నిఖత్ జరీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిఖత్‌ జరీన్‌
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయురాలు
జననం (1996-06-14) 1996 జూన్ 14 (వయసు 27)
నిజామాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
బరువు51 కేజీ
క్రీడ
క్రీడBoxing
Rated atఫ్లై వెయిట్

నిఖత్ జరీన్ (ఆంగ్లం: Nikhat Zareen) భారతీయ వర్థమాన మహిళా బాక్సర్. 2011లో అంటాల్యాలో జరిగిన AIBA ఉమెన్స్ యూత్ & జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకాన్ని సాధించింది.[2] బ్యాంకాక్‌లో జరిగిన 2019 థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో జరీన్ రజత పతకం కైవసం చేసుకుంది.[3] 2015లో అస్సాంలో జరిగిన 16వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది.[4]

2022 మే 19న ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ (2022 Women's World Championship) లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణపతకం గెలిచింది. 52 కిలోల విభాగంలో ఫైనల్‌లో జిట్‌పాంగ్ (థాయ్‌లాండ్‌) పై 5-0 తేడాతో అద్భుత విజయం సాధించింది.[5] ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది.[6] బాక్సింగ్ లో పతకం గెలుచుకున్న ఐదో భారత క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ గుర్తింపు సాధించింది. మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ గతంలో పతకాలు గెలిచినవారిలో ఉన్నారు. 2022 నవంబరు 30న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకుంది.[7]

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా 2022 నవంబర్‌ 30న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిఖత్ జరీన్ అర్జున అవార్డు అందుకుంది

వ్యక్తిగత జీవితం, నేపథ్యం[మార్చు]

జరీన్ 1996 జూన్ 14న తెలంగాణలోని నిజామాబాద్‌లో ఎండి జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించింది.[8] ఆమె కేవలం 13 సంవత్సరాల వయసులో బాక్సింగ్ ప్రారంభించింది. ఆమె బాక్సింగ్ ప్రయాణానికి తండ్రి పూర్తి మద్దతు ఇచ్చాడు.[9] జరీన్ తరచుగా బాక్సర్ మేరీ కోమ్ను తన స్ఫూర్తి ప్రదాతగా భావించేది.[10] హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది.

2009లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు ఆధ్వర్యంలో శిక్షణ పొందటానికి జరీన్‌ను విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేర్చుకుంది. ఒక సంవత్సరం తరువాత ఆమె 2010లో ఈరోడ్‌లో జరిగిన నేషనల్స్‌లో ఆమెను 'గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా' ప్రకటించారు.[11]

వృత్తిపరమైన విజయాలు[మార్చు]

2010లో నేషనల్ సబ్ జూనియర్ మీట్‌లో జరీన్ తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2011 టర్కీలో జరిగిన మహిళల జూనియర్, యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో, ఫ్లై వెయిట్ విభాగంలో ఆమె తొలి అంతర్జాతీయ బంగారు పతకాన్ని సాధింఛచింది. జరీన్ టర్కిష్ బాక్సర్ ఉల్కు డెమిర్‌తో పోరాడి మూడు రౌండ్ల తరువాత 27:16 తేడాతో ఆమెపై గెలిచింది.[2]

అయితే మరోసారి ఇటువంటి విజయాన్ని ఆమె సాధించలేకపోయింది. దీంతో 2013 ఉమెన్స్ జూనియర్ & యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె రజత పతకంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.[11] తరువాత 2014 లో సెర్బియాలోని నోవి సాడ్‌లో జరిగిన మూడవ నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆమె బంగారు పతకం సాధించారు. జరీన్ 51 కిలోల విభాగంలో రష్యాకు చెందిన పాల్ట్సేవా ఎకాటెరినాను ఓడించింది.[12]

2015లో అస్సాంలో జరిగిన 16వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జరీన్ బంగారు పతకం సాధిచింది.[4] 2019లో, కొన్ని సంవత్సరాల విరామం తరువాత, బ్యాంకాక్లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రజతం సాధించడం ద్వారా మరో అంతర్జాతీయ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.[3]

బల్గేరియాలోని సోఫియాలో జరిగిన 2019 స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో 51 కిలోల విభాగంలో ఫిలిపినో ఐరిష్ మాగ్నోను ఓడించి జరీన్ బంగారు పతకాన్ని సాధించింది.[13] 2019 సంవత్సరం జూనియర్ నేషనల్స్‌లో జరీన్ స్వర్ణం సాధించి ‘ఉత్తమ బాక్సర్‌గా’ ఎంపికయ్యాంది. టోక్యోలో జరిగిన ఒలంపిక్స్‌కు మేరీ కోమ్‌ను ఎంపిక చేసినప్పుడు, తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మేరీ కోమ్‌తో తనకు పోటీ పెట్టాలని డిమాండ్ చేస్తూ సంచలనం సృష్టించింది. అయితే మేరీతో జరిగిన బౌట్‌లో ఆమె ఓటమి పాలయ్యారు.[10]

జరీన్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో భాగమైన వెల్స్‌పన్ గ్రూప్ పూర్తి సహాయ సహకారలను అందిస్తోంది.[2] తన పట్టణం నిజామాబాద్, తెలంగాణకు అధికారిక రాయబారిగా నియమితులయింది.[14]

2020లో జరీన్‌కు ఎలక్ట్రిక్ స్కూటర్, పదివేల రూపాయల నగదు బహుమతిని, అవార్డును క్రీడా మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి అందుకుంది.[15]

2022 ఆగస్టులో బర్మింగ్‌హాం వేదికగా జరుగిన కామల్వెన్త్‌ క్రీడల్లో 48-50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి బంగారు పతకాన్ని సాధించింది.[16][17] ఆమె 2023 మార్చి 26న న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో 50 కేజీల విభాగంలో వియత్నాంకు చెందిన ఎన్గుయెన్ తై టామ్‌ పై 5-0తేడాతో గెలిచి రెండవ టైటిల్‌ను గెలిచింది.[18]

ముఖ్యమంత్రి సత్కారం[మార్చు]

  • 2014 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 50 లక్షల రూపాయల చెక్కను నిఖత్‌ జరీన్‌కు అందించి ప్రోత్సహించాడు.[19]
  • టర్కీ వేదికగా జరిగిన వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో బాక్సర్‌ నిఖత్‌ జరీన్ గోల్డ్‌ మెడల్‌ సాధించిన సందర్భంగా 2022 జూన్ 2న హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నిఖత్‌ జరీన్‌ సత్కరించబడి, 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహంతోపాటు జూబ్లీహిల్స్‌ (బంజారాహిల్స్‌) ప్రాంతంలో నివాస స్థలాలాన్ని బహుమతిగా అందుకున్నది. ఈ కార్యక్రమంలో నిఖత్‌ జరీన్‌ తల్లిదండ్రులు జమీల్‌ అహ్మద్‌, పర్వీన్‌ సుల్తానా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[20][21]


అవార్డులు[మార్చు]

  • నిఖత్ తన స్వస్థలమైన నిజామాబాద్‌కు అధికారిక రాయబారిగా నియమితులయింది.[22]
  • 2011 ప్రపంచ జూనియర్, యూత్ చాంపియన్షిప్ లో స్వర్ణం.
  • 2014 నేషన్స్ కప్ లో స్వర్ణం.
  • ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్, జలంధర్, పంజాబ్ - ఫిబ్రవరి 2015 లో 'ఉత్తమ బాక్సర్'గా నిలిచింది[23]
  • స్పోర్ట్స్ 2019లో ఎక్సలెన్స్ విభాగంలో జె.ఎఫ్.డబ్ల్యూ అవార్డు.[24]
  • 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్ లో స్వర్ణం.
  • 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం.
  • 2023 IBA ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం[25].
  • అర్జున అవార్డు (2022 నవంబరు 30)

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు[మార్చు]

2018లో, జరీన్ అడిడాస్‌తో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందంపై సంతకం చేసింది.[26] స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో చేరడానికి జరీన్‌కు వెల్స్పన్ గ్రూప్ మద్దతు ఇచ్చింది.[27][28]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (20 May 2022). "గోల్డెన్‌ పంచ్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  2. 2.0 2.1 2.2 Apr 30, PTI / Updated:; 2011; Ist, 21:28. "4 Indians win gold in AIBA Women's Youth & Junior World Championship | Boxing News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. 3.0 3.1 "This silver medal at Thailand Open is a huge confidence boost for me ahead of the World Championships: Nikhat Zareen - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  4. 4.0 4.1 "Indtoday News | Hyderabad Local News | Telangana" (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-08-23. Retrieved 2021-02-17.
  5. telugu, NT News (2022-06-02). "నిఖ‌త్ జ‌రీన్‌, ఇషాసింగ్‌కు సీఎం కేసీఆర్ స‌న్మానం, ఆతిథ్యం". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
  6. "Nikhat Zareen: రింగ్‌లో సివంగి". web.archive.org. 2022-05-20. Archived from the original on 2022-05-20. Retrieved 2022-05-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. telugu, NT News (2022-11-30). "రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా అర్జున అవార్డుల ప్రదానం". www.ntnews.com. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.
  8. "Indian Boxing Federation Boxer Details". www.indiaboxing.in. Retrieved 2021-02-17.
  9. "Nikhat Zareen packs a punch". The Hindu (in Indian English). Special Correspondent. 2015-02-26. ISSN 0971-751X. Retrieved 2021-02-17.{{cite news}}: CS1 maint: others (link)
  10. 10.0 10.1 Sportstar, Team. "Women who inspire us: Nikhat Zareen". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  11. 11.0 11.1 "India's Nikhat Zareen wins silver at Youth World Boxing | Firstpost". web.archive.org. 2013-09-29. Archived from the original on 2013-09-29. Retrieved 2021-02-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. "currentaffairs_details_responsive". www.jagranjosh.com. Retrieved 2021-02-17.
  13. "Strandja Memorial Boxing Tournament 2019: Nikhat Zareen, Meena Kumari Devi strike gold; Manju Rani settles for silver - Sports News , Firstpost". Firstpost. 2019-02-19. Retrieved 2021-02-17.
  14. "Nikhat Zareen is brand ambassador of Nizamabad". The Hindu (in Indian English). Special Correspondent. 2014-12-13. ISSN 0971-751X. Retrieved 2021-02-17.{{cite news}}: CS1 maint: others (link)
  15. Sep 29, TNN / Updated:; 2020; Ist, 17:59. "Athletes Deepthi, Maheswari, Nandini and boxer Nikhat presented scooters | More sports News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  16. telugu, NT News (2022-08-07). "కామన్వెల్త్‌లో పసిడి పతకంతో మెరిసిన నిఖత్‌.. అభినందించిన సీఎం కేసీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
  17. "Nikhat Zareen : నిఖత్‌ పసిడి పంచ్‌.. నాలుగో స్థానానికి భారత్‌". EENADU. 2022-08-07. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
  18. Eenadu (26 March 2023). "నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌.. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  19. telugu, NT News (2022-06-03). "ప్లేయర్లకు ప్రభుత్వ అండ". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
  20. telugu, NT News (2022-06-02). "నిఖత్‌ జరీన్‌, ఇషాసింగ్‌కు రెండేసి కోట్లు". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
  21. "నిఖత్ జరీన్‌, ఇషా సింగ్‌కు రూ.2 కోట్లు, ఇంటి స్థలం.. కేసీఆర్ బహుమతి". Samayam Telugu. 2022-06-01. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
  22. "Nikhat Zareen is brand ambassador of Nizamabad". The Hindu. 13 December 2014. ISSN 0971-751X. Archived from the original on 20 May 2022. Retrieved 30 October 2015.
  23. "Nikhat Zareen packs a punch". The Hindu (in ఇంగ్లీష్). 26 February 2015. ISSN 0971-751X. Archived from the original on 4 February 2018. Retrieved 30 October 2015.
  24. "The Young Fighter; Nikhat Zareen". JFW Just for women. 24 September 2019. Archived from the original on 31 October 2020. Retrieved 27 September 2020.
  25. "Nikhat Zareen", Wikipedia (in ఇంగ్లీష్), 2023-05-14, retrieved 2023-05-19
  26. Tewari, Saumya (18 September 2018). "Adidas signs brand endorsement deal with Hima Das". Mint. Archived from the original on 27 October 2020. Retrieved 15 October 2020.
  27. "I've decided to look ahead: Boxer Nikhat Zareen starts fresh for upcoming Asian Games, CWG". New Indian Express. 22 August 2020. Archived from the original on 19 October 2020. Retrieved 18 October 2020.
  28. Subrahmanyam, V. V. (17 September 2020). "Boxer Nikhat Zareen pleased to be back in TOPS". Sportstar. Archived from the original on 19 October 2020. Retrieved 18 October 2020.