Jump to content

బొడ్డపాటి సీతాబాయి

వికీపీడియా నుండి
(బొడ్డపాటి సీతాబాయమ్మ నుండి దారిమార్పు చెందింది)

బొడ్డపాటి సీతాబాయి (1895-1948)

పరిచయం

[మార్చు]

కృష్ణా జిల్లా విజయవాడ కాపురస్తురాలు శ్రీమతి బొడ్డపాటి సీతాబాయమ్మగారుగా ప్రసిధ్ధి చెందిన సీతాసుందరి కాకినాడ కాపురస్తులు దిగవల్లి వెంకటరత్నం (1850-1908) గారి తృతీయ పుత్రిక. ఆమె సుప్రసిధ్ధ ప్రజాసేవకురాలు గాను అనేక మహిళా శిశుసంరక్షక కార్యక్రమాలు, సమేవేశాలు సభలలోమహిళా నాయకురాలుగానూ ప్రసిధ్ధి చెంది కొన్ని సంవత్సరాలు విజయవాడలో గౌరవ మేజస్ట్రేటుగా పనిచేశారు. గాంధీ వాది. 1928 మార్చి 18 లో మహాత్మాగాంధీ గారి సబరమతీ సత్యాగ్రహ ఆశ్రమంలో గాంధీజీ స్వయంగా వడికిన రాట్నాన్ని వారి స్వహస్తములతో అందుకుని బెజవాడ తీసుకువచ్చి అప్పటినుంచీ 1948 లో పరమదించే వరకూ నూలు వణికి గాందీగారి దీక్షను స్దారకము చేసుకున్నారు. వీరు టెలిగ్రాఫ్ సూపరింటెండెంటుగా రిటైరైన బొడ్డపాటి పూర్ణయ్య గారి సతీమణి మరియూ ప్రముఖ న్యాయవాది దిగవల్లి వేంకట శివరావుగారి అక్కగారు.

పుట్టుపూర్వోత్తరాలు

[మార్చు]
1895 అక్టోబరు 24 న కాకినాడ రాబర్టసన్ పేటలోని వారి స్వగృహమందు జన్నించిరి. సీతాసుందరి ఆని నామకరణము చేయబడెను. తండ్రి దిగవల్లి వెంకటరత్నం (1850-1908) తల్లి సూర్యమాణిక్యాంబ (1870-1947). వెంకట రత్నం గారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలునుకన్న తన ప్రథమ భార్య పరమదించగా రెండవభార్య సూర్యమాణిక్యాంబ గారిని వివాహమాడి, కుమార్తె సీతాసుందరినీ, కుమారుడు వేంకట శివరావును కలిగిరి. సీతాసుందరి పెద్ద అక్కగారే బ్రహ్మజ్ఞాని తల్లాప్రగడ సుబ్బారావుగారి సతీమణి . చూడుదిగవల్లి వంశవృక్షం క్రింద ఇవ్వబడింది. వెంకట రత్నం గారు చాల సంపన్న కుటుంబము నకు చెందియుండియూ పలుకుబడిగల రెవెన్యూ అధికారి వారి తండ్రిగారైన దిగవల్లి తిమ్మరాజుగారు 1828 లో కట్టించిన శ్రీ భీమేశ్వరస్వామివారి గుడిలో స్వామివారి కళ్యాణము ప్రతిఏటా ఘనముగా ఐదు రోజులు జరిపించేవారు. ఆ గుడికి 1892 లో తిరిగి గోపుర ప్రతిష్ఠ చేశారు. సీతాసుందరి అక్కగార్లైన తన ఇద్దరు పెద్ద కుమార్తెలకీ వివాహాలు ఘనంగా జరిపించారు. పనికిమాలిన ఇనాంజీ రాయితీ భూములను అనేక యకరాలను చెయ్యేరులో కొనుగోలు చేసి నష్టపోవటం ఆదాయముకు మించిన అధిక ఖర్చులు చేయటంతో క్రమక్రమముగా ఆస్తినంతయూ విక్రయముచేసి చివరకు కాకినాడ రాబర్టసన్ పేటలోని వారి తండ్రిగారు కట్టించిన ఇల్లే కాక కొవ్వూరులో తను కట్టించిన ఇల్లు గూడా అమ్మవలసిన స్థితికి వచ్చి1903 లో రిటైరి సీతాసుందరి వివాహముచేసిన మరుసటి సంవత్సర1908 మేలో పరమదించిరి.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

సీతాసుందరి గారి తండ్రి వెంకటరత్నంగారు తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరులో మాజిస్ట్రేటుగా పనిచేయు రోజులలో ఆమె కొవ్వూరులో వున్న నాగరాజ గారి స్కూలులో 3 న తరగతి చదివారు. ఆరోజుల్లో అక్కడే కాపురముండిన అడవి కృష్ణయ్య గారి కుమారుడు బాపిరాజు గారు గూడా ఆమేతో పాటు అదే క్లాసులో చదివారు. అడవి బాపిరాజు గారుకూడా మన్మధనామ సంవత్సరం 1895 లో జన్మించిరి. ఒకే వయస్సులు, ఒకే స్కూలు విద్యార్థులవటంతో సీతాసుందరి స్నేహితురాండ్రతోపాటుగా బాలుడైన బాపిరాజు కూడా ఆడుకోటం తదుపరి ఇద్దరూ సుప్రసిద్దులుగానగుటయె కాక జీవితాంతము కుటుంబ స్నేహితులుగా నుండిరి

వివాహం

[మార్చు]

అప్పటిరోజల ఆచార వ్యవహార ప్రకారము 11 వ ఏటనే ఆమె వివాహంతలపెట్టిన తండ్రి వెంకటరత్నంగారు ఆర్థికంగా శారీరకంగా క్షీణదశ లోనుండెను, కానీ అదృష్ట జాతకురాలైన ఆమెకు కృష్ణాజిల్లా వాస్తవ్యుడై అప్పటికి టెలిగ్రాఫ్ మాస్టరుగా మైసూరులో పని చేయుచున్న శ్రీ బొడ్డపాటి పూర్ణయ్యగారితో కాకినాడలో 1907 జూన్ 14 లో మహా వైభవంగా వివాహము జరింపించిరి.

బహు భాషా వైదుష్యం

[మార్చు]

వివాహం అయిన తరువాత భర్తగారి అభిరుచిప్రకారం ఆమె సీతాబాయిగా ప్రసిధ్ధి చెందారు చురుకైన మేధా శక్తి కలిగయుండటవలన తన భర్తగారైన బొడ్డపాటి పూర్ణయ్య గారి ఉద్యోగ రీత్యా అనేక పట్టణాలలో కాపురముండి న కారణంగా సీతాబాయమ్మగారు బహూభషా ప్రవీణ్యత సంపాదించారు. అనర్గళంగా ఆవిడ మాట్లాడగలిగియుండిన భాషలు మలయాళం, కన్నడం, తమిళం, మరాఠీ, హిందీ. స్వయంకృషితో ఇంగ్లీషు చదవటం వ్రాయటం కూడా నేర్చుకొనియుండిరి . పూర్ణయ్య గారు తోపాటు ఆవిడ కాపురం చేసి న పట్టాణాలు మైసూరు, కాలికట్, బెంగళూరు, మద్రాసు, బొంబాయి, బెజవాడ, షోలాపురు, లాహోరు, అహమదాబాద్ మొదలగునవి .

1921 సంవత్సరములో గాంధీజీ దర్శనం

[మార్చు]

సీతాబాయమ్మగారి జీవిత చరిత్రలో గాంధీ గారికి సంబంధించిన వి రెండు గొప్ప ఘట్టములున్నవి. వారి భర్తగారైన బొడ్డపాటి పూర్ణయ్యగారు టెలిగ్రాఫ్ విభాగంలో ప్రభుత్వోద్యగము చే ఆనేక పట్టణములలో పనిచేసి 1920 లో బెజవాడ టెలిగ్రాఫ్ ఆఫీసుకు డెప్యూటీ సూపరింటెండెంట్ గా బదలీపై వచ్చిరి. అప్పటిలో 1921 మార్చి 31 తేదీన బెజవాడఅఖిల భారత కాంగ్రెస్సు కమిటీ (ఎఐసిసి) మహాసభకి మహాత్మా గాంధీ గారు బెజవాడవచ్చి ప్రసంగించారు. లోకమాన్య తిలక్ గారి స్వాతంత్ర్యోద్యమముకు కోటిరూపాయలు పోగుచేసి ఇరవై లక్షల రాట్నములను నెలకొలిపి ఖాదీ ప్రచారము చేయుటకూ ఒక సంవత్సరంలో స్వతంత్రము సంపాదించుటకు గాంధీగారు దీక్ష పూనిరి. చాలమంది స్త్రీ పురుషులు యధాశక్తితో స్వతంత్రోద్యములో తోట్పడుటకు ఉత్సాహవంతులై ముందుకు వచ్చిరి. . ఆసందర్భములో వచ్చిన గాంధీగారు బెజవాడ టెలిగ్రాఫ్ ఆఫీసు వెనుకాతల వున్న రహదారిబంగళాలో ఒక మహిళా సభలో గూడా ఉపన్యాసముచేసిరి. అప్పుడు కొద్ది రోజులక్రితమే కూతురును కన్న సీతబాయమ్మగారు బాలింతగానున్నాకూడా గాంధీగారిని దర్శించవలెనని ఉత్సాహవంతురాలై ఆ సభకు వెళ్ళి గాంధీగారిని దర్శించి వచ్చిరి.

మహాత్ముని దర్శనానంతరము వచ్చిన కష్టాలు

[మార్చు]

బ్రిటిష్ ప్రభుత్వమువారు ప్రభుత్వోద్యోగులను స్వాతంత్ర్యోద్యమములో పాలుగొనుట చందాలిచ్చుట, ఇప్పించుట, ఖద్దరు ధరించుట ఇత్యాది స్వాతంత్ర్యోద్యమ చర్యలను పూర్తిగా నిషేధించుటయేగాక ప్రభుత్వోద్యోగుల భార్యలు గానీ పిల్లలు గానీ, బంధువులు గానీ ఏవిధమైన ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అటువంటి ఉద్యమాలలో పాల్గొన్నచో ఆ ప్రభుత్వోద్యోగిపై చర్యలు తీసుకొనుచుండిరి. అటువంటి పరిస్థితిలో సీతాబాయమ్మగారి గాంధీ దర్శనము భర్త గారికి చిక్కులు తెచ్చిపెట్టినవి. ఆవిడ గాంధీ దర్శనం కారణంగా భర్త, పూర్ణయ్యగారిపై వచ్చిన నేరా రోపణ: 1. పూర్ణయ్య గారి ఆఫీసులో వారి క్రింది ఉద్యోగులిద్దరు ఖద్దరు ధరించారని, గాందీ టోపీ పెట్టు కున్నారనీ, వారి ఆఫీసర్ల క్లబ్బులో వచ్చే వార్తాపత్రికలు సహాయకనిరాకరణోద్యమముకు సానుభూతిగానుండే పత్రికలగు ఆంధ్రపత్రిక, హిందూ, బోంబే క్రానికల్ మొదలగునవే ననియూ, అప్పటిలో ప్రభుత్వపక్షపాతమైన జస్టిస్పార్టీ వారు నడిపే పత్రికలు తెప్పించుటకు వారి క్రింద పనిచేయు కొందరుఉద్యోగులంగీకరించటములేదన్నీనూ వారి అదీనంలో ఉండే ఈ ఆ చర్యలద్యారా పూర్ణ.య్యగారు కాంగ్రెస్సుఉద్యమాలకు సానుభూతి చూపుతున్నాడని 2. 1921 మార్చి 31 బెజవాడ ఎఐసిసికి వచ్చి న గాంధీజీ మహీళా సభకు కూడా వచ్చిప్రసంగించినప్పుడు పూర్ణయ్యగారి భార్య సీతాబాయి గారు వెళ్లి ఒక బంగారు గొలుసును తిలక్ స్యాతంత్రోద్యమానికి చందాగా ఇచ్చారనీనూ 3. 1921 నవంబరులో వేల్సు యువరాజు గారు బొంబాయిరాకని వ్యతిరేకిస్తూ నల్లజండాలు కట్టుటకు బెజవాడలో టెలిగ్రాఫ్ స్తంభాలు వాడేరని అవి పూర్ణయ్య గారు తీసివెయించినప్పటికీ వారి అశ్రధ్ధవల్లే అలా జరిగిందనినూ 4. కష్టాలన్నీ కలిసే వస్తయన్నట్టుగా ఆరోజులలోనే రాజమండ్రీలో గొప్ప గాంధీ వాది స్వాతంత్ర్య సమరయోధుడైన డాక్టరు బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంగారి బావమరిది చెరుకుపల్లి వెంకటప్పయ్య గారు తమ మిత్రుడు అప్పుడే మద్రాసులా కాలేజీలో చదువు పూర్తి చేసుకుని బెజవాడ వచ్చిన సీతాబాయమ్మగారి తమ్ముడు దిగవల్లి వేంకట శివరావుకు జాన్యవరి 3, 1922 న కేరాఫ్ డా బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారి చిరునామాతో వ్రాసిన పోస్టు కార్డు డి వి.శివరావు కేరాఫ్ డెప్యూటి సూపరింటెండెంటు టెలిగ్రాఫ్ అని వుండగా అది పొరపాటున డెప్యూటీ సూపరింటెండెంటు పోలీసుకు బట్వారా చేయబడటంతో పూర్ణయ్యగారు కాంగ్రెస్సు వాదులు-స్వతంత్రసమమరయోదులతో సంబంధములున్నవని బెజవాడలోని కాంగ్రెస్సునాయకులైన అయ్యదేవర కాళేశ్వరరావుగారు, దాసూ మాధవరావుగార్లతో వారి స్నేహమనియు ఇంకో గొప్ప నేరము జోడైంది. పూర్ణయ్యగారి స్వభావం వారి నీతినిజాయితీలెరిగిన వారి పై అధికారి కూడా ఏమీ చెయలేకపోయిరి. వారిపైనిందలను గూర్చిరహశ్య (కానఫిడెంషియల్) విచారణచేయించబడెను, వారిని పదవినుండి 1922 మార్చి 15న తొలగించి డిపార్టమెంటల్ ఇంక్వైరీ జరిపించి వారివలన ఏమీ దోషములేదని తేలగా 3 నెలల తర్వాత వారిని రిఇనస్టేటచేసి మద్రాసుకు బదలీ చేసిరి. [సశేషం]

గాంధీ బహుకరించిన రాట్నం, “ఖాదీ అక్షరాభ్యాసము”

[మార్చు]

సీతాబాయమ్మగారి జీవితచరిత్రలో గాంధీగారికి సంబంధించి న ఇక రెండవ ఘటంగా పూర్ణయ్యగారు 1926లో లాహోరునుండి బదలీ యై సూపరింటెండెంటుగా అహమదాబాదులో పనిచేస్తున్న రోజులలో ఆమెకు గాంధీజీ సబరమతీ సత్యాగ్రహ ఆశ్రమానికి పోయి వారి చేతిమీదుగా ఏమన్నా జ్ఞాపకార్ధము అందుకుని రావలెనని కోరిక కలదై భర్తగారిని కోరగా 1921 లో మొదటి దర్శనముతర్వాత కలిగిన కష్టాలు తలుచుకుని ఈ సారి తన పై అధికారైన పోస్టు మాస్టర్ జనరల్ ( పి.యమ్.జి) గారి అనుమతి లేనిదే అది వీలు బడదని చెప్పి అట్టి అనుమతికి ప్రయత్నించి లభ్యమైన పిదప మార్చి మూడవవారం 1928 లో కుటుంబ సమేతంగా సబరమతికి వెళ్లి గాంధీగారిని దర్శించి అక్షరాభ్యాసము లాగ గాంధీగారిచే “ఖాదీ అక్షరాభ్యాసము” వారిచేతులమీదుగా జరుగవలెనన్న కోరికను వెల్ల డించాగా గాందీజీ అటులనే ఒక చరకమునిత్తుననెను. ఎప్పుడు రమ్మంటారనగా నీకెప్పుడు వీలుంటే అప్పుడే వచ్చి తీసుకొను మనెను. అంతట అక్కడనున్న హిందూ కరెస్పాండెంటుకు గాంధీగారు చెప్పినట్లుగా చరక ఒకటి పురమాయించమని చెప్పి పది రోజులతరువాత కబురంపగా గాందీజీ తన స్వంత రాట్ణమే ఇచ్చెదనని చెప్పారనీ ఆరోజే సాయంత్రము 5 గంటలకు రమ్మనారనీ తెలియగా సీతాబాయమ్మగారు భర్తగారితో కలిసి వెళ్లగా గాంధీ గారు చాల సంతోషించి “ రండి రండి రావాలి రావాలి” అని చేతుల జోడించి కూర్చోమని పిల్లలు రాలేదమని అడిగి ఇదగో తీసుకొమ్మని తనే వడుకు చున్న రాట్ణమును ఇస్తున్నాని చెప్పి ఆమెను నేలమీదనున్న రాట్నాన్ని తీసుకొనమనగా సీతాబాయమ్మగారు వారి చేతులమీదుగా ఇవ్వమనెను. అంతట మోకరించి యున్న ఆమె చేతులకి గాంధీగారు వారి స్వహస్తములతో అందించారు దాని ఖరీదు ఇవ్వమనిఆయన అడగలేదు కానీ ఆమెకు తోచినంత గాంధీగారి పాదముల యడల వుంచి అతి సంతోషముతో ఆరాట్నంపై నూలు వడకటం ఆరోజునుండే ప్రారంభించి వారి తమ్మడు శివరావుగారికి 1928 ఏప్రిల్ 3 న వ్రాసిన ఉత్తరంలో అప్పటికే 1500 గజముల దారమును తీసినట్లుగా వ్రాశారు. అహమదాబాదులో నుండగనే సీతాబాయమ్మగారు ఆరాట్ణముపై వడకుటకు అనుగుణముగా భూమికి 9 అంగుళాల ఎత్తులో వుండేటట్టి మేలు రకం టేకు చక్కతో పేముఅల్లిన కుర్చీ 1928 సంవత్సరంలో చేయించుకున్నారు. ఇప్పటికీ వున్న ఆకుర్చీ ఛాయా చిత్రము చూడుడు . పూర్ణయ్యగారి రిటైరనతరువాత 1928 చివరలో బెజవాడవచ్చి ఆవిడ స్వంతఇంట్లో జీవనం గడపుతూ 1948 లోపరమదించేవరకూ నూలు వణకుతూ, తను ఖద్దరు వస్త్రములే ధరించుచూ గాంధీగారి దీక్షను సార్థకము చేశారు. ఆ రాట్నముపై వడికిన నూలుదారము మహాత్మా గాంధీగారికి పంపించేవారు, ఆధారముతో చేసిన ఖద్ధరు వస్త్రమును స్వాతంత్ర్య సమరయోధుడు కుటుంబ వైద్యుడైన డాక్టరు ఘంటసాల సీతారామ శర్మగారికి కూడా ఇచ్చారు.[1]

ప్రసూతి శిశు సంరక్షణ కేంద్రము, ప్రజా సేవ

[మార్చు]

సీతాబయమ్మ గారికి ఇంటిపనులు, ఎంబ్రాయడరీ, రోగి శిశ్రూష, శిశు సంరక్షణ మొదలగు పనులలో చాల అబిరుచి కలదై అనేక మహిళా సంఘములందును, ప్రజా సంస్దలందును సభ్యురాలై అనేక విధములుగా ప్రజాసేవ చేశారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమములందును, గ్రంథాలయోద్యమములందును కష్టపడి పనిచేశారు. స్త్రీల క్లబ్బులో మహిళా సంఘమునందు ఆమె ప్రముఖురాలుగానుండి మునిసిపాలిటీ వారి సహాయమతో ప్రసూతి శిశుసంరక్షణ కెంద్రము నడిపేవారు. బీదవారి పిల్లలకు ఉచితముగా పాలు పోయించి, వారికి పిల్లలకు తలలంటి బట్టలు కట్టించటము మొదలగు సంక్షేమ కార్యక్రమాలు స్వయంగా చేయుట చాలమందికి ఆరోజులలో విన్నవారికి కన్న వారికి ఆశ్చర్యము కలుగచేసింది. కాంపోజిట్ మద్రాసు స్టేటులో డైరక్టరు ఆఫ్ పబ్లిక్ హెల్త్ (Director of Public Health) గాచేసిన డాక్టరు దిగవల్లి సుబ్బారావు గారు (సీతాబాయమ్మగారి అన్నగారి కుమారుడే) అప్పట్లో (1933) సూబ్బారావుగారు బెజవాడలో హెల్త్ ఆఫీసరుగా నుండగా సీతాబాయమ్మగారు హెల్త్ అండ్ బేబీ వీక్ (Health and Baby Week) అను ఆరోగ్య వారోత్సవమును జయప్రథముగా నిర్వహించారు. బెజవాడ మహిళా సంఘమునందేకాక ఆమే ఆఖిలభారత మహిళా సంఘముల సమావేశములకు ఆంధ్రసంఘ ప్రతినిధిగా కలకత్తాలోను ఇతర పట్టణములలో గూడా పాల్గొన్నారు.

సంగీతం, సాహిత్యం

[మార్చు]

సీతాబాయమ్మగారు చదివినది కేవలం మూడవ తరగతివరకేనైనను, వార్తాపత్రికలనే కాక గొప్ప సాహిత్యాత్మక రచనలు, చిలకమర్తి వారివి, వీరేశలింగంగారి రచనలు, విజ్ఞాన చంద్రికామండలివారివి, ఆంధ్ర పచ్రారణీ సంఘము వారి ప్రచురణలు చాల శ్రధ్దగా చదివుచుండుట వలన భాషాజ్ఞామును, విజ్ఞానమును సంపాదించారు. ఆవిడ స్వయంగా చేసిన కొన్ని రచనలు భారతి లోను, ఆంధ్రపత్రికలోను ప్రచురించబడినవి. ఆమె సంగీతం పాడగలిగి యుండిరి కానీ ఆవిడ హార్మోనింయపై ఎక్కువ మక్కువ.

అదికార అనధికార బాధ్యతలు

[మార్చు]

రెండవ ప్రపంచయుధ్ధము జరుగుతున్నప్పుటి రోజులలో (1939 – 1945) పట్టణ పరిపాలనలలో దేశరక్షణకొరకు నెల కొల్పబడిన అధికార అనధికార సంఘములలో సీతాబాయమ్మగారు పనిచేశారు. గౌరవ మేజిస్ట్రేటుగా ఆమే కౌశల్యత, న్యాయ దృష్టి కలిగి, సమర్ధతో కొన్ని సంవత్సరములు ప్రశంసనీయముగా పనిచేశారు.

సీతాబాయమ్మగారి సంతతి , జీవిత తుది ఘట్టం

[మార్చు]

పూర్ణయ్య- సీతాబాయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు నలుగురు కమారులు కలిగిరి. పెద్ద కుమార్తె శాంతాబాయి 1930- 32 లో బెనారెస్ హిందూ యూనివర్సిటీలో ఇంటరమీడియట్ చదివింది. అప్పుడు ఆమెతోపాటు చదివిన సహవిద్యార్థిని దుర్గాబాయి దేశ్‌ముఖ్గా ప్రసిధ్ధి చెందిన రాజమండ్రిలోజన్మించిన కాకివాడ కాపురస్తులైన గుమ్మడిదల రామారావు గారి కుమార్తె గుమ్మిడిదల దుర్గాబాయి మిత్రురాలైనది. ఇంటరు తర్యాత 1940లో ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఎ. ఆనర్సులో చదవుచున్న రోజులలోనే 28 వ ఏండ్ల ప్రాయములో కన్జెనిటల్ గుండె జబ్బువలన 1941 లో చనిపోయింది. సీతాబాయమ్మగారి రెండవ కుమార్తె ప్రేమ గూడా చాల చిన్నవయస్సులోనే పరమదించింది. వారి భర్త పూర్ణయ్య గారు 1939 లో పరమదించారు. వారి నలుగురు కుమారులు పెద్ద చదువులు చదివి ఉన్నత పదవులు నిర్వహించారు. సీతాబాయమ్మగారు 1948 దాకా విజయవాడలో నే తన స్వగృహములోనే జీవనం చేసి 1948 లో రెండవ కుమారుడు మిలిటరీ డాక్టరుగా పూనాలో పనిచేయుచ్చున్న కాలంలో పూనా వెళ్లి ఆక్క డ జీర్ణకోశ కాన్సర్ అని నిర్ధారించచడ్డ వ్యాధితో తమ 53 వ ఏట 20/05/1948 న పరమదించారు.

మూలాధారములు

[మార్చు]
  1. "ఒకనాడు గాంధీజీ బహుకరించిన రాట్నం", దిగవల్లి వేంకట శివరావు.అద్రజ్యోతి16/10/1966