పెద్ద అంబర్‌పేట్ పట్టణ అటవీ పార్కు

వికీపీడియా నుండి
(పెద్ద అంబర్‌పేట్ పట్టణ పార్కు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పెద్ద అంబర్‌పేట్ పట్టణ అటవీ పార్కు
పార్కు దృశ్యాలు
రకంపట్టణ అటవీ పార్కు
స్థానంపెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాదు
విస్తీర్ణం1075.64 ఎకరాలు (437.24 హెక్టారులు)
Established2021, జూలై 1
నిర్వహిస్తుందితెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ
స్థితివాడులో ఉంది

పెద్ద అంబర్‌పేట్ పట్టణ అటవీ పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్ద అంబర్‌పేట్ లో ఉన్న పార్కు.[1][2] పెద్ద అంబర్‌పేట్ క‌లాన్ లోని ఔట‌ర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద అంబర్‌పేట్ పట్టణ పార్కు ఏర్పాటుచేయబడింది.[3]

పార్కు వివరాలు[మార్చు]

ఈ పార్కు విస్తీర్ణం 1075.64 ఎకరాలు (437.24 హెక్టారులు) కాగా ఇందులో 40వేల మొక్కలు ఉన్నాయి. పార్కు చుట్టూ 12 కీలోమీటర్ల కంచె వేయబడింది.

ప్రారంభం[మార్చు]

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2021, జూలై 1న ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక మొక్కను నాటి ఏడవ విడత హరితహారాన్ని, కలాన్‌లో ఏర్పాటు చేసిన పట్టణ అటవీ పార్కును ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ-దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, శంబీపూర్ రాజు సురభి వాణీదేవి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.[4][5]

సదుపాయాలు[మార్చు]

పార్కులో వివిధ రకాల జంతువుల బొమ్మలను ఏర్పాటుచేశారు. 2 కిలోమీటర్ల వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, వాష్ రూమ్స్, యోగ షెడ్టు, విశ్రాంతి కోసం 15 గెజిబో షెడ్టులు చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండు ఓపెన్ క్లాస్ రూలు, పిక్నిక్ ఏరియా, పాఠశాలలు-కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు పార్కు ప్రత్యేకతను వివరించేలా ఓపెన్‌ క్లాస్‌ రూంలు, ఏర్పాటుచేయబడ్డాయి. వ‌న భోజ‌నాల‌కు వీలుగా న‌ర్స‌రీ, వాచ్ ట‌వ‌ర్, విశ్రాంతి గ‌దులతోపాటు ఇత‌ర స‌దుపాయాలు కల్పించబడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. "Haritha Haram will ensure a better life for future generations: KT Rama Rao". The New Indian Express. 2021-07-02. Archived from the original on 2021-07-02. Retrieved 2023-06-20.
  2. "Inauguration of Pedda Amberpet Kalan Urban Forest Park in HarithaHaram Programme". ipr.telangana.gov.in. 2021-07-01. Archived from the original on 2022-01-20. Retrieved 2023-06-20.
  3. Vibhavari, Sruthi (2021-07-01). "KTR launches 7th edition of Haritha Haram; inaugurates urban forest park". The Siasat Daily. Archived from the original on 2021-08-02. Retrieved 2023-06-20.
  4. "ఏడో విడత హరితహారం.. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం". Prabha News. 2021-07-01. Archived from the original on 2023-06-20. Retrieved 2023-06-20.
  5. "Palle, Pattana Pragathi launched". The Hindu. 2021-07-01. ISSN 0971-751X. Archived from the original on 2021-07-01. Retrieved 2023-06-20.

బయటి లంకెలు[మార్చు]