Jump to content

పుష్ప మిత్ర భార్గవ

వికీపీడియా నుండి
పుష్ప మిత్ర భార్గవ
జననం(1928-02-22)1928 ఫిబ్రవరి 22
అజ్మీర్, రాజస్థాన్ ఇండియా
మరణం2017 ఆగస్టు 1(2017-08-01) (వయసు 89)
హైదరాబాదు, ఇండియా
జాతీయతIndian
రంగములుబయాలాజీ
వృత్తిసంస్థలుCentre for Cellular and Molecular Biology (CCMB)

పుష్ప మిత్ర భార్గవ ( ఫిబ్రవరి 22, 1928 - ఆగష్టు 1, 2017) (పి.ఎం.భార్గవ) భారతీయ ప్రముఖ శాస్రవేత్త. ఇతను "సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

1928 ఫిబ్రవరి 22న అజ్మీర్‌లో జన్మించారు. లక్నో యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో ఎంఎస్సీ పూర్తి చేసి అదే యూనివర్సిటీలో 1946లో తన 21వ ఏట కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పొందారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి 1950 నుంచి 1953 మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న ఐఐసీటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో పరోశధకుడిగా పనిచేశారు. తర్వాత 1953 నుంచి 56 వరకు అమెరికా వెళ్ళి అక్కడి యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కానిసన్‌, మెడిసన్‌లో ప్రఖ్యాత శాస్త్రవేత్త హెడెల్‌ బర్గర్‌తో కలిసి విస్తృతమైన పరిశోధనలు చేశారు. 1956- 57 వరకు లండన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో పనిచేసి 1957లో ఇండియాకు వచ్చి తిరిగి ఐఐసీటీలో చేరారు. తర్వాత ఐఐసీటీలో పనిచేస్తూనే సీసీఎంబీ పరిశోధన సంస్థను స్థాపించారు.[2] ఆయన అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.[3]

హైదరాబాదులోని ఉప్పల్‌లోని ఐదు అంతస్తుల నివాసంలో ఒక అంతస్తును పరిశోధనశాలకు, మరో అంతస్తును లైబ్రరీకి కేటాయించారు. ఇటీవల వరకూ ఆయన అనేక ఫార్మా కంపెనీలకు సలహాదారుగా పనిచేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశ వ్యాప్తంగా అసహనం, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని నిరసన వ్యక్తం చేస్తూ.. 2016లో పద్మభూషణ్‌ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆయన భార్య మనోరమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరణం

[మార్చు]

ఇతను ఆగస్టు 1, 2017హైదరాబాదులో మరణించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు ఆగస్టు 02, 2017
  2. ప్రఖ్యాత శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ పీఎం భార్గవ కన్నుమూత 02-08-2017[permanent dead link]
  3. "ప్రొఫెసర్‌ పీఎం భార్గవ కన్నుమూత". Archived from the original on 2017-08-04. Retrieved 2017-08-03.
  4. Sakshi (22 February 2021). "సైన్స్‌ శిఖరం.. పీఎమ్‌ భార్గవ". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.

ఇతర లింకులు

[మార్చు]