్దరూ కలిసి లాహోర్‌లో పాకిస్థాన్‌పై 192, వెస్టిండీస్‌పై బాంబేలో 117, 153 పరుగులు జోడించారు. [12]

1979 లో ఇంగ్లండ్‌లో, ది ఓవల్‌లో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో 438 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయింది. 1980-81లో ఆస్ట్రేలియాపై, చౌహాన్ మూడు టెస్టుల్లో 249 పరుగులు చేశాడు, గవాస్కర్ 118 పరుగులు చేశాడు. అడిలైడ్‌లో అతను మూడు పరుగుల తేడాతో వందను కోల్పోయాడు.[13] తదుపరి టెస్ట్‌లో మెల్‌బోర్న్‌లో, అతను 85 పరుగులు చేశాడు. గవాస్కర్‌తో కలిసి 165 పరుగులు జోడించిన తరువాత గవాస్కర్, డెన్నిస్ లిల్లీకి ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. అతను ఆ నిర్ణయంతో విభేదించాడు. అపుడు కెప్టెన్ అయిన గవాస్కర్, తాను పెవిలియన్‌కు వెళ్తూ, చౌహాన్‌ను మైదానం వదిలి తనతో వచ్చెయ్యమని ఆదేశించాడు.[14] భారత మేనేజర్ వింగ్ కమాండర్ షహీద్ దుర్రానీ చౌహాన్‌ని తిరిగి మైదానం లోకి వెళ్ళేలా ఒప్పించాడు. దాంతో ఇబ్బందికర పరిస్థితి తప్పింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత న్యూజిలాండ్‌లో పర్యటించిన చౌహాన్ రెండో టెస్టులో 78, మూడో టెస్టులో 36 & 7 పరుగులు చేశాడు. [15]

తరువాత సంవత్సరాల్లో[మార్చు]

పర్యటన తర్వాత చౌహాన్‌ను తొలగించారు. ఆ తరువాత ఇక ఎంపిక కాలేదు. అతను గవాస్కర్‌తో కలిసి చేసిన 59 ఓపెనింగ్ భాగస్వామ్యాలలో 3022 పరుగులు సాధించాడు. వాటిలో పదిసార్లు 100కి పైగా ఉన్నాయి. తన కెరీర్‌లో 16 అర్ధ సెంచరీలతో 2084 పరుగులు చేశాడు. కానీ ఒక్క శతకం కూడా చెయ్యలేదు. అతని చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ 1985లో బాంబేతో జరిగిన రంజీ ఫైనల్ మ్యాచ్‌. అందులో అతను 98, 54 పరుగులు చేశాడు. [16] అతను భారత జట్టుకు క్రికెట్ కోచ్‌గా కూడా పనిచేశాడు. [17]

రాజకీయాల్లో[మార్చు]

చౌహాన్ భారతీయ జనతా పార్టీ సభ్యుడు. అతను 1991, 1998లో అమ్రోహా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడు. 1996, 1999, 2004లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన అల్లే హసన్‌ను 35,000 ఓట్ల తేడాతో ఓడించాడు. [18] 2017లో అతను నౌగవాన్ సాదత్ (అసెంబ్లీ నియోజకవర్గం) నుండి ఉత్తర ప్రదేశ్ విధానసభకు ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. [19]

విజయాలు[మార్చు]

 • ఒక్క శతకం కూడా లేకుండా టెస్టు కెరీర్‌లో 2,000 కంటే ఎక్కువ పరుగులతో ముగించిన మొదటి టెస్ట్ క్రికెటర్, చౌహాన్. 2022 ఫిబ్రవరి 13 నాటికి, షేన్ వార్న్ (3154 పరుగులు), నిరోషన్ డిక్వెల్లా (2443 పరుగులు) మాత్రమే ఇదే విధమైన రికార్డును కలిగి ఉన్న ఇతర ఆటగాళ్లు. [20]
 • చౌహాన్ గవాస్కర్‌తో కలిసి 11 శతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వాటిలో ఒకటి నాల్గవ వికెట్‌కు కాగా మిగతా వన్నీ ఓపెనింగులే. 1978-79లో వెస్టిండీస్‌తో బాంబేలో జరిగిన టెస్టులో వారు ఓపెనింగ్ చేశారు. అయితే చౌహాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే రిటైర్ అయి, మూడో వికెట్ పడిపోయాక మళ్ళీ వచ్చాడు.[21]

మరణం[మార్చు]

2020 జూలైలో, COVID-19 మహమ్మారి సమయంలో చౌహాన్, COVID-19 సోకింది. ఒక నెల తర్వాత బహుళ అవయవ వైఫల్యం కారణంగా అతన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. [22] 2020 ఆగస్టు 16 న అతను 73 సంవత్సరాల వయస్సులో గురుగ్రామ్‌లో మరణించాడు.[23][24][25][26]

మూలాలు[మార్చు]

 1. "UP CM Adityanath Keeps Home, PWD for Maurya, Dinesh Gets Education". News18. Retrieved 26 January 2019.
 2. Lokapally, Vijay (16 August 2020). "Chetan Chauhan, the batsman who knew no fear". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
 3. "When Chetan Chauhan's laugh riled Australia's Jeff Thomson". The Indian Express (in ఇంగ్లీష్). 2020-08-18. Retrieved 2020-08-20.
 4. "Chetan Chauhan's political innings blossomed during Mandal-Mandir times". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-08-16. Retrieved 2020-08-17.
 5. Karmarkar, Amit (October 28, 2019). "Kamal Bhandarkar: The coach who fine-tuned Sunil Gavaskar's technique". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-17.
 6. "Former India opener Chetan Chauhan passes away at 73". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-17.
 7. "Ranji Trophy 1948-49: Bombay and Maharashtra engage in record run-feast". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-03-11. Retrieved 2020-08-19.
 8. "Sunil Gavaskar remembers Chetan Chauhan: Hard to believe that his cheerful banter won't be there". India Today (in ఇంగ్లీష్). August 17, 2020. Retrieved 2020-08-18.
 9. "Chetan Chauhan Wasn't a Cricketing 'Superstar', But There's Much He Should Be Remembered For". The Wire. Retrieved 2020-09-29.
 10. Scroll Staff. "Ranji Trophy wrap: Cheteshwar Pujara scores double century, Mumbai pile on the runs against TN". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-19.
 11. "Chetan Chauhan was India captaincy material: Former Team India manager". The Times of India (in ఇంగ్లీష్). 26 August 2020. Retrieved 2020-09-29.
 12. "Former India cricketer Chetan Chauhan passes away due to Covid-19". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-08-16. Retrieved 2020-08-18.
 13. "Yahoo Cricket". cricket.yahoo.net. Retrieved 2020-09-29.
 14. "Chetan Chauhan, former cricketer and Uttar Pradesh minister passes away". Jagranjosh.com. 2020-08-17. Retrieved 2020-09-29.
 15. "Full Scorecard of England vs India 4th Test 1979 - Score Report | ESPNcricinfo.com". www.espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-18.
 16. Mondal, Aratrick (2020-07-11). "Former India Test opener Chetan Chauhan tests coronavirus positive, hospitalised in Lucknow". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-19.
 17. "Chetan Chauhan dead, a look at his journey from Indian cricketer to UP cabinet minister". Zee News (in ఇంగ్లీష్). 2020-08-16. Retrieved 2020-09-29.
 18. "Chetan Chauhan's political innings blossomed during Mandal-Mandir times". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-08-16. Retrieved 2020-09-29.
 19. "Former India cricketer Chetan Chauhan dies after contracting coronavirus, suffering cardiac arrest". India Today (in ఇంగ్లీష్). August 16, 2020. Retrieved 2020-08-18.
 20. List of players with over 2000 runs with zero hundreds, Cricinfo Statsguru (accessed 13 February 2022)
 21. "IND vs WI, West Indies tour of India 1978/79, 1st Test at Mumbai, December 01 - 06, 1978 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
 22. "Chetan Chauhan critical after testing positive for Covid-19". ESPN Cricinfo. Retrieved 15 August 2020.
 23. "Chetan Chauhan, Sunil Gavaskar's longest-serving opening partner, dies at 73 | ESPNcricinfo.com". www.espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-16.
 24. "Former India opener Chetan Chauhan passes away at 73". The Times of India (in ఇంగ్లీష్). 16 August 2020. Retrieved 2020-08-17.
 25. "Chetan Chauhan, Former Cricketer And UP Minister, Dies of COVID-19". NDTV.com. Retrieved 2020-08-17.
 26. "Former India cricketer Chetan Chauhan passes away due to Covid-19". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-08-16. Retrieved 2020-08-17.