ధర్మపురి (కరీంనగర్)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ధర్మపరి, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలంలోని గ్రామం.[1]

ధర్మపురి
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో ధర్మపురి మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో ధర్మపురి మండలం యొక్క స్థానము
ధర్మపురి is located in Telangana
ధర్మపురి
తెలంగాణ పటములో ధర్మపురి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°56′51″N 79°05′38″E / 18.9475°N 79.094°E / 18.9475; 79.094
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము ధర్మపురి
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 78,365
 - పురుషులు 38,285
 - స్త్రీలు 40,080
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.75%
 - పురుషులు 53.40%
 - స్త్రీలు 28.53%
పిన్ కోడ్ 505425

ఇది మండల కేంద్రమైన ధర్మపురి నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగిత్యాల నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4417 ఇళ్లతో, 17243 జనాభాతో 2014 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8469, ఆడవారి సంఖ్య 8774. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2079 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 200. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 571698[2].పిన్ కోడ్: 505425.

విషయ సూచిక

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ ధర్మపురి గ్రామం/ మండలం  కరీనగర్ జిల్లా, జగిత్యాల రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ధర్మపురి మండలాన్ని (1+12) పదమూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

భౌగోళిక స్వరూపం[మార్చు]

ఈ మండలం జిల్లాలో ఈశాన్యం వైపున మంచిర్యాల జిల్లా సరిహద్దులో గోదావరి నది గోదావరి నది తీరాన ఉంది. ఈ మండల స్వరూపం త్రికోణం ఆకారంలో పైన మొనతేలి ఉంది.మంచిర్యాల జిల్లా సరిహద్దు, దక్షిణాన గొల్లపల్లి మండలం, ఆగ్నేయాన వెల్గటూరు మండలం, పశ్చిమాన సారంగాపూర్ మండలం, నైరుతిన జగిత్యాల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.మండలంలో 22 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో 10ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.

సమీప ఇంజనీరింగ్ కళాశాల జగిత్యాలలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ పొలసలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగిత్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ధర్మాపూరిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు , 15 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో19 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు నలుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ధర్మాపూరిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రవాణా సౌకర్యాలు

నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి నెంబర్ 63 కొత్త (పాత 16) మరియు రాష్ట్ర హైవే 7ఈ మండలం మీదుగా పోవుచున్నది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ధర్మాపూరిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 720 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 89 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 20 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 35 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 405 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 412 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 333 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 296 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 448 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ధర్మాపూరిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 200 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 118 హెక్టార్లు* చెరువులు: 130 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ధర్మాపూరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మొక్కజొన్న, మిరప

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బీడీలు

యోగనృసింహ క్షేత్రం[మార్చు]

ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగియున్నది. ఈ క్షేత్రములో శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమం, శ్రీ ఉగ్రలక్ష్మీ నృసింహుని ఆలయంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ వేణు గోపాల స్వామి వార్ల ఆలయములు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.

చరిత్ర[మార్చు]

పది, పదకొండవ శతాబ్దాలలో ధర్మపురమని పేరు కలిగిని ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం ఉంది. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది. శాతవాహనులు, బాదామి చాళుఖ్యులు కళ్యాణి చాళుఖ్యులు, కాలంలో ఈ ఆలయం ఉన్నతి స్థితిలో వున్నట్లు తెలుస్తున్నది. నైజామ్ కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో వుండేది. క్రీ.శ. 1309లో అల్లాయుద్దిన్‌ఖిల్జి ధర్మపురి ఆలయాల పై దాడి చేసి నాసనం చేశాడని చరిత్ర వల్ల తెలుస్తున్నది.

యోగాసీనుడైన శ్రీ లక్ష్మిసమేత నృసింహ స్వామి స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్ర రూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడవున్నది. ఇక్కడే శ్రీ రామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్టు చెప్పబడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ధర్మ పురిలో అనేక ఇతర పురాతనమైన ఆలయాలు, మందిరాలు కూడా ఉన్నాయి. గోదావరి తీరంలో వున్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మ పురి ఆతి పురాతనమైనది ఆధ్యాత్మిక వేత్తల భావన. అనేక ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.ధర్మపురి *దేవాలయం* మరియి *గోదవరి* గురించి బయటవారు ఎంత గొప్పగా చేప్పుకొంటరో వారి మాటల్లో...

ధర్మపురి దర్సిస్తే యమపురి ఉండదు[మార్చు]

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రసిదిచెందిన ఒక పుణ్యక్షేత్రం.ధర్మపురి, చారిత్రాత్మకంగా గొప్ప కవులు, తత్వవేత్తలు, సంగీతం, కళ మరియు నృత్య అలంకరించబడిన మహా పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రం లో ఉన్నదీ.రాజు ధర్మవర్మ, అది ధర్మరాయ గతంలో ధర్మపురం, ధర్మనపురం, దంమంవురు, ధర్మవురా మరియు ధర్మపురం అని పిలిచేవారు తర్వాత ఇప్పుడు ధర్మపురిగా పిలుస్తారు. ఇది పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న దేవాలయాలు మరియు కళాకారులకు ప్రసిద్ధి ధర్మపురి క్షేత్రం .దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రెండు దేవాలయాలు ఉన్నాయి. 14 వ మరియు 15వ శతాబ్దాలలో బహమనీ మరియు కుతుబ్ షాహీ, వ్యతిరేక హిందూమతం యొక్క తదుపరి దశలో పతనం ఔరంగజేబు ప్రారంభించారు తర్వాత. తన సహచరులను కూడా తన అడుగుజాడల్లో నడిచారు. రుస్తుమ్దిల్ఖాన్ , హైదరాబాద్ సుబేదార్, ఒక లక్ష్మి నరసింహ స్వామి ఆలయం మార్చబడుతుంది. 1448 AD లో, క్రొత్త దేవాలయం మసీదు సమీపంలో అరవై స్తంభాలు నిలబెట్టింది ఎస్ట ఆలయం పాత నరసింహ స్వామి గుడి97 అని పిలుస్తారు. 1725 AD లో, లార్డ్ నరసింహ యొక్క చిహ్నంగా ధర్మపురి గ్రామ సమీపంలో కనుగొనబడింది.

ధర్మపురి పట్టణం గురించి జగిత్యాల్ నుండి -30 కిమీ మరియు గోదావరి నది బ్యాంక్ సౌత్ సెంట్రల్ రైల్వే కాజీపేట-బల్హర్శ విభాగంనా మంచేరియాల్ రైల్వే స్టేషన్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నది దక్షిణ వాహిని [దక్షిణ ప్రవహించే] గా నది అందువల్ల దక్షిణ ఉత్తర వాహిని అని అంటారు.

ధర్మపురికి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు.తెలంగాణ రాష్ట్రములో ప్రసిద్ది గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కి మీ దూరంలో ఉంది.

పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేస్వరలయం, మసీదులు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి అనాది నుంచి శైవ, వైష్ణవ, ముసిలం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉంది. ఇక్కడ స్వామి వారు యోగానంద నరసింహ స్వామి భక్తుల కోరికలను నేరవేరుస్తున్నాడు.

యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఎర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజు ని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవైతి. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గం లో నడిపించి నలుగు పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి పేరు వచ్చింది అని పురాణాలో చేప్పారు.ధర్మపురిలో ఒక ప్రత్యేకత ఉంది అది యమ ధర్మరాజు ఆలయం.

ఎలా చేరుకోవాలి[మార్చు]

 • హైదరాబాద్, కరీంనగర్,జగిత్యాల , వేములవాడ, మంచిర్యాల, నాగపూర్, ముంబై, భివాండీ, నాందేడ్, చంద్రాపూర్, లతూర్, గుజరాత్, ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, షిరిడీ, తిరుపతిల నుండి భక్తులు బస్సు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
 • రైలు ద్వారా మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద దిగి బస్సు ద్వారా 40 కిలోమీటర్ల ప్రయాణం చేసి చేరుకోవచ్చు.బస్సులు పుష్కలంగా మంచిర్యాల నుండి ధర్మపురికి ఉన్నాయి.

కోటిలింగాల[మార్చు]

ధర్మపురికి 15 కి.మీ దూరంలో వున్న కోటిలింగాలలో బయటపడిన శిలాఫలకాలు, శాతవాహనుల కాలం నాటి అంతకన్నా ముందరి రాజుల నాటి (సామగోపుని గోభద్రుడు) నాణేలు, అలాగే 2003లో పుష్కరాల సమయంలో భూమిని చదును చేస్తున్నపుడు బయటపడిన యజ్ఞవాటికలు, వాటిలో వాడిన ఇటుక, మొదలైనవి బయట పడ్డాయి.

స్థల పురాణము[మార్చు]

పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.

అదనపు సమాచారం[మార్చు]

 • ఆతి పురాతనమైన ధర్మపురి క్షేత్రం కరీంనగర్ కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాల పురాతనమయిన ఆలయం. దీని మూలాలు వివిధ పురాణాలలో కూడా కనబడతాయి. ఇంకా అనేక శిలా శాసనాలలో కూడా దీని ప్రస్తావన ఉంది.
 • గోదావరి, భద్ర నదుల సంగమస్థలమయిన ధర్మపురి అయిదు నరసింహాలయాలున్న ఏకైక గ్రామం. అందులో మూడు నరసింహాలయాలు నేటికీ పూజలందుకుంటున్నాయి. ఉపనిషత్తులు, పురాణాలలో నారసింహుని రూపము, తత్వము ఎలా చెప్పబడ్డాయో అవి ధర్మపురిలో ఎలా మనకి గోచరమవుతున్నాయో నరసయ్యగారు వివరించారు. 32 రకాల నారసింహ రూపాలు స్థలపురాణాలలో వర్ణించబడినాయట. ధర్మపురి గర్భాలయంలో ఉన్నది ప్రహ్లాదయుతుడైన నారసింహుడు. అలాగే నవవిధమైన నారసింహ తత్వాలున్నాయి. ధర్మపురిలో యోగనారసింహుడు, ఉగ్రనారసింహుడు, ప్రహ్లాదనారసింహుడు, లక్ష్మీనారసింహుడు అనే తత్వాలు ప్రకాశించాయి.
 • ఇక్కడి ప్రధాన దేవాలయమైన శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమమునందు ఎక్కడా కనబడని బ్రహ్మ దేవుని విగ్రహము, యముని విగ్రహముండుట మిక్కిలి విశేషము. ఇక్కడికివచ్చిన యాత్రికులకు యముని దర్శనము వలన నరక బాధ ఉండదని క్షేత్రపురాణము తెలుపుతున్నది.
 • ముఖ్యముగా ఇక్కడ పుణ్య గోదావరి నది సమీపములో నుండుటచేత యాత్రికులకు సకల పాపనివారణ కావడమేకాక ఎంతో ఆహ్లాదకరమైన పిక్ నిక్ సెంటర్ వలే గోదావరి ఒడ్డున సమయము గడుపుతారు. ఈ ప్రాంత గోదావరి ప్రమాదకరమైనది కాక స్వచ్ఛమైన నీటిప్రవాహము గలది.
 • ధర్మపురిలోని రామేశ్వరాలయం భువనేశ్వర్ లోని లింగరాజస్వామి దేవాలయాన్ని పోలి వున్నదన్న విషయం, హంపిలోని షద్భుజ నారసింహ విగ్రహానికి మాతృక ధర్మపురిలోని మసీదు నారసింహాలయంలోని విగ్రహమేనన్న విషయం, ఇంకా ధర్మపురిలోని ఆలయ నిర్మాణాలకి, హంపిలోని నిర్మాణాలకి మధ్యన పోలికలు ఉన్నాయి.

నృసింహ జయంతి ధర్మపురి లో:...

సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభీ కరుణానిధేమామ్| ప్రహ్లాద భేద పరిహార పరవతార లక్ష్నీనృసింహ మమదేహి కరావలంబమ్|| సంసార కూప మతిఘోర మగాధమూలం సప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య| దీనస్యదేవ కృపాయ శరణాగతస్య లక్షీనృసింహ మమదేహి కరావలంబమ్|| అవి తొలుత ఆలా! శ్రీ నృసింహస్వామివారిని ప్రార్థించి ఆ స్వామి వారి ఆవిర్భావమునకు గల కారణాలు ఏమిటో? ఒక్కసారి మననంచేసుకుందాం! ఈ భూమిపై 'మానవుడు ' అవతరించిన నాటినుండి తనమనుగడకు ఆనందం కలిగించేవాటిని, తనలు అమ్మి వ్ధాలమేలును చేకూర్చే ప్రకృతి సంప్స్దకు "దేవతా స్వరూఅపాలు కల్పించి"వాటిని పూజిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము. అలా మానవుడు ఈ సృష్టిలోని చరాచరములను అన్నింటిని పూజ్త్యభావముతో చూడటం ఒక విశేషం!అంతేకాదు మన భారతీయ సంస్కృతిలో చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కొన, నది,పర్వతాలు ఇలా ప్రకృతిలోని సంపదనూన్నిటిని పదిలపరుచుకునేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఉండటం మరోవిశేషం.అందువల్లనే మన భారతదేశము కర్మభూమిగా పేరుగాంచినది. అట్టి భారతీయుల ప్రబలమైన విశ్వాసము నకు ప్రామాణికమైనది ఈ న్ర్సింహస్వామి ఆవిర్భావచరిత్ర.. పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన 'జయ విజయులూ సంరక్షించుచూ ఉండు సమయాన,ఒక్కసారి సనక,సనందన,సనత్కుమార సనత్సజాతులైన బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై వస్తారు.వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల,శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు.దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు.అలా శాపగ్రస్తులైన వారు ఇరువురు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యాకశిపులుగా రెండవ జన్మలో రావణ,కుంభకఋణులుగా మూదవ జన్మలో శిశుపాల,దంతవక్త్రులుగా జన్మిస్తారు.అలా మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మింస్చి ఘోరమైన తపస్సులుచేసి,ఆ వరగర్వంతో లోకకంటకులైనారు.దానితో దుష్టశిక్షా, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో వరాహావార రూపంలో హిరణ్యక్షుని ఆటలు కట్టించి హిరణ్యాక్షుని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.

తన సోదర సంహారముపై మిక్కిలి ఆగ్రహించిన 'హిరణ్యకశిపుడు ' బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి దానవ పరిజ్ఞానముతో వివిధ రీతుల మరణము లేకుండ వరాలుపొంది.తనకు ఒక ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతో ఎన్నో అకృత్యాలు చేస్తూ విర్రవీగిపోతూ ఉంటాడు.అట్టి దానవ శ్రేష్ఠునకు నలుగురి కుమారులలో పెద్దకుమారుడైన "ప్రహ్లాదుడు"విష్ణుభక్తుడై తండ్రి అగ్రహానికి గురైనా, హరి నామస్మరణ వీడదు. దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. అక్కడ గురుకులాల్లో కూడా తోటి బాలురకు "హరినామ మాధుర్యాన్ని" పంచిపెడుతూ వారిచే కూడా హరికీర్తనలు పాడించేవాడు.చివరకు హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద,దండోపాయాలతో ప్రయత్నిస్తారు.అందువల్ల కూడా ఏ ప్రయోజనము పొందలేకపోతాడు.చివరకు పుత్రవాత్సల్యమనేది లేకుండ "ప్రహ్లాదుని" సంహరించుటకు వివిధ మార్గాలు అవలంబిస్తాడు.ప్రహ్లాదుని ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణము కాపాడుచున్న శ్రీహరి ఏక్కడరా?ఈ స్తంభమునందు చూపగలవా?అని ప్రశ్నిస్తాడు.అందుకు ప్రహ్లదుదు తండ్రీ!సర్వాంతర్యామి అయినా శ్రీహరి "ఇందుగలడందులేడను సందేహములేదు"ఎందెందు వెదకిన అందందే కలడు అని జవాబు ఇస్తాడు.అయితే ఈ స్తంభమునందు చూపగలవా?అని ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు. అంత శ్రీహరి 'హిరణ్యకసిపుడు ' తన దానవ పరిజ్ఞానుతో 'బ్రహ్మా వలన పొందిన వరాలు ఎమిటో?వాటిలోని లోపాలు క్షణకాలం అలోచించి, అంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని,దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని,అస్త్రశస్త్రాలవల్లగాని,ఇంటగాని,బయతగాని,చావులేకుండా పొందిన వరాలకు అనుగుణమైన రూపుదాల్చి హరిణ్యకశివుడు మొదిన స్తంభమునుండి తన అవతారాలలో 'నాలుగవ అవతారం'"శాశ్వత అవతారం"అంటే!నిర్యాణము పొందిన రాముడు.కృష్ణుడువంటి అవతారముల వలెకాకుండా!సద్యోజాతుడై అంటే అప్పటి కప్పుడు అవతరించినవాడు మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా! స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ "నృసింహ అవతారము" శాశ్వతమైనదిగా చెప్పబడింది. అలా ఈ శ్రీ నృసింహస్వామివారు వైశాఖ శుక్లపక్షములో పూర్ణిమకు ముందువచ్చే 'చతుర్దశి 'నాడు ఆఆవిర్భవించారు.ఆపుణ్యదినమునే మనం "శ్రీనృసింహ జయంతి"గా జరుపుకుంటూ ఉంటాము.ఇది క్తయుగంలో వచ్చిన పరిశుద్ధావతారం. "వైశాఖ శుక్ల పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్,మజ్జన్మ సంభవం వ్రతం పాపప్రణాశనం"అని సాక్షాత్తు శ్రీహరి స్వ్యంగా ప్రహ్లాదునితో చెప్పినట్లు "నృసింహపురాణం"లో చెప్పబడినది. ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యయామి)అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశివుడు మోదిన స్తంభము ఫెళఫెళమని విరగిపడుచుండగా భూనభోంతరాలన్ని దద్దరిల్లేలా సింహగర్జనతో ప్రళగర్జన చేస్తూ! ఉగ్రనరసింహ రూపంతో ఆవిర్భవిస్తాడు.అట్టి స్వామి ఆకారంచూస్తే సింహంతల,మానవశరీరం.సగం మృగత్వం,సగం నరత్వం.ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం,కరుణ,ఉగ్రత్వం,ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన ఆ స్వామి "హిరణ్యకశివుదు"పొందిన వరాలను చేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము "గడపపైన"మృగ నరలక్షణాలతో గూడి,ఒక్క ఉదుటన హిరణ్యజశిపుని మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో హిరణ్యకశిపుని ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు.

అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు ఎవ్వరు శాంతింప చేయలేక,దేవతలందరు ప్రహ్లాదుని ఆ స్వామిని శాంతింప చేయమని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు.అట్టి స్వామి నిర్యాణములేని అవతారమూర్తిగా,పిలిస్తే పలికేదైవంలా భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాబడచూ పూజించబడుచున్నారు@శ్రీనివాస్ కళ్యడపు ధర్మపురి జగిత్యాల జిల్లా తెలంగాణ.

ధర్మపురి పుణ్యక్షేత్రం గూర్చి ఇంగ్లీష్ బాషాలో.

Godavari pushkararalu' facebook page and Dharmapuri news page follow me.This is a small town located in the Karimnagar district of Telangana, 60 km away from the district headquarters. It is mostly famous for Sri Lakshmi Narasimha Swamy Temple which is situated on the southern banks of Godavari which flows through the town. The most interesting fact of Dharmapuri is that the Godavari river flows from north to south direction unlike west to east in all other places where it flows and hence the river is termed here as Dakshina Vahini. This town is also one of the nine Narasimha Kshetrams. Due to presence of many temples in the area, it is also known as ‘Teertharajamu’. The town was ruled by King Dharma Varma and thus the name of the town was named after him as Dharmapuri.

History Of The Temple

It is believed that the temple was built between 928-850 BC. This ancient temple has two versions of temple owing to the devastation it has witnessed over different period of time. The older one is called as the Patha Narasimha Swamy Temple and the newer one is known as the Kottha Narasimha Swamy Temple. In the 14th and 15th century, the next phase of anti-Hinduism started under Aurangzeb after the fall of Bahamanis and QutubShahis. Rustumdil Khan, the Subedhar of Hyderabad converted the temple into a mosque with the help of the then Sultan of Delhi, Aurangzeb. However, in 1448 AD, a new temple near the mosque was reconstructed and hence this temple came to be called as Pata Narasimha Swamy Temple. In 1725 AD, an icon of Lord Narasimha was found in close vicinity of the Dharampuri village and hence, the temple was again rebuilt there. Construction Of The Temple

Pata Narasimha Swamy Temple has two main entrances or Simha Dwarams. Out of the two, Pedda Gopuram is the main entrance of temple complex. There is also an image of Lord Yama at the entrance of the temple to the right. This temple has its own Prakaara or compound in the temple complex. Inside the Prakaara, there is also an idol of Bhakta Anjaneya (Lord Hanuman). Seven more idols of Anjaneya are also framed on the other seven sides of the temple. Inside the Prakaara and before Mukha Mantapam, there is a four pillared pavilion known as the Kalyana Mandapam.Mukha Mantapam consists of 44 stone pillars. The pavilion may be called as Garuda Mandapam dated from the 13th century of the Kakatiyas. The inside roof of the central four pillars facing the Lord is star shaped.The four dark and polished pillars are so exquisite as they bear the figures of the incarnation of Vishnu on the Jangha, nicely carved Ganpati with his vehicle Mushika and various dancing women in different postures.The beautiful sculptures and art on the pillars reflects the highly developed work of the Kakatiyas.The pillars supporting the roof of the sanctum have no resemblance to each other. Inside the Prakaara, there is another Mantapam known as Homa Mantapam which is situated to the south-east of Mukha Mantapam. On the walls of Homa Mantapam, the poems of Narasimha Shatakam were inscribed by Sriman Gudimella Varadachary on 25th July, 1974.

Kotta (New) Narasimha Swamy Temple, also known as Sri Ugra Narasimha Swamy Temple is situated to the right side of the PataNarasimhaSwamy Temple. This new temple was built by Panatula Narayana Deekshitulu in 1803 AD and the image of Yogananda Lakshmi Narasimha was inscribed in it. Facing the Lord Narasimha at the Dhwaja Stambh, Jambavanta is standing. Garuda, Indra, Agni and Vinayaka are also standing around the temple in different directions. The front portion of the temple is known as Antarala and back one as sanctum of the Lord. The sanctum and Antarala are equal in size. There is a circulatory passage around the sanctum of Lord in the temple. Near to Antarala, Anjaneya is standing face to face. The front portion of the Mukha Mantapam has 16 stone pillars. The inside roof over the central four pillars is star shaped and a flower is engraved in the center. The rituals and festivals are similar to the old temple. This place is also famous for the 6 feet tall idol of Lord Brahma with four faces which is very rare.Idols of Lord Krishna and Balarama are also special attractions of the temple.Devotees have strong belief that one who worships Sri Lakshmi Narasimha Swamy will be relieved from mental and physical problems, also get wealthier and lead a healthier life ever.

Best Time To Visit:October to March

The temple organizes Brahmotsavam Jatra every year in a grand manner which lasts for 13 days from Phalgun Shudda Ekadashi in the month of March. During the celebrations, the idol of presiding deity is taken out in a procession. The main days are Kalyanam, Dolothsavam (3 Days) and Rathothsavam. During this time, thousands of pilgrims flock to this place.

Temple Timings

Temple remains open for public from 5AM to 2PM and 4PM to 8PM every day. Temple remains closed between 2PM to 4PM.

Transportation By Air

Hyderabad Airport is the nearest one, 280 km away and is well connected to all the major cities of India and abroad. Other airports close to Dharmapuri are Nagpur Airport (330 km) and Vijayawada Airport (390 km). By Train

The nearest railway station is Mancherial, which is just 40 km away from the temple. It is located on the New Delhi- Chennai route and is well connected to all the major cities of India.

TSRTC and various private travels operate regular buses that ply to Dharmapuri from all the major cities of Telangana and Andhra Pradesh. The best way to reach temple in less time is by your own means of transportation like car or private taxis

ఇతర విశేషాలు[మార్చు]

భూషణ వికాశ శతకం[మార్చు]

1800 ప్రాంతంలో కాయస్థం శేషప్ప కవి ఇక్కడ ప్రధాన దైవం పేరున భూషణ వికాస శతకం రచించారు. ఇది నరసింహ శతకంగా ప్రసిద్ది చెందింది.

ఇది:- భూషణ వికాస! శ్రీ ధర్మపురి నివాసా ! దుష్ట సంహారా! నరసింహా! దురిత దుర అని మకుటంగా రచించబడ్డాయి. దాదాపు వీధి బడులన్నిటిలో ఈ శతకం పాఠ్యాంశంగా ఉండేదట.

గంపలవాడ[మార్చు]

గంపలవాడ ధర్మపురిలోని ఒక వాడ, ఈ వాడ దేవాలయ సమూహానికి దగ్గరగా ఉండును. గంపలవాడకు ఈ పేరెలా వచ్చిందంటే 1970వ దశకంలో తెనుగు వారు (పళ్ళు అమ్మేవారు) ఇక్కడ ఎక్కువగా నివసించేవారు, వీరు గంపలలో పండ్లను తీసుకెళ్ళేవారు, గంప అనగా వెదురుతో చేసిన బుట్ట. మరియు కుమ్మరి వాళ్ళు కూడా మట్టి పాత్రలను ఇదే విధంగా తీసుకెళ్ళేవారు. అందుకనే గంపలవాడ అనే పేరు వచ్చింది. గంపలవాడను అంతకముందు మఠంగడ్డ అనేవారు. ఎందుకంటే పూర్వము ఋషులు, మునులు, ఈగడ్డ పైననే తపస్సు, పూజలు, చేసారని ప్రతీతి. ఇప్పటికి అదే కోవలో శ్రీశ్రీశ్రీ సచ్ఛిదానంద సరస్వతి స్వామివారు మఠంగడ్డ పరిసర ప్రాంతంలోనే శ్రీ మఠం స్థాపించారు, గంపలవాడలో ముఖ్యంగా చీర్ల వంశీయులు నివసిస్తున్నారు.

2015 లో గోదావరి పుష్కరాలు జూలై 14 వ తేదీ నుంచి జూలై 25 వరకూ.. 2003 లో గోదావరి పుష్కరాలు జూలై 30 వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ జరిగాయి. 1991 లో గోదావరి పుష్కరాలు ఆగస్టు 14 నుంచి 25 వరకూ జరిగాయి. 1979 లో గోదావరి పుష్కరాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 9 వరకూ జరిగాయి. 1967 లో గోదావరి పుష్కరాలు సెప్టెంబరు 14 నుంచి సెప్టెంబరు 25 వరకూ జరిగాయి. 1956 లో గోదావరి పుష్కరాలు మే 22 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. పుష్కరాల్లో ముందుగా నదీమతల్లిని పూజిస్తారు. గోదావరి విషయంలో అది గౌతమీ పూజ. పుష్కరాలు జరిగే 12 రోజులూ గౌతమీ మహాత్మ్యం పారాయణ చేస్తారు. ఇది బ్రహ్మాండ పురాణంలో 114వ అధ్యాయంలో ఉంది. అన్నట్టు నదీ స్నానం చేసేటప్పుడు కృత్య అనే దేవతని స్మరించాలి అని మీకు తెలుసా? నది ఒడ్డు నుంచి ఒక పిడికెడు మట్టిని తీసుకుని స్నానానికి ముందు నదిలో వేసి కృత్య అనే దేవతని స్మరించుకోవాలి. ఆ పైనే స్నానం చేయాలి. లేదంటే నదీస్నాన ఫలాన్ని కృత్య తీసేసుకుంటుందని పెద్దలు చెబుతారు. అయితే ఇప్పుడంతా కాంక్రీట్ ప్రపంచం. స్నాన ఘట్టాలన్నీ సిమెంట్ మయం. కృత్యని స్మరిస్తూ వేయడానికి మట్టి దొరకడం దుర్లభమే. అందుకే కనీసం చిటికెడు మట్టినైనా ఇంటినుంచే తీసుకు వెళ్లి స్నానానికి ముందు నదిలో వేసి ఆ దేవతని స్మరించుకోవడం ఉత్తమం.పుష్కర పనుల్లో జాప్యం.. గడువు సమీపిస్తున్నా కనిపించని వేగం..

గడువు సమీపిస్తున్నా గోదావరి పుష్కరాల పనులు వేగం పుంజుకోలేదు. జూన్‌ 15 నాటికి పుష్కరాల పనులు పూ ర్తిచేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నా.. దానికనుగుణంగా పనులు మాత్రం సాగడం లేదు. క్షేత్రస్థాయిలో చాలా పనులు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. 90 శాతం పనులు ప్రారంభమయ్యాయని అధికార యం త్రాంగం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. వివి ధ శాఖల మధ్య సమన్వయం లోపం కూడా పనుల్లో జాప్యానికి కారణమవుతోంది. అలాగే సకాలంలో నిధులు విడుదల కాకపోతుండటం, టెండర్లు పిలవడంలో జాప్యం వంటి కారణాలు పుష్కర పనుల్ని మరింత ఆలస్యం చేస్తున్నాయి. జూలై 14 నుంచి 25 వరకు జరిగే పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేరుగా భక్తులకు అవసరమయ్యే పుష్కరఘాట్ల నిర్మాణం, బట్టలు మార్చుకునే గదుల ఏర్పాటు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా వంటి పనులనుతో లి విడతలో పూర్తిచేయాలని నిర్ణయించింది. అభివృద్ధి పనులు, రోడ్లనిర్మాణాలు, పార్కుల సుందరీకరణ తదితర పనులను రెండో విడతలో పూర్తిచేయనుంది. ఇప్పటివరకు తొలివిడతలో చేపట్టిన పనులు 40.74శాతం, రెండో విడత పనులు 30.25శాతం ప్రారంభమయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఘాట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఇటీవల ఓ మంత్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంతకాలం చేస్తారంటూ అధికారులను నిలదీశారు ధర్మపురి వద్ద జరుగుతున్న పనుల్లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించింది. మేర పనులు ప్రారంభమయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మరోవైపు గోదావరి పుష్కరాల లోగో కూడా ఇంకా విడుదల చేయలేదు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల ద్వారా చేపడతామన్న ప్రచారం కూడా ప్రారంభం కాలేదు. గోదావరి; ధర్మపురి; మన పావన గోదావరి గోముఖాన పుట్టి'నదే' మన పావన గోదావరి గలగలమని పారు'నదే' మన పావన గోదావరి హైలెస్సల హుషారుతో మెలికలెన్నొ తిరుగుతుంది జలగీతల సాగు'నదే' మన పావన గోదావరి పాయలుగా విడిపోతూ మరల ఏక వాహినౌను జలమార్గములేయు'నదే' మన పావన గోదావరి వేకువలో రవి కాంతులు మేనంతా పూసుకుంది బిడియాలను జార్చు'నదే' మన పావన గోదావరి చందమామ దూకుతాడు ఈదులాటలాడేందుకు అలలకొంగు దాచు'నదే' మన పావన గోదావరి సరసమైన సాగరాన్ని కలవాలని నెలరాజా వడివడిగా కదులు'నదే' మన పావన గోదావరి

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

తొట్లవాడ[మార్చు]

ధర్మపురిలో చేరిత్రక నేపథ్యం కలిగిన వాడ తొట్లవాడ నిజాం కాలంలో అక్కన్న మదన్న ఇక్కడ పెద్ద రతి బావిని నిర్మిచినరు అది పురాతన కాలంలో ధర్మపురిలో నీటి కొరత బాగా ఉండేది అప్పుడు ధర్మపురి లక్మినర్సింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన అక్కన్న మదన్నలు కరువు పరిస్థితి గూర్చి తెలుసుకొని ఇక్కడ అతిపెద్ద రాతి బావిని నిర్మాణం చేసారు.ప్రస్తుతం తొట్లవాడలో పెద్ద బావి ఎప్పుడు కూడా ఎండిపోలేదు ఇక్కడ రోజు వందలాది మంది నీరు నిప్పుకుంటారు పెళ్ళి లకు నీరు ఉపయోగించు కుంటారు కానీ కొందరు నా దారి సపారేటు అనేవాళ్ళు కొందరు ఇంత ప్రాచుర్యం కలిగిన బావిని వాహనాలు కడుగుతున్నరూ కానీ బావి చుట్టు పక్కల నివాసితున్న వాళ్ళు చూసి చూడన్నట్టు వుంటున్నారు రైతులు ఇప్పటికి అక్కన్న మాదన్నను మర్చిపోరు తొట్లవాడ మున్నూరు కాపు లవాడ అని కూడా అంటారు.తొట్లవాడ సరిహద్దులు: దివాడు తోట . సరగమ్మ వాడ. తమల్ల కుంట .మాదరి వాడ.అంబేద్కర్ వాడ. వద్దులు ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. ధర్మపురి
 2. ఆరేపల్లి
 3. నేరెళ్ళ
 4. దొంతాపూర్
 5. తీగల ధర్మారం
 6. జైన
 7. దోనూర్
 8. రాజారం
 9. తుమ్మెనల
 10. నాగారం
 11. కమలాపూర్
 12. తిమ్మాపూర్
 13. రాయపట్నం

గణాంకాలు[మార్చు]

మండల జనాభా (2011) - మొత్తం 78,365 - పురుషులు 38,285 - స్త్రీలు 40,080[4]

(2001) - మెత్తం 73230 - పురుషులు 36124 - స్త్రీలు 37106.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]