తెలంగాణ తెలుగుదేశం పార్టీ కమిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కమిటీ
స్థాపన తేదీ2014
ప్రధాన కార్యాలయంఎన్టీఆర్ ట్రస్ట్ బంజారాహిల్స్ తెలంగాణ
విద్యార్థి విభాగంతెలుగు విద్యార్థులు ఫెడరేషన్
యువత విభాగంతెలుగు యువత
మహిళా విభాగంతెలుగు మహిళ
రాజకీయ విధానంమతం సమానత్వం
Coloursపసుపు
లోక్‌సభలో సీట్లులేవు
రాజ్యసభలో సీట్లులేవు
శాసనసభలో స్థానాలులేవు
Election symbol
Website
https://www.telugudesam.org/

తెలుగుదేశం పార్టీ, తెలంగాణ ( తెలంగాణ టిడిపి ), తెలంగాణ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభాగం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను పార్టీ నియమించింది ప్రస్తుతం ఆయన 2022 నవంబరు నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు [1][2]

2014లో జరిగిన [3]తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 15 స్థానాలను గెలుచుకుంది.

చరిత్ర[మార్చు]

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది.[3] 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి టిడిపి లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకుంది.[4][5]

2016 హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 150 స్థానాలకు గానూ ఒక కౌన్సిలర్ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది.[6] 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో, 119 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో టిడిపి రెండు స్థానాలను గెలుచుకుంది, ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాలు గెలుచుకుంది. ఇది భారత జాతీయ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.[7]

విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కమిటీలను నియమించింది. ఎల్.రమణ 2015లో తెదేపా తెలంగాణ కమిటీకి మొదటి అధ్యక్షుడిగా నియమితులై 2021 జూలై 19 వరకు పనిచేశారు. 2021 జూలైలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులును నియమించారు.[8]

2022 నవంబరులో, మాజీ ఎమ్మెల్సీ, BC నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా N. చంద్రబాబు నాయుడు నియమించారు.[9] ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉనికిని కోల్పోయింది.

నాయకులు[మార్చు]

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు[మార్చు]

నం. ఫోటో పేరు
బాధ్యతలు స్వీకరించిన తేదీ బాధ్యతల నుంచి తప్పుకున్న తేదీ Ref.
1 ఎల్. రమణ 2015 2021 [8]
2 బక్కని నరసింహులు 2021 జూలై 19 2022 నవంబరు 4
3 కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 2022 నవంబరు 10 అధికారంలో ఉన్నాడు. [9]

మూలాలు[మార్చు]

  1. "N Chandrababu Naidu appointed Telangana TDP chief". The Times of India. November 5, 2022.
  2. Gowtham, G. (December 13, 2022). "Telangana TDP Can Play A Key Role In AP Election?". India Herald.
  3. 3.0 3.1 "List of Winners in Telangana 2014". Myneta.info. Retrieved 21 December 2022.
  4. "Telangana Lok Sabha (General) Election Results 2014". Elections.in. Retrieved 21 December 2022.
  5. "TDP's lone Telangana MP, Malla Reddy, joins TRS". Indian Express. June 1, 2016.
  6. "GHMC Election Results 2016: TRS Wins Hyderabad Civic Polls With 99 Seats, Congress, TDP-BJP Combine Routed". India.com. February 15, 2016.
  7. "Telangana Election Results 2018: TRS wins 88 seats, KCR set to return for a second term". Financial Express. December 12, 2018.
  8. 8.0 8.1 Vadlapatla, Sribala (July 20, 2021). "Telangana: Ex-MLA Bakkani Narasimhulu is new TTDP chief". The Times of India.
  9. 9.0 9.1 "Telangana TDP Springs A Big Surprise". Mirchi9.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-10-14. Retrieved 2022-10-24.