ధర్మపురి (జగిత్యాల జిల్లా)
| ధర్మపురి | |
| — మండలం — | |
| అక్షాంశరేఖాంశాలు: 18°56′51″N 79°05′38″E / 18.9475°N 79.094°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | కరీంనగర్ |
| మండల కేంద్రం | ధర్మపురి |
| గ్రామాలు | 23 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 78,365 |
| - పురుషులు | 38,285 |
| - స్త్రీలు | 40,080 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 40.75% |
| - పురుషులు | 53.40% |
| - స్త్రీలు | 28.53% |
| పిన్‌కోడ్ | {{{pincode}}} |
ధర్మపురి, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా,ధర్మపురి మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[2] ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న ధర్మపురి పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] కరీంనగర్ జిల్లా నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4417 ఇళ్లతో, 17243 జనాభాతో 2014 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8469, ఆడవారి సంఖ్య 8774. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2079 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 200. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 571698.[4]
భౌగోళిక స్వరూపం
[మార్చు]ఈ మండలం జిల్లాలో ఈశాన్యం వైపున మంచిర్యాల జిల్లా సరిహద్దులో గోదావరి నది తీరాన ఉంది. ఈ మండల స్వరూపం త్రికోణం ఆకారంలో పైన మొనతేలి ఉంది.మంచిర్యాల జిల్లా సరిహద్దు, దక్షిణాన గొల్లపల్లి మండలం, ఆగ్నేయాన వెల్గటూరు మండలం, పశ్చిమాన సారంగాపూర్ మండలం, నైరుతిన జగిత్యాల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
రాజకీయాలు
[మార్చు]ఈ మండలం ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.మండలంలో 22 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో 10ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఏయ్డెడ్ ఓరియంటల్ సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల,రెండు ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ పొలసలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగిత్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]ధర్మాపూరిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, 15 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో19 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు నలుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ లేదు. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]ధర్మాపూరిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 33 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రవాణా సౌకర్యాలు నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి నెంబర్ 63 కొత్త (పాత 16), రాష్ట్ర హైవే 7ఈ మండలం మీదుగా పోవుచున్నది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, పౌర సరఫరాల కేంద్రం, శనివారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఎస్.బి.ఐ. బ్యాంక్, యూనియన్ బ్యాంక్, గాయత్రి బ్యాంక్, కరీంనగర్ సహకార బ్యాంక్ లు ఉన్నాయి
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఆశా కార్యకర్త ఉన్నాయి.గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రామంలో ఒక సినిమా హాలు ఉంది. (చంద్ర తీయటర్)
గ్రామ ప్రముఖులు
[మార్చు]
- సంగనభట్ల నర్సయ్య: 1954, జూలై 23న ధర్మపురిలో జన్మించాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటులు, దర్శకులు, రంగస్థల అధ్యాపకులు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలో ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ పొందాడు.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]ధర్మాపురిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 720 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 89 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 20 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 35 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 405 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 412 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 333 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 296 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 448 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]ధర్మాపురిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 200 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 118 హెక్టార్లు* చెరువులు: 130 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]ధర్మాపూరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]పారిశ్రామిక ఉత్పత్తులు
[మార్చు]బీడీలు
దేవాలయాలు
[మార్చు]యోగ నృసింహక్షేత్రం
[మార్చు]యోగనృసింహ క్షేత్రం ఈ ఆలయం సుమారు ఒక వేయి సంవత్సరాల పైబడి సుదీర్ఘ చరిత్ర కలిగిఉంది. ఈ క్షేత్రములో శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయం, శ్రీ ఉగ్రలక్ష్మీ నృసింహుని ఆలయంతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి శ్రీ వేణుగోపాలస్వామి వార్ల ఆలయాలు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి ఇతర అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.ఈ ఆలయం సమీపంలోనే అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం ఉంది.[5]
గ్రామ చరిత్ర
[మార్చు]చారిత్రాత్మకంగా గొప్ప కవులు, తత్వవేత్తలు, సంగీతం, కళ, నృత్య కళాకారులకు కలిగిఉన్న గ్రామం. రాజు ధర్మవర్మ, అది ధర్మరాయ గతంలో ధర్మపురం, ధర్మనపురం, దంమంవురు, ధర్మవురా, ధర్మపురం అని పిలిచేవారు. తర్వాత ఇప్పుడు ధర్మపురిగా పిలుస్తారు. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. 14 వ, 15వ శతాబ్దాలలో బహమనీ, కుతుబ్ షాహీ, వ్యతిరేక హిందూమతం తదుపరి దశలో పతనం ఔరంగజేబు ప్రారంభించారు. తర్వాత. తన సహచరులను కూడా తన అడుగుజాడల్లో నడిపించారు. రుస్తుమ్దిల్ఖాన్, హైదరాబాద్ సుబేదార్, ఒక లక్ష్మి నరసింహ స్వామి ఆలయం మార్చబడింది. సాశ. 1448 లో, క్రొత్త దేవాలయం మసీదు సమీపంలో అరవై స్తంభాలు నిలబెట్టింది వెస్ట్ ఆలయం పాత నరసింహస్వామి గుడి 97 అని పిలుస్తారు.సా.శ. 1725 లో, లార్డ్ నరసింహ చిహ్నంగా ధర్మపురి గ్రామ సమీపంలో కనుగొనబడింది.ధర్మపురికి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు.
యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఏర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమ ధర్మరాజుని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితి. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి నలుగు పాదాలపై ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి పేరు వచ్చింది అని పురాణాలో చెప్పారు.ధర్మపురిలో ఒక ప్రత్యేకత ఉంది అది యమ ధర్మరాజు ఆలయం.
ఇతర విశేషాలు
[మార్చు]గంపలవాడ
[మార్చు]గంపలవాడ ధర్మపురిలోని ఒక వాడ, ఈ వాడ దేవాలయ సమూహానికి దగ్గరగా ఉండును. గంపలవాడకు ఈ పేరెలా వచ్చిందంటే 1970వ దశకంలో తెనుగు వారు (పళ్ళు అమ్మేవారు) ఇక్కడ ఎక్కువగా నివసించేవారు, వీరు గంపలలో పండ్లను తీసుకెళ్ళేవారు, గంప అనగా వెదురుతో చేసిన బుట్ట. కుమ్మరి వాళ్ళు కూడా మట్టి పాత్రలను ఇదే విధంగా తీసుకెళ్ళేవారు. అందుకనే గంపలవాడ అనే పేరు వచ్చింది. గంపలవాడను అంతకముందు మఠంగడ్డ అనేవారు. ఎందుకంటే పూర్వము ఋషులు, మునులు, ఈగడ్డ పైననే తపస్సు, పూజలు, చేసారని ప్రతీతి. ఇప్పటికి అదే కోవలో శ్రీశ్రీశ్రీ సచ్ఛిదానంద సరస్వతి స్వామివారు మఠంగడ్డ పరిసర ప్రాంతంలోనే శ్రీ మఠం స్థాపించారు, గంపలవాడలో ముఖ్యంగా చీర్ల వంశీయులు నివసిస్తున్నారు.
2015 లో గోదావరి పుష్కరాలు జూలై 14 వ తేదీ నుంచి జూలై 25 వరకూ.. 2003 లో గోదావరి పుష్కరాలు జూలై 30 వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ జరిగాయి. 1991 లో గోదావరి పుష్కరాలు ఆగస్టు 14 నుంచి 25 వరకూ జరిగాయి.1979 లో గోదావరి పుష్కరాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 9 వరకూ జరిగాయి. 1967 లో గోదావరి పుష్కరాలు సెప్టెంబరు 14 నుంచి సెప్టెంబరు 25 వరకూ జరిగాయి. 1956 లో గోదావరి పుష్కరాలు మే 22 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. పుష్కరాల్లో ముందుగా నదీమతల్లిని పూజిస్తారు. గోదావరి విషయంలో అది గౌతమీ పూజ. పుష్కరాలు జరిగే 12 రోజులూ గౌతమీ మహాత్మ్యం పారాయణ చేస్తారు. ఇది బ్రహ్మాండ పురాణంలో 114వ అధ్యాయంలో ఉంది. అన్నట్టు నదీ స్నానం చేసేటప్పుడు కృత్య అనే దేవతని స్మరించాలి అని మీకు తెలుసా? నది ఒడ్డు నుంచి ఒక పిడికెడు మట్టిని తీసుకుని స్నానానికి ముందు నదిలో వేసి కృత్య అనే దేవతని స్మరించుకోవాలి. ఆ పైనే స్నానం చేయాలి. లేదంటే నదీస్నాన ఫలాన్ని కృత్య తీసేసుకుంటుందని పెద్దలు చెబుతారు. అయితే ఇప్పుడంతా కాంక్రీట్ ప్రపంచం. స్నాన ఘట్టాలన్నీ సిమెంట్ మయం. కృత్యని స్మరిస్తూ వేయడానికి మట్టి దొరకడం దుర్లభమే. అందుకే కనీసం చిటికెడు మట్టినైనా ఇంటినుంచే తీసుకు వెళ్లి స్నానానికి ముందు నదిలో వేసి ఆ దేవతని స్మరించుకోవడం ఉత్తమం.పుష్కర పనుల్లో జాప్యం.. గడువు సమీపిస్తున్నా కనిపించని వేగం..
గడువు సమీపిస్తున్నా గోదావరి పుష్కరాల పనులు వేగం పుంజుకోలేదు. జూన్ 15 నాటికి పుష్కరాల పనులు పూ ర్తిచేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నా.. దానికనుగుణంగా పనులు మాత్రం సాగడం లేదు. క్షేత్రస్థాయిలో చాలా పనులు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. 90 శాతం పనులు ప్రారంభమయ్యాయని అధికార యం త్రాంగం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. వివి ధ శాఖల మధ్య సమన్వయం లోపం కూడా పనుల్లో జాప్యానికి కారణమవుతోంది. అలాగే సకాలంలో నిధులు విడుదల కాకపోతుండటం, టెండర్లు పిలవడంలో జాప్యం వంటి కారణాలు పుష్కర పనుల్ని మరింత ఆలస్యం చేస్తున్నాయి. జూలై 14 నుంచి 25 వరకు జరిగే పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేరుగా భక్తులకు అవసరమయ్యే పుష్కరఘాట్ల నిర్మాణం, బట్టలు మార్చుకునే గదుల ఏర్పాటు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా వంటి పనులనుతో లి విడతలో పూర్తిచేయాలని నిర్ణయించింది. అభివృద్ధి పనులు, రోడ్లనిర్మాణాలు, పార్కుల సుందరీకరణ తదితర పనులను రెండో విడతలో పూర్తిచేయనుంది. ఇప్పటివరకు తొలివిడతలో చేపట్టిన పనులు 40.74శాతం, రెండో విడత పనులు 30.25శాతం ప్రారంభమయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఘాట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఇటీవల ఓ మంత్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంతకాలం చేస్తారంటూ అధికారులను నిలదీశారు ధర్మపురి వద్ద జరుగుతున్న పనుల్లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించింది. మేర పనులు ప్రారంభమయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మరోవైపు గోదావరి పుష్కరాల లోగో కూడా ఇంకా విడుదల చేయలేదు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా చేపడతామన్న ప్రచారం కూడా ప్రారంభం కాలేదు. గోదావరి; ధర్మపురి; మన పావన గోదావరి గోముఖాన పుట్టి'నదే' మన పావన గోదావరి గలగలమని పారు'నదే' మన పావన గోదావరి హైలెస్సల హుషారుతో మెలికలెన్నొ తిరుగుతుంది జలగీతల సాగు'నదే' మన పావన గోదావరి పాయలుగా విడిపోతూ మరల ఏక వాహినౌను జలమార్గములేయు'నదే' మన పావన గోదావరి వేకువలో రవి కాంతులు మేనంతా పూసుకుంది బిడియాలను జార్చు'నదే' మన పావన గోదావరి చందమామ దూకుతాడు ఈదులాటలాడేందుకు అలలకొంగు దాచు'నదే' మన పావన గోదావరి సరసమైన సాగరాన్ని కలవాలని నెలరాజా వడివడిగా కదులు'నదే' మన పావన గోదావరి
తొట్లవాడ
[మార్చు]ధర్మపురిలో చేరిత్రక నేపథ్యం కలిగిన వాడ తొట్లవాడ నిజాం కాలంలో అక్కన్న మాదన్న ఇక్కడ పెద్ద రతి బావిని నిర్మించారు అది పురాతన కాలంలో ధర్మపురిలో నీటి కొరత బాగా ఉండేది అప్పుడు ధర్మపురి లక్మినర్సింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన అక్కన్న మదన్నలు కరువు పరిస్థితి గూర్చి తెలుసుకొని ఇక్కడ అతిపెద్ద రాతి బావిని నిర్మాణం చేసారు.ప్రస్తుతం తొట్లవాడలో పెద్ద బావి ఎప్పుడు కూడా ఎండిపోలేదు ఇక్కడ రోజు వందలాది మంది నీరు నిప్పుకుంటారు పెళ్ళి లకు నీరు ఉపయోగించు కుంటారు కానీ కొందరు నా దారి సపారేటు అనేవాళ్ళు కొందరు ఇంత ప్రాచుర్యం కలిగిన బావిని వాహనాలు కడుగుతున్నరూ కానీ బావి చుట్టు పక్కల నివాసితున్న వాళ్ళు చూసి చూడన్నట్టు వుంటున్నారు రైతులు ఇప్పటికి అక్కన్న మాదన్నను మర్చిపోరు తొట్లవాడ మున్నూరు కాపు లవాడ అని కూడా అంటారు.తొట్లవాడ సరిహద్దులు: దివాడు తోట . సరగమ్మ వాడ. తమల్ల కుంట .మాదరి వాడ.అంబేద్కర్ వాడ. వద్దులు ఉన్నాయి.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- ఆచార్య వారిజా రాణి: సాహితీవేత్త, ఆచార్యురాలు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2018-03-13.
- ↑ "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 8 May 2021.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ ఈనాడు, రాజన్న సిరిసిల్ల జిల్లా (4 March 2019). "అడవిలో ఆది దేవుడు". Archived from the original on 4 March 2019. Retrieved 6 March 2019.
- ↑ telugu, NT News (2023-03-17). "మహిళా యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌గా వారిజారాణి". www.ntnews.com. Archived from the original on 2023-03-17. Retrieved 2023-03-17.
బయటి లింకులు
[మార్చు]- ఈనాడు ఆదివారం' 2003 జూలైలో కథనం
- ధర్మపురి వెబ్ సైట్ Archived 2007-11-16 at the Wayback Machine
- ధర్మపురి క్షేత్ర చిత్రము
- ధర్మపురి నుంచి వెలవడుతున్న జ్యోతిష వెబ్ సైట్
- ఆదిభట్ల నారాయణదాసు రచించిన "నా యెరుక" పుస్తకం 25 వ పేజీ
