Jump to content

జహాంగీర్

వికీపీడియా నుండి
(జహంగీరు నుండి దారిమార్పు చెందింది)
జహాంగీర్
మొఘల్ చక్రవర్తి
పరిపాలన1605 - 1627
పూర్తి పేరునూరుద్దీన్ సలీమ్ జహాంగీర్
జననంసెప్టెంబరు 20, 1569
జన్మస్థలంఫతేపూర్ సిక్రీ
మరణం1627 నవంబరు 8(1627-11-08) (వయసు 58)
సమాధిTomb of Jahangir
ఇంతకు ముందున్నవారుఅక్బర్
తరువాతి వారుషాజహాన్
భార్యలుమన్‌భవాతి భాయి
మన్మాతి
నూర్జహాన్
సంతానమునిసర్ బేగం , కుస్రూ మిర్జా, పర్వెజ్, బహర్ బాను బేగం, షాజహాన్, షహ్‌ర్యార్, జహందర్
వంశముTimurid
తండ్రిఅక్బర్
తల్లిPrincess హర్కా భాయి (a.k.a. Mariam Zamani) (Jodhabai)[1]

నూరుద్దీన్ సలీం జహాంగీర్, బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, ఖుష్రూయె గీతీ పనాహ్, అబుల్-ఫాతెహ్ నూరుద్దీన్ జహాంగీర్ పాద్షాహ్ గాజీ జన్నత్-మక్సానీ (పర్షియన్: نور الدین جهانگیر ), జననం సెప్టెంబరు 20, 1569 - మరణం నవంబరు 8, 1627) (OS ఆగస్టు 30, 1569NS నవంబరు 8, 1627, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి. జహాంగీర్ అనే పదం పర్షియన్ భాషా పదం; جهانگير, అర్థం "ప్రపంచాన్ని జయించినవాడు". నూరుద్దీన్ అనగా "విశ్వాస జ్యోతి".

జహాంగీర్ తండ్రి అక్బర్. ఎన్నో నోముల తరువాత పుట్టాడు. జహాంగీర్ భార్య నూర్జహాన్. అందగత్తెయేగాక మహా తెలివైనది. రాజ్యభారాన్ని మోయగల స్తోమత గలది. జహాంగీర్ త్రాగుడు అలవాటుకు బానిస. ఈ దురలవాటుతోనే మరణించాడు. మంచి న్యాయ పరిపాలకుడిగా పేరున్ననూ, 'త్రాగుడు చక్రవర్తి' గా చెడ్డపేరు తెచ్చుకొని, అదే పేరుతో మరణించాడు.

స్వీయ చరిత్ర

[మార్చు]

జహాంగీర్ తన స్వీయ చరిత్రను తుజ్క్-ఎ-జహాంగీరీ అనే పేరుతో రచించాడు.

ప్రకృతి పరిశోధకుడు, విహంగ శాస్త్రవేత్తగా

[మార్చు]

జహంగీరును మొగల్ చక్రవర్తిగానేకాదు, శాస్త్రవేత్తగా చెప్పుకోవచ్చు. పక్షి పరిశీలనలో ఈయన అనుభవాలు, జ్ఞాపకాలు ఎంతో విలువైనవి.. 1605 - 1627 మధ్య కాలంలో మన దేశంలో చక్రవర్తిగా ఉన్న ఈయన పక్షులు, మొక్కలు, జంతువులను గాఢంగా పరిశీలించి, వాటి సంబంధిత విలువైన అంశాలను సాధికారికంగా చెప్పగలిగారు. కళలకు, సాహిత్యానికి, భవన నిర్మాణశాస్త్రమునకు, ప్రకృతి విజ్ఞానమునకు ఎంతో సేవ చేశారు.

ప్రధానంగా ఈయనకు పక్షులంటే అమితమైన ప్రేమానురాగాలు. పక్షులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి ప్రవర్తన, జీవన విధానాల గురించి ఒక గ్రంథాన్ని కూడా రాసారు. "తజుక-ఇ-జహంగిరి" (జహంగీర్ జ్ఞాపకాలు) లో తన పరిశోధనల సారాంశాన్ని పొందుపరిచారు. భారతదేశంలో వృక్ష, జంతు జాలం గురించి అనూహ్యంగా విస్తృత సమాచారాన్ని అందించారు. సమకాలిక శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు రాశారు. ఖగోశ శాస్త్ర, సాంకేతితి శాస్త్ర గ్రంథాలను ఉర్దూలో వెలువరించారు.

ఈయన 1605, అక్టోబరు 24 న మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. యుద్ధాలు, తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలు, నడుమ కూడా ఈయన ప్రకృతి పరిశీలన చేసేవాడు. ఈయన సొంతంగా జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేసుకొని, గంటల తరబడి, రోజుల తరబడి పరిశీలనలు జరిపెవారు. పక్షి శాస్త్రానికి సంబంధించిన అనేక మౌలికాంశాలను తొలిసారిగా పొందుపరచగలిగాడు. తాను రాసిన సమాచార గ్రంథంలో 36 రకాల జాతుల జంతువులను, 57 వర్గాల వృక్షాల గురించి అమూల్య పరిశోధనా సమాచారాన్ని కూర్పుచేశారు. వాటి వాటి లక్షణాలు, పర్యావరణ ప్రభావం, శారీర నిర్మాణ విశేషాలు, అలవాట్లు, స్థానిక పేర్లు, సగటు బరువు, కొలతలు మొదలయిన వివరాలన్నిటినీ తెలిపారు. అంతే కాదు, తమ ఆస్థాన ప్రముఖ చిత్రకారుడు ఉస్తాద్ మాన్సూర్ చె ఆయా జంతువుల, వృక్షాల అద్భుతమైన; పెయింటింగ్ లు వేయించి, తన సమాచారానికి జోడించారు. వృక్ష, జంతు జాలములను ప్రదర్శించిన ఆ పెయింటింగ్ లు ఆధునిక పరిశోధనలకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉన్నాయి. అనేకానేక పుష్పజాతులను, పక్షులను, జంతువులను చిత్రీకరించిన ఈ పెయింటింగ్స్ విశేష సమాచారాన్ని క్రోడీకరించేవిధంగా ఉన్నాయి.

అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ పక్షి పరిశోధకుడు సలీం ఆలీ మాటల్లో,

ప్రకృతి చరిత్రకు సంబంధించి అమూల్యమైన అంశాలను జహంగీరు భావితరాలకు అందించారు. మొక్కలకు సంబంధించి కూడా ఈయన అద్భుత విషయాలను విశదీకరించారు. సూర్య, చంద గ్రహణాలు, తోకచుక్కల గూర్చి సైతం తన పరిశీలనలను గ్రంధస్థం చేశారు. ప్రకృతి పరిశీలనలో భాగంగా ఒక కొత్త పక్షిని గమనించిన వెంటనే అస్థాన చిత్రకారులను పిలిపించి, వారిచేత వాటి బొమ్మలను వేయించేవారు. ఈ చిత్రాలతో కూడిన ఆల్బం సైతం పక్షుల పరిశోధనా శాస్త్రంలో ఎంతో కీలకమైనదిగా మన్ననలు అందుకోగలిగింది.

—సలీం అలీ

సంపద

[మార్చు]

జహంగీర్ చక్రవర్తి ఏ నగల్లోనూ పొదగకుండా విడిగా ఉన్న వజ్రాల బరువు మణుగు, కెంపులు రెండు మణుగులు, పచ్చలు అయిదుమణుగులు, జేడ్ ఒక మణుగు ఉండేవి. ఇవి కాక బంగారంలో రత్నాలు తాపిన ఖడ్గాల పిళ్ళు, బాకులు, మృదంగాలు, కలికితురాయిలు, వక్షోభూషణాలు, సింహాసనాలు, జీనులు, కూజాలు, బల్లెములు, పానపాత్రలు, తాయత్తు, ఉంగరాలు మొదలైనవెన్నో ఉన్నాయి.[2]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Fatehpur Sikri. Columbia University.
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  • Andrea, Alfred J. and Overfield, James H. The Human Record: Sources of Global History. Vol. 2: Since 1500. Fifth Edition.
  • Alvi, Sajida S. “Jahangir.” Religion and State During The Reign of Mughal Emperor Jahangir: Non-juristical Perspectives. No. 69. [1995]. JSTOR Database. <www.jstor.org>
  • Findly, Ellison B. “Jahangir.” Jahangir’s vow of Non-Violence. No.2. Vol. 107. [1987]. JSTOR Database. < www.jstor.org >

బయటి లింకులు

[మార్చు]
అంతకు ముందువారు
Akbar
Mughal Emperor
1605–1627
తరువాత వారు
Shah Jahan
"https://te.wikipedia.org/w/index.php?title=జహాంగీర్&oldid=4242331" నుండి వెలికితీశారు