ప్రకాష్ పడుకోనె

వికీపీడియా నుండి
(ప్రకాష్ పడుకొనె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రకాశ్ పడుకోణె

1955 జూన్ 10కర్ణాటకలో జన్మించిన ప్రకాశ్ పడుకోణె (Prakash Padukone) (Kannada/Konkani: ಪ್ರಕಾಶ್ ಪಡುಕೋಣೆ) భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 1980లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెల్చి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతని విజయాలకు స్పందించిన భారత ప్రభుత్వం 1972 లో అర్జున అవార్డును, 1982లో పద్మశ్రీను బహుకరించింది.

క్రీడాజీవితం[మార్చు]

1962లో కర్ణాటక రాష్ట్ర జూనియర్ చాంపియన్‌షిప్ లో పాల్గొని పడుకోణె క్రీడాజీవితం ఆరంగేట్రం చేశాడు. అందులో మొదటి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టిననూ నిరుత్సాహపడక శ్రమించి రెండేళ్ళ పిదప ఆ టైటిల్ గెల్చితన పోరాట పటిమను చాటిచెప్పాడు. 1972లో జాతీయ జూనియర్ టైటిల్ గెల్చినాడు. అదే సంవత్సరం సీనియర్ టైటిల్ కూడా చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏడేళ్ళ వరకు వరుసగా ప్రతి ఏటా సీనియర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. 1975లో యూనియన్ బ్యాంకులో ప్రొబేషనరీ అధికారిగా చేరి 1986 వరకు పనిచేశాడు. 1979లో కామన్వెల్త్ క్రీడల టైటిల్ గెల్చినాడు. ఆ తర్వాత లండన్ మాస్టర్స్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, స్వీడిష్ ఓపెన్ లకు కూడా తన ఖాతాలో జమచేసుకున్నాడు. 1980లో బ్యాడ్మింటన్ లో అత్యున్నతమైన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ చాంపియన్‌షిప్ ను గెల్చిఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. తన క్రీడాజీవితంలో అధిక భాగం శిక్షణ నిమిత్తం డెన్మార్క్ లో గడిపినందున మార్టెన్ ఫాస్ట్ లాంటి యూరోపియన్ ఆటగాళ్ళు దగ్గరి మిత్రులయ్యారు [1]. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన పడుకోణె 1981 లో బ్యాడ్మింటన్ క్రీడ నుంచి నిష్క్రమించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

పకాష్ పడుకోణె తండ్రి రమేష్ పడుకోణె సీనియర్ చాలా కాలం పాటు మైసూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు కార్యదర్శిగా పనిచేశాడు. పడుకోణె భార్య ఉజాలా, ఇద్దరు కూతుర్లతో కల్సి ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉన్నాడు. ప్రముఖ మోడల్, నటి అయిన దీపికా పడుకోణె ప్రకాశ్ కూతురే.

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

పద్మశ్రీ పురస్కారం

ప్రస్తుత పరిస్థితులు[మార్చు]

1991 లో క్రీడాజీవితానికి చరమగీతం పాడి కొద్దికాలం పాటు భారత బ్యాండ్మింటన్ అసోసియేషన్ కు చైర్మెగ్ గా పనిచేశాడు. ఆ తర్వాత 1993 నుంచి 1996 వరకు జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు కోచ్ గా పనిచేశాడు. ప్రస్తుతం ప్రకాశ్ పడుకోణె బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించి నిర్వహిస్తున్నాడు. ఆయన గీత్ సేథితో కలిసి దేశంలో క్రీడల ప్రోత్సాహానికి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌ను స్థాపించాడు. అతను ఇటీవలే తన టచ్‌ప్లే (Touchplay) పేరుతో జీవిత్రచరిత్రను విడుదల చేశాడు. దాని రచయిత దేవ్ సుకుమార్.

మూలాలు[మార్చు]

  1. The iron mask Archived 2007-03-22 at the Wayback Machine, BadZine.info, 05 January 2007

బయటి లింకులు[మార్చు]