చందూర్ (వర్ని)

వికీపీడియా నుండి
(బడా పహాడ్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జలాల్పూర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండలం వర్ని
ప్రభుత్వము
 - సర్పంచి Y సాయికిరణ్
జనాభా (2011)
 - మొత్తం 5,801
 - పురుషుల సంఖ్య 2,792
 - స్త్రీల సంఖ్య 3,009
 - గృహాల సంఖ్య 1,421
పిన్ కోడ్ 503201
ఎస్.టి.డి కోడ్ 08467

జలాల్పూర్, నిజామాబాదు జిల్లా, వర్ని మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 201., యస్.టీ.డీ.కోడ్ = 08467.

బడా పహాడ్[మార్చు]

వర్ని మరియు చందూరు మధ్య జలాల్పూ‌ర్ గ్రామ పరిదిలో ఉన్న బడాపహాడ్ పెద్దగుట్ట షాదుల్లా బాబా దర్గా సయ్యద్ సాదుల్లా హుస్సేనీ దర్గాలో అనేక మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర కూడా జరుగును. పెద్దగుట్ట ఏరియాలో నిజాంల కాలంలో షాదుల్లా అనే మహానుభావుడు వసూలైన కప్పం కూడా రాజుకు అప్పజెప్పకుండా కష్టాల్లో ఉన్న పేదలకే పంచిపెట్టాడు. వసూలు చేయడం దాటవేశాడు. దాంతో రాజుకు కోపం వచ్చింది. ఒక్కరిని ఇలా వదిలిపెడితే అందరూ రకరకాల కారణాలు చెప్పి ఇలా ఏదో ఒకటి చేసే అవకాశం ఉందని షాదుల్లాను పట్టుకురమ్మని సైనికులను పంపించాడు. షాదుల్లాకు సైనికులకు మధ్య యుద్ధమే జరిగింది. షాదుల్లాను వాళ్లు చంపేశారు. సైనికులతో షాదుల్లా ఒక కర్రతో యుద్ధం చేశాడని, చివరికి ఆ కర్రను భూమిమీద కొట్టడంతో భూమి రెండుగా చీలిందని, అందులోకి దూకి మాయమయ్యాడని కథ. పెద్దగుట్ట మీద షాదుల్లా మజార్ (సమాధి) ఉంది. దాని పక్కన కొంచెం ఎడంగా ఆయనకు పాలు పోసే సాలవ్వ సమాధి కూడా ఉంది. కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెళ్లయిన జంటలు షాదుల్లా ఆశీస్సుల కోసం దర్గాను దర్శనం చేసుకుంటారు. పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్ళి కావాలని మొక్కుకుంటానికి వస్తుంటారు. రాత్రిళ్లు వచ్చి అక్కడ నిద్ర చేస్తారు. చుట్టుపక్కల చాలా దూరాల నుంచి తమ కోర్కెలు తీరుతాయో లేదో తెలుసుకోవడానికి ఎంతోమంది వచ్చి అక్కడ నిద్ర చేస్తారు. రాత్రి కలలో కనిపించి షాదుల్లా బాబా తాము అనుకున్న పని అవుతుందో కాదో, లేదా ఇంకా ఏదో ఒక విషయం చెబుతాడు. ఆ పని కాదనుకుంటే అసలు షాదుల్లా బాబా కలలోకే రాడు అని వారందరి నమ్మకం. శుక్రవారం న్యాజ్ (కందూరు) చేయడానికి ఎన్నో బృందాలు అక్కడికి వస్తుంటాయి. ప్రతి సంవత్సరం అక్కడ పెద్ద ఎత్తున ఉర్సు (జాతర) సాగుతుంది. ప్రతి ఏడాది వఖ్ఫ్ బోర్డు పాడే పాటలో కోటి నలభైరెండు లక్షలకు ఎవరో ఒకరు దర్గా రాబడిని పాడుకుంటారు. అంటే కోటి నలభైరెండు లక్షలు వక్ఫ్‌బోర్డుకు చెల్లించి ఆ పైన వచ్చే ఆదాయాన్ని పాడినవారు ఉంచుకుంటారు.అంత డబ్బు ఆదాయంగా వచ్చినప్పటికీ షాదుల్లా బాబా దర్గా పరిసరాల్లో వసతులేమీ లేవు. మంచి నీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిందే. గుట్ట మీద ఒక్కటంటె ఒక్క సిమెంట్ కప్పు లేదు. దర్గాకు కూడా పైన కప్పు లేదు. రేకులు ఉన్నాయి. గుట్ట పైకి మెట్ల దారిలో అటువైపు ఇటువైపు చిన్నచిన్న గుడిసెల్లో ఏ ఆధారమూ లేని ముసలివాళ్లు, తమ బిడ్డలు పోషించలేక వదిలేస్తే అక్కడ పడి ఉన్నవాళ్లు, ఏదో ఒక రోగంతో బతుకీడుస్తున్నవాళ్లు గుడిసెల బయట కూర్చుని అడుక్కుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొన్ని ముస్లిం మతసంస్థలు (జమాత్‌లు) దర్గాల దగ్గరికి పోవడం సరైంది కాదంటూ ప్రచారం చేస్తుండడంతో కొందరు ముస్లింలు దర్గాలకు వెళ్లడం లేదు. దీనివల్ల దర్గాలకు వెళ్లే హిందూ-ముస్లింల కలగలుపు సంస్కృతి తగ్గిపొయ్యే ప్రమాదం ఏర్పడింది. దర్గాలు ఈ దేశంలో హిందూ-ముస్లింల మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉన్నాయి. ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరముంది.

గొల్లసాయమ్మ - #సహాయం:

  జలాల్ పూర్ కి  చేoదిన  సాయమ్మ అనే మహిళా తన పశువులను మేపుతూ షాదుల్లా దెగ్గరికి వచ్చింది. దివ్య తేజస్సుతోవెలుగుతున్న షాదుల్లని చూసి పలకరించింది..ఆ షాదుల్లా కి  రోజు పాలు ,పెరుగు , అన్నం పెట్టేది.
  ఈ సాయమ్మ అతనికి చేస్తున్న సహాయాన్ని పసిగట్టిన సైనికులు ఆమెను  అనుసరించారు. అప్పుడు వారు షాదుల్లాని పట్టుకోవటానికి రావటంతో  అతను ఉన్న ప్రదేశంలో భూమి ఒక్కసారిగా  రెండు ముక్కలైoది.
షాదుల్లా,అతని సహకుడు రామన్న వీరికి కాపలాగా ఉండే కుక్క ,గుర్రం ,పులి, పిల్లి అతనితో పటు అక్కడే సమాధి అయ్యాయి.
 
 అప్పుడి అలంగిరి ప్రభువు,చేసిన తప్పుకు 
పాచ్చతపపడి షాదుల్లా సమాధి అయిన చోట దర్గాని , రామన్నకి గుడిని నిర్మించాడు.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,801 - పురుషుల సంఖ్య 2,792 - స్త్రీల సంఖ్య 3,009 - గృహాల సంఖ్య 1,421

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02

గ్రామం[మార్చు]