టి.ఎన్.సదాలక్ష్మి
టి.ఎన్.సదాలక్ష్మి | |||
![]()
| |||
నియోజకవర్గం | కామారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డిసెంబరు 25, 1928 బొల్లారం | ||
మరణం | జూలై 24, 2004 | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | టీవీ నారాయణ | ||
మతం | హిందూ |
టి.ఎన్.సదాలక్ష్మి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారిణి, రాజకీయ నాయకురాలు. [1]
జీవిత విశేషాలు[మార్చు]
ఈమె 1928 డిసెంబరు 25 న సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో గల దళిత కుటుంబంలో జన్మించారు. బొల్లారం లోని ప్రైవేటు పాఠశాలలో, కీస్ హైస్కూల్‌లో, మద్రాస్‌లోని ‘క్వీన్ మేరీస్ ఉమెన్స్ కాలేజీ’లో యఫ్.ఏ. కోర్సు చదివారు. పదవ తరగతి చదువుతుండగా టీవీ నారాయణతో పెండ్లి జరిగింది[2].
రాజకీయ జీవితం[మార్చు]
చిన్న వయస్సులోనే ఆర్యసమాజం వైపు ఆకర్షితులైనారు. 1957లో తొలిసారిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎస్.సి. రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత నిజామాబాదు జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండవసారి ఎన్నికై దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులైనారు. 1962లో తొలి మహిళా డిప్యూటి స్పీకరుగా పదవి పొందారు. 1967లో మరోసారి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన పరాజయం పొందారు. 1969లో తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు.ఈ ఉద్యమ సమయంలో ముఖ్య నాయకులంతా జైల్లో ఉంటే, తన బంగారాన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో ఉద్యమాన్ని నడిపించిన ధీశాలి ఆమె. తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి జైలుకు వెళ్ళిన పిదప సదాలక్ష్మి ఆ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగింది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి 2000లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆమె బాబూ జగ్జీవన్‌రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు[2]. ఆమె జూలై 24, 2004 న మరణించారు.
మూలాలు[మార్చు]
- ↑ Andhrajyothy (10 November 2018). "ముఖ్యమంత్రికే ముచ్చెమటలు పట్టించిన చైతన్య లక్ష్మి". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
- ↑ 2.0 2.1 "నమస్తే తెలంగాణ". Archived from the original on 2011-09-27. Retrieved 2014-04-16.