పెద్ద అంబర్‌పేట్ పట్టణ అటవీ పార్కు
పెద్ద అంబర్‌పేట్ పట్టణ అటవీ పార్కు | |
---|---|
రకం | పట్టణ అటవీ పార్కు |
స్థానం | పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ |
సమీప పట్టణం | హైదరాబాదు |
విస్తీర్ణం | 1075.64 ఎకరాలు (437.24 హెక్టారులు) |
Established | 2021, జూలై 1 |
నిర్వహిస్తుంది | తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ |
స్థితి | వాడులో ఉంది |
పెద్ద అంబర్‌పేట్ పట్టణ అటవీ పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్ద అంబర్‌పేట్ లో ఉన్న పార్కు.[1][2] పెద్ద అంబర్‌పేట్ కలాన్ లోని ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద అంబర్‌పేట్ పట్టణ పార్కు ఏర్పాటుచేయబడింది.[3]
పార్కు వివరాలు
[మార్చు]ఈ పార్కు విస్తీర్ణం 1075.64 ఎకరాలు (437.24 హెక్టారులు) కాగా ఇందులో 40వేల మొక్కలు ఉన్నాయి. పార్కు చుట్టూ 12 కీలోమీటర్ల కంచె వేయబడింది.
ప్రారంభం
[మార్చు]తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2021, జూలై 1న ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక మొక్కను నాటి ఏడవ విడత హరితహారాన్ని, కలాన్‌లో ఏర్పాటు చేసిన పట్టణ అటవీ పార్కును ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ-దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, శంబీపూర్ రాజు సురభి వాణీదేవి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.[4][5]
సదుపాయాలు
[మార్చు]పార్కులో వివిధ రకాల జంతువుల బొమ్మలను ఏర్పాటుచేశారు. 2 కిలోమీటర్ల వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, వాష్ రూమ్స్, యోగ షెడ్టు, విశ్రాంతి కోసం 15 గెజిబో షెడ్టులు చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండు ఓపెన్ క్లాస్ రూలు, పిక్నిక్ ఏరియా, పాఠశాలలు-కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు పార్కు ప్రత్యేకతను వివరించేలా ఓపెన్ క్లాస్ రూంలు, ఏర్పాటుచేయబడ్డాయి. వన భోజనాలకు వీలుగా నర్సరీ, వాచ్ టవర్, విశ్రాంతి గదులతోపాటు ఇతర సదుపాయాలు కల్పించబడ్డాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Haritha Haram will ensure a better life for future generations: KT Rama Rao". The New Indian Express. 2021-07-02. Archived from the original on 2021-07-02. Retrieved 2023-06-20.
- ↑ "Inauguration of Pedda Amberpet Kalan Urban Forest Park in HarithaHaram Programme". ipr.telangana.gov.in. 2021-07-01. Archived from the original on 2022-01-20. Retrieved 2023-06-20.
- ↑ Vibhavari, Sruthi (2021-07-01). "KTR launches 7th edition of Haritha Haram; inaugurates urban forest park". The Siasat Daily. Archived from the original on 2021-08-02. Retrieved 2023-06-20.
- ↑ "ఏడో విడత హరితహారం.. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం". Prabha News. 2021-07-01. Archived from the original on 2023-06-20. Retrieved 2023-06-20.
- ↑ "Palle, Pattana Pragathi launched". The Hindu. 2021-07-01. ISSN 0971-751X. Archived from the original on 2021-07-01. Retrieved 2023-06-20.