కింజరాపు ఎర్రన్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
| name = కింజరాపు ఎర్రన్నాయుడు
| name = కింజరాపు ఎర్రన్నాయుడు
| image =
| image =
File:Yerram Naidu Kinjarapu.jpg
<gallery>
File:Yerram Naidu Kinjarapu.jpg|Yerram Naidu Kinjarapu
</gallery>
| caption =
| caption =
| birth_date ={{Birth date and age|1957|2|23|df=y}}
| birth_date ={{Birth date and age|1957|2|23|df=y}}

06:04, 2 నవంబరు 2012 నాటి కూర్పు

కింజరాపు ఎర్రన్నాయుడు
కింజరాపు ఎర్రన్నాయుడు


నియోజకవర్గం శ్రీకాకుళం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-02-23) 1957 ఫిబ్రవరి 23 (వయసు 67)
నిమ్మాడ, ఆంధ్ర ప్రదేశ్
మరణం 2012 నవంబరు 2
రణస్థలం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కింజరాపు విజయ కుమారి
సంతానం 1 కూతురు మరియు 1 కొడుకు
నివాసం హైదరాబాదు
September 16, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=533

కింజరాపు ఎర్రన్నాయుడు (జ.23 ఫిబ్రవరి, 1957 -జ.2 నవంబర్, 2012 ) 11వ, 12వ, 13వ మరియు 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.

బాల్యం , విద్యాభ్యాసం

ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం గారలో సాగించి, టెక్కలిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ విశాఖపట్టణంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో పూర్తిచేశాడు. ఎల్.ఎల్.బి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యాడు.

రాజకీయ జీవితం

ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో హరిశ్చంద్రపురం నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర్య పార్టీ అభ్యర్ధిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన కింజరాపు కృష్ణమూర్తి ఇతడి చిన్నాన్న. అతను, గౌతు లచ్చన్న, ఎన్.జి.రంగాల అడుగుజాడల్లో నడిచి ప్రజాసేవ ధ్యేయంగా కష్టించి పనిచేశాడు. అప్పటి నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా, ఆ తరువాత శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999 మరియు 2004) లోక్ సభ సభ్యునిగా బారత పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.

కుటుంబం

ఇతడి భార్య విజయకుమారి; వీరికి ఇద్దరు పిల్లలు; ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రధమ ఉద్దేశ్యంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు.

మరణం

నవంబర్ 2 ,2012 న ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్ కి ఢీకొని అపస్మారక స్థితిలొకి వెళ్ళారు ఉదయం 3:30 నిముషాలకి వైద్యులు మరణాన్ని ధ్రువీకరించారు .

బయటి లింకులు