Jump to content

తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్

వికీపీడియా నుండి
తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుతెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ
ప్రారంభ విడుదల11 మే 2022; 2 సంవత్సరాల క్రితం (2022-05-11)
ఆపరేటింగ్ సిస్టంఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, యుఎస్ఎస్‌డి
రకంఆరోగ్యం
లైసెన్సుఫ్రీవేర్, యాజమాన్యం

తెలంగాణ డయాగ్నస్టిక్‌ మొబైల్‌ యాప్‌, అనేది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకోసం రూపొందించిన అధికారిక మొబైల్ యాప్‌.[1] రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్‌ ఫోన్‌లో చూసుకొనే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.[2]

ప్రారంభం

[మార్చు]

2022 మే 11న మెదక్ జిల్లా, నార్సింగిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపి జి. రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[3][4]

సేవలు

[మార్చు]
  • వ్యక్తిగత ఆరోగ్య వివరాలు తెలుసుకోవడం
  • వైద్య పరీక్షల వివరాలు, రిపోర్టులను డౌన్‌లోడ్‌ చేసుకోవడం
  • దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖాన వివరాలు తెలుసుకోవడం
  • పరీక్షలను బట్టి అందుబాటులో ఉన్న దవాఖానను ఎంచుకోవడం
  • వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆశా సిబ్బంది, ఆసుపత్రుల సేవలపై వివరాలు తెలుసుకోవడం
  • అభిప్రాయాన్ని నమోదు చేయడం
  • వైద్యసేవలపై అసౌకర్యం కలిగితే ఫిర్యాదు చేయడం
  • జరుగుతున్న వైద్య పరీక్షల స్టేటస్‌ తెలుసుకోవడం

మూలాలు

[మార్చు]
  1. "Govt app for free diagnostic tests". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2022-05-12. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.
  2. telugu, NT News (2022-05-12). "అరచేతిలో ఆరోగ్యం". Namasthe Telangana. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.
  3. "Telangana News: అరచేతిలో ఆరోగ్య సమాచారం". EENADU. 2022-05-12. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.
  4. Shanker, K. Shiva (2022-05-11). "Simply app-surd! Newly-launched app not available for download". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-05-11. Retrieved 2022-05-12.