టి. రాజాసింగ్ లోథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి. రాజా సింగ్
టి. రాజాసింగ్ లోథ్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - ప్రస్తుతం
నియోజకవర్గం గోషామహల్

వ్యక్తిగత వివరాలు

జననం (1977-04-15) 1977 ఏప్రిల్ 15 (వయసు 47)
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగు దేశం పార్టీ
తల్లిదండ్రులు టి.నావల్ సింగ్, రామి భాయి
జీవిత భాగస్వామి టి.ఉష భాయి
సంతానం 4 (3 కుమారులు, 1 కుమార్తె)
నివాసం ధూల్‌పేట్, హైదరాబాద్, 500006

టి. రాజాసింగ్ లోథ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3][4]

జననం

[మార్చు]

టి.రాజాసింగ్ 1977, ఏప్రిల్ 15న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోషామహల్లో టి. నావల్ సింగ్, రామి భాయి దంపతులకు జన్మించాడు. అతను పూర్వికులు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రాజాసింగ్ కు ఉషాబాయితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాజాసింగ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేశాడు. అతను 2009 హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి, 2009 నుండి 2014 వరకు కార్పోరేటర్ గా పనిచేశాడు. రాజాసింగ్ 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[5][6] అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8] అతను 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[9]

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[10]

రాజాసింగ్‌ ను 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[11]

వివాదాలు

[మార్చు]

హైదరాబాద్ జూమెరత్ బజార్ లో స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి భాయ్ విగ్రహం తొలగింపు సంఘటనపై రాజాసింగ్‌పై కేసు నమోదైంది.[12] అతను ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ పై అభ్యంతరం తెలిపాడు.[13][14] 2020, సెప్టెంబరులో రాజా సింగ్ హింసను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తమ నియమావళిని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌ అతను వ్యక్తిగత ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాపై నిషేధం విధించింది.[15]

సస్పెన్షన్‌

[మార్చు]

మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనే కారణంతో 2022 ఆగస్టు 23న ఆయనను పార్టీ నుండి అధిష్ఠానం బహిష్కరణ చేసింది. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు శాస‌నస‌భాప‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించి ఆయనపై చ‌ర్యలు తీసుకుంది. 2023లో జరిగే శాసనసభ ఎన్నికల సందర్బంగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను  పార్టీ నాయకత్వం 2023 అక్టోబర్ 22న ఎత్తివేసింది.[16]

మూలాలు

[మార్చు]
 1. "SRI T. RAJA SINGH". Telangana Legislative Assembly. Archived from the original on 2021-05-06. Retrieved 2021-05-13.
 2. BBC News తెలుగు (5 November 2018). "తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?". BBC News తెలుగు. Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
 3. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
 4. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
 5. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
 6. "T. Raja Singh(Bharatiya Janata Party(BJP)):Constituency- GOSHAMAHAL(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-28.
 7. "T. Raja Singh MLA of Goshamahal Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
 8. "T. Raja Singh(Bharatiya Janata Party(BJP)):Constituency- GOSHAMAHAL(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-28.
 9. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
 10. NTV Telugu (14 December 2023). "ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
 11. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
 12. NTV Telugu (20 June 2019). "బండరాయితో తలపై బాదుకున్న రాజాసింగ్..! (వీడియో వైరల్‌)". NTV Telugu. Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
 13. APHerald (1 December 2015). "ఓయులో బీఫ్ ఫెస్టివల్‌పై లొల్లి." [Andhra Pradesh Herald]. Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
 14. Telugu One India (9 December 2015). "ఓయూలో బీఫ్ ఫెస్టివెల్ వద్దు: షాకిచ్చిన హైకోర్టు, రాజాసింగ్ హ్యాపీ". telugu.oneindia.com. Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
 15. News 18 (3 September 2020). "Who is 'Rowdy-sheeter' BJP MLA T Raja Singh and Why Did Facebook Ban Him for Hate Speech?". www.news18.com. Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 16. Namaste Telangana (22 October 2023). "గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత." Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.