నీతోనే ఉంటాను
Appearance
నీతోనే ఉంటాను | |
---|---|
దర్శకత్వం | టి. ప్రభాకర్ |
రచన | టి. ప్రభాకర్ (చిత్రానువాదం) మరుధూరి రాజా (మాటలు) |
నిర్మాత | పి. పురుషోత్తమ రావు |
తారాగణం | ఉపేంద్ర రచన సంఘవి |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | కె.రమేష్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1 ఫిబ్రవరి 2002 |
సినిమా నిడివి | 129 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నీతోనే ఉంటాను 2002, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పి. పురుషోత్తమ రావు నిర్మాణ సారథ్యంలో టి. ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, రచన, సంఘవి ప్రధాన పాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. 1965లో వి.మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి ముఖ్యపాత్రల్లో నటించిన జమీందార్ సినిమాలోని ఒక పాటను సినిమా టైటిల్ గా పెట్టారు.
నటవర్గం
[మార్చు]- ఉపేంద్ర (రవి)
- రచన (అపర్ణ)
- సంఘవి (దివ్య)
- థ్రిల్లర్ మంజు
- బేతా సుధాకర్
- తనికెళ్ళ భరణి
- సుబ్బరాయశర్మ
- శివపార్వతి
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: టి. ప్రభాకర్
- నిర్మాత: పి. పురుషోత్తమ రావు
- మాటలు: మరుధూరి రాజా
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: వాసు
- కూర్పు: కె.రమేష్
- నిర్మాణ సంస్థ: లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1]
పాటపేరు | గాయకులు |
---|---|
"పొంగి పొంగి" | ఉన్ని కృష్ణన్, స్వర్ణలత |
"వలపుల మల్లె" | రాజేష్ కృష్ణన్, హరిణి |
"మెరిసే నీ" | ఉదిత్ నారాయణ్ |
"జల్లో వానజల్లో" | ఉన్నిమీనన్, స్వర్ణలత |
"హండ్ సమ్ " | కవితా కృష్ణమూర్తి |
స్పందన
[మార్చు]"ఈ చిత్రం ఆసక్తికరంగా ఉంటుంది" అని ది హిందూ పత్రిక రాసింది.[2] ఐడిల్‌బ్రేన్ ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇచ్చింది, "ఈ చిత్ర కథ నవల. కానీ, చిత్రానువాదం, దర్శకత్వం నవల కథాంశాన్ని సరిగా ఉపయోగించలేకపోయింది".[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-14. Retrieved 2020-08-17.
- ↑ Srihari, Gudipoodi. "Movie review - Neethone Vuntanu - by Gudipoodi Srihari". www.idlebrain.com.
- ↑ Jeevi. "Movie review - Neethone Vuntanu". www.idlebrain.com.