మాలా సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలా సిన్హా
2013లో మాలా సిన్హా
జననం
అల్దా సిన్హా

(1936-11-11) 1936 నవంబరు 11 (వయసు 87)
కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం)
జాతీయతఇండియన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1952–1994
జీవిత భాగస్వామి
చిదంబరం ప్రసాద్ లోహాని
(m. 1966)
పిల్లలుప్రతిభా సిన్హా
తల్లిదండ్రులుఆల్బర్ట్ సిన్హా

మాలా సిన్హా (జననం 1936 నవంబరు 11) ప్రసిద్ధి చెందిన భారతీయ నటి, ఆమె హిందీ, బెంగాలీ, నేపాలీ చిత్రాలలో పని చేసింది. మొదట్లో ప్రాంతీయ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆమె 1950ల చివరి నుంచి 1970ల ప్రారంభం వరకు హిందీ చిత్రసీమలో అగ్రశ్రేణి నటిగా ఎదిగింది. ఆమె కెరీర్‌లో గురుదత్ ప్యాసా (1957), యష్ చోప్రా ధూల్ కా ఫూల్ (1959), ఫిర్ సుబహ్ హోగి (1958)లతో లాంటి చిత్రాలతో పేరొందిన మాలా సిన్హా వందకు పైగా సినిమాలలో నటించింది.[1]

మాలా సిన్హా కిషోర్ కుమార్, ఉత్తమ్ కుమార్, దేవ్ ఆనంద్, ధర్మేంద్ర, రాజ్ కుమార్, రాజేంద్ర కుమార్, బిస్వజిత్, మనోజ్ కుమార్, రాజేష్ ఖన్నా తదితరుల సరసన నటించింది. ఆమె 1958 నుండి 1965 వరకు వైజయంతిమాల కంటే అధిక పారితోషికం పొందిన నటి. 1966 నుండి 1967 వరకు వైజయంతిమాలతో కాస్త తక్కువ, ఆపై 1968 నుండి 1971 వరకు షర్మిలా ఠాగూర్‌తో రెండవ స్థానాన్ని, 1972-73లో సాధన, నందా కర్నాటకితో మూడవ స్థానంలో ఆమె పారితోషికం ఉండేది.[2] అనేక అవార్డులు, నామినేషన్లు అందుకున్న ఆమెకు 2018లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా లభించింది.

జీవితం తొలి దశలో[మార్చు]

నేపాల్ నుండి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌కు వలస వచ్చిన క్రిస్టియన్ నేపాలీ దంపతులకు మాలా సిన్హా జన్మించింది. ఆమె తండ్రి పేరు ఆల్బర్ట్ సిన్హా. మాలా సిన్హా అసలు పేరు ఆల్డా, కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా)లోని స్కూల్‌లో ఆమె స్నేహితులు ఆమెను డాల్డా అని పిలిచి ఆటపట్టించేవారు, కాబట్టి ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన మొదటి అసైన్‌మెంట్ పొందిన తర్వాత తన పేరును బేబీ నజ్మాగా మార్చుకుంది.[3][4] ఆ తర్వాత నటిగా తన పేరును మాలా సిన్హాగా మార్చుకుంది. చిన్నతనంలో డ్యాన్స్, పాటలు నేర్చుకుంది. ఆమె ఆల్ ఇండియా రేడియోలో గాయని అయినప్పటికీ, ఆమె ఎప్పుడూ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగింగ్ చేయలేదు. అయితే ఆమె గాయనిగా 1947 నుండి 1975 వరకు అనేక భాషలలో స్టేజ్ షోలు చేసింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మాలా సిన్హా 1966లో నేపాలీ నటుడు చిదంబర్ ప్రసాద్ లోహానిని వివాహం చేసుకున్నారు. ఈ జంట నేపాలీ చిత్రం మైతీఘర్ (1966)లో కలిసి నటించారు. ఆయనికి నేపాల్‌లో ఎస్టేట్ ఏజెన్సీ వ్యాపారం ఉంది. ఆమె వివాహం తర్వాత ఆమె సినిమా షూటింగ్‌ల కోసం ముంబైకి వచ్చి ఉంటుంది. ఆమెకు ఒక కుమార్తె ప్రతిభా సిన్హా, ఒక మాజీ బాలీవుడ్ నటి.[5][6] ఏప్రిల్ 2017లో మాలా సిన్హా చనిపోయింది.[7][8]

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

  • 1965లో జహాన్ అరా చిత్రానికి ఉత్తమ నటి (హిందీ) పురస్కారం, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు.
  • 1967లో హిమాలయ్ కీ గోద్ మె చిత్రానికి ఉత్తమ నటి (హిందీ) పురస్కారం, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు.
  • ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నుంచి ఉత్తమ నటిగా ధూల్ కా ఫూల్, బహురాణి, జహాన్ అరా, హిమాలయ్ కీ గోద్ మె చిత్రాలకు వరుసగా 1960, 1964, 1965, 1966 సంవత్సరాలలో ఎన్నికైంది.
  • 2018లో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • 2007లో స్క్రీన్ అవార్డుల నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • 2004లో సిక్కిం ప్రభుత్వంచే సిక్కిం సమ్మాన్ అవార్డు[9]
  • 2005లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (నేపాల్) నుంచి మైతీఘర్ చిత్రానికి క్రిటిక్స్ అవార్డ్[10][11]
  • 2013లో కెల్వినేటర్ GR8! మహిళా అవార్డులు: జీవితకాల సాఫల్య పురస్కారం[12]
  • 2017లో LG ఫిల్మ్ అవార్డ్ - మైతీఘర్ చిత్రానికి ప్రత్యేక గౌరవం[13]
  • 2021లో సినిమా రంగంలో ఆమె కౄషికి దీనానాథ్ మంగేష్కర్ విశేష్ పురస్కార్[14]

మూలాలు[మార్చు]

  1. "Trip down the memory lane with Mala Sinha". Screen. Bollywood Hungama. 13 March 2001. Archived from the original on 31 October 2011. Retrieved 26 August 2011.
  2. "Star of the week - MALA SINHA | Bollywood Buzz - MAG THE WEEKLY". Archived from the original on 29 January 2020. Retrieved 29 January 2020.
  3. "Do you know Mala Sinha is Christian?". glamsham.com. Archived from the original on 25 July 2018. Retrieved 2 February 2018.
  4. "10 less known facts about Mala Sinha-Features-Features & Events-Indiatimes Movies - Page3". Archived from the original on 4 May 2010. Retrieved 24 February 2014.
  5. "Happy Birthday Mala Sinha » - Picture 10". Goodtimes.ndtv.com. Archived from the original on 1 March 2014. Retrieved 24 February 2014.
  6. "rediff.com, Movies: Profiling Mala Sinha". Rediff.com. Archived from the original on 13 December 2012. Retrieved 24 February 2014.
  7. "Happy Birthday Mala Sinha » - Picture 15". Goodtimes.ndtv.com. Archived from the original on 1 March 2014. Retrieved 24 February 2014.
  8. "Mala Sinha misses the camera". Gulf News. 9 January 2018. Archived from the original on 3 February 2018. Retrieved 2 February 2018.
  9. "Few facts about Bollywood's former heroine". The Telegraph. Calcutta, India. 15 July 2004. Archived from the original on 2 November 2012. Retrieved 25 June 2011.
  10. "| Bollywood News | Hindi Movies News". BollywoodHungama.com. Archived from the original on 2 March 2014. Retrieved 24 February 2014.
  11. "Outlook India Magazine Online- Read News India, Latest News Analysis, World, Sports, Entertainment | Best Online Magazine India".
  12. "IndianTelevisionAcademy.com". IndianTelevisionAcademy.com. Archived from the original on 11 April 2013. Retrieved 24 February 2014.
  13. "Nepal & Nepali".
  14. "Nana Patekar, Mala Sinha and others felicitated with Master Deenanath Mangeshkar Awards".