పాలెగాళ్లు

వికీపీడియా నుండి
(పాలెగాళ్ళు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
క్రీస్తు శకం 1700 నాటి భారతదేశ పటము. ఇందులో దక్షిణభారతదేశంలో పాలెగాళ్ళ ఏలుబడి లోని ప్రాంతాలను కూడా చూడవచ్చు.
బ్రిటీష్ వాళ్ళు ఉరితీసిన ప్రసిద్ధ రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి - కొత్తకోట (గిద్దలూరు) గ్రామం వద్ద ఉన్నది
నరసింహారెడ్డి సేన తమ ఫిరంగిలో వాడిన ఇనుప గుండు

పాలెగాళ్లు దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలను పరిపాలించిన రాజులు. పాలెగాళ్లను తమిళంలో పాళైయక్కారర్ అని, తెలుగులో పాలెగాడని, కన్నడంలో పాళె యగరరు అని అంటారు. వీళ్లు సా.శ.17, 18వ శతాబ్దాల్లో సాయుధులై పాలన సాగించారు.

నేపథ్యము

[మార్చు]

విజయ నగర రాజ్య పతనానంతరం పాలెగాళ్ల పాలన ప్రారంభమైంది. సా.శ.1800 నాటికి సీమలో 80 మంది పాళెగాళ్లు, 30 వేల మంది సైని కులు ఉండేవారు. సా.శ.1600 నుండి సా.శ.1800 వరకు రాయలసీమ ప్రాంతంలో బలమైన రాజుల పాలన లేదు. పాళెగాళ్ల పాలనే రాయలసీమలో ఉండేది. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట పరాయి రాజుల వశమైనప్పటికీ బురుజులు మాత్రం పాళెగాళ్ల ఆధీనంలోనే ఉండేవి.

విజయనగర రాజుల కాలంలోనే ( సా.శ. 1336-1680) పాళెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాళెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, రాజులకు అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. సా.శ.1565 లో జరిగిన తళ్లికోట యుద్ధం లో సుల్తానుల చేతులలో పరాజయం పొందిన విజయనగర రాజులు తమ రాజధానిని బళ్లారి జిల్లాలోని హంపీ నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు మార్చారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాతో బీజాపూర్, గోల్కొండ నవాబులు ఉమ్మడిగా 1650 లో పెనుగొండ మీద దాడి చేసి విజయనగర రాజ్యాన్ని ధ్వంసం చేశారు. ఈ యుద్ధాలన్నింటికీ యుద్ధ భూమి రాయలసీమే. సా.శ.1572 లో పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పటి నుంచి 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారికి రాయలసీమ ప్రాంతం ధారాదత్తమయ్యే దాకా ఇక్కడ 30 యుద్ధాలు జరిగాయి. ఈ 230 ఏళ్లలో ముస్లిం సైన్యాల ఘోరకృత్యాల వల్ల సీమ ప్రజల ధన, మాన, ప్రాణ నష్టం జరిగి ఈ ప్రాంతం సర్వనాశనమైంది.

బ్రిటీష్ వారితో పోరాటము

[మార్చు]

బ్రిటిష్ సామ్రాజ్యం మొక్కదశలో ఉన్న ప్పుడే తుంచేయాలని బ్రిటిష్ వారితో రాయలసీమ పాలెగాళ్లు సా.శ.1801 నుంచి 1805 వరకూ ఐదేళ్లపాటు గెరిల్లా పోరాటాలు చేసి ఉరికంబాలు ఎక్కి అమరులయ్యారు. బ్రిటిష్ సైనిక చట్టాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ఎదిరించిన ఘనత వారిదే. రాయలసీమ పాలెగాళ్లలో కొందరిని ఉరితీయగా కొందరిని ద్వీపాంతరం పంపగా మరికొందరిని దేశ బహిష్కరణ చేశారు.రాయలసీమ పాలెగాళ్లను విజయనగర ప్రభువులు సా.శ.15వ శతాబ్దిలో ప్రజలకు రక్షణ కల్పించేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు నియమించారు. బ్రిటిష్ వాళ్లను ఎదిరించే నాటికి పాలెగాళ్లు 350 ఏళ్లుగా కొండ మార్గాల్లో దుర్గాలు, కోటలు, బురుజులు నిర్మించుకుని ప్రజల రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేవారు. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడినందు వలన పాలెగాళ్లను బ్రిటిష్ సర్కార్ బంది పోట్లు అంటూ నిందించింది. నిజాం నవాబు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన ‘సైన్య సహకార’ పద్ధతికి తలొగ్గి సంధి షరతుల్లో భాగంగా రాయలసీమను 1800లో ఆంగ్లేయు లకు దారాదత్తం చేసిన ఫలితంగా రాయలసీమ ఆగ్రహంతో ఊగిపోయింది. 80 మంది పాలెగాళ్లు 33,000 మంది సైనికులతో బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టారు. సా.శ.1801 నుంచి 1806 వరకు చిత్తూరు పాలెగాళ్లు బలిజ పాలెగారు అయిన నారగంటి అనంతప్ప నాయుడు నాయకత్వములో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడ్డారు. ఈ పోరాటాలలో యాదరకొండ పాలెగారు రామప్ప నాయుడిని కల్లియబండ అడవులలో సా.శ.1804లో బ్రిటిష్‌వారు ఉరి తీశారు. ఆ తరువాత వరుసగా బంగారుపాళ్యం పాలెగారు కుమారున్ని, చారగళ్లు పాలె గాళ్లను ఉరితీశారు. మిగిలిన పాళెంలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చరిత్ర

పౌరుషానికి ప్రతీకలు.. పాల ఏకిరిలు

[మార్చు]

పాల ఏకిరి... ఈ కులస్తులు ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చిన రాజపుత్రుల తెగకు చెందిన వారు. వీరి ధెైర్యసాహసాలు విజయనగర రాజులు గుర్తిం చి సామంత రాజులుగా, పాలెగాళ్లుగా బాధ్యతలు అప్పజె ప్పారు. తర్వాతి కాలంలో ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టడంలో పాల ఏకిరిలు తమ వంతు పాత్ర పో షించారు. స్వాతంత్య్రానంతరం రాచరికాలు పోవడంతో వీరు సామాన్య పౌరులుగా బతకాల్సి వచ్చింది. ఆత్మాభి మానం అడ్డురావడంతో దిక్కుతోచక కొండలు, గుట్టలు పట్టి తిరిగారు. అందుకే వీరు ఐదు దశాబ్దాల కిందటే బీసీ లుగా గుర్తింపు పొందారు. నేటికీ కొండకోనల్లోని ఎండు పుల్లలు తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారు. ఈ గణతం త్ర రాజ్యంలో బలహీనులు- కడుహీనులుగా బతుకుతు న్న పాలఏకిరి సామాజికవర్గ జీవితాల్లోకి తొంగి చూస్తే...

రాయలసీమ జిల్లాలలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, కోస్తాలోని నెల్లూరు, తెలంగాణలోని హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకే పాల ఏకిరిలు పరిమితమయ్యారు. ఉత్తర భారత దేశం నుండి వలస వచ్చిన పాలఏకిరి కులస్తులు రాయ లసీమ ప్రాంతంలో సామంత రాజులుగా, పాలెగాళ్లుగా గుర్తిం పు పొందారు. వేషధారణ కూడా అదే విధంగా ఉండేది. అప్ప ట్లో వీరి ప్రధాన వృత్తి వేట. ఆ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా వీరికి భూములు కేటాయించింది. మాట ఇచ్చారంటే తప్పే వారు కాదు. నుక ఆస్తులే కాదు, ప్రాణాలు సైతం పోగొ ట్టుకున్న వారు వీరిలో ఉన్నారు. ఎవరెైనా చిన్న మాటన్నా సహించేవారు కాదు. పోటీపడితే వెనకడుగు వేసే ఆలోచన అంతకంటే ఉండేది కాదు. నిప్పుకు ఉప్పు తోడెైనట్లు వీరికి కో పం కూడా ఎక్కువే. కనుకనే తరచూ తగాదాలు, కొట్లాటలకు దిగేవారు. వీధిపోరాటాలు సర్వసాధారణం. ఇక దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాలలో వీరు తమ వంతు పాత్ర పోషించారు.

పుట్టుకతోనే వచ్చిన నాయకత్వ లక్ష ణాలు పుణికిపుచ్చుకున్న వీరు స్థానికులను ఏకంచేసి స్వాతం త్య్రోద్యమంలో పాల్గొన్నారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన త ర్వాత వీరు కొత్త సమస్యను ఎదుర్కొన్నారు. గతంలో మాదిరి బలమున్నవారిదే రాజ్యం అనే మాటకు అవకాశం లేకుండా పో యింది. రాచరికానికి చరమగీతం పాడటంతో వీరి ప్రాభవం తగ్గిపోయింది. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా దే శంలోని ప్రజలు నడచుకోవటంతో వీరు సామాన్య పౌరులుగా బతకాల్సి వచ్చింది. వీటన్నింటి ఫలింగా ఉన్న ఆస్తులు హ రించుకుపోయాయి. ఆత్మాభిమానం అడ్డురావటంతో గ్రామంలో ఉండలేక కొండలు గుట్టలు పట్టి తిరిగారు. అవే వారికి ఆ శ్రయ దుర్గాలు కావడం, వేట వీరి ప్రధాన వృత్తి కావడంతో అ క్కడే జీవనం సాగించారు. కనుకనే అన్ని రంగాలలో వెనుకబడి నేటికీ కొండ ప్రాంతాలలోనే దయనీయ జీవితాన్ని గడుపు తున్నారు. మురళీధరన్‌ కమిషన్‌ వీరి గురించి ప్రస్తావిస్తూ... బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ‘మౌర్యులు’, ఒడిషా, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్‌లో ‘నాయక్‌’లుగా పిలుబడుతున్నారని పేర్కొంది. చరిత్రలో వీరి ప్రధాన వృత్తి మిలటరీ, పోలీస్‌ సర్వీస్‌ అని వివరించింది.

వీరి దీన స్థితిని చూసిన ప్రభుత్వం 1955లో పాల ఏకిరిని బిసీ జాబితాలో చేర్చింది. బిసీ రిజర్వేషన్‌ ఫలాలు రుచి చూసే లోపే... అంటే 1970లో బీసీ జాబితా నుండి వీరు తొలగించ బడ్డారు. తిరిగి రిజర్వేషన్‌ సౌకర్యం పొందటం కోసం పాల ఏకి రి కులస్తులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఎన్‌టి రా మారావు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరి ప్రయ త్నాలు ఫలించి బిసీ జాబితాలో వీరిని 1986లో చేర్చారు. అయితే ఈ జీఓను కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పుకు అను గుణంగా జీఓలో మార్పులు చేయడాన్ని గురించి ప్రభుత్వం ప ట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1994లో అప్పటి ముఖ్యమం త్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పుట్టు స్వామి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చాక జీవో వస్తుం దని ఎదురు చూశారు. అయితే కోట్ల ప్రభుత్వం పతనం కావ డంతో తర్వాత వచ్చిన పాలకులు పుట్టు స్వామి కమిషన్‌ను ప ట్టించుకోలేదు. ఈ క్రమంలో మళ్లీ పాల ఏకిరి వారు ఎన్నో ప్ర యత్నాలు చేశారు.

వీరి ప్రయత్నాలు ఫలించి 2007 ఆగస్టులో పాల ఏకిరిని బిసీ జాబితాలో చేరుస్తూ జీఓ విడుదలెైంది. కాగా ఈ పాల ఏకిరి కులస్తులు కర్నాటకలో ఎస్టీలుగా, తమిళ నాడులో బీసీలుగా చెలామణి అవుతున్నారు. పూర్వం పాలెగా ళ్లుగా ఉన్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో తిన డం... కాలక్షేపంతోనే రోజులు గడిపేశారు. విద్య పట్ల ఏమా త్రం శ్రద్ధ చూపలేదు. ఫలితంగా తర్వాతి కాలంలో అన్ని రం గాలలో బాగా వెనుకబడ్డారు. పెైగా కొండకోనల్లో జీవనం సా గించడంతో బడికి దూరమయ్యారు. కనుకనే గతంలో దొర... దొరబిడ్డగా పిలువబడిన వీరు నేడు పామరుల స్థాయికి దిగజా రుతున్నారు. కొండకోనల్లోని ఎండుపుల్లలు తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారు.

మరికొందరు వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నారు. ఇప్పటికీ చాలీచాలని పూరిళ్లలో రోజులు గు డుపుతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన బంగారుపల్లి జమిం దారు చిత్తూరులో ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. ఈ పాఠ శాల ఏర్పాటు కావడంతో కొంత మేరకు వీరిని విద్యారంగం వెై పు మొగ్గు చూపే విధంగా చేసింది.అయినప్పటికీ నామమా త్రంగానే వీరు విద్య పట్ట శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విద్యకున్న ప్రాధాన్యత వీరికి తెలిసి రావడంతో తమ పిల్లలను బడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

రాయలసీమ జిల్లాల్లో విస్తరించిన `పాలఏకిరి' కులస్థులు చిన్నసైజు రాజుల మాదిరే ఉండేవారు. వీరి పూర్వీకులు బ్రిటీష్‌ హయాంలో పాలెగాళ్లు. వేషధారణ కూడా అదే విధంగా ఉండేది. అప్పట్లో వీరి ప్రధాన వృత్తి వేట. బ్రిటీష్‌ ప్రభుత్వం వీరికి భూములు కూడా కేటాయించింది.

వృత్తి, సామాజిక జీవతం

[మార్చు]

వీరిలో విద్యావంతుల శాతం చాలా తక్కువ. 1956లో వీరిని బిసీ జాబితాలో చేర్చారు. తర్వాత కొన్ని కారణాలవల్ల వారిని ఆ జాబితా నుంచి తొలగించారు. గత ఏడాది వీరిని రాష్ర్ట ప్రభుత్వం బీసీల జాబితాలో చేర్చి జీవో విడుదల చేసింది. ఈ కులస్థుల్లో ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరైనా చిన్న మాటన్నా సహించరు. పోటీపడితే వెనకడుగు వేసే అలోచన అంతకంటే లేదు. వీరికి కోపం కూడా ఎక్కువే. తరచూ తగాదాలు, కొట్లాటలకు దిగేవారు. వీధిపోరాటాలు సర్వసాధార ణం. దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాలలో వీరు అగ్రభా గాన నిలిచేవారు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కనుక స్థానికులను ఏకం చేయటంలో వీరికి వీరే సాటి. ఈ నేపథ్యంలో ఆంగ్లేయులను దేశం నుంచి తరిమివేయటంలో తమ వంతు పాత్ర పోషించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాచరికానికి చరమగీతం పాడటంతో వీరి ప్రాభవం తగ్గిపోయింది. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా దేశంలోని ప్రజలు నడుచుకోవటంతో వీరు సామాన్య పౌరులుగా బతకాల్సి వచ్చింది. బలమున్న వాడిదే రాజ్యం అనే మాట వీరిపట్ల చెల్లకుండా పోయింది. పైగా ఉన్న ఆస్తులు హరించుకు పోయాయి. ఆత్మాభిమానం అడ్డురావటంతో గ్రామంలో ఉండలేక కొండలు గుట్టలు పట్టి తిరిగారు. అవే వారికి ఆశ్రయ దుర్గాలయ్యాయి. కనుక అన్ని రంగాలలో వెను కబడి నేటికీ కొండ ప్రాంతాలలోనే గడుపుతున్నారు. కర్ణాటక లోనూ వీరి జనా భా ఎక్కువగానే ఉంది. పాలఏకిరి కులస్థులు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ. బతుకుదెరువు కోసం స్వాతంత్య్రానంతరం వీరు ఇతర జిల్లాలకు వెళ్లారు. అయితే రాయలసీమలో మాత్రం ఇప్పటికీ కొండప్రాంతాలలోనే జీవనం సాగిస్తున్నారు. పూర్వం పాలెగాళ్లుగా ఉన్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు జల్సా చేశారే తప్ప చదువుపట్ల శ్రద్ధ చూపలేదు. ఫలితంగా తర్వాతి కాలంలో అన్నిరంగాలలో బాగా వెనుక బడ్డారు. ఐ.ఏ.ఎస్‌., ఐ.పి.స్‌. అధికారులు కాదుకదా, కనీసం గ్రూప్‌ వన్‌ అధికారి కూడా ఈ కులం నుంచి రాలేకపోయారు. ఒకప్పుడు దొర, దొరబిడ్డగా మన్ననలందుకున్నవారు నేడు పామరుల స్థాయికి దిగజారారు. చదువు విలువ తెలుసు కోవడంతో గత రెండు దశాబ్దాలుగా విద్యార్థుల సంఖ్య కొంత పెరి గింది. పాలఏకిరి కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని విద్యార్థులకు హాస్టల్‌ వసతి ఫ్రీ ఎడ్యుకేషన్‌ వంటి సౌకర్యాలు కల్పించాలనీ వీరు కోరుతున్నారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Rao, Velcheru Narayana, and David Shulman, Sanjay Subrahmanyam. Symbols of substance : court and state in Nayaka period Tamil Nadu (Delhi ; Oxford : Oxford University Press, 1998) ; xix, 349 p., [16] p. of plates : ill., maps ; 22 cm. ; Oxford India paperbacks ; Includes bibliographical references and index ; ISBN 0-19-564399-2.
  • Rajaram, K. (Kumarasamy), 1940–. History of Thirumalai Nayak (Madurai : Ennes Publications, 1982) ; 128 p., [1] leaf of plates : ill., maps ; 23 cm. ; revision of the author's thesis (M. Phil.--Madurai-Kamaraj University, 1978) Includes index ; bibliography p. 119–125 ; on the achievements of Tirumala Nayaka, fl. 1623–1659, Madurai ruler.
  • Balendu Sekaram, Kandavalli, 1909–. The Nayakas of Madura by Khandavalli Balendusekharam (Hyderabad : Andhra Pradesh Sahithya Akademi, 1975) ; 30 p. ; 22 cm. ; "World Telugu Conference publication." ; History of the Telugu speaking Nayaka kings of Pandyan Kingdom, Madurai, 16th–18th century.
  • K. Rajayyan, A History of Freedom Struggle in India
  • K. Rajayyan, South Indian Rebellion-The First War of Independence (1800–1801)
  • M. P. Manivel, 2003 – Viduthalaipporil Virupachi Gopal Naickar (Tamil Language), New Century Book House, Chennai
  • N. Rajendran, National Movement in Tamil Nadu, 1905–1914 – Agitational Politics and State Coercion, Madras Oxford University Press.
  • D. Sreenivasulu, "Palegars or factionists, they call the shots in Rayalaseema", The Hindu (online) 24 January 2005.

ఇతర లింకులు

[మార్చు]