Jump to content

పాలమూరు గోస

వికీపీడియా నుండి
పాలమూరు గోస
Palamur gosa.book cover.jpeg2
కృతికర్త: సం. ప్రొ. జి. హరగోపాల్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కవిత్వం (పాటలు, వచన కవితలు)
ప్రచురణ: కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా
విడుదల: జూలై, 2004
పేజీలు: 260



పాలమూరు గోస మహబూబ్ నగర్ జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై, 2004 లో వెలువడిన పుస్తకం. పాలమూరు జిల్లాలోని కరువు అంశంపై జిల్లా కవులు తెలుగు, ఉర్దూ భాషలలోరాసిన పాటలు, వచన కవితలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాకు చెందిన చిత్రకారులు కరువు అంశంపై గీసిన చిత్రాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

నేపథ్యం

[మార్చు]

మార్చి 2, 2003 రోజు మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటి ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూల నుండి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకారులు, కళాకారులు హజరయ్యారు[1]. కరువుపై నాటి సభలో వారు పాటలు, కవితలు గానం చేశారు. కళారూపాలు ప్రదర్శించారు. చిత్రాలను గీసి ప్రదర్శించారు. సభ జరిగిన సంవత్సరం తర్వాత వాటన్నిటికి పుస్తక రూపమిస్తూ, కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా వారు జూలై, 2004 లో ఈ పుస్తకాన్ని తీసుకవచ్చారు[2].

సంపాదక వర్గం

[మార్చు]

నాటి కరువు వ్యతిరేక పోరాట కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఏడు మంది సభ్యులు ఈ పుస్తకానికి సంపాదకులుగా వ్యవహరించారు. వారు ప్రొ. జి. హరగోపాల్, ఎం. రాఘవాచారి, ఎన్. యాదగిరి, కె.సి. వెంకటేశ్వర్లు, ఎం.డి. ఎక్బాల్ పాష, బి. వెంకటయ్య, ఎండి. ఖైసర్.

విషయసూచిక

[మార్చు]
  1. కృతజ్ఞత
  2. కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం
  3. కరువు రాజకీయనాయకుల పుణ్యమే.
  4. పాలమూరి లేబర్ (రూం)
  5. ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస?
  6. జిల్లా సాహితీ చరిత్రలో ఇది అపూర్వం.
  7. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు.
  8. పాలమూరు గెలుస్తుంది.
  9. మా మాట
  10. అంకితం.


  1. పాటలు
  2. కవితలు
  3. పద్యాలు
  4. కరువు జన్మభూమి (స్కిట్)
  5. ఉర్దూ కవితలు
  6. కరువు ప్రదర్శన చిత్రాలు
  7. చిరునామాలు.

విషయ సూచికలోని మొదటి పది అంశాలు సంపాదక వర్గపు తొలిపలుకులు, నాటి సభలోని ప్రధాన వక్తల ఉపన్యాసాలు, సభపై మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన కథనాలు చోటుచేసుకున్నాయి. కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి కరువు రాజకీయనాయకుల పుణ్యమే అంటూ ముందు మాట రాశారు. పాలమూరు లేబర్ (రూం) పేరిటి పెండ్యాల వరవరరావు సుదిర్ఘ వ్యాసం రాశాడు. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు అంటూ ఆంధ్రజ్యోతి రాయగా[3], ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస? అంటూ ఈనాడు సంపాదకీయంతో పాటు, జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వమంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాలమూరు గెలుస్తంది అని పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్ రాశాడు.

అంకితం

[మార్చు]

"పుట్టిన గడ్డ మీద బతుకు దుర్భరమై, బతకడానికే బలైన పాలమూరు లేబరుకు...

అత్యాచారాల హత్యాచారాలకు బలైన పాలమూరు తల్లులకు...

అసహజ మరణాల కొలిమైన పాలమూరులో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నేత కార్మికులు, పేదలకు...

పీడనకు వ్యధాభరిత జీవనానికి సాక్ష్యంగా నిస్సహాయంగా ఆకలిచావుల పాలైన వారికి...

పుట్టిన గడ్డకు, కన్న బిడ్డలకు కాకుండా కనిపించకుండా పోయిన వారికి...

ఈ లోకం ప్రజలదే ప్రజలకే చెందాలని ఆశలు పల్లవించే పోరాటంలో అమరులైన వారికి...

వినమ్రంగా...అంకితం" అంటూ సంపాదక వర్గం పేర్కొంది.

పాటలు - కవులు

[మార్చు]

ఈ పుస్తకంలో సుమారు యాబై (50) మంది కవులు రాసిన పాటలను పొందుపరిచారు. వారి పాటల శీర్షిక, వాటిని రాసిన కవుల వివరాలు ఇలా ఉన్నాయి.

క్రమ సంఖ్య పాట శీర్షిక పాట రాసిన కవి పేరు చిరునామా
1 పాలమూరు కరువు పాట కడుదాసు వెంకటదాసు
2 కరువు కీర్తన కస్తూరు పంతులు సాయన్న
3 రాగులరాంరెడ్డన్నా! జి. మురళీధర్ రావు
4 లేబరన్నాల్లారా! గాజుల లక్ష్మీనారాయణ
5 పాలమూరు దండం ఎన్. యాదగిరి
6 ఒక్క పూట తిండికి గోరటి వెంకన్న
7 మబ్బుల్లారా వచ్చిపోరా జక్క గోపాల్
8 బతుకంతా భారమాయె కె. సల్మాన్
9. మహబూబ్ నగరం చెల్లో ఎం.ఎ. గఫార్
10 పాలమూరు గోస డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్
11 పాలమూరి గొస జాలం సత్తయ్య
12 అగ్గజూడ లచ్చమా బి. జనార్థన్
13 మాయమ్మ పాలమూరు సి. కృష్ణయ్య
14 వలసపాట కిందింటి కిరణ్
15 పాలమూరి కరువు గోస వి. వెంకట్రాములు
16 కరువు బతుకు పోవాలన్నరో ఎన్. శ్రీనివాస్
17 పాలమూరు గొస డా. ఎస్వీ. సత్యనారాయణ
18 ఉద్యమించరా బి. కాళిదాసు
19 పాలమూరి లొల్లి బూస జంగయ్య
20 గోదాములే నిండివుండగ హారతి వాగీశ్
21 నేలమ్మ లాలనకు దూరమా ఆనంద్
22 పాలమూరు రైతు మల్లేపల్లి శేఖర్ రెడ్డి
23 వచ్చేరో కరువొచ్చేరో ఔటస్వామి
24 ఇది ఏమి కరువన్నో మరికంటి బాలస్వామి
25 కరువుకేక పల్లెర్ల రామ్మోహనరావు
26 రైతు వేదన గట్టు మనోహర్ రెడ్డి
27 పాలమూరు జిల్లా పాట జెట్టి కురుమూర్తి
28 జనం బాధ పి. మంతటి కృష్ణపద్మ
29 కరువు రోదన కె. బాల్‌రెడ్డి
30 కరువుమీద మన్ను బొయ్య కె. శ్రీనివాస్
31 అన్నదాత హన్మంత్ రెడ్డి
32 నా పల్లె నాయుడు గారి జయన్న
33 పాలమూరు వలసబతుకు నర్సింహ
34 పల్లెల్లో చీకట్లు కమ్మెరా మూలమల్ల మీనాప్రభాకర్
35 కరువు కరువోరన్నా జనజ్వాల
36 చదరంగంలో పావులు డా. భూమిగోపాల్
37 వలసజీవులు లాడెసాని బాలస్వామి
38 ఓ పాలమూరి కూలి రైతా! ఎ. మహేశ్
39 ఇది ఏమి కాలం? ఎం. సత్యనారాయణ
40 బువ్వనీళ్ళు కావాలి వై. దేవదానం
41 పాలమూరు ప్రజల గోడు బి. వెంకటేశ్వర్లు
42 రైతు బ్రతుకు కె. ఉదయ్ కుమార్
43 పాలమూరు రైతు గోస కె. వి. యాదగిరి
44 పాలమూరి ముద్దుబిడ్డ ఆకలి ఘోష ఎం.డి. ఇద్రిష్
45 పాలమూరు గొస బాదేపల్లి వెంకటయ్య గౌడు
46 ఆకలి కేకలు జన్ను రాఘవులు
47 బతుకు రాత మార్చుకోవయా గొంది శివారెడ్డి
48 కరువు పోరాటం ఆర్తం గురునాథం
49 కరువు గోస గన్నోజు శ్రీనివాసాచారి
50 పాలమూరు బిడ్డలం రేపల్లి ఖాజా హఫీజుద్దీన్


కవితలు - కవులు

[మార్చు]
క్రమ సంఖ్య కవితా శీర్షిక రాసిన కవి పేరు చిరునామా
1 పాలమూరు బిడ్డలం సి. వెంకటేశ్వరశర్మ
2 వలసబోయిన వసంతం కె. నవీన్
3 పాలమూరు పల్లవి డి. హెచ్. జి. అమ్మణ్ణ
4 మనుషులు రాలుతున్న నేల పరిమళ్
5 మేం మనుషులం పి. భారతి
6 నాతోడు నిన్ను సంతకంప ఎం. నారాయణ
7 కుర్చీలు కూలుతయ్ కోట్ల వెంకటేశ్వరరెడ్డి
8 మాకూ మంచిదినాలొస్తయ్ కె. ఎల్. సత్యవతి
9 పొలమారిన పాలమూరు కాశీం
10 అయినొల్లంతా వలసపోతే ఎం. వెంకట్రాములు
11 గోస ఎన్. శివశంకర్
12 పాడెకట్టె తెంపుకొని ఉజ్వల్
13 కాలంపోటు బైరోజు చంద్రశేఖర్
14 అల్లుడి నోట్లో శని ఖాజామైనొద్దీన్
15 పాలమూరి కష్టజీవి ఎన్. కిశోర్ కుమార్
16 పాలమూరు కరువు దృశ్యం కమలేకర్ శ్యాం ప్రసాదరావు
17 పొట్టంత ఆకలి గోస అక్కల వేంకటేశ్వర్లు
18 వలస రేడియం
19 జాడలేని రైతుబిడ్డ వేముల శ్రీనివాసులు
20 పాలమూరు గోస ఎ. వెంకయ్య నాయక్
21 పాలమూరు లేబరొల్లు పులిమామిడి మద్దిలేటి
22 పల్లెబోసిపోయే కట్టా కృష్ణయ్య
23 తల్లి కోసం సి. వీణాదేవి
24 కరువు షాక్ ఆర్. కె. చంచల
25 బలవుతున్న బాల్యం పి. సృజన
26 మనకీ బాధ కొత్తది కాదు స్వర్ణ సుధాకర్
27 కరువు లేదు ఎస్. రాజశేఖర్ రెడ్డి
28 రైతు గోస పి. భాస్కరయోగి
29 చిక్కనవుతున్న దుఃఖం సతీష్
30 యాడబోయిరి నా జనం అంపశ్రీ
31 నా గొంతు గోస ఎస్. సురేష్ బాబు
32 జన్మభూమి బూటకం కె. వామన్ కుమార్
33 కరువు నృత్యం జి. రవిశంకర్
34 గోస గుముడాల చక్రవర్తి గౌడు
35 నా పల్లె హిమజ్వాల
36 ఏమని వ్రాయను అగ్నిజ్వాల ఖాజానజీరుద్దీన్
37 రగులుతున్న పాలమూరు వల్లభాపురం జనార్ధన
38 ఎడారి కోయిల పాట ఉదయ్
39 పాలమూరు గోస విరజాజి రామిరెడ్డి
40 సిగ్గిడ్సినోడు భీంపల్లి శ్రీకాంత్
41 కరువు రక్కసి ఎలకొండ వరప్రసాద్
42 కరువు రక్కసి డి.ఎస్. బాబూదేవీదాస్‌రావు
43 జెండాకెక్కిన గోస చిలుక రవి
44 చెయ్యిచాచిన అన్నదాత వై. రుక్మాంగదరెడ్డి
45 కరువు ఏకరువు ఏ. సూర్యప్రకాష్ రావు
46 కూటికి కుండనైత బలుపరి ఆనంద్‌శ్రీ
47 పాలమూరి గోస సి. సాకేత ప్రవీణ్
48 పాలమూరు గోస మహమ్మద్ బురాన్
49 కరువు కరువు అనంత రామచంద్రయ్య
50 పాలమూరు రైతన్న డా. వీరయ్య
51 కరువు గోస బి. లింగారెడ్డి
52 ఎండమావులు డా. వరప్రసాద్
53 పాలమూరు బిడ్డలకు స్వాగతం మల్లికార్జున్
54 పాలమూరు గోస భాస్కర్ ఎలకంటి
55 జనం గోస టి. వి. భాస్కరాచార్య
56 పాలమూరు పల్లెగోడు కె. శివరాజు
57 పాలమూరు గోస కమలేకర్ రాంచందర్‌జీరావు
58 నీటికోసం ఫాంటసీ ప్రతాప్ కౌటిల్య
59 కరువు తీరేదెప్పుడు? కొండా బసవరాజు
60 పాలమూరి గోస వి. రాజారాంప్రకాష్
61 తెల్సుకో వై. ధన్‌రాజ్ కుమార్
అనువాద కవితలు
62 జాగో-ఉఠో జమాల్ బీహరీ
63 మై డార్లింగ్ సిటీ జి. విజయ్

పద్యాలు - కవులు

[మార్చు]
క్రమ సంఖ్య పద్యాల శీర్షిక పద్య కవి పేరు చిరునామా
1 పాలమూరు గోస ఎం.డి. జహంగీర్
2 కరువు జిల్లా కన్నీరు డా. కె. బాలస్వామి
3 పాలమూరు గోస పెంటమరాజు నరసింగరావు
4 పాలమూరు గోస సి. వెంకటదాసు
5 పాలమూరు పద్యాలు కర్ణకోట రవీంద్రనాథ్
6 పాలమూరు షట్పది కె. గిరిజారమణ

కరువు జన్మభూమి (స్కిట్)

[మార్చు]

కరువు నేపథ్యాన్ని తీసుకొని ఈ స్కిట్ రాశారు. ఇది సమిష్టి రచన. కె. సి. వెంకటేశ్వర్లు, హిమజ్వాల, జనార్థన్, లింగస్వామి, ఎన్. శ్రీనివాసులు ఈ రచనలో పాలుపంచుకున్నారు.

ఉర్దూ కవితలు - కవులు

[మార్చు]

ఉర్దూ కవితలను ఉర్దూతో పాటు, తెలుగు లిపిలోనూ ముద్రించారు.

క్రమ సంఖ్య కవితా శీర్షిక కవి పేరు చిరునామా
1 నయా మౌసమ్‌ నయా మంజిల్‌ ముజిబ్ షాహ్ పురి
2 ఖౌమీ ఎక్ జహతి హలీం బాబర్
3 పాల్మూర్ పర్ అతాబ్ మొహబ్బత్ అలీ
4 ఘజల్ మహమ్మద్ అబ్దుల్ సలాం సిద్ధిఖీ
5 ఆద్మీకో న ఆయా నజర్ ఆద్మీ గులాం మహమూద్ తాజ్
6 మైడూండ్తాహూ రషీద్ రహబర్
7 ఖుస్క్ సాలి చిచా పాల్మూరి
8 ఖత సాజిదా సికిందరి
9 ఘజల్ నాసర్ బిన్ అహ్మద్
10 ఖితాత్ బాబర్ షేఖ్
11 ఖుస్క్ సాలి మహమ్మద్ జాకీర్ హుసేన్
12 ఖుస్క్ సాలి మహమ్మద్ అబ్దుల్ కరీం


కరువు చిత్రాలు - చిత్రకారులు

[మార్చు]

స్పందన, రమేశ్, పి. బాలజంగయ్య, మహేశ్, శివసాగర్, ఎక్బాల్ పాషా, ఇద్రీష్, వెంకటేష్, ఎన్. జయన్న, విద్యార్థి, జి. శ్రీనివాస్, ఎన్. విద్య, జి. యాదగిరి, పి. వెంకటేశ్వరశర్మ, గుముడాల చక్రవర్తి గౌడు తదితర చిత్రకారులు గీసిన చిత్రాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

మూలాలు

[మార్చు]
  1. ఇది పాలమూరు గోస, ఇక చూపిస్తారా ధ్యాస?,ఈనాడు, దినపత్రిక, తేది.03.03.2003
  2. పాలమూరు గోస, సం: కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్, 2004.
  3. ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా అనుబంధం, తేది:03.03.2003