చాంద్ బాషా పి

వికీపీడియా నుండి
(చాంద్‌ బాషా పి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జాబిలి చాంద్‌ బాషా పి .... హింది భాషోపాధ్యాయుడిగా పనిచేస్తూ.... వివిధ పత్రికలలో, సంకలనాల్లో కవితలు, కథలు వ్రాశారు. 1994 నుండి కవితా రచన చేస్తున్నారు.2013 నుండి 'జాబిలి' సాహితీ,సామాజిక,రాజకీయ,మాసపత్రిక కు గౌరవంపాదకులుగా ఉంటూ పత్రికని దిగ్విజయంగా నడుపుతున్నారు.అనంత సాహిత్య అకాడమీ,వేకువ సేవా సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.2008, లో నిజామాబాద్‌ జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త,2007, అనంతపురంలో ఇలా చాల పురస్కారాలందుకున్నారు.

బాల్యము

[మార్చు]

చాంద్‌ బాషా పి..... అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామంలో 1972., సెప్టెంబరు 8 న జన్మించారు. ఇతని కలంపేరు: జాబిలి జయచంద్ర. వీరి తల్లితండ్రులు: ఎ.రమిజాబి, ఎ.జాఫర్‌ అలీ సాహెబ్‌. చదువు: ఎం.ఏ (హిందీ)., హెచ్ప్‌టి. ఉద్యోగం: హింది పండిట్‌.

రచనా వ్యాసంగము

[మార్చు]

1996లో సాహిత్య రంగ ప్రవేశం.2000లో చేశారు. ఇతని కవిత 'మట్టిమనిషి' తొలి సారి ప్రచురితం అయ్యింది. అప్పటినుండి వివిధ పత్రికలలో, సంకలనాల్లో కవితలు, కథలు ప్రచురించ బడ్డాయి...2021 లో తన తొలికవితాసంపుటి "మట్టినిముద్దాడిన మనిషి" ముద్రణ అయిపోయి విడుదలకు సిద్దమయ్యింది.మతసామరస్యం అన్నఅంశం పై 100 మంది ప్రముక కవుల కవుతలతో "మిలన్"కవితా సంకలనానికి సంపాదకత్వ వహిస్తున్నారు.ఈ పుస్తకం ముద్రణకు వెలుతోంది.ఇస్లా శాంతి మార్గం పై జాబిలి రాసిన 73 పేజీల దీర్ఘ కావ్యం."శాంతి పూలదేహం"విడుదలకు సిద్దం అవుతోంది.

అవార్డులు-పురస్కారాలు

[మార్చు]

రాధేయ కవితా పురస్కారం (2005, అనంతపురం), తెలుగు సాహితీ సమితి పురస్కారం (2006, కర్నూలు), శరత్‌ సాహితీ స్రవంతి పురస్కారం (2007, కరీంనగర) ఇందుకూరి సాహితీ భారతి పురస్కారం 2008, నిజామాబాద్‌, జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త 200, అనంతపురం, ఇలా చాల పురస్కారాలందుకున్నారు. ఇతని లక్ష్యం: అసమానతలు లేని సమాజ నిర్మాణంలో కవిగా సాహిత్య సేవ. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం సామాజిక సేవా కార్యకర్తగా నిరంతరం చేయూత ఇవ్వడం.

మూలాల జాబితా

[మార్చు]
  • సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ