మహిషాసుర మర్దని (సినిమా)
స్వరూపం
| మహిషాసుర మర్దిని (1959 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.ఎస్.రంగా |
|---|---|
| నిర్మాణం | బి.ఎస్.రంగా |
| తారాగణం | రాజ్‌కుమార్ షావుకారు జానకి, చిత్తూరు నాగయ్య, రాజనాల, సంధ్య, సూర్యకళ |
| సంగీతం | జి.కె.వెంకటేష్ |
| నేపథ్య గానం | ఎ.పి.కోమల, పి.లీల, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి |
| గీతరచన | సముద్రాల జూనియర్ |
| సంభాషణలు | సముద్రాల జూనియర్ |
| ఛాయాగ్రహణం | బి.ఎస్.రంగా |
| నిర్మాణ సంస్థ | విక్రమ్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
మహిషాసుర మర్దని అదే పేరుతో విడుదలైన కన్నడ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ సినిమా 1959, నవంబర్ 27న విడుదల అయ్యింది. విక్రమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఛాయా గ్రహకుడు, నిర్మాత, దర్శకుడు బి. ఎస్. రంగా తెరకెక్కించిన ఈ చిత్రం లో రాజ్ కుమార్, షావుకారు జానకి, చిత్తూరు నాగయ్య నటించిన ఈ చిత్రానికి సంగీతం జి. కె. వెంకటేష్ సమకూర్చారు .
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం, ఛాయాగ్రహణం, నిర్మాత: బి.ఎస్.రంగా
- సంగీతం: జి.కె. వెంకటేష్
- మాటలు, పాటలు: సముద్రాల జూనియర్
- నృత్యం: ఎ.కె.చోప్రా
- కూర్పు: పి.జి.మోహన్, ఎం.దేవేంద్రనాథ్
- నేపథ్య గాయకులు: ఎ.పి.కోమల, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పద్మ, పి.లీల, శిష్ట్లా జానకి,ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల
- నిర్మాణ సంస్థ: విక్రమ్ ప్రొడక్షన్స్
- విడుదల:27:11:1959.
తారాగణం
[మార్చు]- రాజ్‌కుమార్_మహిషాసుర
- షావుకారు జానకి_ గుణవతి
- ఉదయకుమార్_ రాంబేష
- నాగయ్య_శుక్రాచార్య
- రాజనాల
- సంధ్య_చాముండేశ్వరి
- సూర్యకళ
- కుచలకుమారి
- నరసింహరాజు (కన్నడ నటుడు)
- కె.ఎస్ అశ్వత్_ నారద
- గణపతి భట్
- ఇంద్రాణి_దుర్గాదేవి
- ఎం.లక్ష్మీదేవి
- వసుదేవ గిరిమాజి
- హనుమంతరావు
- సూర్యకుమార్
- ఉదయ శంకర్ _ విష్ణు
- సదాశివయ్య
- రాజేంద్రకృష్ణ
- వై.ఎన్.ఎస్.స్వామి
- రంగస్వామి
- పాపమ్మ
- శాంతమ్మ
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
- చిన్నారి కన్నె మనసు చూరగొన్న రాజా నీ వన్నె చూచి - పి.సుశీల
- జయ జగదీశ్వరీ జయహే శంకరీ జయ మహేశ్వరీ - ఎ.పి. కోమల
- నందన వనమీ సుందర జగమే అందము చిందే వలపు - పి.లీల, ఘంటసాల
- నారాయణ వనమాలీ వరదా నారద సంగీతలోలా - పి.బి. శ్రీనివాస్
- మనసెరిగిన వాడవని..సోయగాల బాల కోరి నిన్నే చేరెర - పి.సుశీల
- మాణిక్యవీణా ముఫలాలయంతీం.. జయ జయ శంకరీ - పి.బి. శ్రీనివాస్ బృందం
- వన్నెల పసికందా మా వలపుల ఆనంద - ఎ.పి. కోమల,పద్మ బృందం
- సుఖభోగసారా సురశేఖరా శ్రీకరా దేవేంద్రా గుణసాంద్రా - ఎస్. జానకి
- అమ్మా జగన్మాతా నా మాంగల్యమును కాపాడవే - పి.లీల
- సరాసరి గాలితేలి వచ్చినారము మెరుపులలో చెలువు మీరి - ఎస్. జానకి బృందం
విశేషాలు
[మార్చు]- ఈ సినిమా తెలుగుతో సహా అదే పేరుతో 7 భాషలలోకి డబ్ చేయడిన తొలి భారతీయ సినిమా.
- రాజ్‌కుమార్ తొలి సారిగా ఈ సినిమాతో నేపథ్యగాయకుడి అవతారం ఎత్తాడు.
- మద్రాసులోని విక్రమ్‌స్టూడియోలో చిత్రీకరించబడిన తొలి సినిమా ఇది.
మూలాలు
[మార్చు]- ↑ కల్లూరి భాస్కరరావు. "మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)