Jump to content

జాస్తి రామమోహనరావు చౌదరి

వికీపీడియా నుండి

జాస్తి రామమోహనరావు చౌదరి సుప్రసిద్ధ రంగస్థల నటులు. ఆంజనేయుడు, భస్మాసురుడు, హరిశ్చంద్రుడు, మైరావణుడు, భవానీ శంకరుడు, జాంబవంతుడు మొదలైన పాత్రలలో ప్రాచూర్యం పొందారు.

జననం

[మార్చు]

రామమోహనరావు చౌదరి 1929, డిసెంబరు 24 న పూర్ణయ్య చౌదరి, సాంబ్రాజ్యమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

రామమోహనరావు విద్యార్థి దశలో ఉన్నప్పుడే తెలుగు పద్యాలు రాగయుక్తంగా పాడుతూ, ఉపాధ్యాయుల ప్రేమను పొందారు. హైస్కూలు ప్రధానోపాధ్యాయులైన మధుసూదనరావుకి నాటకాభిరుచి ఉంది. దాంతో ఆయన తన విద్యార్థులచే శ్రీకృష్ణరాయబారం నాటకం ప్రదర్శింపచేశారు. అందులో రామమోహనరావు కృష్ణపాత్ర చేశారు. స్కూలు వార్షికోత్సవ వేడుకలలో వేసి ఈ నాటకంలో కృష్ణపాత్ర ధరించిన, రామమోహనరావు పద్యాలు చక్కగా పాడి ప్రేక్షకుల మన్ననలను పొందారు. అలా తన నటనకు బీజం పడింది.

మోహనరావు 1958లో "శ్రీమహాలక్ష్మి నాట్యమండలి"ని స్థాపించారు. మోహనరావు నటించిన శ్రీకృష్ణ జాంబవంత యుద్ధం, లంకాదహనము, వాలి-నుగ్రీవ, మోహినీ భస్మాసుర మొదలైన నాటకాలను హెచ్.యం.వి. గ్రామఫోను కంపెనీవారు రికార్డు చేసుకున్నారు. వీరితోపాటు బండారు రామారావు, చెంచు రామారావులు కూడా గ్రామఫోన్ రికార్డులిచ్చారు.

రామమోహనరావు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో రేడియో వారోత్సవాలు జరిపినప్పుడు మోహినీ భస్మాసుర నాటకాన్ని, 1962లో విజయవాడ రేడియో కేంద్రంలో రామాంజనేయ యుద్ధం నాటకాన్ని ప్రదర్శించారు.

రామమోహనరావు సొంత బృందాన్ని, ప్రదర్శనకు కావల్సిన లైట్స్, మైకులు, తెరలు, డ్రెస్ లు ఏర్పాటుచేసుకొని ప్రత్యేక వాహనంలో ప్రయాణం చేసూ దాదాపుగా నెలకు 25 నుండి 30 నాటకాలు ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1972 నుండి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రితో కలసి చింతామణి, హరిశ్చంద్ర నాటకాలు ప్రదర్శించారు.

ఈయన ఆంధ్రప్రదేశ్తో పాటు కలకత్తా, బొంబాయి, బెంగుళూరు, జంషెడ్‌పూర్, మద్రాసు, భిలాయ్, దుర్గాపూరు, జయపూరు మొదలైన ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చారు.

నటించిన పాత్రలు

[మార్చు]
  • ఆంజనేయుడు
  • భస్మాసురుడు
  • హరిశ్చంద్రుడు
  • మైరావణుడు
  • భవానీ శంకరుడు
  • జాంబవంతుడు

సినిమారంగం

[మార్చు]

రామమోహనరావు రాష్ట్రం నలుమూలలా నాటకాలు వేస్తున్న సమయంలో మాంగల్యం సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో షణ్ముఖి ఆంజనేయ రాజు రాముడుగా, రామమోహనరావు ఆంజనేయుడుగా నటించారు.

సన్మానాలు - బిరుదులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • జాస్తి రామమోహనరావు చౌదరి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 215.