షేక్ మహబూబ్ బాషా, నెల్లూరు
- బాషా మహబూబ్ షేక్ నెల్లూరు ....వీరు వ్రాసిన కవితలు, కథలు, కథానికలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. . కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో కూడా ప్రచురితం అయ్యాయి.
బాల్యము
[మార్చు]బాషా మహబూబ్ షేక్ నెల్లూరు జిల్లా నందవరంలో 1961 మే 28న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్ మహబూబ్‌బీ, షేక్ మస్తాన్ సాహెబ్. చదువు: బి.ఎ (లిట్)., ఎంఎ., బిఎ.ఎం.యస్. ఉద్యోగం: 'హైదారాబాద్ మిర్రర్' దినపత్రిక విజయవాడ ఎడిషన్ బాధ్యత వహించారు.
రచనా వ్యాసంగము
[మార్చు]1979లో 'బీడిముక్క' కథానిక ఆంధ్రాపత్రిక దినపత్రికలో ప్రచురితం కావడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం అయ్యింది. అప్పటి నుండి వివిధ పత్రికలలో కవితలు, కథలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. . కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో ప్రచురితం అయ్యాయి.
రచనలు
[మార్చు]1. చీకి మూసిన ఏకాంతం, 2. భారత నారీ బాధపడకు, 3. ప్రేమ పూజారులు, 4.ఎస్ నేనే, 5. ఆ రోజు..., 6. సమాజం కట్టిన సమాధాులు, 7. యుగధర్మం (నవలలు). 1984లో రాసిన 'చీకటి మూసిన ఏకాంతంలో' (నవల) పాఠకుల మన్నన పొందింది. 1985లో పురుష ద్వేషం పై స్త్రీల మనోభావాలను సృజిస్తూ రాసిన 'భారత నారీ బాధపడకు' (నవల) ధూషణ- భూషణలకు కారణమై గుర్తింపు తెచ్చి పెట్టింది. లక్ష్యం: సమాజాన్ని మానవత్వపు మూసలో పోయాలని.
మూలాల జాబితా
[మార్చు]- సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56