భలే అమ్మాయిలు (1957 సినిమా)
స్వరూపం
'భలే అమ్మాయిలు' తెలుగు చలన చిత్రం,1957 సెప్టెంబర్ 6 న విడుదల.నరసు స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, సావిత్రి, చిలకలపూడి సీతారామాంజనేయులు, కొంగర జగ్గయ్య ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం, సాలూరు రాజేశ్వరరావు, సాలూరు హనుమంతరావు అందించారు.
| భలే అమ్మాయిలు (1957 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
|---|---|
| నిర్మాణం | వి.ఎల్.నరసు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, చిలకలపూడి సీతారామాంజనేయులు |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు & ఎస్. హనుమంతరావు |
| నిర్మాణ సంస్థ | నరసూ స్టూడియోస్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
నటీనటులు
[మార్చు]- నందమూరి తారక రామారావు_ ఆనంద్
- సావిత్రి_సరోజ
- చిలకలపూడి సీతారామాంజనేయులు_సుబ్రహ్మణ్యం
- కొంగర జగ్గయ్య_శేషగిరిరావు
- గిరిజ_ గిరిజ
- రేలంగి వెంకట్రామయ్య_ వెంకట్రామయ్య
- పి.హేమలత_జయలక్ష్మమ్మ
- పేకేటి శివరాం_ మోహన్
- వల్లూరి బాలకృష్ణ _ నీలయ్య
- డాక్టర్ శివరామకృష్ణయ్య_వెంకటాద్రి
- ఛాయాదేవి_ మంగమ్మ
- సూర్యకళ_ రత్తమ్మ
- అమ్మాజీ_ రేఖా
- బేబీ శశికళ_సుచిత్ర.
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: వేదాంతం రాఘవయ్య
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు,హనుమంతరావు
గీత రచయితలు: వెంపటి సదాశివ బ్రహ్మం,కొసరాజు రాఘవయ్య చౌదరి
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, జిక్కి, పి.లీల, ఎం.ఎల్.వసంత కుమారి, బి.గోపాలం
కథ: వెంపటి సదాశివ బ్రహ్మం
చిత్రానువాదం: వేదాంతం రాఘవయ్య
ఛాయా గ్రహణం: వి.కుమారదేవన్
ఎడిటింగ్: ఆర్.హనుమంతరావు
నిర్మాత: వి.ఎల్.నరసు
నిర్మాణ సంస్థ:నరసూ స్టూడియోస్
విడుదల:06:09:1957.
పాటలు
[మార్చు]- అందాల రూపము ఆనంద దీపము కనుదోయి విందుచేయు - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
- ఓహో బంగరు చిలుకా అహా ఎందుకే అలకా ఇలా చూడవు మాటడవు - జిక్కి
- ఓహోహో లొకమున యవ్వనులైన ప్రేమికుల కన్ను కన్ను కలసి - పి.సుశీల బృందం
- గోపాల జాగేలరా ననులాలించి పాలింప రావేలరా - ఎం.ఎల్.వసంతకుమారి, పి.లీల
- చకచక జణత తకథిమి కిటత పకపక నవ్వుతా పంతమాడుతా- జిక్కి బృందం - రచన: కొసరాజు రాఘవయ్య
- చీటికి మాటికి చీటికట్టి వేధించేవానాడు లాటరిలోన లక్షలు - పి.బి.శ్రీనివాస్, జిక్కి
- దాగుడుమూతలు చాలునురా నీ ఆగడమంతా తేలెనురా దొరికేవురా - జిక్కి బృందం
- నాణెమైన సరుకుంది లాహిరి మీరు బోణిచేసారంటే - పి.బి.శ్రీనివాస్, బి.గోపాలం
- మది వుయ్యాలలూగే నవభావాలేవోరేగె మానస - పి.లీల, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- ముద్దులొలికేవోయి నవ్వుచిలికేవోయి అందచందాల పాపాయి - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
- దిల్లానా_ఎం.ఎల్.వసంత కుమారి.
బయటి లింకులు
[మార్చు]- సినీరధంలో భలే అమ్మాయిలు పాటలు వినండి. Archived 2016-01-30 at the Wayback Machine
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.