Jump to content

సయ్యద్ హుసేన్ బాషా

వికీపీడియా నుండి
(సయ్యద్‌ హుసేన్‌ బాషా నుండి దారిమార్పు చెందింది)

బాషా హుసేన్‌ సయ్యద్‌ మంచి నటుడిగా మాత్రమే కాకుండ మంచి నాటక రచయిత. ఆయన కవిగా ఖ్యాతి గాంచారు. నాటక రంగంలో మంచి నటుడిగా ఖ్యాతిగాంచిన సయ్యద్‌ బాషా హుసేన్‌ చలన చిత్రాలలో కూడా నటించారు.

బాల్యము

[మార్చు]

ఆయన ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1939 మార్చి 31న సయ్యద్‌ అబ్దుల్‌ సలాం, మైమున్నీసా దంపతులకు జన్మించారు.

రచనా వ్యాసంగము

[మార్చు]

గుంటూరు ఆంధ్రాక్రైస్తవ కళాశాలలో బి.ఏ చదువుతున్న సమయంలో మంచి నటుడిగా మాత్రమే కాకుండ మంచి నాటక రచయిత, కవిగా ఖ్యాతిగాంచారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖలో ఉద్యోగం చేపట్టిన ఆయన కవితలు, కథానికలు ముఖ్యంగా నాటికలు, నాటకాలు రాశారు. 'ఆశాజ్యోతి, ఆశాజీవులు, పసి హృదాయాలు, జీవన కెరాలు, సమాజంలో స్త్రీ' నాటికలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ నాటికలు వందల ప్రదర్శనలకు నోచుకున్నాయి. కవితల ద్వారా వెల్లడించిన తన ఆభిప్రాయాలను 'గాయాలు-గేయాలు' కవితా సంకలం ద్వారా గ్రంథస్థం చేశారు.

చలన చిత్ర రంగములో....

[మార్చు]

నాటక రంగంలో మంచి నటుడిగా ఖ్యాతిగాంచిన సయ్యద్‌ బాషా హుసేన్‌ చలన చిత్రాలలో కూడా నటించారు. స్వయంగా స్క్రిపును రూపొందించిన 'పెద్దింటి కోడలు', 'ఉత్తమురాలు' సినిమాల్లో నటించారు. అటవీ శాఖలో రేంజర్‌గా ఉద్యోగ విరమణ చేసిన సయ్యద్‌ బాషా హుసేన్‌ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సినిమాలకు రచయితగా సహకారం అందించారు. చివరి వరకు నాటకరంగం మీదా ఎక్కువగా దృష్టిసారించిన సయ్యద్‌ బాషా హుసేన్‌ (స్వగ్రామమైన) యర్రగొండపాలెంలో 2008 డిసెంబరు 13న కన్నుమూశారు. (సమాచారం: 'ఇండియా' మాసపత్రిక, 2008 జనవరి. ఇంటర్యూ: సయ్యద్‌ బాషా హుసేన్‌ కుమారుడు సయ్యద్‌ సాబిర్‌ హుసేన్‌, 2008 జనవరి 20, వినుకొండ.)

మూలాలు

[మార్చు]
  • సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 52

మూలాల జాబితా

[మార్చు]


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ