బుర్రిపాలెం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బుర్రిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (201)
 - మొత్తం 3,306
 - పురుషుల సంఖ్య 1,639
 - స్త్రీల సంఖ్య 1,667
 - గృహాల సంఖ్య 954
పిన్ కోడ్ 522202
ఎస్.టి.డి కోడ్ 08644

బుర్రిపాలెం (ఆంగ్లం: Burripalem), గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 301. ఎస్.టి.డి.కోడ్ = 08644.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

బుర్రిపాలెం గ్రామంలో, పేదలకు ఉచితంగా శుద్ధిచేసిన మంచినీరు అందించే ఉద్దేశ్యంతో, 2014, అక్టోబరు-3న, కీ.శే.పెమ్మసాని సాంబశివరావు ఙాపకార్ధం, మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించినారు. [6]

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. ఈ గ్రామ పంచాయతీ ఫిబ్రవరి-2, 1929 లోనే ఏర్పడింది. 1929లో తొలి సర్పంచి శ్రీ శాఖమూరి రాఘవయ్య. 1956లో తొలి మహిళా సర్పంచి శ్రీమతి శాఖమూరి సరోజిని.1986లో అప్పటి గవర్నరు శ్రీమతి కుముద్ బెన్ జోషీ, ఈ గ్రామంలోని జెట్టి ఇసాక్ పక్కా ఇంటితోపాటు, ఇందిరా కాలనీలో నూతనంగా నిర్మించిన 42 పక్కా నివాస గృహాలను ప్రారంభించారు.
 2. 2000 లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఇక్కడ జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. [3]
 3. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కొండూరి సామ్రాజ్యం, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:-ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖమాసం(మే నెల)లో, శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు, ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [5]

ప్రముఖ తెలుగు సినీ నటుడు శ్రీ ఘట్టమనేని కృష్ణ బుర్రిపాలెంకి చెందిన వారే.

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 3203
 • పురుషుల సంఖ్య 1602
 • మహిళలు 1601
 • నివాస గృహాలు 837
 • విస్తీర్ణం 702 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • చదలవాడ 2 కి.మీ
 • చెముడుపాడు 2 కి.మీ
 • జంపని 4 కి.మీ
 • నేలపాడు 4 కి.మీ
 • చివలూరు 5 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • తూర్పున కొల్లిపర మండలం
 • దక్షణాన వేమూరు మండలం
 • ఉత్తరాన దుగ్గిరాల మండలం
 • తూర్పున కొల్లూరు మండలం

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

[3] ఈనాడు గుంటూరు రూరల్ జులై 8, 2013. 2వ పేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2013,జులై-27; 1వ పేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్ /తెనాలి; మే-9,2014; 1వ పేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2014, అక్టోబరు-5; 2వపేజీ.