దర్వేష్ అలీ సాహెబ్ దర్గా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dharvesh Ali Saheb Darga

దర్వేష్ అలీ సాహెబ్ దర్గా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మండలానికి కేంద్రమైన ధరూర్ గ్రామంలో ఉంది.

చరిత్ర[మార్చు]

దర్వేష్ అలీ సాహెబ్ అను ఒక ముస్లిం సాధువు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ కొంత కాలం జీవించి, ఇక్కడే సజీవ సమాధి అయ్యారని గ్రామస్తుల కథనం.[1]

ఉత్సవాలు[మార్చు]

ఈ దర్గాలో సంవత్సరం పొడువునా ఎవరో ఒకరు కందురులు చేస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో దర్గాలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ధరూర్ చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సైతం ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.

ప్రత్యేకత[మార్చు]

ఈ దర్గాను గ్రామంలో ముస్లిమ్‌ల కంటే హిందువులే ఎక్కువగా ఆరాధించడం విశేషం. మరి ముఖ్యంగా హిందువులలో కురుమ, యాదవులు తమ పెంపుడు జీవులైన గొర్రె జాతి వృద్ధి చెందాలని అందుకు దర్గా స్వామి ఆశిస్సులు ఉండాలని మొక్కుబడులు కట్టి, స్వామి పేర ఒక పొట్టేలును విడిచి, సంవత్సరం అంతా మేపి, ఉర్సు సందర్భంగా కందురు చేస్తుంటారు. దర్వేష్ అలీ సాహెబ్ అను పేరును హిందువులు తమ వాడుకలో, కొందరు దర్వేష్ + అలీ అని, దానినే కాల క్రమంలో దర్శెల్లిగా మార్చేశారు. అలాగే దర్వేష్ + సాహెబ్ అను పేరును వాడి దానిని దర్శంగా మార్చేశారు. ఈ విధంగా మారిన పేర్లను హిందువులు తమ పిల్లలకు స్వామి పేరుగా పెట్టుకుని తమ భక్తిని చాటుకుంటారు. అందుకే ఈ గ్రామంలో చాలా మంది హిందువుల పేర్లు దర్శం అని, దర్శెల్లి అని కనిపిస్తాయి. ఈ అనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. దీపిక, ప్రత్యేక సంచిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ధరూర్- 2006, పుట - 3