షేక్ బడే సాహెబ్, గుంటూరు
- బడే సాహెబ్ షేక్ గుంటూరు కవిగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ధార్మిక, సామాజికాంశాల మీదా తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో పలు రేడియో ప్రసంగాలు చేశారు. ముస్లింల పట్ల ముస్లిమేతరులలో గల అపోహలను తొలగించడనికి కవితలు, గేయాల ద్వారా ఎంతో కృషి చేశారు. స్వయంగా హిందీ విద్యాలయాన్ని స్థాపించి ఆ భాషాభివృద్ధికి జీవితాంతం పాటుపడ్డారు. కవిగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.
బాల్యము
[మార్చు]బడే సాహెబ్ షేక్ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం, జానపాడు జన్మించారు. పుట్టిన తేది: -1927, జూలై 1. వీరి తల్లితండ్రులు: మొహిద్దీన్‌బీ, షేక్ సైదా సాహెబ్. చదువు: యస్.యస్.యల్.సి, రాష్ట్రభాషా ప్రవీణ, ప్రచారక్, హిందీ సాహిత్యరత్న,
వృత్తి
[మార్చు]ఉపాధ్యాయులు. తెలుగు, ఉర్దూ, హిందీ భాషలలో పండితులు. కలంపేరు: సాబిర్.
సాహిత్య రంగ ప్రవేశము
[మార్చు]1970లో 'భాయికీ పుకార్' గేయరచనతో సాహిత్యరంగ ప్రవేశం చేశారు.. అపటి నుండి అలుపెరుగక ధార్మిక గ్రంథ రచనలు చేస్తూ, శ్రావ్యంగా పాడుతు, జీవితాంతము సమాజ సేవలో కాలము గడిపిన మహా మనీషి ఇతడు.
రచనలు
[మార్చు]1. ప్రవక్త హజరత్ మొహమ్మద్ వారి జీవిత చరిత్ర (హరికథా రూపం),2. జగజ్జ్యోతి హజరత్ మొహమ్మద్ (గేయరచన), 3. హమారే రసూల్, 4. హృదయ ఘోష (కవితా సంపుి). 5. సర్‌దారె ఆలం (ఉర్దూ రచన) వంటి ధార్మిక గ్రంథాలను రచించారు. హరికథా రూపంగా రాసిన ప్రవక్త హజరత్ మొహమ్మద్ వారి జీవిత చరిత్ర వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ హరికథా గేయరూపం విశిష్టతను వివరిస్తూ డాక్టర్ తూమాటి దోణప్ప తన 'హరి కథా సర్వస్వం' పరిశోధానాత్మక గ్రంథాంలో ఆరు పేజీలు కేటాయించారు.
ప్రసంగాలు
[మార్చు]ముహమ్మద్ ప్రవక్త రచనను ప్రదర్శనకు యోగ్యంగా తయారుచేసి స్వయంగా పలు ప్రదార్శనలను నిర్వహించారు. ధార్మిక, సామాజికాంశాల మీదా తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో పలు రేడియో ప్రసంగాలు చేశారు. ముస్లింల పట్ల ముస్లిమేతరులలో గల అపోహలను తొలగించడనికి కవితలు, గేయాల ద్వారా ఎంతో కృషి చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కోరుతూ ప్రజలు ఉద్యమిస్తున్న సందర్భంగా 'నేను ఓసి నెట్లవుతాను' అంటూ పాట రాసి, స్వయంగా పాడిన గీతం వీరికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఎక్కడ సభ గానీ, సమావేశం గానీ జరిగినా అక్కడికి వెళ్లి ఆ పాటను పాడి విన్పించిన తరువాత మాత్రమే అక్కడ మిగతా కార్యక్రమాలు మొదలయ్యేవి. అంతేగాక వీరు స్వయంగా హిందీ విద్యాలయాన్ని స్థాపించి ఆ భాషాభివృద్ధికి జీవితాంతం పాటుపడ్డారు. కవిగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.
సన్మానాలు
[మార్చు]వీరు సమాజానికి చేసిన సేవను గుర్తించి రాష్ట్రంలోని పలు సాహిత్య, సాంస్కృతిక వేదికలు ఆయనను సన్మానించాయి. చివరిక్షణం వరకు సాహిత్య సృష్టిచేస్తూ, శ్రావ్యంగా పాడి ప్రజలకు విన్పిస్తూ, ప్రదర్శిస్తూ ఇటు కవి-రచయితగా అటు మంచి నటుడు, గాయకుడిగా ప్రజల మన్నన పొందిన షేక్ బడే సాహెబ్ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో 2007 ఆగస్టు 31న కన్నుమూశారు. (ఇంటర్యూ: షేక్ బడే సాహెబ్ రెండవ కుమారుడు షేక్ మహమ్మద్ మూసాతో 21-10- 2009న ఇంటర్యూ, 2001 ఏప్రిల్ 18న, విజయవాడలో షేక్ బడే సాహెబ్ స్వయంగా వెల్లడించిన విశేషాలు.)
మూలాలు
[మార్చు]సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త—ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 50
మూలాల జాబితా
[మార్చు]