Jump to content

బుడన్ సాహెబ్ షేక్

వికీపీడియా నుండి
(బుడన్‌ సాహెబ్‌ షేక్‌ నుండి దారిమార్పు చెందింది)

బుడన్‌ సాహెబ్‌ షేక్‌ ముస్లిం రచయిత. ఆయన వ్రాసిన ఖుతుబ్‌నామా కావ్యాన్ని చదివిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చేసిన ప్రశంసా వ్యాఖ్య.... 'ఏ పద్యము తీసినను వసుచరిత్రయో, మను చరిత్రయో, పారిజాతాపహరణమో స్మృతికి తగులుతున్నది' అని అన్నారు.

బాల్యము- చదువు

[మార్చు]

బుడన్‌ సాహెబ్‌ షేక్‌ .... కడప జిల్లా కొత్తపల్లి జన్మించారు. వీరి తల్లితండ్రులు: మహబూబీ, ఖాశిం సాహెబ్‌. చదువు: బి.ఎ., బి.యల్‌. వృత్తి : న్యాయవాది.

రచనా వ్యాసంగము

[మార్చు]

కడపలో న్యాయవాదిగా పనిచేస్తూనే రచనా వ్యాసంగం సాగించారు. 1965లో చారిత్రక పద్యాకావ్యం 'ఖుతుబ్‌నామా' రాసేనాటికే ఉత్తమ కవిగా ఖ్యాతిగాంచారు. ఆనాటి ప్రముఖ పత్రికలన్నిటిలో ఆయన రచనలు చోటుచేసుకున్నాయి.

రచనలు

[మార్చు]

ఖుతుబ్‌నామా (1965), జలాల్‌నామా (అగ్బరు చరిత్ర, 1969), రామేనామా (పద్యాకావ్యాలు). ఖుతుబ్‌నామా గ్రంథం మైసూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ విద్యారులకు పాఠ్య గ్రంథంగా అనుమతించారు. ఖుతుబ్‌నామా కావ్యాన్ని చదివిన కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణ చేసిన ప్రశంసా వ్యాఖ్య: 'ఏ పద్యము తీసినను వసుచరిత్రయో, మను చరిత్రయో, పారిజాతాపహరణమో స్మృతికి తగులుతున్నది' (ఖుతుబ్‌ నామా, 1965, ప్రచురణ: అబ్దుల్‌ సలాం, కడప). 1965లో 'గోలకొండ' శీర్షికతో రాసిన చారిత్రక పద్యాకావ్యంలోని పద్యాలు పాలా వెంకట సుబ్బయ్య సంపాదాకత్వంలోని 'కలభాషిణి' పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ పద్యాలకు మంచి పాఠకాదరణ లభించడంతో గోలకొండ చరిత్రను కావ్యముగా వ్రాయమని వెంకట సుబ్బయ్య కోరగా పూర్తిస్థాయిలో 'ఖుతుబ్‌నామా' (పద్యకావ్యం) వ్రాశారు.

మూలాల జాబితా

[మార్చు]
  • సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ