Jump to content

భైంసా రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
భైంసా రెవెన్యూ డివిజను
గడ్డన్నవాగు ప్రాజెక్టు
గడ్డన్నవాగు ప్రాజెక్టు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లానిర్మల్

భైంసా రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నిర్మల్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం భైంసాలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ముధోల్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

[మార్చు]

బైంసా డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం బైంసా రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 కుబీర్‌ మండలం 38 రెవెన్యూ గ్రామాలు
2 కుంటాల మండలం 16 రెవెన్యూ గ్రామాలు
3 బైంసా మండలం 34 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
4 ముధోల్ మండలం 24 రెవెన్యూ గ్రామాలు (6 నిర్జన గ్రామాలు)
5 బాసర మండలం 17 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
6 లోకేశ్వరం మండలం 31 రెవెన్యూ గ్రామాలు (5 నిర్జన గ్రామాలు)
7 తానూర్‌ మండలం 33 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-03-02.
  3. "REVENUE DIVISIONS | Nirmal District | India". www.nirmal.telangana.gov.in. Archived from the original on 2022-01-31. Retrieved 2022-03-02.
  4. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-03-02.