పింగళి చైతన్య
పింగళి చైతన్య | |
---|---|
జననం | పింగళి చైతన్య |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు కథ, సినిమా రచయిత్రి. |
జీవిత భాగస్వామి | బాలగంగాధర తిలక్ |
పిల్లలు | ఖుదీరాంబోస్ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | పింగళి వెంకయ్య |
నోట్సు | |
పింగళి చైతన్య తెలుగు కథ, సినిమా రచయిత్రి. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2016 లభించింది.[1] ఫిదా, నేల టికెట్టు సినిమాలకు పాటలు కూడా రాసింది.[2]
జీవిత విశేషాలు
[మార్చు]చైతన్య పుట్టింది విజయవాడ అయినా పెరిగింది కోదాడ దగ్గర నందిగామలో. ఆమె భారతదేశ జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్యసమరయోధుడు పింగళి వెంకయ్య మునిమనవరాలు. ఆమె తండ్రి పాత్రికేయులు పింగళి దశరధరామ్. ఆయన "ఎన్‌కౌంటర్" పత్రిక ద్వారా తెలుగునాట సంచలనం సృష్టించిన వ్యక్తి.[3]
రచనా ప్రస్థానం
[మార్చు]చైతన్య రచించిన ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ అనే కథల సంపుటి అవార్డుకు ఎంపికయింది. ఆమె ప్రయోగాత్మక కథా రచనలో విమర్శకుల ప్రసంశలను అందుకొన్నారు. పురస్కార గ్రహీతకు మెమొంటో, 50 వేలు నగదు అందజేస్తారు.[4] దేశవ్యాప్తంగా 24 భాషలకు సంబంధించి 24 మంది యువ రచయితలకు ఈ పురస్కారం ప్రకటించారు. అకాడమీ చైర్మన్ విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ నేతృత్వంలో ఇంఫాల్‌లో జరిగిన సమావేశంలో ఈ అవార్డుల ఎంపిక జరిగింది.[5]
తండ్రి పింగళి దశరథరామ్ సోషలిస్టు. చైతన్య చిన్నప్పుడే ఆయన హత్యకు గురయ్యారు. ఇప్పటివరకు చైతన్య రెండు పుస్తకాలు రాసింది. ఒకటి చిట్టాగాంగ్ విప్లవ వనితలు, రెండోది మనససులో వెన్నెల. ఈమె విజయవిహారం పత్రికలో కొంతకాలం పనిచేసింది[6].
సినిమా రంగం
[మార్చు]శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఫిదాకి కో-రైటర్‌గా చేసింది. అంతేకాకుండా ఫిదా సినిమాలో 'ఊసుపోదు ఊరుకోదు', 'ఫిదా ఫిదా', నేల టికెట్ సినిమాలో 'బిజిలి', 'విన్నానులే', లవ్ స్టోరీ (2020) సినిమాలో 'ఏయ్ పిల్ల', మసూద (2022) సినిమాలో 'దాచి దాచి' వంటి పాటలు రాసింది.
రచనలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Chaitanya, Subba Rao win Sahitya Awards". Indian Express. 17 June 2016. Archived from the original on 17 జూన్ 2016. Retrieved 18 June 2016.
- ↑ BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ telugu, NT News (2023-01-29). "మహిళలూ.. మాస్ రాస్తారు!". www.ntnews.com. Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-30.
- ↑ పింగళి చైతన్యకు యువ పురస్కారం 17-06-2016[permanent dead link]
- ↑ పింగళి చైతన్యకు ‘యువ పురస్కార్’ Sakshi | Updated: June 17, 2016
- ↑ "చిట్టగాంగ్ విప్లవ చైతన్యం". Archived from the original on 2016-06-24. Retrieved 2016-06-23.
- ↑ చిట్టగాంగ్ విప్లవ వనితల పుస్తక పరిచయం
- ↑ "మనసులో వెన్నెల పుస్తక పరిచయం". Archived from the original on 2020-11-27. Retrieved 2016-06-18.