బేగం అక్తర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బేగం అక్తర్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామం అక్తరీబాయి ఫైజాబాది
మూలం ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్, భారత్
రంగం గజల్, ఠుమ్రి, దాద్రా [1]
వృత్తి సంగీతకారుడు
క్రియాశీల కాలం 1929 - 1974

బేగం అఖ్తర్ (1914 - 1974). అఖ్తరీబాయి ఫైజాబాదీ జననం అక్టోబర్ 7, 1914, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో. ఆమె తొలి గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్. ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె గజల్లు, దాద్రాలు, ఠుమ్రీలు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఆమె కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది. 1945లో బారిష్టర్ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు వివాహం జరిగింది. బేగం అఖ్తర్ "గజల్ గాయని"గా పేరు గాంచింది. ఆమె పాడిన పాటలు దాదాపు 400 వరకు ఉంటాయి. 30 అక్టోబర్ 1974, ఆమె మరణించిన రోజు.

ఆమె చివరి గజల్:

"సునాకరో మేరీ జాఁ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హైఁ యహాఁ కౌన్ కిస్కే పహచానే.

పురస్కారాలు[మార్చు]

సూచికలు[మార్చు]

  1. Dadra Thumri in Historical and Stylistic Perspectives, by Peter Lamarche Manuel, Peter Manuel. Published by Motilal Banarsidass Publ., 1989. ISBN 8120806735. Page 157.

బయటి లింకులు[మార్చు]

Video links